
ప్రతీకాత్మక చిత్రం
కేసముద్రం(మహబూబాబాద్): నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని రం గాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికు లు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన నేరేడి శ్రీనాథ్, అనిత దంపతులకు ఇద్దరు కుమారులు బబ్లు, జశ్వంత్(2) ఉన్నారు. శ్రీనాథ్ మేకలను మేపేందుకు వెళ్లగా, అనిత కూలీ పని నిమిత్తం వెళ్లింది.
ఈ క్రమంలో ఇంటివద్ద ఉన్న జశ్వంత్ ఇంటి ఆవరణలోని నీటి సంపులో ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. ఇంతలో ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు సంపు వద్దకు వచ్చి చూడగా కొడుకు చనిపోయి ఉండడాన్ని గమనించారు. సంప్‌లో నుంచి బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment