మెతుకు సీమకు ఘన చరిత్ర ఉంది. ఇక్కడ శతాబ్దాల కాలం కాకతీయుల పాలన కొనసాగింది. ఇక్కడి నుంచే చారిత్రక ఖిల్లా నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చి కూడా ఇక్కడి చరిత్రకు ప్రత్యేక ఆనవాళ్లు. దేశానికి ప్రధాన మంత్రిని అందించి చరిత్రపుటల్లో రాజకీయంగా చెరగని ముద్ర వేసుకుంది మెదక్ నియోజకవర్గం. మెదక్‌లో 1952 నుంచి ఇప్పటివరకు శాసనసభకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఐదు సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీలు గెలుపొందాయి. సీపీఐ, ఇండిపెండెంట్, జనతాపార్టీ, టీఆర్‌ఎస్‌లు ఒక్కోసారి గెలిచాయి. నియోజకవర్గాల పునర్వవ్యస్థీకరణ అనంతరం చోటుచేసుకున్న మార్పులతో ప్రస్తుతం మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు మెదక్, హవేళిఘణాపూర్, నిజాంపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, పాపన్నపేట మండలాలుగా విస్తరించింది.
2004 ఎన్నికల ముఖ చిత్రం
పన్నెండో శాసనసభ (2004–09)కు జరిగిన ఎన్నికల్లో మెదక్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్, టీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీల కూటమికి ఎదురు నిలిచి కుదేలైంది. ఒక్కటంటే ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఐదు కాంగ్రెస్, నాలుగు టీఆర్‌ఎస్, జనతా పార్టీ ఒకటి చొప్పున గెలుచుకున్నాయి. సిద్దిపేట నుంచి వరుసగా ఆరోసారి గెలిచి కేసీఆర్ డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండానే హరీశ్‌రావు వైఎస్ మంత్రివర్గంలో చేరి ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సిద్దిపేటలో అరంగేట్రం చేసి గెలుపొందారు. మొత్తంగా ఏడు కొత్త ముఖాలు అసెంబ్లీలో అడుగుపెట్టాయి. వైఎస్ కేబినెట్‌లో జిల్లాకు పెద్దపీట వేశారు. తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సిద్దిపేట, దొమ్మాట, రామాయంపేట నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.
– సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
మెదక్ నియోజకవర్గ ముఖచిత్రం
ఘన చరితకు.. రాజకీయ చతురతకు నిలయం మెతుకుసీమ. కాకతీయుల పాలన నుంచి దేశానికి ప్రధానిని అందించడం వరకు చరగని ముద్ర వేసింది. ఇక్కడి సీఎస్‌ఐ చర్చి ప్రపంచానికే తలమానికం. 1952 నుంచి ఇప్పటివరకు శాసనసభకు 14 సార్లు ఎన్నికలు నిర్వహించగా ఐదుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు టీడీపీ, సీపీఐ, ఇండిపెండెంట్, జనతాపార్టీ, టీఆర్‌ఎస్ ఒక్కోసారి గెలుపొందాయి. 1980లో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. కరణం రామచంద్రారావు అసెంబ్లీకి ఐదుసార్లు ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు మంత్రిగా కొనసాగారు. 2014లో గెలుపొందిన పద్మాదేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
మెదక్ భౌగోళిక చరిత్ర
నియోజకవర్గాల పునర్వివిభజనకు ముందు మెదక్ నియోజకవర్గ రూపురేఖలు మరోలా ఉండేవి. అప్పట్లో మెదక్, పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, రేగోడు, అల్లాదుర్గ్ మండలాలు ఉండగా పునర్విభజన అనంతరం మెదక్ మున్సిపాలిటితో పాటు మెదక్, హవేళిఘణాపూర్, నిజాంపేట, రామాయంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాలతోపాటు నూతనంగా ఏర్పాటు అయిన రామాయంపేట మున్సిపాలిటీ మెదక్ నియోజకవర్గంలోకి చేరాయి.
మెదక్ నుంచి గెలిచి ప్రధానిగా..
1980 సంవత్సరంలో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. స్వయంగా దేశనాయకత్వానికే నాయకత్వం అందించిన మెదక్ చరిత్ర రాజకీయ చరిత్రలో చెదరని ముద్రవేసుకుంది.
వెంకటేశ్వరరావు రెండుసార్లు..
మెదక్ పట్టణానికి చెందిన వెంకటేశ్వరరావు వరుసగా రెండుసార్లు 1952, 1957 సంవత్సరంలో శాసనసభకు ఎంపికయ్యారు. రెండు సార్లు గెలుపొందిన వ్యక్తిగా మెదక్ చరిత్రలో నిలిచారు.
మొదటిసారి గెలిచి డిప్యూటీ స్పీకర్‌గా..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొదటి సారి 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున మెదక్ నియోజకవర్గం నుంచి పోటీచేసి పద్మాదేవేందర్‌రెడ్డి గెలుపొందారు. ఆమె డిప్యూటీ స్పీకర్‌గా పదవి బాధ్యతలను నిర్వహించారు.
ఐదుసార్లు గెలిచిన కరణం..
కరణం రామచంద్రారావు నియోజకవర్గంలో అందరికీ తెలిసిన పేరు. ఆయన పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామస్తుడు. సాధారణ వ్యవసాయ కుంటుంబంలో జన్మించిన ఆయన మెదక్ నుంచి శాసనసభకు ఐదు సార్లు ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా రెండు పర్యాయాలు కొనసాగారు. 1972లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఆయన 1983, 1985, 1994, 1999 సంవత్సరాల్లో టీడీపీ తరఫున గెలుపొందారు.
రామాయంపేట మండలం
మొత్తం ఓటర్లు 28,341
మహిళలు 14,474
పురుషులు 13,867
Comments
Please login to add a commentAdd a comment