గజ్వేల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను రాష్ట్రాధినేతగా నిలబెట్టింది ఈ నియోజకవర్గమే. విభిన్న సంస్కృతికి నిలయంగా పేరుగాంచిన నియోజకజవర్గం గజ్వేల్. ఎందరో ఉద్యమకారులకు, కవులు, కళాకారులకు జన్మనిచ్చిన గడ్డ. వివిధ మతస్థులు జాతుల సంగమంతో ఈ నియోజకవర్గాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తారు.
రాజకీయ పార్టీలకు ఆ సెంటిమెంటే:
కేసీఆర్ ఇలాకాగా అభివర్ణించే ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది స్థానికేతరులకు అచొచ్చిన నియోకవర్గం. 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం సుదేవ్ నుంచి 2014లో గెలిచిన కేసీఆర్ వరకు అంతా స్థానికేతరులే. అలాగే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే అధికారంలోకి రావడం మరో విశేషం. గత 13 ఎన్నికలు పరిశిలీస్తే అదే జరిగింది. దాంతో ఈ సెంటిమెంట్‌ను రాజకీయవర్గాలు అన్ని కూడా బలంగా నమ్ముతున్నాయి.
ఇక 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం వాసుదేవ్, 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో పనిచేసిన జేబీ ముత్యాలరావు, ఆర్.నరసింహారెడ్డి కూడా స్థానికేతరులే. ఆ తర్వాత 1962లో నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో ఎస్సీలు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత 1983లో అల్లం సాయిలు, 1985లో సంజీవరావు, 1989, 2004లలో డాక్టర్ జె గీతారెడ్డి, 1994లో డాక్టర్ జి విజయరామారావు, 1999లో సంజీవరావులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరంతా స్థానికేతరులే కావడం విశేషం.
2009లో జనరల్.. సీటు కొట్టేసిన కేసీఆర్!
2009లో జరిగిన ఎన్నికల్లో తూంకుంట నర్సారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడమే కాకుండా స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గానికి కేసీఆర్ కూడా స్థానికేతరులే కావడం విశేషం. వాస్తవానికి 2008లోనే సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో పాగా వేశారు. ఇక్కడ ఫాంహౌజ్ ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేస్తూ తన ఇలాకాగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనగా తీర్చిదిద్దుతున్నారు.
ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు
- భూ సేకరణ (జలశాలయాల నిర్మాణంకోసం,కంపెనీల ఏర్పాటు కోసం)
- సామాన్యుల సమస్యలు పరిష్కారం లేకపోవడం
- రోడ్లు,పెద్ద భవనాలు తప్ప సామాన్యులకు లబ్ది చేకూరలేదనే అపవాదు
రాజకీయ పార్టీల వారిగా పోటీ :
బీఆరెస్ పార్టీ
- కేసీఆర్(బీఆరెస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి)
కాంగ్రెస్ పార్టీ
- తుంకుంట నర్సారెడ్డి(జిల్లా అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే)
- మాదాడి జశ్వంత్ రెడ్డి(టీపీసీసీ మెంబర్,సీనియర్ నాయకుడు రంగారెడ్డి తనయుడు)
- బండారు శ్రీకాంత్ రావు(టీపీసీసీ ప్రధాన కార్యదర్శి)
Comments
Please login to add a commentAdd a comment