శబరిమలై యాత్రకు రైళ్లు ఫుల్
Published Fri, Nov 8 2013 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమలై వెళ్లే స్వాములకు సంబంధించి విజయనగరం మీదుగా వెళ్లే వందకు పైగా రైళ్లన్నీ రిజర్వేషన్లలో వెయిటింగ్ లిస్టుల్లోనే దర్శనమిస్తున్నాయి. విజయనగరం నుంచి ఎర్నాకులం వరకూ వెళ్లే రైళ్ల రిజర్వేషన్‌లన్నీ జనవరి 8 వరకూ ఖాళీలు లేకపోవ డంతో దర్శనానికి వెళ్లేందుకు అయ్యప్ప భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెట్టకపోవడంతో భక్తులు బస్సులకే పరిమితమవుతున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి తమకు అందుబాటులో ఉన్న బంధువుల సహాయంతో రిజర్వేషన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
విజయనగరం మీదుగా ఎర్నాకులం వెళ్లేందుకు కేవలం పది రైళ్లు ఉన్నాయి. 15906 వివేక్ ఎక్స్‌ప్రెస్, 06335 డిబ్రూఘర్-కొచ్చావలి స్పెషల్,02851 సంత్రాగచ్చి-కొచ్చావలి స్పెషల్, 18189 టాటా -అలెప్పీ ఎక్స్‌ప్రెస్, 13351 ధన్‌బాద్- అలెప్పీ ఎక్స్‌ప్రెస్, 16310 పాట్నా -ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్, 16324 షాలిమార్ -త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్, 12660 గురుదేవ్ ఎక్స్‌ప్రెస్, 12516 గౌహతి-త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్, 12508 గౌహతి-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లు వెళ్తాయి. వీటిలో ఏ ఒక్క రైలుకూ జనవరి నెల వరకూ రిజర్వేషన్లు ఖాళీల్లేవు. డిసెంబరు 25న ఒక్కరోజుమాత్రమే 6 వరకూ ఆర్‌ఏసీ ఉంది. ప్రస్తుతానికి అన్ని రైళ్లూ వందకు పైగా వెయిటింగ్ లిస్ట్, మరికొన్ని రిగ్రీట్, ఇంకొన్ని నో రూమ్‌తో దర్శనమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తం గా ఏటా అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతోందని, విజయనగరం మీదుగా ఎర్నాకులం వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసే విధంగా రైల్వే అధికారులు శ్రద్ధ చూపాలని అయ్యప్ప యాత్రకు వెళ్లే భక్తులు కోరుతున్నారు.
Advertisement
Advertisement