అనంతపురం కల్చరల్ : సుబ్రమణ్య షష్టిని పురస్కరించుకుని మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వరాలయంలో కొలువైన అయ్యప్ప దేవాలయంలో క్షీరాభిషేకాలు జరిగాయి. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అదేవిధంగా చెరువుకట్టపై వెలసిన సుబ్రమణ్యస్వామి ఆలయంలోనూ షష్టి వేడుకలు జరిగాయి.