Drain
-
ఐస్ క్రీంలో పురుగులు
-
సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే
ప్రముఖ ఆర్ అండ్ బీ గాయకుడు అషర్ మాజీ భార్య తమెకా ఫాస్టర్ తాజాగా జార్జియాలోని అతి పెద్ద సరస్సును ఖాళీ చేయించాలని అధికారులను కోరుతున్నారు. దానిలో ఆమె కుమారుడు 11 సంవత్సరాల క్రితం జెట్ స్కీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఫ్యాషన్ డిజైనర్ తమెకా ఫాస్టర్ అట్లాంటాకు ఈశాన్యంగా ఉన్న 44-మైళ్ల పొడవైన రిజర్వాయర్ లేక్ లానియర్ "డ్రెయిన్, క్లీన్,రీస్టోర్" కోసం ఆన్లైన్ పిటిషన్ వేసి, 3 వేలకు మించిన సంతకాలను సేకరించారు. ఈ భారీ సరస్సు పూర్తిగా ఎండిపోయినప్పుడే అధికారులు దానిలోని ప్రమాదకర పదార్థాలను సురక్షితంగా తొలగించగలరని ఆమె అంటోంది. వ్యక్తిగత వాటర్‌క్రాఫ్ట్, వినోద కార్యక్రమాలలో నిమగ్నమయ్యేవారి రక్షణ కోసం సరస్సు వద్ద మెరుగైన భద్రతా చర్యలను చేపట్టాలని ఫోస్టర్ సూచించారు. ఆమె 11 ఏళ్ల కుమారుడు కిల్ గ్లోవర్ జూలై 2012లో లేక్ లానియర్లోని లోపలి ట్యూబ్‌పై తేలుతుండగా, వారి కుటుంబ స్నేహితుడు జెఫ్రీ హబ్బర్డ్ నడుపుతున్న జెట్ స్కీ ఆ బాలునిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కైల్ - బౌన్స్ టీవీ వ్యవస్థాపకుడు ర్యాన్ గ్లోవర్ కుమారుడు, అషర్ సవతి కొడుకు బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. అయితే ఆ బాలుడు చనిపోయే ముందు రెండు వారాల పాటు లైఫ్ సపోర్ట్‌లో ఉన్నాడు. ఈ నేపధ్యంలో హబ్బర్ట్పై హత్య కేసు నమోదయ్యింది. అతను దోషిగా నిర్ధారణ కావడంతో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, 15 ఏళ్ల పరిశీలన శిక్ష విధించారు. తన కుమారుని విషయంలో ఎదురైన ఈ సంఘటన సరస్సులో సరైన జోనింగ్, భద్రత, రక్షణ చర్యల తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతున్నదని ఫోస్టర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ తెలిపిన వివరాల ప్రకారం సరస్సుపై భారీ ట్రాఫిక్ కారణంగా గత మూడు దశాబ్దాల్లో వందలాది పడవలు పరస్పరం ఢీకొన్నాయి. 1994-2018 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో 170కు మించిన మరణాలు చోటుచేసుకున్నాయి. 73 ఏళ్ల క్రితం నాటి ఈ మానవ నిర్మిత సరస్సు నీటి ప్రవాహాలపై ప్రభావం చూపుతున్నదని, ఇది ఇక్కడ వినోద కార్యక్రమాల్లో పాల్గొనేవారికి ప్రమాదకరంగా పరిణమించిందని ఫోస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాహూచీ రివర్కీపర్ కన్జర్వేషన్ గ్రూప్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సరస్సు 5 మిలియన్ల ప్రజలకు తాగునీటిని అందిస్తున్నది. ఆస్కార్విల్లేలోని నల్లజాతి కమ్యూనిటీకి ముంపును తెచ్చిపెడుతూ ప్రమాదకరంగా పరిణమించిన ఈ సరస్సును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, తద్వారా ఇటువంటి విషాదాలను నివారించవచ్చని ఫోస్టర్ పేర్కొంది. ఈ లేక్‌లోని నీటిని తోడి వేసిన తరువాత నీటి సంబంధిత కార్యకలాపాల కోసం కఠినమైన నిబంధనలను అమలు చేయాలని, జోనింగ్‌ను ప్రవేశపెట్టాలని ఫోస్టర్ ప్రతిపాదించింది. కాగా ఫోస్టర్, అషర్లు 2009లో విడాకులు తీసుకున్నారు. వీరికి అషర్ రేమండ్, నావిడ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
డ్రైన్లు శుభ్రం చేసిన ట్రాఫిక్ పోలీసులు
బెంగళూరు: గుజరాత్ తీరంలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న బిపర్ జోయ్ తుఫాను ప్రభావం బెంగళూరు నగరం మీద కూడా పడింది. మంగళవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరం మొత్తం నీటమునిగింది. ఎక్కడికక్కడ నీళ్లు రోడ్లపై చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. స్వయంగా ట్రాఫిక్ పోలీసులే రంగంలోకి దిగి డ్రైనేజీ అడ్డులను తొలగించి వర్షపు నీటిని మళ్లించి ట్రాఫక్ క్లియర్ చేశారు. వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన పోలీసుల వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు బెంగళూరు సౌత్ డీసీపీ సుజీతా సల్మాన్. భారీ వర్షం కారణంగా ఏకోస్పెస్, బెల్లందూర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ కోన్ లను ఉపయోగించి నీటిని తొలగించారు. డ్రైనేజీల్లో అడ్డుపడిన చెత్తను స్వహస్తాలతో తీసి వర్షపు నీటిని మళ్లించడంతో నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేయగలిగారు. ఇదే విషయాన్ని బెంగళూరు సౌత్ డీసీపీ తన ట్విట్టర్లో రాస్తూ.. నిలిచిపోయిన నీటిని ట్రాఫిక్ పోలీసుల సాయంతో తొలగించడమైందన్నారు. ట్వీట్ తోపాటు వీడియోని కూడా జత చేశారు డీసీపీ. water logging cleared with the help of our staff. @CPBlr @jointcptraffic @blrcitytraffic @BlrCityPolice https://t.co/CUXvU8EG9e pic.twitter.com/fMmo3dsV92 — Sujeetha Salman , IPS (@DCPSouthTrBCP) June 12, 2023 -
ఛీ!.. ఇలానా కొబ్బరి బోండాలు విక్రయించేది..వీడియో వైరల్
ఈ వేసవిలో దాహార్తిని తీర్చడానికి కొబ్బరి బోండాలకు సాటి ఏదిరాదు. అలాంటి కొబ్బరి బోండాలు అనారోగ్యంగా ఉన్నప్పుడూ, లేదా పండగలు, శుభాకార్యాల్లోనే ఎంతగానో వినియోగిస్తాం. ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా మంది కొబ్బరి బోండాలనే ప్రివర్ చేస్తుంటారు. కూల్‌డ్రింక్స్‌కి బదులు ఇవే ఆరోగ్యానికి మంచిదని వాటికే ప్రాధాన్యత ఇస్తారు చాలామంది. ఐతే ఈ వీడియో చూశాక కచ్చితంగా ఓపినియన్ మారిపోవడమే గాక తాగేందుకు భయపడతాం కూడా. ఆఖరికి కొబ్బరి బొండాలను కూడా ఇలా కలుషితం చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అని విస్మయం కలిగిస్తుంది ఈ వ్యక్తి చేసిన పని. ఆ వీడియోలో కొబ్బరి బోండాలను అమ్మే వ్యక్తి తన బండిపై ఉన్న లేత కొబ్బరి బోండాలపై డ్రైయిన్ వాటర్ చల్లుతున్నట్లు కనిపిస్తుంది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సదరు వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందని 28 ఏళ్ల సమీర్‌గా గుర్తించారు. #Watch | Vendor sprinkling drain water on coconuts. Noida Police caught after video viral on social media#Noida #viralvideo #Coconuts #News18JKLH pic.twitter.com/ZhuXEYCylz — News18 Kashmir (@News18Kashmir) June 6, 2023 (చదవండి: అభిమానానికి హద్దులు లేవంటే ఇదేనేమో!.. ఓ వ్యక్తి ధోనిపై ఉన్న ప్రేమను..) -
వైరల్ వీడియో: చేపల వేటకు వెళ్తే నోట్ల కట్టలు ప్రత్యక్షం..
-
మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): నగరంలోని తిలక్ రోడ్డు షిరిడీ సాయి మార్గ్ జంక్షన్లో నిర్మాణ దశలో ఉన్న డ్రెయినేజీలో గత వారం రోజుల కిందట దురదృష్టవశాత్తు కాలు జారి పడి మృతిచెందిన ఏరుకొండ నాగేశ్వరరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. మృతుడు నాగేశ్వరరావు కుటుంబానికి నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని ఎంపీ భరత్ గురువారం అందజేశారు. అలాగే డ్రెయినేజీ కాంట్రాక్టర్ తరపున మరో రూ.5 లక్షలు నష్టపరిహారాన్ని ఎంపీ భరత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి సహాయ సహకారాలను బహిర్గతం చేయకూడదని, కానీ ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా టీడీపీ నాయకులు కొంతమంది శవ రాజకీయాలు చేయడం వల్ల చెప్పక తప్పడం లేదన్నారు. చదవండి: చంద్రబాబు నోరు.. రామోజీ రాతలు ఒక్కటే: మంత్రి బొత్స జరిగిన సంఘటన దురదృష్టకరం.. మానవతా దృక్పథంతో ఆదుకోవాలి.. తప్పిస్తే ఇటువంటి విషాదకర సంఘటనలను తమ స్వప్రయోజనాలకు వాడుకోవడం మంచిది కాదన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జరిగిన ఈ సంఘటనను సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని.. ఆయన చాలా బాధపడ్డారన్నారు. మృతుని ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ఎంపీ వెంట నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, బొమ్మన జయ్ కుమార్, కొత్త బలమురళి, కంతారం పాటిల్,సీరపు నగేష్ చంద్రరెడ్డి, దుంగ సురేష్, తదితరులు ఉన్నారు. చదవండి: హోంశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
ఇంటికో ఇంకుడు గుంత
సాక్షి, అమరావతి: వైఎస్సార్–జగనన్న కాలనీల్లో నిర్మించిన ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేలకు పైగా లేఅవుట్లలో 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయగా.. రెండు దశల్లో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో 17.66 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఆయా కాలనీల్లో రూ.32 వేల కోట్లకు పైగా నిధులతో శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు ఇప్పటికే కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లు చకచకా ఇస్తున్నారు. ఇదిలావుండగా శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తయి ఉండాలి. అలాకాకుండా సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. ఈ క్రమంలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్ల వద్ద తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో గుంతకు రూ.6 వేలు ఒక్కో ఇంకుడు గుంత నిర్మించడానికి దాదాపు రూ.6 వేల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ మొత్తాన్ని సంబంధిత ఇంటి లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3.40 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కాగా, తొలి దశలో 7,278 కాలనీల్లో 1,11,770 ఇళ్లకు ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎంపీడీవోలు/మునిసిపల్ కమిషనర్ల నేతృత్వంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు/వార్డు ఎమినిటీ సెక్రటరీలకు ఇంకుడు గుంతల నిర్మాణం పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. వీరికి గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగంతో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. పలు ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం ప్రారంభించారు. భూగర్భ జలం పెరుగుతుంది ప్రస్తుతం నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం వినియోగిస్తాం. పూర్తి స్థాయిలో డ్రెయిన్లు, కాలువలు నిర్మించిన అనంతరం ఇంట్లో వృథాగా పోయే నీటితోపాటు వర్షపు నీటిని కూడా ఈ గుంతల్లోకి చేర్చవచ్చు. తద్వారా భూగర్భ జలం పెరుగుతుంది. కాలనీల్లో పెద్దఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణం చేపడితే భవిష్యత్‌లో భూగర్భ జలాల అభివృద్ధికి దోహదపడుతుంది. – అజయ్‌జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ -
Video: పెళ్లి ఫొటోలు తీస్తూ కాలువలో పడిపోయిన మహిళ.. తరువాత ఏం జరిగిందంటే!
పెళ్లంటేనే సందడి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఇళ్లంతా పండగ వాతావరణం ఉంటుంది. పెళ్లిలో జరిగే ఫన్నీ, ఊహించని, ఆసక్తికర, షాకింగ్, ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఈ మధ్య వివాహ వేడుకల్లో ఎంజాయ్మెంట్ ఎక్కువైంది. అతి చేష్టలకు పోయి కొందరు ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేడుకలో వధూవరుల ఫొటోలు తీస్తున్న ఓ మహిళ పొరపాటున కాలు జారి మురికి కాలువలో పడిపోయింది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు చోటుచేసుకుందో దానిపై క్లారిటీ లేదు కానీ.. వీడియో చూస్తుంటే విదేశాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో మహిళ వధూవరుల ఫొటోలను తన ఫోన్లో రికార్డ్ చేస్తూ కనిపించింది. జంటను కెమెరాలో బంధించే క్రమంలో వెనక్కి నడుస్తుండగా ఉన్నట్టుండి మురుకు నీటి కాలువలో పడిపోయింది. అక్కడున్న వారంతా ఆమెను కాలువ నుంచి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం కనిపించింది. ఇక ఈ వైరల్ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు. ఫోటోలో మునిగిపోవడమే కాకుండా.. చుట్టూ పిరిసరాలను గమనిస్తూ ఉంటే బాగుంటుంది. అదృష్టం బాగుండి ఎలాంటి గాయాలు కాలేదు. లేకుంటే ఎంత ఘోరం జరిగేది’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by hyderabadi__jaan (@hyderabadi__jaan) -
బిక్కవోలు డ్రెయిన్‌లో డాల్ఫిన్ చేప
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: మండలంలోని ఏపీత్రయం శివారు బిక్కవోలు డ్రెయిన్‌లో గురువారం మధ్యాహ్నం డాల్ఫిన్ చేప స్థానికులకు చిక్కిందని తహసీల్దార్ టి.సుభాష్, జిల్లా ఫారెస్ట్ అధికారి ఐవీకే రాజు తెలిపారు. బిక్కవోలు డ్రెయిన్‌లో డాల్ఫిన్ చేప కనిపించడంతో స్థానికులు తమకు సమాచారం అందించారన్నారు. అక్కడికి వెళ్లి స్థానికుల సహాయంతో ఏపీత్రయం వంతెన సమీపంలో డాల్ఫిన్ చేపను ఆ డ్రెయిన్‌లో విడిచిపెట్టామన్నారు. కొంతసేపటికి అది నీటిలో మునిగిపోయిందన్నారు. జాలర్లు వెదకగా అది చనిపోయినట్లు గుర్తించారు. డాల్ఫిన్ 150 కేజీల బరువు, 1.5 మీటర్ల పొడవు ఉందన్నారు. ఇది సముద్రంలో నుంచి ఇంద్రపాలెంలో గల ఉప్పుటేరు మీదుగా బిక్కవోలు డ్రెయిన్‌లోకి వచ్చి ఉంటుందని తెలిపారు. నిబంధనల ప్రకారం డాల్ఫిన్‌కు శుక్రవారం పోస్టుమార్టం చేస్తారన్నారు. గ్రామంలోని ఏటిగట్టు వద్ద ఉన్న డాల్ఫిన్‌ను చూడటానికి జనం ఎగబడ్డారు. వీఆర్వో జి.అంచిబాబు, ఫారెస్ట్ అధికారులు సిద్ధార్థ, ఉపేంద్రరెడ్డి, వసంతకుమారి పాల్గొన్నారు. చదవండి: రెండురోజుల్లో పెళ్లి.. అంతలోనే యువకుడి షాకింగ్ నిర్ణయం.. ఏం జరిగింది? -
డ్రైన్ ఉంటే మాకేంటి...ఆక్రమించి మరీ భవన నిర్మాణం!
ఒంగోలు సబర్బన్: నగరంలో అక్రమ కట్టడాలు యథేచ్చగా సాగుతున్నాయి. నగర పాలక సంస్థ అధికారుల అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు పూర్తవుతున్నాయి. కళ్ల ముందే పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నా నగర పాలక సంస్థ అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. నగరంలో ఒకచోట కాదు అనేక ప్రాంతాల్లో అనుమతుల్లేని నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. తనిఖీలకు వెళ్లిన సమయంలో తెరవెనుక ఒప్పందాలు కుదుర్చుకుని వస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్‌లో అక్రమంగా నిర్మిస్తున్న భారీ భవనం. దక్షిణ బైపాస్ ప్రగతి భవన్‌కు వెళ్లే ప్రధాన గేటుకు ఆనుకొని దానిని నిర్మిస్తున్నారు. వారం రోజులుగా పనులు జరుగుతున్నాయని తెలిసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఒకటికి నాలుగు సార్లు అక్కడికి వెళ్లి వచ్చారే తప్ప నిర్మాణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదంటే.. దాని మతలబు ఏమై ఉంటుందో స్పష్టమవుతోంది. దీనికి తోడు దక్షిణ బైపాçస్లో ఉత్తరం వైపున ఆనుకొని ఒంగోలు నగరానికి చెందిన ప్రధాన డ్రైనేజీ కాలువ ఉంది. మామిడిపాలెం, హౌసింగ్ బోర్డు, ఎస్ఎస్ ట్యాంకు–1 పరిసర ప్రాంతాల నుంచి మురుగు నీరు, వర్షపు నీరు ఈ డ్రైనేజి నుంచే ప్రవహించాల్సి ఉంది. అయితే దాదాపు 10 అడుగుల వెడల్పు ఉండే దీనికి రెండు సిమెంట్ పైపులు వేసి తాత్కాలికంగా మట్టితో కప్పేసి మరీ నిర్మాణం చేస్తున్నారు. పెద్ద వరద వస్తే వర్షపు నీరు సాఫీగా వెళ్లే వీలు లేక ప్రభుత్వ భవనాల సముదాయం, నాగార్జున యూనివర్శిటీ స్టడీ సెంటర్, నవోదయ కళాశాలల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా నగరంలో అక్రమ నిర్మాణాలకు కట్టడి వేయాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్‌లో ఉన్నతాధికారి స్పందించకపోవడం గమనార్హం. నగర పాలక సంస్థ ఆదాయానికి గండి: అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేసుకుంటూ పోతే నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఫ్లింత్ ఏరియాను బట్టి, అంతస్తుల భవనాల లెక్కన కార్పొరేషన్‌కు ఫీజులు చెల్లించాలి. నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా తూట్లు పడుతున్నా తమ జేబులు నిండితే చాలు అన్న చందంగా ఉంది టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు. నోటీసులు ఇచ్చి ఆపుతాం.. అక్రమంగా జరుగుతున్న భవన నిర్మాణాలను ఆపేస్తాం. నిబంధనలకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకుంటాం. దక్షిణ బైపాస్‌లో ప్రగతి భవన్ ముందు జరుగుతున్న భవన నిర్మాణం విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే నోటీసులు ఇవ్వమని టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్పా. నోటీసు ఇవ్వటంతో పాటు అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేస్తాను. టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమాలకు పాల్పడిన విషయం నా దృష్టికి రాలేదు. ఆ విషయంపై కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటాను. – ఎం.వెంకటేశ్వరరావు, కమిషనర్, ఒంగోలు నగర పాలక సంస్థ -
మురికి కాల్వలో దూకిన కౌన్సిలర్.. వెంటనే పాలాభిషేకం.. ఎందుకో తెలుసా..?
సాక్షి, న్యూఢిల్లీ: సింహాద్రి సినిమాలో సింగమలై అంటూ విలన్లను ఊచకోత కోస్తాడు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఎన్టీఆర్‌కు పాలాభిషేకం చేస్తారు. ఇదే తరహాలో ఓ కౌన్సిలర్ చేసిన పనికి ప్రజలు ఫిదా అయిపోయి ఆయనకు పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా కౌన్సిలర్.. ఎందుకిలా చేశారు అనుకుంటున్నారా.. వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలో మున్సిపల్ కార్మికులు మురికి కాలువను శుభ్రం చేయడంలేదని ఆ ప్రాంత కౌన్సిలర్‌కు వినతి పత్రాలు అందాయి. దీంతో అక్కడికి చేరుకున్న ఆప్ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హసన్.. శాస్త్రి పార్క్‌లో పొంగిపొర్లుతున్న మురుగు కాలువను శుభ్రం చేయడానికి అందులోకి దిగారు. అనంతరం కాలువలోని చెత్తను తొలగించారు. AAP councilor Haseeb-ul-Hasan jumps in drain during mission clean up, then milk bath much in the style of actor Anil Kapoor in the Bollywood blockbuster “Nayak”. Watch the #ViralVideo. (Video by @PankajJainClick) #AAP #Drain #MilkBath pic.twitter.com/bkBAi5PyEB — IndiaToday (@IndiaToday) March 22, 2022 ఈ సందర్భంగానే ఆ కాలువను అక్కడి అధికారులు శుభ్రం చేయడం లేదని.. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగానని హసీబ్ చెప్పడం గమనార్హం. కాలువలోని చెత్తను తొలగించిన అనంతరం ఆ ప్రాంతంలోని ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు ఆయనను కూర్చోబెట్టి పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్ స్పందిస్తూ.. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతల స్టంట్లు మొదలయ్యాయంటూ కామెంట్స్ చేశాడు. -
పాపం ఏమైందో.. వివాహిత ఆత్మహత్య
మొగల్తూరు(పశ్చిమగోదావరి): గొంతేరు డ్రెయిన్‌లో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవు గ్రామంలో జరిగింది. ఎస్సై ఆర్.మల్లిఖార్జున రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కాళీపట్నం పడమరకు చెందిన జక్కంశెట్టి ధర్మారావు గత ఏడాది కరోనా కారణంగా మృతిచెందగా అప్పటి నుంచి కుమార్తె అశ్విని దిగాలుగా ఉండేది. మూడు నెలల క్రితం అశ్వినికి (23)కి భీమవరం మండలం దిరుసుమర్రుకు చెందిన వేండ్ర రామకృష్టతో వివాహమైంది. చదవండి: నెట్ సెంటర్లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి.. ఇటీవల సంక్రాంతి పండుగకు కాళీపట్నం వచ్చిన ఆమె గురువారం అర్దరాత్రి మోటార్‌సైకిల్‌పై ఒంటరిగా ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవు ప్రాంతంలోని జాతీయ రహదారి వంతెన వద్దకు చేరుకుంది. సెల్‌ఫోన్‌ను అక్కడ వదిలేసి డ్రెయిన్‌లోకి దూకేసింది. కుటుంబ సభ్యులు చింతరేవు వంతెన వద్ద మోటార్‌సైకిల్ గుర్తించి డ్రెయిన్‌లో గాలించారు. వంతెన సమీపంలోని ముత్యాలపల్లి రేవు వద్ద మృతదేహాన్ని గుర్తించారు. బాధితురాలి తల్లి తులసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
అమానుషం: పసికందును డ్రైనేజీలో పడేసిన తల్లి
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): భర్త వేధింపులు తాళలేక ఓ తల్లి తన కొడుకును డ్రైనేజీలో పడేయగా బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన విజయవాడలోని కామినేనినగర్ డొంకరోడ్డు కాలనీలో జరిగింది. వల్లెపు మీనాక్షి డొంకరోడ్డు కాలనీకి చెందిన జయరాంను ద్వితీయ వివాహం చేసుకుంది. వీరికి 6 నెలల కిందట సామ్యేలు జన్మించాడు. మీనాక్షిపై భర్తకు అనుమానం పెరిగింది. జయరాంకు మద్యం, గంజాయి సేవించే అలవాటు ఉంది. ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్తతో విసిగిపోయిన మీనాక్షి బుధవారం ఉదయం 5 గంటలకు సామ్యేలును తీసుకొని కాలనీ పక్కనే ఉన్న గుంటతిప్ప డ్రైనేజీలో పడేసింది. కాలనీ వాసులు సామ్యేలు కోసం డ్రైనేజీలో గాలించారు. సామ్యేలు మృతదేహాన్ని బయటకు తీసి విషయాన్ని పటమట పోలీసులకు చెప్పారు. వారు ఘటనాస్థలికి చేరుకొని పంచనామా అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జయరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు మీనాక్షిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: AP: నేటి నుంచి 12వ విడత ఫీవర్ సర్వే -
తన్నుకున్న సర్పంచ్, ఉపసర్పంచ్
కౌడిపల్లి (నర్సాపూర్): ఓ మురికి కాలువ నిర్మాణం విషయంలో సర్పంచ్, ఉపసర్పంచ్లు బాహాబాహీకి దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్‌పల్లిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో పంచాయతీ నిధులతో స్థానిక పాఠశాల నుంచి నల్లపోచమ్మ గుడి వరకు మురికి కాలువ నిర్మించేందుకు సర్పంచ్ సంజీవ్ ప్రతిపాదించారు. అయితే మరోచోట నిర్మిద్దామని ఉపసర్పంచ్ వెంకటేశం ఈ ప్రతిపాదనపై అభ్యంతరం చెప్పారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకోవడంతో పాటు తన్నుకున్నారు. దీంతో తోటి సభ్యులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడిపించారు. పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉపసర్పంచ్‌పై దాడి పంచాయతీ కార్యాలయంలో బాహాబాహీ అనంతరం ఎంపీటీసీ ప్రవీణ్, సర్పంచ్ సంజీవ్ కుటుంబ సభ్యులు అతని అనుచరులు కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఇంతలోనే ఉపసర్పంచ్ వెంకటేశం కూడా అక్కడికి వచ్చాడు. ఇది గమనించిన సర్పంచ్ అన్న రవి, తమ్ముడు ప్రవీణ్‌తోపాటు అతని వర్గీయులు ఒక్కసారిగా ఉపసర్పంచ్‌పై దాడి చేశారు. దీంతో ఎస్ఐ రాజశేఖర్, పోలీసు సిబ్బంది ఇరువర్గాలను చెదరగొట్టారు. చదవండి: ఆధిపత్య పోరు: సర్పంచ్ వర్సెస్ ఉపసర్పంచ్ -
కరోనా : వేడి వేడి సమోసా కావాలా నాయనా!
మహమ్మారి కరోనాను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోంది. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. అయితే ఇలాంటి కష్ట సమయంలో కూడా ఒక ఆకతాయి తన బుద్ధిని బయటపెట్టుకున్నాడు. బాధితులకోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి ఒక వింత కోరిక కోరాడు. దీంతో అప్పటికే ఇలాంటి అసంబద్ద కాల్స్ తో విసుగు చెందిన జిల్లా ఉన్నతాధికారి సదరు వ్యక్తికి తగిన రీతిలో బుద్ధి చెప్పారు. అంతేకాదు సంక్షోభ సమయంలో కీలకమైన సేవలందిస్తున్న సమయంలో ఇలాంటి పిచ్చి పిచ్చి కాల్స్ తో విసిగిస్తే.. ఇలాంటి గుణపాఠమే చెబుతామంటూ హెచ్చరించారు. కరోనా బాధితుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రాంపూర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసిన ఒక వ్యక్తి తనకు వేడి వేడి సమోసాలు కావాలని కోరాడు. అంతకు ముందు పిజ్జా డెలివరీ కావాలని అడిగాడు. పలుమార్లు ఇలాగే చేయడంతో చిర్రెత్తుకొచ్చిన డిఎం ఆంజనేయ కుమార్ సింగ్ అతగాడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అతను అడిగినట్టుగానే సమోసాలను అతనికి పంపించి, అనంతరం సదరు వ్యక్తిచేత డ్రైనేజీ శుభ్రం చేయించారు. దీనికి సంబంధించి ఆయనొక పోస్ట్ షేర్ చేశారు. తమ అమూల్య సమయాన్నివృధా చేస్తే ఇలానే వుంటుందనేసందేశాన్నిచ్చారు. నిబంధనలు పాటిస్తూ ప్రజలు సురక్షితంగా వుండాలని సూచించారు. దీంతో డీఎం చర్యను పలువురు నెటిజన్లు అభినందించారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న వారిని ఇలా విసిగించడం తగదని మండిపడుతున్నారు. కలిసికట్టుగా పోరాడి కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టాలని పిలుపునివ్వడం విశేషం. नाली साफ कर सामाजिक कार्य में योगदान देकर प्रशासन को सहयोग देते व्यवस्था का दुरुपयोग करने वाले व्यक्ति। राष्ट्रीय आपदा के समय आप सभी का सहयोग प्रार्थनीय है। जिम्मेदार नागरिक बनें। स्वस्थ रहें। सुरक्षित रहें। pic.twitter.com/4vMMp97OLp — DM Rampur (@DeoRampur) March 29, 2020 -
కన్నతల్లే కఠినాత్మురాలై..
నిడదవోలు రూరల్: పసికందును కన్నతల్లే మురుగు డ్రెయిన్‌లో పడవేసిన విషాదఘటన నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఓ యువతి ఈ ఘాతుకానికి పాల్పడింది. పెళ్లి కాకుండానే గర్భిణి అయిన ఈ యువతి గురువారం అర్ధరాత్రి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ పసికందు గర్భంలోనే మృతిచెందడంతో డ్రెయిన్‌లో పడవేసినట్లు తెలిసింది. స్థానికులు శుక్రవారం ఉదయం మురుగు డ్రెయిన్‌లో ఉన్న శిశువును చూసి పంచాయతీ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటా సర్వే చేసి అనారోగ్యంతో ఉన్న ఆ యువతిని గుర్తించి నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. తాడిమళ్ల పీహెచ్సీ వైద్యాధికారి సుధీర్‌కుమార్ పర్యవేక్షణలో నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి యువతికి వైద్యపరీక్షలు చేశారు. యువతి సమాచారం మేరకు సమిశ్రగూడెం ఎస్సై టీవీ సురేష్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పనులకు వెళ్లి పరిచయం పెంచుకుని.. యువతితో పాటు ఆమె తండ్రి ఇద్దరూ కలిసి ఈ ఏడాది జనవరిలో జంగారెడ్డిగూడెం మండలంలో పొగాకు నారుమడుల పనికి వెళ్లారు. వారికి బంధువైన చాగల్లు మండలం ఊనగట్ల గ్రామానికి చెందిన యువకుడితో ఈమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకోవడంతో గర్భం దాల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. తనకు గర్భం వచ్చిందని తెలియదని ఆ యువతి చెప్పినట్లు తెలుస్తోంది. -
తల్లి వద్దనుకుంది.. మూగజీవులు కాపాడాయి
చండీగఢ్ : ఇంకా కన్ను కూడా తెరవని పసిపాపను నిర్దాక్షిణ్యంగా మురికి కాల్వలోకి విసిరేసింది ఓ కసాయి తల్లి. కానీ నోరు లేని మూగజీవులు ఆ బిడ్డను కాపాడి మానవత్వం చాటుకున్నాయి. ప్రస్తుతం ఆ చిన్నారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణం హరియాణలోని కైతాల్ జిల్లాలో చోటు చేసుకుంది. సీసీటీవీ రికార్డులో ఉన్న దాని ప్రకారం శుక్రవారం ఓ మహిళ డోగ్రన్ గేట్ ప్రాంతంలో ఓ పసిపాపను ప్లాస్టిక్ కవర్లో చుట్టి మురికి కాల్వలోకి విసిరి వెళ్లి పోయింది. అయితే కుక్కలు ఆ కవర్‌ను బయటకు తీసుకురావడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ప్లాస్టిక్ కవర్లో పసిపాపను చూసి కుక్కలు అరుస్తూ.. బాటసారులను అప్రమత్తం చేశాయి. పసిబిడ్డను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. చిన్నారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. విసిరేయడం మూలానా చిన్నారి తలకు బలమైన గాయం అయినట్లు వైద్యులు తెలిపారు. త్వరలోనే నయమవుతుందన్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ దారుణానికి పాల్పడిన మహిళ గురించి ఆరా తీస్తున్నాం. త్వరలోనే ఆమెను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. -
డ్రైన్లో తేలుతూ.. పసికందు మృతదేహం
సాక్షి, అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్) : తల్లి పొత్తిళ్లలో నిద్రించాల్సిన ఆ పసికందు మురుగు కాల్వ పాలయ్యాడు. ఏ తల్లికి భారమయ్యాడో మరి కళ్లు కూడా పూర్తిగా తెరవకుండానే అందరికీ దూరమయ్యాడు. డ్రైనేజీలో ఓ మగ శిశువు మృతదేహం లభ్యమైన ఘటన పాయకాపురం శాంతినగర్‌లో సోమవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం శాంతినగర్ శారదా విద్యాలయం రోడ్డులోని ప్రధాన డ్రైన్లో ఓ శిశువు ఆకారం ఉన్న మృతదేహం తేలుతూ స్థానికులకు కనిపించింది. దీంతో వారు స్థానిక నా యకులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు డ్రైన్ మధ్యలో ఉన్న ఆ శిశువును బయటకు తీశారు. పేగులు మొత్తం బయటపడి ఉన్నాయి. సుమారు రెండు రోజుల వయస్సు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు ఎవరైనా కావాలని పడేశారా లేక ఎక్కడైనా పుట్టి చనిపోయిన బిడ్డను ఇలా కాల్వలో వదిలేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నున్న సీఐ ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి వివరాలను సేకరిస్తున్నారు. -
మురికి కాల్వలో పడ్డ వరుడు
చండీగఢ్ : పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించిన బరాత్ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. దాంతో పెళ్లి కుమారుడితో సహా మరో 14 మంది మురికి కాల్వలో పడిపోయారు. పంజాబ్‌లోని హోషియాపూర్ గ్రామంలో ఫిబ్రవరి 9న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఘజియాబాద్‌లోని ఇందిరాపురముకు చెందిన అమిత్ యాదవ్‌కు సోనమ్ అనే యువతితో పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో హోషియాపూర్‌లో ఏర్పాటు చేసిన వివాహ వేదిక వద్దకు ఇరు కుటుంబాల బంధువులు వచ్చారు. అయితే ఫంక్షన్ హాల్‌కు రోడ్డుకు మధ్య చిన్నపాటి మురుగు కాల్వ ఉంది. పెళ్లికి వచ్చే వారికి వీలుగా ఈ మురుగు కాల్వపై తాత్కాలిక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాల్ ముందు వధువు కుటుంబ సభ్యులు వరుడికి ఆహ్వానం పలికేందుకు నిలబడ్డారు. అదే సమయంలో వరుడితో పాటు ఆయన స్నేహితులు డ్యాన్స్ చేసుకుంటూ తాత్కాలిక బ్రిడ్జిని దాటుతున్నారు. ఈ సమయంలో బ్రిడ్జి ఉన్నట్టుంది కుప్పకూలిపోయింది. దాంతో వరుడితో సహా మరో 14 మంది మురుగు కాల్వలో పడిపోయారు. వీరిలో ఇద్దరు ఎనిమిదేళ్ల పిల్లలు కూడా ఉన్నారు. బాధితులందరిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు ఫంక్షన్ హాల్ యాజమాన్యమే బాధ్యత వహించాలని వరుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దాంతో ఫంక్షన్ హాల్ యాజమాన్యం వరుడి కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారం ఇస్తామని చెప్పడంతో.. వివాదం సద్దుమణిగింది. -
మురుగు శుద్ధితో భూతాపోన్నతికి చెక్!
పట్టణం, నగరం... ఏదైనా మురుగునీటి కాల్వలు సర్వసాధారణం కదా. దుర్గంధం వెదజల్లుతూ పలురకాల వ్యాధులకు కారణమవుతున్న మురుగు నీటితో ఈ భూమికి మేలు చేయవచ్చునని అంటున్నారు ప్రిన్స్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. భూతాపోన్నతికి కారణమవుతున్న కార్బన్డయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువులను ఒడిసిపట్టేందుకు మురుగుకాల్వలు మేలైన మార్గమని వీరు సూచిస్తున్నారు. ఈ అంశంపై తాము ఇటీవల విస్తృత అధ్యయనం నిర్వహించామని, భూతాపోన్నతికి చెక్ పెట్టేందుకు మురుగునీటి కాల్వలు ఉపయోగపడతాయని తేలినట్లు జేసన్ రెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు నీళ్లు ఉపయోగపడతాయని ఇప్పటివరకూ ఎవరూ ఆలోచించలేదని, మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల ద్వారా మిథేన్ ఉత్పత్తితోపాటు అనేక ఇతర విలువైన ఖనిజాలను రాబట్టుకోవడం ద్వారా పర్యావరణానికి మేలు చేయవచ్చునని తమ అధ్యయనం ద్వారా తెలిసిందని జేసన్ అంటున్నారు. వాతావరణం నుంచి సేకరించిన కార్బన్‌డయాక్సైడ్‌ను పంపడం ద్వారా జరిగే మురుగునీటి శుద్ధీకరణతో ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరించారు. మురుగునీటి ద్వారా విలువైన మిథేన్, కార్బనేట్ ఖనిజాలు, ఎరువులను తయారు చేసేందుకు ఇప్పటికే అనేక టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయని జేసన్ గుర్తు చేశారు. -
కాలువలో యువకుడి మృతదేహం
సాక్షి, న్యూఢిల్లీ : నోయిడాలోని ఓ కాలువలో తేలుతున్న యువకుడి మృతదేహాన్ని బుధవారం ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెక్టార్ 8లో కాలువలో పడిఉన్న యువకుడి మృతదేహం గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. స్ధానికుల సమాచారంతో కాలువ నుంచి యువకుడి మృతదేహాన్నివెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారని సెక్టార్ 20 పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ మనోజ్ కుమార్ పంత్ పేర్కొన్నారు. మృతదేహంపై ఎలాంటి గాయాల గుర్తులు లేవని, కుడి చేయితో పాటు ఛాతీపై విజయ్ అనే టాటూ ఉందని, రెండు చేతులపై ఓం అని రాసిఉందని పంత్ తెలిపారు. బాధితుడికి 28 సంవత్సరాల వయసు ఉంటుందని, ఆటోప్సీ నివేదిక వెలుగుచూస్తే యువకుడి మరణానికి స్పష్టమైన కారణం తెలుస్తుందని, ప్రస్తుతం బాధితుడిని గుర్తించే పనిలో ఉన్నామని ఎస్హెచ్ఓ తెలిపారు. -
వైరల్ వీడియో: డ్రైనేజీ శుభ్రం చేసిన సీఎం
పుదుచ్చేరి : స్వచ్ఛ భారత్‌లో భాగంగా మన నాయకులు, సినిమా ప్రముఖులు, క్రీడాకారులు ఇలా ఒక్కరనేంటి దాదాపు దేశంలోని ప్రముఖులందరు కూడా చీపురు పట్టి రోడ్లు ఉడ్చిన సంఘటనలు అనేకం జరిగాయి. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఓ వ్యక్తి స్వయంగా పార చేత పట్టుకుని మురికి కాలువలను శుభ్రం చేసిన సంఘటనలను ఎక్కడా చూసి ఉండం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడియో చూస్తే ఆ లోటు కూడా తీరిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛతాహై సేవా’ కార్యక్రమంలో భాగంగా ఓ ముఖ్యమంత్రి మురికి కాలువలో ఉన్న చెత్తను తొలగించారు. నలుగురికి చెప్పే ముందు మనం ఆచరించాలని చెప్పిన ఈ వ్యక్తి పుదుచ్చేరి కాంగ్రెస్ సీఎం వీ నారాయణస్వామి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో నారాయణస్వామి స్వయంగా మురికి కాలువలో ఉన్న చెత్తను తొలగించారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నారాయణ స్వామి చేసిన పనిని మెచ్చుకుంటూ.. ‘మీరు ఏదో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కోసం ఈ పని చేస్తున్నట్లు లేరు. చాలా నిజాయితీగానే మురికి కాలువలోకి దిగి అక్కడ ఉన్న చెత్తను తొలగిస్తున్నార’ని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ‘కార్యకర్తలకు మీరు ఓ రోల్‌మోడల్‌గా నిలిచారు. మీరు చేసిన పని మాకు మరింత ఉత్సాహన్నిచ్చింద’ని కాంగ్రెస్ అభిమాని ఒకరు వ్యాఖ్యానించారు. కానీ మరికొందరు మాత్రం ‘ఇప్పటికైనా మీకు పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు అర్థం కావాలని కోరుకుంటున్నాం. వారికి సరైన పరికరాలు అందజేయండి’ అంటూ కామెంట్ చేశారు. -
మురికి కాలువను శుభ్రం చేసిన సీఎం
-
మద్యం మత్తులో డ్రెయిన్‌లో దూకేశాడు..
పశ్చిమగోదావరి ,భీమవరం టౌన్: ఉధృతంగా ప్రవహిస్తున్న యనమదుర్రు డ్రెయిన్‌లోకి భీమవరంలోని చిన్నవంతెన పైనుంచి మద్యం మత్తులో నక్కా రాము అనే వ్యక్తి ఆదివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో దూకేశాడు. ఇది చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక దళ కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ ఆఫీసర్ ఎస్కే జాన్అహ్మద్ ఆధ్వర్యంలో సిబ్బంది బాల ఏసు, సుబ్బారావు, వెంకటరత్నం, వై.సుబ్బరాజు అక్కడికి చేరుకున్నారు. తాడు సహాయంతో రామును బయటకు తీసుకువచ్చేందుకు శ్రమించారు. మద్యం మత్తులో ఉన్న అతను తాడును పట్టుకుని కొంతమేర పైకి లాగిన తర్వాత వదిలేయడంతో మళ్లీ అతన్ని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది చెమటోడ్చారు. ఎట్టకేలకు రక్షించగలిగారు. డీఎన్నార్ కాలువగట్టు సమీపంలో నివశిస్తున్న అతను తనకు ఏవో కష్టాలు ఉన్నాయని మద్యం మత్తులో ఉండి చెబుతున్నాడు. చివరకు అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి ఊపిరి పీల్చుకున్నారు. -
‘గీత నీ మంచి మనసుకు సలాం’ ; వీడియో వైరల్
చెన్నై : పాలు అమ్మే వ్యక్తి పిలుపుకు బయటకు వచ్చిన గీతకు చిన్న మూలుగు శబ్దం వినిపించింది. పాపం ఏదో పిల్లి పిల్ల డ్రైనేజీ గుంత దగ్గర చిక్కుపడిందేమో అనుకున్న గీతకు అక్కడ కనపడిన దృశ్యం చూడగానే ఒక్కసారి ఒళ్లు జలదరించింది. కారణం ఆ అరుపులు పిల్లివి కాదు.. ఇంకా పూర్తిగా కళ్లు తెరవని ఓ పసిగుడ్డువి. అంతే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ పసివాణ్ణి బయటకు తీసింది గీత. ఆ చిన్నారికి దెబ్బలు ఏమైనా తగిలాయేమో పరిశీలించింది. అనంతరం ఆ పసివాణ్ణి శుభ్రం చేసి సమీప ఆస్పత్రికి తీసుకెళ్లింది. చెన్నైలోని వలసరవక్కంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘నీ మంచి మససుకు సలాం’ అంటూ నెటిజన్లు గీతను తెగ పొగుడుతున్నారు. ప్రస్తుతం చెన్నై ఎగ్మోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ పసివాడు క్షేమంగానే ఉన్నాడని డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు. ఈ విషయం గురించి గీతా ‘పాలు అమ్మే వ్యక్తి చెప్పడం వల్ల నేను శబ్దం వస్తోన్న వైపుగా వెళ్లాను. అదృష్టం కొద్ది పసివాడు ఉన్న చోట నీరు లేదు కాబట్టి క్షేమంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత చిన్నారుల సంక్షేమ గృహానికి చేరుస్తాం అని అధికారులు తెలిపారన్నారు గీత. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ సంఘటన చోటు చేసుకుంది కాబట్టి ఈ బాలునికి ‘సుతంథిరమ్’(తమిళ పదం. దానికి అర్ధం స్వేచ్ఛ) అనే పేరు పెట్టినట్లు తెలిపారు గీత.