
శబరిమల: అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య రెండునెలల పాటు కొనసాగిన శబరిమల వార్షిక పూజలు ఆదివారంతో ముగిశాయి. రుతుస్రావం వయస్సులో ఉన్న మహిళలను కూడా ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అధికార వామపక్ష, ప్రతిపక్ష బీజేపీ శ్రేణుల నిరసనలు, ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికిన విషయం తెలిసిందే.
67 రోజుల అనంతరం ఆదివారం ఉదయం 6.15 గంటలకు పండాలం రాజకుటుంబానికి చెందిన పి.రాఘవ వర్మ రాజా దర్శనం అనంతరం భస్మాభిషేకం పూజతో ఆలయ మహద్వారాన్ని మూసివేశారు. తిరిగి ఫిబ్రవరి 13వ తేదీన మళయాళం నెల కుంభం సందర్భంగా పూజల కోసం ఆలయాన్ని తెరుస్తారు.