నరకాసురుడు చనిపోతే దీపావళి జర్పుకున్నట్టు నేడు మెదక్‌లో బీజేపీ గెలిస్తే అంత సంబరాలు జరుపుకున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘు నందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ అన్నీ వర్గాల ప్రజల్ని ప్రజలను అణిచి వేయాలని చూసింది. ఫలితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందన్నారు. తన గెలుపును మల్లన్న సాగర్‌లో తన చితి తానే పెర్చుకొని మరణించిన రైతు మల్లారెడ్డికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
దుబ్బాకలో రఘునందన్ రావుకి ప్రోటోకాల్ లేకుండా చేద్దామని అనుకున్నారు కానీ నేడు సిద్దిపేటలో కూడా ప్రోటోకాల్ వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి మెదక్ గడ్డపై కాషాయ జెండా ఎగిరిందన్న రఘనందన్ .. నా గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు పరోక్షంగా ప్రచారం చేశారని అన్నారు. నరకాసురుడు చనిపోతే దీపావళి జరుపుకున్నట్లు నేడు మెదక్‌లో బీజేపీ గెలిస్తే అంత సంబరాలు జరుపుకున్నారు
బీఆర్‌ఎస్ నేత వెంకట్ రాంరెడ్డి 30రోజులలో గజ్వేల్ ప్రాంత క్షిరా సాగర్ రైతులకు వారి భూములను తిరిగి ఇవ్వకపోతే ఎక్కడి వరకు అయినా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వెంకట్ రాంరెడ్డి స్వాధీనం చేసుకున్న గజ్వేల్ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి దానిపై చర్యలు ఏవి అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment