
సాక్షి, హైదరాబాద్: శబరిమలకు నడిపే ప్రత్యేక రైళ్లలో భక్తులు పూజలు చేసుకోవచ్చని.. కానీ హారతి కర్పూరం, దీపాలు, అగరొత్తులు వెలిగించరాదని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. గురువారం నుంచి శబరిమల ప్రత్యేక రైళ్లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేసింది.
నిప్పు వల్ల రైళ్లకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో, భక్తులు రైళ్లలో అగ్గి పుల్లలు కూడా వెలిగించొద్దని ఆ ప్రకటనలో సూచించింది. మండే స్వభావం ఉన్న వాటిని వినియోగించటం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
రైల్వే పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. బుధవారం రైల్ నిలయంలో జరిగిన పెన్షన్ అదాలత్‌లో ఆయన పాల్గొన్నారు. పెన్షన్ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ సెల్‌ను ప్రారంభించారు.
చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. ఇక అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లు!