సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాలు కీలక నేతలకు షాక్ ఇస్తున్నాయి. అధికార పార్టీలోని మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాత్రమే కాదు.. ఇతర పార్టీల్లోని నేతలకు చేదు అనుభవం మిగల్చబోతున్నాయి ఈ ఎన్నికలు.
బీజేపీ తురుపుముక్కగా భావించిన ఈటల.. రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి చేతిలో ఓడారు. ఏకంగా 17వేల ఓట్ల(17,158 ఓట్లు) మెజారిటీతో ఈటలపై కౌశిక్‌రెడ్డి నెగ్గారు. హుజూరాబాద్‌లో ఈటల రెండో స్థానానికే పరిమితం అయ్యారు.
మరోవైపు కేసీఆర్‌ను ఓడిస్తానని చాలెంజ్ చేసి మరీ గజ్వేల్ బరిలోనూ ఈటల నిల్చున్నారు. అయితే.. ఇక్కడా కేసీఆర్ చేతిలో ఈటలకు పరాభవం తప్పలేదు. కాకుంటే ఈటల లాంటి బలమైన నేత పోటీ చేయడంతో గత ఎన్నికల కంటే ఈసారి కేసీఆర్ మెజారిటీ తగ్గింది. అయితే గజ్వేల్‌లో కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ రికార్డు మాత్రం నెలకొల్పారు.
కరీంనగర్ ఈసారి కచ్చితంగా నెగ్గుతారనే అంచనాలున్న బండి సంజయ్.. గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. స్వల్ప మెజార్టీతోనే ఆయన బండి చేతిలో ఓడారు.
దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన రఘునందన్‌రావు.. ఇప్పుడు ఎన్నికలో ఓటమి పాలయ్యారు. కొత్త ప్రభాకర్(మెదక్ ఎంపీ) భారీ మెజార్టీతో ఇక్కడి నుంచి నెగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment