టీడీబీ : ‘హరివరాసనం’లో చిన్నమార్పులు | TDB to rerecord Lord Ayyappa’s lullaby | Sakshi
Sakshi News home page

టీడీబీ : ‘హరివరాసనం’లో చిన్నమార్పులు

Published Sun, Nov 19 2017 6:43 PM | Last Updated on Sun, Nov 19 2017 6:45 PM

TDB to rerecord Lord Ayyappa’s lullaby - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, తిరువనంతపురం : అయ్యప్పస్వామి జోలపాటగా ప్రఖ్యాతిగాంచిన ‘హరివరాసనం’ అనే అష్టకంలో కొన్ని తప్పులను సరిదిద్దినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు తెలిపింది. మళయాళంలో అష్టకంగా పిలుచుకునే ఈ హరివరసానంలో శ్లోకాల్లో సంస్కృత పదాలు కొన్ని రూపాంతరం చెందడం, అసలుకే లేకపోవడం జరిగిందని.. టీడీబీ పేర్కొంది. వీటిని సరిదిద్ది మళ్లీ కొత్తగా రికార్డ్‌ చేసిన హరివరాసనం శ్లోకాలనే ఈ ఏడాది స్వామి వారికి జోలపాటగా వినిపిస్తామని బోర్డు తెలిపింది.


దేశంలో పలువురు గాయకులు హరివరాసనం శ్లోకాలను ఆలపించినా.. కేజే ఏసుదాస్‌.. హరివరాసనంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన టీడీపీ అధ్యక్షుడు పద్మకుమార్‌ తెలిపారు. ప్రస్తుతం శ్లోకాల్లో అరివిమర్ధనం నిత్యనర్తనం అనే పాదంలో.. అరి విమర్ధనం అంటూ విడిగా ఉచ్ఛరించాలని ఆయన తెలిపారు. అరి  అంటే శత్రువని, మర్ధనం అంటే నాశనం చేయడమనే అర్థం వస్తుందని చెప్పారు. ఏసుదాస్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని.. ఆయన రాగానే వీటిని సరిదిద్ది హరివరసానం శ్లోకాలను మళ్లీ రికార్డింగ్‌ చేస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement