ప్రముఖ గాయని కె.ఎస్. చిత్రకు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కనుంది. కేరళ ప్రభుత్వం ఏటా అందజేసే ‘హరివరాసనమ్’ పురస్కారానికి ఈ ఏడాది చిత్రని ఎంపిక చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. జనవరి 14న శబరిమల దేవస్థానంలో వైభవంగా జరగనున్న కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని చిత్రకి అందజేయనున్నారు. పురస్కారంలో భాగంగా రూ. లక్ష నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని గాయని అందుకోనున్నారు. మధురమైన తన స్వరంతో పాటలు పాడుతూ.. అందరిలో లౌకిక స్ఫూర్తిని పెంపొందిస్తున్నందుకే చిత్రకి ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక పురస్కారం ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘దక్షిణ భారత నైటింగేల్’ అని బిరుదందుకున్న సింగర్ చిత్ర మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల సినిమాలకు గాత్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment