
అశ్విని(ఫైల్‌ఫోటో)
మొగల్తూరు(పశ్చిమగోదావరి): గొంతేరు డ్రెయిన్‌లో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవు గ్రామంలో జరిగింది. ఎస్సై ఆర్.మల్లిఖార్జున రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కాళీపట్నం పడమరకు చెందిన జక్కంశెట్టి ధర్మారావు గత ఏడాది కరోనా కారణంగా మృతిచెందగా అప్పటి నుంచి కుమార్తె అశ్విని దిగాలుగా ఉండేది. మూడు నెలల క్రితం అశ్వినికి (23)కి భీమవరం మండలం దిరుసుమర్రుకు చెందిన వేండ్ర రామకృష్టతో వివాహమైంది.
చదవండి: నెట్ సెంటర్‌లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి..
ఇటీవల సంక్రాంతి పండుగకు కాళీపట్నం వచ్చిన ఆమె గురువారం అర్దరాత్రి మోటార్‌సైకిల్‌పై ఒంటరిగా ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవు ప్రాంతంలోని జాతీయ రహదారి వంతెన వద్దకు చేరుకుంది. సెల్‌ఫోన్‌ను అక్కడ వదిలేసి డ్రెయిన్‌లోకి దూకేసింది. కుటుంబ సభ్యులు చింతరేవు వంతెన వద్ద మోటార్‌సైకిల్ గుర్తించి డ్రెయిన్‌లో గాలించారు. వంతెన సమీపంలోని ముత్యాలపల్లి రేవు వద్ద మృతదేహాన్ని గుర్తించారు. బాధితురాలి తల్లి తులసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment