గాన గంధర్వుడికి కేరళ ప్రభుత్వ పురస్కారం | SP balasubramanyam got harivarasanam award | Sakshi
Sakshi News home page

గాన గంధర్వుడికి కేరళ ప్రభుత్వ పురస్కారం

Published Mon, Apr 20 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 AM

SP balasubramanyam got harivarasanam award

తిరుపతి: గాన గంధర్వుడు ఎస్‌పి బాలసుబ్రమణ్యం కేరళ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకోనున్నారు. అయ్యప్ప భక్తిగీతాలు ఆలపించిన బాలసుబ్రమణ్యం అయ్యప్పస్వామి కొలువైన శబరిమలై పుణ్యక్షేత్రంలో హరివరసానం అవార్డును అందుకోనున్నారు. కేరళ ప్రభుత్వం ప్రతి ఏడాది అయ్యప్పస్వామిని కీర్తిస్తూ ఆలపించిన ప్రముఖ గాయకుల్లో ఒకరిని ఎంపిక చేసి ఈ అవార్డుతో సత్కరించడం ఆనవాయితీ.

ఈ సారి మన గాన గంధర్వుడి ని అవార్డు వరించింది. జూన్‌లో శబరిమలైలో ఈ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. గత ఏడాది వరకు అవార్డుతోపాటు రూ.50వేలు నగదు బహుమతి అందించిన కేరళ ప్రభుత్వం ఈ ఏడాది రూ.లక్షకు పెంచడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement