సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేత విజయశాంతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పోటీకి తాను రెడీగా ఉన్నట్టు పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు పొలిటికల్‌గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అయితే, వచ్చే ఎన్నికల్లో గెలుపోటముల అంశాన్ని పక్కనపెట్టి బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై పోటీ చేయాలని విజయశాంతి సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు తాను సిద్ధమని సంకేతాలిస్తూ ట్వీట్ చేశారు. ఆ అవకాశం తనకే కల్పించాలని పార్టీ అధిష్టానానికి విజయశాంతి విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఇక, ట్విట్టర్ వేదికగా విజయశాంతి.. కామారెడ్డి అసెంబ్లీపై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తుంది. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం. ఇది ప్రజలకు తెలియపర్చటం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు.
కామారెడ్డి అసెంబ్లీ పై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తది.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) August 23, 2023
రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే..
బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం...
ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్… pic.twitter.com/2TplIvgykR
ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. కామారెడ్డి, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు. సిట్టింగుల్లో ఏడుగురికి అవకాశం ఇవ్వలేదు. నాంపల్లి, గోషామహల్, జనగాం, నర్సాపూర్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి.
ఇది కూడా చదవండి: కార్యాచరణపై రేపు మైనంపల్లి భేటీ
Comments
Please login to add a commentAdd a comment