సాక్షి, శబరిమల : ఈ ఏడాది శబరిమల అయ్యప్ప ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆలయం తెరిచిన 25 రోజుల్లోనే అప్పయ్య ఆలయానికి రూ. 100 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రకటించారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. ఈ ఏడాది అదనంగా.. రూ. 15 కోట్లు వచ్చినట్లు టీడీబీ అధికారులు ప్రకటించారు. ఇది ఆల్ టైమ్ రికార్డుగా కూడా వారు చెబుతున్నారు. మండల పూజలు పూర్తయ్యే నాటికి ఆదాయం మరింత పెరుగుతుందని వారు అంటున్నారు.గత ఏడాది ఇదే సమయానికి ఆలయానికి 85.96 కోట్ల రూపాయలు ఆదాయంరాగా..ఈ ఏడాది అదనంగా మరో 15 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీడీపీ పేర్కొంది.
మొత్తం రెవెన్యూ వివరాలు
శబరిమల అప్పయ్య మొత్తం రెవన్యూ : 101, 08,80,925
అరవణ, అప్పం ప్రసాదం అమ్మకల ద్వారా : 52,63,02,745
హుండీ ఆదాయం : 35,89,26,885
భారీగా భక్తులు
శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. మంగళవారం సాయంత్రం కూడా దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పంబ, శరంగుత్తి, సన్నిధానం దగ్గర భారీ రద్దీ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు రద్దీలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని.. వారిని పోలీసులు ప్రత్యేక దారిలో పంపుతున్నారని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.
నెయ్యాభిషేకం కోసం
అయ్యప్ప భక్తులు ఇరుముడి నెయ్యి కోసం మాళికాపురం ఆలయం దగ్గరి ప్రాంతాన్ని కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు. భక్తులు ఇరుముడి, నెయ్యిని ఇక్కడే విప్పుకోవచ్చని తెలిపారు. అలాగే అయ్యప్ప ఆలయానికి ఉత్తరాన భండారం పేరుతో మరో కాంప్లెక్స్ ఉందని.. అక్కడ కూడా నెయ్యాభిషేకం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment