Tub
-
చందమామ రావే... రోలర్ కోస్టర్ తేవే! రూపాయి ఖర్చు లేకుండా!
పిల్లల ఆనందానికి మించి తల్లిదండ్రులకు ఆస్తులు ఏం ఉంటాయి? ఈ ఇన్స్టాగ్రామ్ వైరల్ వీడియోను చూస్తే... ‘నిజమే సుమీ!’ అనిపిస్తుంది. పిల్లలు ఎంజాయ్ చేసే వాటిలో రోలర్ కోస్టర్ రైడ్ కూడా ఒకటి. అయితే బయటికి పిల్లల్ని తీసుకెళ్లి ఆ ఆనందంలో భాగం చేయడానికి టైమ్ సరిపోవడంతో పాటు డబ్బులు కూడా సరిపోవాలి. ఈ వైరల్ వీడియో దంపతులు తమ ఇంట్లో ఉన్న పెద్ద ఎల్ఈడీ టీవీతో ‘రోలర్ కోస్టర్ రైడ్’ను ఇంట్లోకి తీసుకువచ్చారు. సాఫ్ట్ కుషన్‌తో కూడిన టబ్‌లో పాపను కూర్చోబెట్టారు. చెరో పక్క పట్టుకొని టీవీ దగ్గరకు తీసుకువెళ్లారు. టీవీలో రోలర్ కోస్టర్ వర్చువల్ వీడియోను ప్లే చేశారు. పాప ఆ రైడ్‌లో భాగం అయింది. సంతోషంతో నవ్వుతూనే ఉంది! View this post on Instagram A post shared by Kaashvi Rathore (@princess_point_.l) -
నీటిసంపులో పడి బాలుడి మృతి
కేసముద్రం(మహబూబాబాద్): నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని రం గాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికు లు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన నేరేడి శ్రీనాథ్, అనిత దంపతులకు ఇద్దరు కుమారులు బబ్లు, జశ్వంత్(2) ఉన్నారు. శ్రీనాథ్ మేకలను మేపేందుకు వెళ్లగా, అనిత కూలీ పని నిమిత్తం వెళ్లింది. ఈ క్రమంలో ఇంటివద్ద ఉన్న జశ్వంత్ ఇంటి ఆవరణలోని నీటి సంపులో ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. ఇంతలో ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు సంపు వద్దకు వచ్చి చూడగా కొడుకు చనిపోయి ఉండడాన్ని గమనించారు. సంప్‌లో నుంచి బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి కన్నీరుమున్నీరుగా విలపించారు. -
చిన్నారిని మింగిన నీటి తొట్టె
పత్తికొండ టౌన్: మండలంలోని పుచ్చకాయలమాడ గ్రామంలో మంగళవారం సాయంత్రం నీటితొట్టెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు. గ్రామానికి చెందిన వనిత, కాశీనాథ్ దంపతుల కుమారుడు జయక్రిష్ణ సాయంత్రం ఇంటిముందు అరుగుపై ఆడుకుంటూ, ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నీటితొట్టెలో పడిపోయాడు. తండ్రి బయటకు వెళ్లగా, ఇంటిలో పనిలో ఉన్న తల్లి గమనించ లేదు. చాలాసేపటి తర్వాత చిన్నారి కోసం వెతకగా, నీటితొట్టెలో అచేతనంగా పడిఉన్నాడు. తీసిచూడగా అప్పటికే మతి చెందాడు. కుమారుడి మతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
సంపులో పడి చిన్నారి మృతి
హైదరాబాద్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని కాటేదాన్ వెంకటేశ్వర కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. తల్లి దండ్రులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఉదయ్(4) ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి సంపులో పడ్డాడు. ఈ ఘటన ఎవరు గుర్తించకపోవడంతో.. నీట మునిగి మృతిచెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.