Gajwel Assembly Constituency
-
ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: బీ ఆర్ఎస్ అధ్యక్షుడు, మా జీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి ఒకటో తేదీన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర శాసనసభకు గత ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగ్గా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. డిసెంబర్ 9న అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్త గా ఎన్నికైన వారిలో చాలా మంది ఎమ్మె ల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే డిసెంబర్ 8న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బాత్రూంలో కేసీఆర్ జారి పడగా తుంటి ఎముకకు గాయమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కేసీఆర్‌కు శస్త్ర చికిత్స జరిగింది. నాటి నుంచి కేసీఆర్ వైద్యుల సూ చన మేరకు విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారు. త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి క్రియాశీలం కాబోతున్న కేసీఆర్ ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేస్తారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం నేప థ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి తరలిరానుండటంతో అసెంబ్లీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి. -
గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేందుకు కుట్రలు చేశారు: హరీష్ రావు
సాక్షి, గజ్వేల్: అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేందుకు అనేక కుట్రలు జరిగాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ భారీ మెజార్టీతో గెలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులే అయినా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కేసులు పెడున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు. కాగా, హరీష్ రావు గజ్వేల్ కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు పనిచేశాయి. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. అయినా కూడా కేసీఆర్ విజయం సాధించారు. మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇది మీ విజయం. మీ అందరి కష్టం. మీకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ ప్రత్యేక సమావేశం. కుట్రలు భగ్నం.. గజ్వేల్‌లో కేసీఆర్‌పై 154 నామినేషన్లు వేశారు. అనేక కుట్రలు. విత్ డ్రా తర్వాత 47 మిగిలాయి. నాలుగు మిషన్ల ఏర్పాటు వల్ల కొందరు కన్ఫ్యూజ్ అయ్యారు. 18,750 ఓట్లు చితికిపోయాయి. మరో 2200 ఓట్లు కారును పోలిన రోడ్డు రోలర్ గుర్తుకు పడ్డాయి. ఇన్ని కుట్రలు జరిగినా కేసీఆర్ 45 వేల మెజారిటీతో గెలిపించారు. మూడోసారి గెలుపు అందించారు. గజ్వేల్ ప్రజలందరికీ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ తరుపున ధన్యవాదాలు. గజ్వేల్ అభివృద్ధి ఎంతో జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీలో గజ్వేల్‌పై కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కింది. గత చరిత్రను బీఆర్ఎస్ తిరగరాసింది. ఒక్కనాడు కూడా కాంగ్రెస్ నాయకులపై కేసుకు పెట్టలేదు. గజ్వేల్ ఎలా బాగు చేయాలి అని నిరంతరం ఆలోచించారు. కానీ, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నెల రోజులు కూడా కాలేదు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. కేసులు పెడుతున్నారు. కేసీఆర్ గజ్వేల్‌ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తే, కాంగ్రెస్ వాళ్లు కేసులు, కుట్రలతో ముందుకు తీసుకెళుతున్నారు. ప్రగతి భవన్ గురించి భట్టి చెప్పాలి.. డిసెంబర్ 9న రుణమాఫీ.. నాలుగు వేలకు పింఛన్లు పెంచుతాం.. కరెంట్ బిల్లు కట్టొద్దు.. రైతుబంధు పెంచుతాం అన్నారు. వడ్లకు రూ.500 బోనస్, నిరుద్యోగ భృతి అన్నారు.. ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారు. ప్రగతి భవన్లో 250 బెడ్ రూమ్స్ ఉన్నాయన్నారు. బంగారు బాత్ రూములు ఉన్నాయన్నారు. అక్కడ ఉంటున్న భట్టి గారు వాస్తవాలు చెప్పాలి. కేటీఆర్ దావోస్ వెళ్లి పెట్టుబడులు తెస్తే దండుగ అన్నారు. ఉత్తకుమార్ రెడ్డి అక్కడికి వెళ్ళడం వేస్ట్ అన్నారు. మీ ముఖ్యమంత్రి వెళ్ళారు ఏం సమాధానం చెబుతారు. బీజేపీతో కోట్లాడతం అని దోస్తీ చేస్తున్నది ఎవరు? బండి సంజయ్, అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్‌ను బీఆర్ఎస్ ఓడించింది. ఈ దేశం అదానీ, అంబానీ చేతుల్లో ఉందని, అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడని, ఈ ఇద్దరి చేతుల్లో 500 కంపెనీలు ఉన్నయని రాహుల్ గాంధీ అంటాడు. సాయంత్రం రేవంత్ రెడ్డి, అదానీ కలిసి హగ్ ఇచ్చుకుంటారు. షేక్ హ్యాండ్ చేసుకుంటారు. రాహుల్ కరెక్టా? రేవంత్ కరెక్టా?. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది. గజ్వేల్ ప్రజలకు అండగా ఉంటా.. గజ్వేల్ ప్రజల కోసం నా తలుపులు 24 గంటల పాటు తెరిచే ఉంటాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకుంటాను. ఎక్కడ అన్యాయం జరిగినా ఫోన్ చేయండి, నేనే మీ వద్దకు వస్తాను భుజం కలిపి పోరాటం చేస్తాను. పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యి మెదక్ జైల్లో నాలుగు రోజుల పాటు ఉన్నాను. ధైర్యంగా ఉండండి, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. కలిసి పనిచేద్దాం.. మన కేసీఆర్ కోలుకుంటున్నారు. త్వరలోనే గజ్వేల్ క్యాంప్ ఆఫీస్‌కి వస్తారు. మీ అందరితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో మీకు పూర్తిస్థాయిలో సహకారం ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు మనకు అద్భుతమైన విజయమందిస్తారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో మూడు వంతుల ఎంపీ సీట్లు అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని వార్తలు వస్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో కలిసి పని చేద్దాం. ఏడు ఎమ్మెల్యేలలో ఆరు ఎమ్మెల్యేలు మన పార్టీ వాళ్ళు ఉన్నారు. అద్భుత విజయం సాధిస్తాం. మీకు స్థానిక నాయకులతో పాటు, కేసీఆర్, నేనూ అందుబాటులో ఉంటాము. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. కలిసి ముందుకు వెళ్దాం అని వ్యాఖ్యలు చేశారు. -
గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు.. హుజూరాబాద్‌లో ఈటల ఓటమి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాలు కీలక నేతలకు షాక్ ఇస్తున్నాయి. అధికార పార్టీలోని మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాత్రమే కాదు.. ఇతర పార్టీల్లోని నేతలకు చేదు అనుభవం మిగల్చబోతున్నాయి ఈ ఎన్నికలు. బీజేపీ తురుపుముక్కగా భావించిన ఈటల.. రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి చేతిలో ఓడారు. ఏకంగా 17వేల ఓట్ల(17,158 ఓట్లు) మెజారిటీతో ఈటలపై కౌశిక్‌రెడ్డి నెగ్గారు. హుజూరాబాద్‌లో ఈటల రెండో స్థానానికే పరిమితం అయ్యారు. మరోవైపు కేసీఆర్‌ను ఓడిస్తానని చాలెంజ్ చేసి మరీ గజ్వేల్ బరిలోనూ ఈటల నిల్చున్నారు. అయితే.. ఇక్కడా కేసీఆర్ చేతిలో ఈటలకు పరాభవం తప్పలేదు. కాకుంటే ఈటల లాంటి బలమైన నేత పోటీ చేయడంతో గత ఎన్నికల కంటే ఈసారి కేసీఆర్ మెజారిటీ తగ్గింది. అయితే గజ్వేల్‌లో కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ రికార్డు మాత్రం నెలకొల్పారు. కరీంనగర్ ఈసారి కచ్చితంగా నెగ్గుతారనే అంచనాలున్న బండి సంజయ్.. గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. స్వల్ప మెజార్టీతోనే ఆయన బండి చేతిలో ఓడారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన రఘునందన్‌రావు.. ఇప్పుడు ఎన్నికలో ఓటమి పాలయ్యారు. కొత్త ప్రభాకర్(మెదక్ ఎంపీ) భారీ మెజార్టీతో ఇక్కడి నుంచి నెగ్గారు. -
ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్.. హ్యాట్రిక్ దక్కేనా
గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచార పర్వం కీలక దశకు చేరుకున్నది. పోలింగ్ సమీపిస్తుండటంతో అన్ని వర్గాలను ఆకర్షించడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ మద్దతు కోరుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడుగా ముందుకువెళ్తోంది. బీజేపీ, కాంగ్రెస్ సైతం ఓటర్లను ఆకర్శిస్తూనే అన్ని వర్గాలను తమవైపు తిప్పుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గజ్వేల్: నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్‌కు భారీ మెజారిటీని అందించడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయ త్నిస్తున్నాయి. కేసీఆర్ రాష్ట్రమంతటా పర్యటిస్తున్న క్రమంలో ఆయన గెలుపు బాధ్యతను నియోజకవర్గంలోని పార్టీ యంత్రాంగం భుజస్కందాలపై వేసుకున్నది. ఎలాగైనా కేసీఆర్‌కు హ్యాట్రిక్ విజయాన్ని అందించడానికి శ్రేణులు పనిచేస్తున్నాయి. పని విభజన చేసుకుంటూ నేతలు ముందుకు సాగుతున్నారు. ఈ నియోజకవర్గానికి మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర అటవీ అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనతోపాటు ఇతర ముఖ్య నేతలు సైతం నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, కుకునూర్‌పల్లి, మర్కూక్, ములుగు, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది ఓటర్లను కలిసేందుకు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటికే సుమారుగా 40వర్గాలతో అధికార పార్టీ నేతలు సమ్మేళనాలను నిర్వహించారు. ఈ క్రమంలోనే భూనిర్వాసితులు, దివ్యాంగులు, ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు, వైశ్యులు, కెమిస్ట్, డ్రగ్గిస్ట్ తదితర సమ్మేళనాలకు మంత్రి హరీశ్‌రావు హజరై వారి మద్దతును కోరారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం తర్వాత గజ్వేల్‌లో వచ్చిన మార్పును వివరిస్తూ... ఈ అభివృద్ధి ప్రక్రియ నిరంతరంగా కొసాగాలంటే కేసీఆర్‌కు భారీ మెజారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. మరికొన్ని ముఖ్యమైన వర్గాల ఆత్మీయ సమ్మేళనాలను సైతం నిర్వహించడానికి అధికార పార్టీ సిద్ధమవుతోంది. ఈటల సైతం.. బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ సైతం ఇక్కడ వివిధ వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తిగా ద్వితీయశ్రేణి నాయకులను తనవైపు తిప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో బలంగా ఉన్న వర్గాలను గుర్తించి ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వర్గాలను కలిశారు. గతంలో టీఆర్ఎస్లో క్రీయాశీలకంగా ఉండి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న నేతలను కలిసి వారి మద్దతును కోరుతున్నారు. అంతేకాకుండా బీసీ నినాదాన్ని ప్రచారంలో బలంగా వాడుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ నేతలు చూపుతున్న నిర్లక్ష్యాన్ని తనదైన శైలిలో ఎండ గడుతున్నారు. స్థానిక నినాదాన్ని నమ్ముకుని.. కాంగ్రెస్ అభ్యర్థి, తూంకుంట నర్సారెడ్డి మాత్రం స్థానిక నినాదాన్ని నమ్ముకొని ఎన్నికల రంగంలోకి దిగారు. తన ప్రచారంలో ప్రతి చోట ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పార్టీల ప్రయత్నాలు నడుమ గజ్వేల్ ఎన్నికల ప్రచార పర్వం ఆసక్తికరంగా మారింది. -
TS: పూర్తైన పరిశీలన.. 2,898 నామినేషన్లకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో.. నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఈసీ ఈ వివరాలను మంగళవారం సాయంత్రం అధికారికంగా వెల్లడించింది. మొత్తం 4,798 మంది నామినేషన్లు దాఖలు కాగా.. 2,898 నామినేషన్లకు ఆమోదం లభించింది. అలాగే 606 తిరస్కరణకు గురయ్యాయి. ఈసీ షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో రేపటితో(నవంబర్ 15తో) నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. మధ్యాహ్నాం 3గంటల లోపు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. దీంతో 2,898 మందిలో ఎంత మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారు? ఎన్నికల బరిలో చివరకు ఎంత మంది మిగులుతారు? అనేది రేపు సాయంత్రం కల్లా తేలనుంది. ఇక నామినేషన్ల పరిశీలన తర్వాత ఆమోదించినవాటి లెక్కల ప్రకారం.. కేసీఆర్ పోటీ చేయబోతున్న గజ్వేల్ అత్యధికంగా 114 నామినేషన్లకు ఆమోదం లభించింది. వీళ్లలో 28 మంది విత్‌డ్రా చేసుకోగా(ఇవాళ సాయంత్రం వరకు).. 86 మంది అభ్యర్థులు మిగిలారు. మేడ్చల్‌లో 67, కామారెడ్డిలో 56(కేసీఆర్ పోటీ చేయబోయే రెండో స్థానం), ఎల్బీ నగర్లో 57 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ఈనెల 3వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. 10వ తేదీతో ముగిసింది. మొదటి రోజు 96 మంది, రెండో రోజు 136, 6వ తేదీన 207, 7వ తేదీన 281 మంది, 8వ తేదీన 618 మంది, 9వ తేదీన 1,133 మంది, ఆఖరి రోజు అధికంగా 2,327 మంది వేశారు. అలా.. ఎన్నికల్లో మొత్తం 4,798 మంది నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 2018 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు 2,399 నామినేషన్లు వేయగా అందులో 456 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన వాళ్లలో 367 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. చివరకు 1,821 మంది ఎన్నికలో బరిలో నిలిచారు. అయితే.. ఎన్నికల్లో 1,569 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం. -
కేసీఆర్‌కు కొత్త కష్టాలు.. గులాబీ నేతల్లో టెన్షన్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక, నామినేషన్లలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్‌లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో, గజ్వేల్‌లో నామినేషన్లతో బీఆర్ఎస్కు కొత్త టెన్షన్ ఎదురైంది. నామినేషన్లపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. వివరాల ప్రకారం.. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా దాఖలైన నామినేషన్లపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. సీఎం కేసీఆర్‌పై నామినేషన్లు వేసిన బాధితులను నేతలు బుజ్జగిస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఇక, నామినేషన్లు వేసిన వారిలో వందకుపైగా రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి ప్లాట్స్ బాధితులు, రైతులు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించాలని రైతులు నామినేషన్లు వేశారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున 30కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో, రంగంలోకి దిగిన గులాబీ పార్టీ నేతలు వారిని విత్‌డ్రా చేసుకోవాలని బుజ్జగిస్తున్నారు. ఈ క్రమంలో గజ్వేల్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో నామినేషన్ల దాఖలును సీఈఓ ఆఫీస్ ఫైనల్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో కలిపి 4,798 మంది 5,716 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా గజ్వేల్‌లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు. 116 నామినేషన్లతో మేడ్చల్ సెకండ్ ప్లేస్, కామారెడ్డిలో 92 మంది 104 నామినేషన్లు వేశారు. అత్యల్పంగా నారాయణపేటలో 13 నామినేషన్లు వేశారు. వైరా, మక్తల్‌లో కూడా 13 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇది కూడా చదవండి: అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గాయాలు! -
కేసీఆర్‌పై పోటీ.. సరికొత్త రికార్డు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నామినేషన్ ప్రక్రియ శుక్రవారంతోనే ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,355 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అయితే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోటీ చేస్తోన్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచే అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్ 157 నామినేషన్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు బాధితులు సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో 100 మంది వట్టెనాగులపల్లి శంకర్ హిల్స్ ప్లాట్ బాధితులు ఉన్నారు. జగిత్యాల చెరుకు రైతులు కూడా పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున కూడా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువమంది ధరణి సహా వివిధ బాధితులు ఉన్నారు. నిరసన తెలిపే ఉద్దేశంలో భాగంగా వీరు నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్ తర్వాత మేడ్చల్ నియోజకవర్గం నుంచి 125 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇక్కడ మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు ఎక్కువగా ఉండటంతో బాధితులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మూడోస్థానంలో కామారెడ్డి నియోజకవర్గానికి 102 నామినేషన్లు వచ్చాయి. ముఖ్యమంత్రి కెసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో కూడా అత్యధిక నామినేషన్లు రావడం గమనార్హం. ఆ తర్వాత.. మునుగోడు నుంచి 83, సూర్యాపేట నుంచి 81, మిర్యాలగూడ నుంచి 79, సిద్దిపేట నుంచి 76, నల్గొండ నుంచి 71, హుజూరాబాద్ నుంచి 70, కోదాడ నుంచి 66, రాజేంద్రనగర్ నుంచి 64, మల్కాజిగిరి నుంచి 60, ఎల్బీ నగర్ నుంచి 62, శేరిలింగంపల్లి నుంచి 58, సిరిసిల్ల నుంచి 42 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈసీ షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 10వ తేదీతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. నవంబర్ 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ ఆఖరు. ఇప్పటిదాకా వంద మంది అఫిడవిట్లు లేకుండా నామినేషన్లు వేయడంతో ఎన్నికల సంఘం వాళ్లకు నోటీసులు జారీ చేసింది. అలాగే.. బీఫామ్ లేకుండా నామినేషన్లు వేసిన వాళ్లను స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించనుంది ఈసీ. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ నెల 30న పోలింగ్ ఉంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. తెలంగాణ ఎన్నికల సమగ్ర కథనాల కోసం క్లిక్ చేయండి -
సెంటు భూమి లేదు! కేసీఆర్ అఫిడవిట్లో ఇంకా ఏముందంటే..
సాక్షి, సిద్ధిపేట/కామారెడ్డి: భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ నామినేషన్లు వేశారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నాం కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు. తొలుత.. గజ్వేల్‌లో ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు కేసీఆర్. ఆపై విశ్రాంతి తీసుకుని హెలికాఫ్టర్‌లో కామారెడ్డికి చేరుకున్నారు. అక్కడ తొలుత బీఆర్ఎస్ నేతలతో ఆయన చర్చలు జరిపారు. ఆపై కామారెడ్డి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఇక నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కేసీఆర్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల అంశంలో కేసులేనని తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో రూ. 2లక్షల 96వేల క్యాష్ మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు కేసీఆర్. కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మ పేర్లపై బ్యాంక్‌లలో డిపాజిట్లు అయిన నగదు రూ. 17కోట్లకు పైగా ఉంది. కేసీఆర్ పేరు మీద మొత్తం తొమ్మిది బ్యాంక్ అకౌంట్స్, శోభమ్మకు మూడు అకౌంట్స్ ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో బ్యాంకు డిపాజిట్లు డబుల్ అయ్యాయి. 2018 ఎన్నికల సమయంలో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ కలిపి రూ.5.63 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడది మరో 11.16 కోట్లకు పెరిగింది. కేసీఆర్ సతీమణి శోభ చేతిలో 2018 ఎన్నికల సమయంలో రూ.94 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.6.29 కోట్లకు చేరింది. బంగారు ఆభరణాలు 2.8 కేజీలు(రూ. 17లక్షలు విలువచేసే) ఉన్నట్లు తాజా అఫిడవిట్లో వెల్లడి. గత పదేళ్లుగా ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేవని అఫిడేవిట్‌లో చూపించారు కేసీఆర్. స్థిర ఆస్తుల రూపంలో రూ. 17.83 కోట్లు, చరాస్తుల రూపంలో రూ.9.67 కోట్లు ఉన్నాయి కేసీఆర్‌కు. ఆయన భార్య శోభ పేరు మీద రూ.7.78 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉన్నాయి. ఉమ్మడి ఆస్తిగా రూ.9.81 కోట్ల మేర చరాస్తులు ఉన్నాయి. కేసీఆర్ పేరు మీద రూ.17.27 కోట్ల అప్పు.. కుటుంబం పేరు మీద రూ.7.23 కోట్ల అప్పు ఉంది. సొంతంగా కారు, బైక్ లేదు కేసీఆర్‌కు.బదులుగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ తదితర వాహనాలు 14 ఉన్నాయి. వీటి విలువ రూ.1.16 కోట్లుగా పేర్కొన్నారు. తనది రైతు కుటుంబం అని, వ్యవసాయం తన వృత్తి అని చెప్పుకునే కేసీఆర్.. తన పేరు మీద సెంటు భూమి లేదని అఫిడవిట్లో ప్రస్తావించడం కొసమెరుపు. కేసీఆర్, ఆయన సతీమని శోభమ్మ పేర్ల మీద ప్రత్యేకంగా ఎలాంటి భూములు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఉన్న భూమంతా కుటుంబ ఉమ్మడి ఆస్తిగా చూపించారు. కేసీఆర్ కుటుంబానికి 62 ఎకరాల భూమి ఉండగా.. అందులో 53.30 ఎకరాల సాగుభూములు, 9.36 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి. -
గజ్వేల్‌కు నేను కొత్త కాదు.. ఈటల ఎమోషనల్ కామెంట్స్!
సాక్షి, గజ్వేల్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొలిటికల్ లీడర్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీలనే కాకుండా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివి అని అన్నారు. అయితే, ఈటల రాజేందర్ గురువారం వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో జరిగిందే ఇప్పుడు గజ్వేల్‌లోనూ జరుగుతుంది. గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం. బీఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు, కుట్రలు చేసినా గెలిచేది బీజేపీ పార్టీనే. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రానుంది. గజ్వేల్‌లో ఏ పార్టీ అయినా సమావేశాలు పెట్టుకోవచ్చునని, కానీ బీజేపీ సమావేశాలకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డబ్బులిచ్చి బీజేపీ సభకు రాకుండా చేస్తున్నారన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇలాగే చేశారన్నారు. కానీ వారు ప్రలోభాలకు లొంగకుండా ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టారన్నారు. ఈసారి గజ్వేల్‌లో అదే జరుగుతోందన్నారు. గజ్వేల్‌కు నేను కొత్త కాదు. గజ్వేల్‌లో తొలి పౌల్ట్రీ ఫాం ఏర్పాటు చేసి నా జీవితం ప్రారంభించాను. తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో గజ్వేల్‌లోనే ఎక్కువగా తిరిగాను. సొంత ప్రాంతంలో తిరగాలని కేసీఆర్ చెప్తే.. హుజురాబాద్‌లో ఉద్యమం నడిపాను. తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెల్యే అయ్యాక తెలంగాణతో పాటు అణగారిన వర్గాల వారి కోసం కూడా పోరాడాను అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: టార్గెట్ ఎర్రబెల్లి.. ఝాన్సీరెడ్డి బదులు యశస్వినీ! -
ఈటల రాజేందర్ సంచలన ప్రకటన
సాక్షి, కరీంనగర్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరమైన పోరుకు వేదిక కాబోతోందా? బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంతో పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపైనా తాను పోటీ చేస్తానని ప్రకటించారాయన. గురువారం హుజూరాబాద్‌లో బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తాను తన నియోజకవర్గంతో పాటు సీఎం కేసీఆర్ పై గజ్వేల్‌లో రెండు చోట్లా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ లో మీరే కథానాయకులు అవ్వాలంటూ కార్యకర్తలకు ఆయన పిలుపు ఇచ్చారు. కేసీఆర్ పైసలు కుమ్మరించబోతున్నారు! మానకొండూర్‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారు. ప్రజలనే కాదు.. ఆఫీసర్లను సైతం నమ్మలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ అంగట్లో సరుకుల్లా నాయకుల్ని కొంటున్నారు. నాయకుడి స్థాయిని బట్టి రేట్ అంటగడుతున్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఒక్కొక్క నియోజకవర్గంలో రూ.30 నుంచి వంద కోట్ల దాకా ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారు అని ఈటల ఆరోపణలు గుప్పించారు. -
కేసీఆర్ Vs రాములమ్మ.. తెలంగాణలో పొలిటికల్ వార్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేత విజయశాంతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పోటీకి తాను రెడీగా ఉన్నట్టు పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు పొలిటికల్‌గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, వచ్చే ఎన్నికల్లో గెలుపోటముల అంశాన్ని పక్కనపెట్టి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై పోటీ చేయాలని విజయశాంతి సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు తాను సిద్ధమని సంకేతాలిస్తూ ట్వీట్ చేశారు. ఆ అవకాశం తనకే కల్పించాలని పార్టీ అధిష్టానానికి విజయశాంతి విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక, ట్విట్టర్ వేదికగా విజయశాంతి.. కామారెడ్డి అసెంబ్లీపై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తుంది. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం. ఇది ప్రజలకు తెలియపర్చటం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. కామారెడ్డి అసెంబ్లీ పై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తది. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే.. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం... ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్… pic.twitter.com/2TplIvgykR — VIJAYASHANTHI (@vijayashanthi_m) August 23, 2023 ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. కామారెడ్డి, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు. సిట్టింగుల్లో ఏడుగురికి అవకాశం ఇవ్వలేదు. నాంపల్లి, గోషామహల్, జనగాం, నర్సాపూర్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇది కూడా చదవండి: కార్యాచరణపై రేపు మైనంపల్లి భేటీ -
గజ్వేల్: ఆ సెంటిమెంట్‌దే ఎప్పుడూ విజయం!
గజ్వేల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను రాష్ట్రాధినేతగా నిలబెట్టింది ఈ నియోజకవర్గమే. విభిన్న సంస్కృతికి నిలయంగా పేరుగాంచిన నియోజకజవర్గం గజ్వేల్. ఎందరో ఉద్యమకారులకు, కవులు, కళాకారులకు జన్మనిచ్చిన గడ్డ. వివిధ మతస్థులు జాతుల సంగమంతో ఈ నియోజకవర్గాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తారు. రాజకీయ పార్టీలకు ఆ సెంటిమెంటే: కేసీఆర్ ఇలాకాగా అభివర్ణించే ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది స్థానికేతరులకు అచొచ్చిన నియోకవర్గం. 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం సుదేవ్ నుంచి 2014లో గెలిచిన కేసీఆర్ వరకు అంతా స్థానికేతరులే. అలాగే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే అధికారంలోకి రావడం మరో విశేషం. గత 13 ఎన్నికలు పరిశిలీస్తే అదే జరిగింది. దాంతో ఈ సెంటిమెంట్‌ను రాజకీయవర్గాలు అన్ని కూడా బలంగా నమ్ముతున్నాయి. ఇక 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం వాసుదేవ్, 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో పనిచేసిన జేబీ ముత్యాలరావు, ఆర్.నరసింహారెడ్డి కూడా స్థానికేతరులే. ఆ తర్వాత 1962లో నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో ఎస్సీలు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత 1983లో అల్లం సాయిలు, 1985లో సంజీవరావు, 1989, 2004లలో డాక్టర్ జె గీతారెడ్డి, 1994లో డాక్టర్ జి విజయరామారావు, 1999లో సంజీవరావులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరంతా స్థానికేతరులే కావడం విశేషం. 2009లో జనరల్.. సీటు కొట్టేసిన కేసీఆర్! 2009లో జరిగిన ఎన్నికల్లో తూంకుంట నర్సారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడమే కాకుండా స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గానికి కేసీఆర్ కూడా స్థానికేతరులే కావడం విశేషం. వాస్తవానికి 2008లోనే సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో పాగా వేశారు. ఇక్కడ ఫాంహౌజ్ ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేస్తూ తన ఇలాకాగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు భూ సేకరణ (జలశాలయాల నిర్మాణంకోసం,కంపెనీల ఏర్పాటు కోసం) సామాన్యుల సమస్యలు పరిష్కారం లేకపోవడం రోడ్లు,పెద్ద భవనాలు తప్ప సామాన్యులకు లబ్ది చేకూరలేదనే అపవాదు రాజకీయ పార్టీల వారిగా పోటీ : బీఆరెస్ పార్టీ కేసీఆర్(బీఆరెస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి) కాంగ్రెస్ పార్టీ తుంకుంట నర్సారెడ్డి(జిల్లా అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే) మాదాడి జశ్వంత్ రెడ్డి(టీపీసీసీ మెంబర్,సీనియర్ నాయకుడు రంగారెడ్డి తనయుడు) బండారు శ్రీకాంత్ రావు(టీపీసీసీ ప్రధాన కార్యదర్శి) -
సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గంలో అధికారం వహించేది ఎవరు?
గజ్వేల్ నియోజకవర్గం తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2018 ఎన్నికలలో కూడా గజ్వేల్ నుంచి పోటీచేసి ఘనవిజయం సాధించారు. ఆయన అంతకుముందు సిద్దిపేటలో ఆరుసార్లు గెలిచారు. 2014, 2018లలో గజ్వేల్ నుంచి గెలిచి ఎనిమిదిసార్లు గెలిచిన ఏకైక తెలంగాణ నేతగా రికార్డు సృష్టించారు. తెలంగాణ ఉద్యమ నేతగా 2002 నుంచి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ చరిత్రనే కెసిఆర్ మలుపు తిప్పారు. తెలంగాణ సాదించిన నేతగా, టిఆర్ఎస్ ను విజయ పదంలో నడిపించిన నాయకుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. గజ్వేల్ లో 2018లో తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి వంటేరు ప్రతాపరెడ్డిపై 56922 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వంటేరు గతసారి టిడిపి నుంచి పోటీచేసి, ఆ తర్వాత పరిణామాలలో కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసి ఓటమి చెందారు. తదుపరి ఆయన కూడా టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. కెసిఆర్‌కు 120608 ఓట్లు రాగా, ప్రతాపరెడ్డికి 63686 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి పోటీచేసిన బిజెపి అభ్యర్ధి ఆకుల విజయకు 15 వేలకు పైగా ఓట్లు రావడం విశేషం. కెసిఆర్ వెలమ సామాజికవర్గానికి చెందినవారు. కెసిఆర్ 2014లో కూడా శాసనసభకు, పార్లమెంటుకు పోటీచేసి రెండు చోట్ల విజయం సాధించారు. రెండువేల నాలుగులో సిద్దిపేట శాసనసభకు, కరీంనగర్ లోక్ సభకు పోటీచేసి రెండుచోట్ల విజయం సాదించిన కెసిఆర్ 2014లో గజ్వేల్ నుంచి శాసనసభకు, మెదక్ నుంచి లోక్ సభకు పోటీచేసి మళ్లీ గెలుపొందారు.ఇది ఒక రికార్డు. అంతేకాక 2004లో ఎమ్.పిగా ఎన్నికయ్యాక, ఒకేటరమ్ లో రెండుసార్లు రాజీనామా చేసిన చరిత్ర కూడా ఈయన సొంతం. ఆ రకంగా కరీంనగర్ ఎమ్.పిగా ఒకే టరమ్‌లో మూడుసార్లు గెలిచిన నేతగా కూడా నమోదయ్యారు. కెసిఆర్ 1983 ఎన్నికలలో ఓడిపోయినా, ఆ తర్వాత ఆయన ఎదురులేని నేతగా మారారు. 1985 లో తొలిసారి సిద్దిపేట నుంచి తెలుగుదేశం పక్షాన గెలుపొందారు. ఆ తర్వాత 1989,1994,1999లలో కూడా విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. 1999లో గెలిచిన తర్వాత మంత్రి పదవి కాకుండా ఉప సభాపతి పదవి ఇచ్చారు. దాంతో అసంతృప్తికి గురి అయ్యారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నడుం కట్టాలని సన్నద్దమై, ఉప సభాపతి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో తాను ఏర్పాటు చేసుకున్న టిఆర్ఎస్ తరపున సిద్దిపేటలో పోటీచేసి గెలుపొందారు. అలా ఒక్కడితో ఆరంభమైన ఆయన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధించడమే కాకుండా , తెలంగాణలో తన పార్టీని విజయపధాన నడిపించి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తం ఎనిమిదిసార్లు శాసనసభకు ఎన్నికై చరిత్ర సృష్టించారు. కెసిఆర్ 8 సార్లు శాసనసభతోపాటు ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికైన రికార్డును సొంతం చేసుకున్నారు. గజ్వేల్ ఎక్కువ కాలం రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉండేది. అప్పట్లో పదకుండు మంది ఎస్.సి.నేతలు గెలుపొందారు. 1962లో నుంచి రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉన్న గజ్వేల్ 2009లో జనరల్‌గా మారింది. ఫలితంగా 1989లోను, 2004లోను ఇక్కడ గెలిచిన మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి ఇక్కడ కాక జహీరాబాద్ రిజర్వుడ్ నియోజకవర్గంలో పోటీచేసి వరసగా అక్కడ రెండుసార్లు గెలిచారు. గజ్వేల్ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నికతో సహా 16సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి తొమ్మిది సార్లు, టిడిపి నాలుగుసార్లు, పిడిఎఫ్ ఒకసారి, టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు జనరల్ స్థానంలో గెలిచిన ఆర్.నరసింహారెడ్డి ఎన్నిక చెల్లదని చెప్పడంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో కూడా ఆయనే గెలిచారు. జి.సైదయ్య ఇక్కడ నాలుగుసార్లు గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన జె.బి.ముత్యాలరావు మరోసారి సికింద్రాబాద్‌లో గెలుపొందారు. ఈయన 1962లో మహాబూబ్‌నగర్ నుంచి 1967 నాగర్‌కర్నూలు నుంచి లోక్‌సభకు గెలుపొంది కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక్కడ ఒకసారి గెలిచిన డాక్టర్ విజయరామారావు2004లో స్టేషన్ ఘన్పూర్ నుంచి గెలిచారు. ఒకసారి సిద్ధిపేట నుంచి లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. ఈయన డాక్టర్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కొంతకాలం సభ్యునిగా ఉన్నారు. టిఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా వ్యవహరించారు. 2008లో టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. కాని ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2009లో వరంగల్జిల్లా వర్ధన్నపేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ రెండుసార్లు, జహీరాబాద్‌లో రెండుసార్లు గెలిచిన గీతారెడ్డి ప్రముఖ రిపబ్లికన్ నాయకురాలు జె.ఈశ్వరీబాయి కుమార్తె, ఈమె చెన్నారెడ్డి, కోట్ల 2004 నుంచి డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో సభ్యురాలిగా ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..