harivarasanam award
-
ఇళయారాజాకు మరో అరుదైన పురస్కారం
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాకు మరో అరుదైన గౌరవ దక్కింది. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘హరివరాసనం’ పురస్కారాన్ని ఆయనకు ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీన శబరిమలైలో ఇళయరాజాకు పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించి.. ఎన్నో అద్భుతమైన పాటలు అందించి మ్యూజిక్ మేస్ట్రోగా పేరొందిన ఇళయరాజా.. ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, సత్కారాలు పొందారు. భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే, శబరిమల కొండపై నెలకొన్న అయ్యప్పను మేలుకొలిపే ‘హరివరాసనం’ పాటను ఎంతో భక్తితన్వయత్వంపై ఇళయరాజా పాడటం.. విశేషమైన ప్రాచుర్యం పొందింది. అయ్యప్ప భక్తులు నిత్యం వినే పాటగా ఇది ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఇళయరాజకు హరివరాసనం పురస్కారం దక్కడం, శబరిమలలో దానిని అందుకోబోవడం అరుదైన విశేషమని చెప్పాలి. -
'దక్షిణ భారత కోకిల'కు ప్రతిష్టాత్మక అవార్డ్
ప్రముఖ గాయని కె.ఎస్. చిత్రకు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కనుంది. కేరళ ప్రభుత్వం ఏటా అందజేసే ‘హరివరాసనమ్’ పురస్కారానికి ఈ ఏడాది చిత్రని ఎంపిక చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. జనవరి 14న శబరిమల దేవస్థానంలో వైభవంగా జరగనున్న కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని చిత్రకి అందజేయనున్నారు. పురస్కారంలో భాగంగా రూ. లక్ష నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని గాయని అందుకోనున్నారు. మధురమైన తన స్వరంతో పాటలు పాడుతూ.. అందరిలో లౌకిక స్ఫూర్తిని పెంపొందిస్తున్నందుకే చిత్రకి ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక పురస్కారం ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘దక్షిణ భారత నైటింగేల్’ అని బిరుదందుకున్న సింగర్ చిత్ర మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల సినిమాలకు గాత్రదానం చేశారు. -
టీడీబీ : ‘హరివరాసనం’లో చిన్నమార్పులు
సాక్షి, తిరువనంతపురం : అయ్యప్పస్వామి జోలపాటగా ప్రఖ్యాతిగాంచిన ‘హరివరాసనం’ అనే అష్టకంలో కొన్ని తప్పులను సరిదిద్దినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. మళయాళంలో అష్టకంగా పిలుచుకునే ఈ హరివరసానంలో శ్లోకాల్లో సంస్కృత పదాలు కొన్ని రూపాంతరం చెందడం, అసలుకే లేకపోవడం జరిగిందని.. టీడీబీ పేర్కొంది. వీటిని సరిదిద్ది మళ్లీ కొత్తగా రికార్డ్ చేసిన హరివరాసనం శ్లోకాలనే ఈ ఏడాది స్వామి వారికి జోలపాటగా వినిపిస్తామని బోర్డు తెలిపింది. దేశంలో పలువురు గాయకులు హరివరాసనం శ్లోకాలను ఆలపించినా.. కేజే ఏసుదాస్.. హరివరాసనంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన టీడీపీ అధ్యక్షుడు పద్మకుమార్ తెలిపారు. ప్రస్తుతం శ్లోకాల్లో అరివిమర్ధనం నిత్యనర్తనం అనే పాదంలో.. అరి విమర్ధనం అంటూ విడిగా ఉచ్ఛరించాలని ఆయన తెలిపారు. అరి అంటే శత్రువని, మర్ధనం అంటే నాశనం చేయడమనే అర్థం వస్తుందని చెప్పారు. ఏసుదాస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని.. ఆయన రాగానే వీటిని సరిదిద్ది హరివరసానం శ్లోకాలను మళ్లీ రికార్డింగ్ చేస్తామని చెప్పారు. -
సింగర్ బాలుకు కేరళ సత్కారం
శబరిమలై: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీర్తికి మరో కలికితురాయి తోడైంది. కేరళ ప్రభుత్వం, శబరిమలై దేవస్థానం ఉమ్మడిగా అందించే ప్రతిష్ఠాత్మక 'హరివరాసనం' అవార్డును ఈ ఏడాదికిగానూ ఆయన అందుకున్నారు. శనివారం అయ్యప్ప సన్నిధానం శబరిమలై ఆలయంలో కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎస్ శివకుమార్ నుంచి బాలు ఈ అవార్డును స్వీకరించారు. అవార్డుతోపాటు లక్ష రూపాయల నగదు బహుమానం, మెమొంటోను అందజేశారు. తన గానం ద్వారా ఆథ్యాత్మిక ఉన్నతికి పాటుపడినందుకుగానూ ఆయనను హరివరాసనం అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. 'ఐదు దశాబ్ధాల నా సంగీత ప్రస్థానంలో ఎన్నో అవార్డులను అందుకున్నాను. అయితే హరివరాసం మాత్రం వాటన్నింటిలోకి ప్రధానమైనదిగా భావిస్తున్నాను. అయ్యప్ప స్వామి ఆలయం మత సామరస్యానికి గొప్ప ఉదాహరణ. స్వామివారిని కీర్తిస్తూ హిందీ సహా అనేక భాషల్లో పాటలు పాడిన నేను మొదటిసారి శబరిమలకు రావడం ఆనందంగా ఉంది' అని అన్నారు. -
గాన గంధర్వుడికి కేరళ ప్రభుత్వ పురస్కారం
తిరుపతి: గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రమణ్యం కేరళ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకోనున్నారు. అయ్యప్ప భక్తిగీతాలు ఆలపించిన బాలసుబ్రమణ్యం అయ్యప్పస్వామి కొలువైన శబరిమలై పుణ్యక్షేత్రంలో హరివరసానం అవార్డును అందుకోనున్నారు. కేరళ ప్రభుత్వం ప్రతి ఏడాది అయ్యప్పస్వామిని కీర్తిస్తూ ఆలపించిన ప్రముఖ గాయకుల్లో ఒకరిని ఎంపిక చేసి ఈ అవార్డుతో సత్కరించడం ఆనవాయితీ. ఈ సారి మన గాన గంధర్వుడి ని అవార్డు వరించింది. జూన్లో శబరిమలైలో ఈ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. గత ఏడాది వరకు అవార్డుతోపాటు రూ.50వేలు నగదు బహుమతి అందించిన కేరళ ప్రభుత్వం ఈ ఏడాది రూ.లక్షకు పెంచడం విశేషం.