jumping
-
పని ఒత్తిడికి మరొకరు బలి.. అటల్ సేతు పైనుంచి దూకి..
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆందోళనకర ఉదంతం వెలుగు చూసింది. ముంబైలోని అటల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆఫీసులో పని ఒత్తిడి కారణంగానే తన భర్త ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడని మృతుని భార్య మీడియాకు తెలిపారు. ఇటీవల పూణెలోని ఒక సీఏ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతి పని ఒత్తిడిన తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఉదంతం మరువక ముందే ముంబైలో ఇదే తరహా విషాదం చోటుచేసుకుంది. మీడియాకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం సుశాంత్ చక్రవర్తి(40) అనే వ్యక్తి తాను ప్రయాణిస్తున్న కారును అటల్ సేతుకు ఒకవైపున నిలిపాడు. ఆ తరువాత బ్రిడ్జిపై నుంచి సముద్రంలోకి దూకాడు. మృతుడు ప్రభుత్వ రంగ బ్యాంకులో పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసు వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం మృతునికి భార్య, ఏడాది కుమార్తె, తల్లి ఉన్నారు.మృతుని భార్య వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు సుశాంత్ చాలా కాలంగా ఆఫీసులో పని భారంతో ఆందోళన చెందుతున్నాడని తెలిపారు. కాగా సుశాంత్ ఇటీవలే కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుశాంత్ చక్రవర్తి మృతదేహం కోసం పోలీసులు సముద్రంలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు.ఇది కూడా చదవండి: కత్తితో దాడి.. ముగ్గురు మృతి -
అటల్ సేతు నుంచి సముద్రంలోకి దూకి...
మహారాష్ట్రలోని ముంబైలో అటల్ సేతుపై నుంచి దూకి ఓ యువ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు డోంబవలికి చెందిన శ్రీనివాసన్ కురుటూరి (38)గా పోలీసులు గుర్తించారు. శ్రీనివాసన్ బుధవారం మధ్యాహ్నం 12.24 గంటలకు అటల్ సేతుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై న్హవా షెవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.అటల్ సేతు వద్దనున్న సీసీటీవీ ఫుటేజీలో ఒక కారు అటల్ సేతు వద్ద అకస్మాత్తుగా ఆగడం, ఒక వ్యక్తి కారులో నుండి బయటకు వచ్చి వంతెన రెయిలింగ్‌పైకి వేగంగా ఎక్కి, సముద్రంలోకి దూకడం కనిపిస్తుంది. మృతుడు శ్రీనివాసన్ విదేశాల్లో ఉద్యోగం చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చి వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. పోలీసులు స్థానికుల సాయంతో సముద్రంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. -
Yellow Babu : ప్రకృతి కూడా పసుపు పార్టీ సరుకేనా?
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు రాజకీయ పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి బి.ఆర్.ఎస్., బిజెపి ల నుండి పలువురు నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుని పార్టీ కండువాలు కప్పుతున్నారు. ఇలా చేస్తే ప్రకృతి ఊరుకోదని.. తీవ్ర పరిణామాలు తప్పవని గతంలో రేవంత్ రెడ్డి ఓ ఎల్లో మీడియా అధినేతతో కలిసి స్టూడియోలో కూర్చుని సిద్ధాంతీకరించారు. మరి ఇపుడు రేవంత్ రెడ్డి ఇలా BRS పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? ప్రమాదం ఏమీ ఉండదా? అని పొలిటికల్ ఎన్విరాన్ మెంటలిస్టులు ప్రశ్నిస్తున్నారు. పొరుగు పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదట. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని అనుకోవడం వల్లనే దివంగత వై.ఎస్.ఆర్. పై ప్రకృతి ప్రకోపించిందట. దాని కారణంగానే ఆయన మరణించారని ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లో మీడియా లో ఇంటర్వ్యూలో అభిప్రాయ పడ్డారు. ఇలా అభిప్రాయ పడ్డ రేవంత్ రెడ్డి.. ఏబీఎన్ రాధాకృష్ణ ఇద్దరూ కూడా చాలా చాలా మేధవులు. కాకపోతే ఇద్దరికీ కొద్ది పాటి సంస్కారం కూడా లేకుండా పోయిందంటున్నారు రాజకీయ పండితులు. దివంగత వై.ఎస్.ఆర్. హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. చనిపోయిన వారి గురించి ఎవ్వరూ కూడా హేళనగా మాట్లాడరు. కానీ ఈ ఇద్దరూ కూడా వై.ఎస్.ఆర్. మరణానికి ఆయన టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలనుకోవడమే కారణమన్నట్లు.. అందుకే ప్రకృతి ఆయన్ను శిక్షించింది అన్నట్లు తీర్మానించారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి అత్యంత ఇష్టమైన గురువు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? 23 మంది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కేసులు పెడతామని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి టిడిపిలో చేర్చుకున్నారు. మరి ఈ ఘటనపై ప్రకృతికి కోపం ఎందుకు రాలేదట? వై.ఎస్.ఆర్. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను చేర్చుకుందామా వద్దా అని ఆలోచన చేస్తేనే పగ బట్టేసిన ప్రకృతి చంద్రబాబు నిస్సిగ్గుగా 23 మందిని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవడమే కాకుండా అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినా ప్రకృతి ఎందుకు ఊరుకున్నట్లు? కొంపదీసి ప్రకృతి కూడా ఎల్లో బ్యాచ్ లో చేరిపోయిందా? ఎల్లో మీడియా తరహాలో టిడిపి అధినేత ఏం చేసినా ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? చంద్రబాబుకి రాజకీయ ప్రత్యర్ధి అయిన వై.ఎస్. ఆర్. తనను ఆశ్రయించిన వారిని తన పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటేనే ప్రకృతికి కోపం వస్తుందా? అన్నది రేవంత్ రెడ్డితో పాటు..రాధాకృష్ణకూడా సమాధానం చెప్పాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదే చంద్రబాబు పురమాయిస్తే ఇదే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంటికి కరెన్సీ కట్టలతో వెళ్లి బేరసారాలాడారు. మరి ఆ ఘటన పట్ల ప్రకృతికి అభ్యంతరాలేవీ ఉండవా? చంద్రబాబు వారి అనుచరులు ఎలా వ్యవహరించినా ప్రకృతి చూసి పరవశించిపోతుందా? అన్నది కూడా రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు వివరించాలి. ఈ ఒక్క విషయమే కాదు..చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు పీకలదాకా అప్పులు చేసి రాష్ట్ర ఖజానా దివాళా తీయించి గద్దె దిగేటపుడు 100కోట్లు మాత్రమే మిగిల్చి పోయారు. అపుడు ఏపీ అద్బుతంగా ఉందని భజన చేసింది ఎల్లో మీడియా. బాబుతో పోలిస్తే చాలా తక్కువగా అప్పులు చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం రాష్ట్రాన్ని దివాళా తీయించేస్తున్నారంటూ గగ్గోలు పెట్టే రాతలు రాసింది. మనోడు చేస్తే సంసారం..ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఎల్లో మీడియా పైత్యపు రాతలు.. ఆ భావజాలంతో ఉండే వారి పైత్యపు కూతలు కొత్త కాదు. సరే చంద్రబాబు నాయుడి ప్రకృతికి చుట్టం కాబట్టి ఆయన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా రాజ్యాంగ విరుద్ధంగా టిడిపిలో చేర్చుకున్నా ప్రకృతి ఏమీ అనలేదు. కానీ ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ప్రకృతి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆయన్ని అభిమానించే వారు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బి.ఆర్.ఎస్. నుంచి ఇద్దరు ఎంపీలను ఒక ఎమ్మెల్యేనీ రేవంత్ రెడ్డి పార్టీ చేర్చుకుని కండువాలు కప్పింది. మరో మాజీ మంత్రి మల్లారెడ్డిని డి.కె.శివకుమార్ దగ్గరకు పంపి బేరాలాడించింది. ప్రకృతి ఏపీలోనే కాదు కర్నాటకపైనా నిఘా పెడుతుంది మరి. అందుకే అందరూ జాగ్రత్తగా ఉంటే మంచిదంటున్నారు విజ్ఞులు. - సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
అక్కడ ఆటలు సాగవని అర్థమైంది.. అందుకే గ్లాస్లో మునకేశాడా?
స్థిరత్వం లేని కొందరు రాజకీయ నేతలు గాలివాటుకు ప్రయాణం చేస్తుంటారు. ప్రతి ఎన్నికలకు ఒక్కో పార్టీ చొప్పున మారుతుంటారు. అలాగే నియోజకవర్గాలూ మారుతుంటారు. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రజలను మోసం చేసి అక్కడి నుంచి మరోచోటుకు వెళుతుంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అలాంటి నాయకుడొకరు తయారయ్యారు. ప్రజలు ఛీత్కరించుకుంటున్నా ఆ నాయకుడిలో మార్పు రాలేదు. ఆయనో మాజీ ఎమ్మెల్యే. పద్నాలుగేళ్ల రాజకీయ జీవితం. రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఐదు పార్టీలు మారారు. చాలా నియోజకవర్గాలూ మారారు. పార్టీ మారడం అనేది పెద్ద సమస్య కాదు. కాని స్థిరత్వం ఉండదని, గాలివాటుకు పోతుంటారని, ఏ పార్టీలో ఉన్నా, అవినీతి తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ముద్ర వేసుకున్నారు. ప్రజలు చీదరింపులు ఎదుర్కొంటున్నారు. ఆయనే పంచకర్ల రమేష్‌బాబు. విశాఖలో షిప్పింగ్ కాంట్రాక్టులు చేసే రమేష్‌బాబు ప్రజారాజ్యంతో రాజకీయ అరంగేట్రం చేసి, చిరంజీవి పేరుతో పెందుర్తి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, ప్రజలకు సేవ చేస్తాడని నమ్మారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినపుడు ఆయన కూడా హస్తం గూటికి చేరారు. 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావుతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. పెందుర్తిలో చేసిందేమీలేక, అక్కడి ప్రజలకు మొఖం చూపించలేక యలమంచిలి టిక్కెట్ తీసుకుని సైకిల్ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. యలమంచిలి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ నీరు, చెట్టు, చెరువు, మట్టి, కొండ అన్న తేడా లేకుండా అక్కడి ప్రకృతి సంపద అంతా దోచుకున్నారు. చదవండి: పవన్ ‘బ్రో’ సీన్‌పై మంత్రి అంబటి రియాక్షన్ దోపీడి కోసమే రాజకీయాల్లోకి వచ్చిన పంచకర్ల రమేష్‌బాబును 2019 ఎన్నికల్లో జనం చిత్తుగా ఓడించారు. రాజకీయ భవిష్యత్తు అంధకారంగా కనిపించడంతో జగన్మోహన్రెడ్డి పాలన చూసి తాను మారానంటూ వైఎస్సార్సీపీలో చేరారు. అధికార పార్టీని అడ్డుగా పెట్టుకుని దోపిడీ కొనసాగించవచ్చని భావించారు. ఫార్మా సిటీ, అరకులో భూముల కబ్జాకు సిద్ధమయ్యారు. రమేష్ బాగోతం తెలిసిన వైఎస్సార్సీపీ నాయకత్వం ఆయన్ను కట్టడి చేసింది. దీంతో ఇక్కడ తన ఆటలు సాగవని అర్థమై.. పవన్ కళ్యాణ్ జనసేన పంచన చేరారు. అనేక పార్టీలు, పలు నియోజకవర్గాలు మారిన రమేష్‌బాబును చూసి జనం ఈసడించుకుంటున్నారు. రమేష్‌ను నమ్మి గతంలో ఆయన వెంట తిరిగిన కార్యకర్తలు చాలామంది ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయారు. ఒకరిద్దరు మాత్రం భూకబ్జాలు, అక్రమ మట్టి తవ్వకాలతో ఆర్థికంగా బలపడ్డారు. చదవండి: ‘వావీ వరసలు లేని.. నారాయణ.. నారాయణ’ ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు పంచకర్ల లాంటి నాయకులకు ఉత్తరాంధ్రలో చోటు ఇవ్వరాదని భావిస్తున్నారు. ఇటీవల పెందుర్తిలో ఆత్మీయ సమావేశం పేరిట పంచకర్ల కొందరు సన్నిహితుల్ని పిలవగా వారంతా ముఖం చాటేసారు. దోపిడీయే లక్ష్యంగా పార్టీలు, నియోజకవర్గాలు మారే రమేష్‌ను చూసి ఏ పార్టీ కార్యకర్తలు వస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. గ్లాస్ పార్టీ తరపున ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
నలుగురిని బలిగొన్న టిక్ టాక్ ఛాలెంజ్..
అలబామా: అమెరికాలోని అలబామాలో టిక్ టాక్ వీడియోల పిచ్చి నలుగురు ప్రాణాలను తీసింది. వీరంతా బోట్ జంపింగ్ ఛాలెంజ్ పేరుతో వేగంగా వెళ్తోన్న రన్నింగ్ బోటు లోనుంచి నీటిలోకి దూకే ప్రయత్నంలో మెడలు విరగ్గొట్టుకుని అక్కడికక్కడే చనిపోయారు. టిక్ టాక్ వీడియోలంటే చాలా మందికి ఒక సరదా. వీడియోలో ఐడియా వినూత్నంగా ఉండాలే గానీ చాలా తక్కువ వ్యవధిలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకోవచ్చు. అలా పాపులర్ అయినవారు చాలామందే ఉన్నారు. అయితే టిక్ టాక్ వలన కలిగే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్న నెపంతో చాలా దేశాలు ఈ యాప్ ను నిషేధించాయి. ఇదిలా ఉండగా అమెరికాలోని అలబామాలో టిక్ టాక్ సరికొత్త ఛాలెంజ్ ఇప్పటికే నలుగురిని బలి తీసుకుంది. అదే బోట్ జంపింగ్ ఛాలెంజ్.. సముద్రంలో వేగంగా వెళ్తున్న బోటు నుండి నీటిలోకి దూకడమే ఈ ఛాలెంజ్. ఈ విచిత్రమైన ఛాలెంజ్ ఉన్నట్టుండి వైరల్ గా మారడంతో అనేకమంది ఈ ప్రయత్నం చేస్తూ బోట్ నుండి దూకుతూ వీడియోలు తీశారు. కానీ వారిలో నలుగురు మాత్రం తమ మెడలను విరగ్గొట్టుకుని విగతజీవులుగా మారిపోయారు. ఈ వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. TikTok boat jumping challenge that sees people leap off vessels moving at high speed is blamed for FOUR deaths in Alabama - as cop says victims broke their necks instantly. pic.twitter.com/2aCxvJZsRy — Molly Ploofkins™ (@Mollyploofkins) July 9, 2023 అమెరికాకు చెందిన కెప్టెన్ జిమ్ డేవిస్ మాట్లాడుతూ గత ఆరు నెలల్లో మనం నియంత్రించగలిగి కూడా అలా చేయకపోవడం వలన ఈ దిక్కుమాలిన ఛాలెంజ్ వలన నలుగురు చనిపోయారని అన్నారు. నీటిలోకి దూకగానే క్షణాల వ్యవధిలో వారి మెడలు విరిగిపోయాయని, వీరంతా స్నేహితుల ముందు షో ఆఫ్ చేయాలన్న తపనతో చనిపోయినవారేనని ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: ఖలిస్తానీలకు దీటుగా భారతీయుల ర్యాలీ.. -
కళ్లు తిరుగేవాళ్లు ఈ వీడియో చూడకండి...
-
ఆహ...భలే జంప్ చేశారు.. Wow.. what a jump
-
80 ఏళ్లు దాటాక గిన్నిస్ రికార్డు.. విమానం ఎక్కి, అక్కడ్నుంచి దూకేసి..
80 ఏళ్లు దాటాక మీరేం చేస్తుంటారు? ఓపికుంటే.. వాకింగ్‌కు వెళ్తారు లేదా మనుమలు, మనవరాళ్లతో ఆడుకుంటూ ఉంటారు..అంతేగా..అదే వయసులో ఉన్న వీళ్లేం చేశారో తెలుసా? విమానం ఎక్కేసి.. అక్కడ్నుంచి దూకేశారు. తద్వారా గిన్నిస్ రికార్డు సాధించేశారు. జంపర్స్ ఓవర్ ఎయిటీ సొసైటీకి చెందిన ఈ 8 మంది అమెరికాలోని ఒర్లాండోలో స్కైడైవ్చేసి.. ఇలా సర్క్యులర్ ఫార్మేషన్ ఫీట్‌ను చేశారు. 80 ఏళ్లు దాటినవారిలో ఇంతమంది కలిసి ఒక స్కైడైవ్ ఫార్మేషన్ చేయడం ఇదే మొదటిసారట. ఇప్పటివరకూ ఆరుగురు కలిసి చేసినదే రికార్డుగా ఉంది. -
80 ఏళ్ల వృద్ధులు స్కై డైవింగ్‌తో... గిన్నిస్ రికార్డు
80 ఏళ్ల వయసులో ఉండే బామ్మ లేదా తాతలు ఎలా ఉంటారో మనందరకీ తెలుసు. పాపం ఆ వయసులో నడవడానకి, తినడానికి కూడా ఇబ్బంది పడతారు. కనీసం ఎక్కడికైనా పంపించాలన్న భయపడతాం. పైగా వారు కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేందుకే ఇష్టపడతారు. తాము గడిపని ప్రదేశాల నుంచి వచ్చేందుకు కూడ ఇష్టపడరు. అలాంటిది 80 ఏళ్ల వయసులో ఎనిమిది మంది వృద్ధులు విమానం నుంచి జంప్ చేసే స్కై డైవింగ్‌ని చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ది జంపర్స్ ఓవర్ ఎయిటీ సోసైటీ (జేంఈఎస్)కి చెందిన ఎనిమిది మంది సభ్యులు జిమ్ కుల్హనే, క్లిఫ్ డేవిస్, స్కాటీ గాలన్, వాల్ట్ గ్రీన్, పాల్ హినెన్, స్కై హుమిన్స్కీ, వుడీ మెక్కే, టెడ్ విలియమ్స్ తదితరులు ఈ రికార్డును సృష్టించారు. వారంతా విమానం నుంచి దూకి ఒక వృత్తాకారంలో స్కై డైవింగ్ చేశారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ స్కైడైవింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ సెలబ్రేషన్ కోసం మూడు రోజుల ఈవెంట్లో భాగంగా స్కైడైవ్ డిలాండ్లో నిర్వహించిన స్కైడైవ్లో వారు ఫీట్‌ని ప్రదర్శించారు. ఈ ఆధునిక స్కై డ్రైవింగ్ క్రీడలో మా బృందం కాలానుగణంగా అభివృద్ధి చెందుతుంది అని తెలిపేలా ఈ ప్రదర్శన ఇచ్చినందుకు తమకు గర్వంగా ఉందని ఆ వృద్ధ సభ్యులు చెబుతున్నారు. (చదవండి: ట్రక్కును ఢీకొట్టిన ఖడ్గమృగం.. వీడియో షేర్ చేసిన సీఎం) -
హాస్టల్ గోడ దూకి.. 150 సీసీ కెమెరాల కళ్లుగప్పి..
చంద్రగిరి(తిరుపతి జిల్లా): అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి నలుగురు విద్యార్థినులు పారిపోయిన ఘటన చంద్రగిరిలో కలకలకం సృష్టించింది. వెస్ట్ డీఎస్పీ నరసప్ప కథనం మేరకు.. విజయనగరం, విజయవాడ, కడప, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన నలుగురు విద్యార్థినులు చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో కంచి కామకోటి పీఠం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాలలో ఉంటూ చంద్రగిరిలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను అడ్డు తొలగిస్తే కలసి జీవించవచ్చని.. వీరిలో ఇద్దరు విద్యార్థినులు మైనర్లు. వీరు డిగ్రీ చదువుకుంటూ.. హాస్టల్లో వేదాలు, హిందూ సంప్రదాయాలు నేర్చుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురు అమ్మాయిలు హాస్టల్ వెనుక వైపు నుంచి 8 అడుగుల ఎత్తయిన గోడదూకి పారిపోయారు. హాస్టల్ ఇన్చార్జి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థినుల ఆచూకీ గుర్తించేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, హాస్టల్ నుంచి వెళ్లే మూడు రోజులకు ముందు ఏమి జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. ఓ బయటి వ్యక్తి సెల్‌ఫోన్ నుంచి విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం రెండు సార్లు ఎవరితోనో మాట్లాడినట్లు తెలుస్తోంది. సుమారు 350 మంది ఉన్న హాస్టల్లో 150కి పైగా సీసీ కెమెరాలు, 10 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అయినా విద్యార్థినులు పారిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
పాపం ఏమైందో.. వివాహిత ఆత్మహత్య
మొగల్తూరు(పశ్చిమగోదావరి): గొంతేరు డ్రెయిన్‌లో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవు గ్రామంలో జరిగింది. ఎస్సై ఆర్.మల్లిఖార్జున రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కాళీపట్నం పడమరకు చెందిన జక్కంశెట్టి ధర్మారావు గత ఏడాది కరోనా కారణంగా మృతిచెందగా అప్పటి నుంచి కుమార్తె అశ్విని దిగాలుగా ఉండేది. మూడు నెలల క్రితం అశ్వినికి (23)కి భీమవరం మండలం దిరుసుమర్రుకు చెందిన వేండ్ర రామకృష్టతో వివాహమైంది. చదవండి: నెట్ సెంటర్లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి.. ఇటీవల సంక్రాంతి పండుగకు కాళీపట్నం వచ్చిన ఆమె గురువారం అర్దరాత్రి మోటార్‌సైకిల్‌పై ఒంటరిగా ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవు ప్రాంతంలోని జాతీయ రహదారి వంతెన వద్దకు చేరుకుంది. సెల్‌ఫోన్‌ను అక్కడ వదిలేసి డ్రెయిన్‌లోకి దూకేసింది. కుటుంబ సభ్యులు చింతరేవు వంతెన వద్ద మోటార్‌సైకిల్ గుర్తించి డ్రెయిన్‌లో గాలించారు. వంతెన సమీపంలోని ముత్యాలపల్లి రేవు వద్ద మృతదేహాన్ని గుర్తించారు. బాధితురాలి తల్లి తులసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
షాకింగ్ వీడియో: 16వేల అడుగుల ఎత్తులోంచి..
దక్షిణాఫ్రికా: స్కై డ్రైవింగ్‌లు గురించి వినే ఉంటాం. ఇలాంటి స్కై డ్రైవింగ్‌లు భయం కలిగించే అత్యద్భుతమైన ధైర్య సాహసాలతో చేసే ఒక అరుదైన విన్యాసం. కానీ ఒక్కోసారి ఈ విన్యాసాలు బెడిసికొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడొక దక్షిణాప్రికా బృందం చేసిన స్కైడ్రైవింగ్ చూస్తే చాలా భయం వేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది (చదవండి: అరుదైన వింత సంఘటన... తోకతో పుట్టిన బాలుడు) ఈ వీడియోలో ..మొదట ఆ బృందం అంతా విమానంలో ఆకాశంలో ఒక చోట ఈ విన్యాసం చేయడానికి చూస్తున్నట్లుగా కనిపిస్తారు. ఈ మేరకు అక్కడే ఆకాశంలో ఒక చోట గాలిలో విమానాన్ని నిలిపి నెమ్మదిగా విమానం డోర్ తీసి ఒకేసారి జంప్ చేయాలని నిర్ణయించుకుంటారు. వారు అనుకున్న విధంగా అందరూ ఒకేసారి 16 వేల అడుగుల ఎత్తులోంచి జంప్ చేస్తారు. అయితే వారు జంప్ చేసి విధానం అత్యంత భయానకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బృందం అంతా ఒకేసారి దూకడంతో విమానం ఒక్కసారి స్పిన్ అయిపోయి అదుపుతప్పినట్టుగా వెళ్లుతుంది. పైగా ఒక దశలో విమానిం కిందకి వెళ్లే క్రమంలో వాళ్లపైకి దూసుకొస్తున్నట్లుగా ఉంటుంది. అదృష్టమేమిటంలే ఎవర్ని ఢీ కొట్టకుండా ఆ విమానం కాసేపటికి నిధానంగా కిందకి ల్యాండ్ అవ్వడానికి వెళ్లిపోతుంది. అయితే జంప్ చేసిన 9 మంది బృంద సభ్యులు ఒక్కసారిగా చెల్లచెదురైనా మళీ అంతా భలే చక్కగా ఒకరిని ఒకరు పట్టుకుంటూ రకరకాలుగా విన్యాసాలు చేస్తారు. ఈ మేరకు ఈ 9 మంది బృంద సభ్యులు ఏవియేషన్ విద్యలో భాగంగానే ఈ విన్యాసాలు ప్రదర్శిస్తారు. అయితే కొంతసేపటికి ఆ బృందం సురక్షితంగా కిందకి ల్యాండ్ అవుతారు. (చదవండి: వింతైన ఇల్లు దీని ధర ఎంత తెలుసా?) -
Yadadri: చెరువులో దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: భువనగిరి మండలం రాయగిరి చెరువులో దూకి ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, స్థానికుల సమాచారంతో పోలీసులు చెరువు దగ్గరకు చేరుకున్నారు. చెరువు కట్టపై లభించిన సెల్‌ఫోన్, ఇతర వస్తువుల ఆధారంగా యువతి.. హైదరాబాద్ లాలాపేట్‌కు చెందిన గీతా రాణి(26)గా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు యువతి బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: ‘కిలేడి’ మహిళ.. ఇద్దరు పిల్లలతో బ్యాంక్‌కు వచ్చి.. -
స్టైలిష్ వాక్, లవ్లీ జంపింగ్స్... స్విమ్మింగ్‌తో డాగ్స్ సందడి
-
బంగీజంప్..ఇలా ఎప్పుడైనా చూశారా?
మాస్కో: సాధారణంగా బంగీ జంప్ ఎత్తైన ప్రదేశాల నుంచి చేసే ఒక స్టంట్..ఇది చాల ధైర్యం ఉన్నవారు మాత్రమే చేస్తారు. ఈ జంప్ చేసేవారు.. సేఫ్టీ కోసం భుజాలకు, నడుముకు తాడులను కట్టుకుంటారు. అయితే, ఈ వ్యక్తి కాస్త వెరైటీగా ఆలోచించాడు. సేఫ్టీ కోసం పెట్టే కొక్కాన్ని తన పిరుదులకు తగిలించుకున్నాడు. ఇప్పడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతొంది. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన రష్యలో చోటుచేసుకుంది. దీనిలో సదరు వ్యక్తికి నిర్వహకులు , నడుముకు తాడును కట్టారు. అదేవిధంగా అతను నడుముకు కొక్కెలు కూడా తగిలించుకున్నాడు. భవనంపైన 50 అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా కిందకు జంప్ చేశాడు. అతను,కిందకు పోయే క్రమంలో గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. ఆ వ్యక్తి మాత్రం కిందకు సేఫ్టీగానే చేరుకున్నాడు. అయితే, అతని చర్మం ఉందా..లేక..ఊడిపోయిందా! అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు..ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ అక్కడ..దమ్ముంది’ కాబట్టి కొక్కెం తగిలించుకున్నాడు..‘ ఇదేం స్టండ్రాబాబు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, రష్యాలో మరొక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ప్యారాచుట్లో ఎగురుతున్నాడు. ఆ ప్యారాచుట్ హెలికాప్టర్ చివరన చిక్కుకుంది. దీంతో అది.. ఎత్తైన ప్రదేశంలో లాక్కొనిపొయింది. అక్కడ మైనస్20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. దీన్నిగమనించిన గ్రామస్థులు మిలటరీ వారికి సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి అతని ప్రాణాలను కాపాడారు. చదవండి: లేడి దొంగ..బట్టలు జారిపోతున్నా పట్టించుకోలేదు! -
అరెరె.. పట్టు జారె..
శ్రావణ శుక్రవారం నగరంలోని కొన్ని కళాశాలలు, పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో విద్యార్థులు ఆటవిడిపు కోసం సంజీవయ్య పార్కుకు వచ్చి సరదాగా గడిపారు. ఓ మిత్ర బృందం మాత్రం చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ పార్కులోని కొలను గట్లపై గెంతులేశారు. ఒక విద్యార్థి ఇవతలి గట్టు నుంచి అవతలి గట్టుకు దూకుతూ కేరింతలు కొట్టాడు. ఒకసారి బాగానే దాటినా.. రెండోసారి మాత్రం పట్టుతప్పి నీటిలో పడిపోయాడు. ఈ దృశ్యాలు ‘సాక్షి’ కెమెరా బందించింది. – ఫొటోలు: ఎ. సురేష్‌కుమార్ -
తిరిగితే తిరిగావు కానీ...
లాంతరు వెలుగులో తిరిగి ఆ స్టూలు ఎక్కడుందో కనిపెట్టాడు గురువు. దాన్ని తీసేయించి, ఆ రాత్రి ఆ గోడ దగ్గరే నిల్చున్నాడు. ఊరికి దూరంగా వున్న గురుకులం అది. చాలామంది పిల్లలు అందులో ఉండేవారు. వారికి ఒక గురువు పాఠాలు బోధించేవారు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు.అయితే, ఒక పిల్లాడు రోజూ రాత్రి లేచి, గోడ దూకి, పట్టణంలోకి తిరగడానికి వెళ్లేవాడు. గదుల్ని పర్యవేక్షించడానికి వచ్చిన గురువు ఒక పిల్లాడు గోడ దూకి వెళ్లినట్టు గుర్తించాడు. అలాగే తాను వాడే ఒక ఎల్తైన స్టూలు కూడా లేకపోవడం గమనించాడు. లాంతరు వెలుగులో తిరిగి ఆ స్టూలు ఎక్కడుందో కనిపెట్టాడు గురువు. దాన్ని తీసేయించి, ఆ రాత్రి ఆ గోడ దగ్గరే నిల్చున్నాడు. బయటికి పోయిన కుర్రాడు అర్ధరాత్రి దాటాక తిరిగివచ్చాడు. అక్కడ స్టూలు ఉందో లేదో గుర్తించకుండా, నిల్చున్న గురువు తల మీద కాలు మోపాడు. కిందికి దిగాక తను చేసింది చూసి ఒక్కసారి భయాశ్చర్యాలకు లోనయ్యాడు. కాలు మోపిందానికి గురువు ఏ స్పందనా కనబరచకుండా, ‘నాన్నా, నువ్వు రాత్రిళ్లు తిరిగితే తిరిగావు. కానీ బయట బాగా చలిగావుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెబుదామనే ఇంతసేపూ ఇక్కడ నిల్చున్నాను’ అన్నాడు. పిల్లాడి ముఖంలో మార్పు కనబడింది. ఇంకంతే, అప్పట్నించీ ఆ గోడ దూకే పని మళ్లీ చేయలేదు. -
గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : గోదావరిలోకి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం జగ్గంపేట మండలం లోవకొత్తూరు గ్రామానికి చెందిన గరిక లోవదుర్గా నాగార్జున (25) బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం రోడ్-కం-రైలు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకాడు. 2013లో తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ట్రిబుల్ ఐటీ చదివిన నాగార్జున బ్యాంక్ టెస్ట్‌లకు కోచింగ్ తీసుకుంటూ అతడి గ్రామంలోని దారాల ఫ్యాక్టరీలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో రాజమహేంద్రవరం, కాకినాడలో వైద్యం చేయించినట్టు మృతుడి తండ్రి విశ్వనాథం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గంట సమయంలో ఇంటిలో భోజనం చేసి ఫ్యాక్టరీ పని ఉందని చెప్పినట్టు తండ్రి చెప్పారు. ఫ్యాక్టరీ మోటారు సైకిల్‌పై రాజమహేంద్రవరం చేరుకున్న అతడు.. అక్కడ మోటారు సైకిల్, జేబులోని రూ.3000, సెల్‌ఫోన్ ఉంచి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకేశాడు. అతడిని పరిశీలించిన వారు మోటారు సైకిల్ వద్ద ఉన్న సెల్‌ఫోన్, నగదు తీసుకువెళ్లిపోయారు. మృతుడి సెల్‌ఫోన్ నుంచి ఇంటికి ఫోన్ చేసి మీ కుమారుడు బ్రిడ్జి మీద నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులకు తెలిపారు. విషయాన్ని వారు రాజమహేంద్రవరంలోని బంధువులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ ఎస్సై నాగార్జున రాజు, పోలీసులు బ్రిడ్జి మీద మృతుడు వదిలిన మోటారుసైకిల్‌ను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు మృతదేహం కోసం జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. శోక సముద్రంలో కుటుంబ సభ్యులు మృతుడు నాగార్జున తండ్రికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. కుమార్తె పెద్దది కాగా కుమారులలో నాగార్జునే ఇంటికి పెద్ద కుమారుడు. ఇతడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడని అనుకుంటున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడడం కుటుంబ సభ్యులను కలచివేసింది. -
ఒకరిద్దరి నిష్క్రమణతో నష్టం లేదు
ఆదిరెడ్డి పార్టీని వీడుతున్నట్టు మాటైనా చెప్పలేదు పార్టీ ఇచ్చిన పదవిని వదులుకుని వెళ్లడమే సరైన పద్ధతి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం): ఒకరిద్దరు నాయకులు పార్టీని వీడిపోయినా ఎలాంటి నష్టం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులు.. ఎమ్మెల్సీ ఆదిరెడ్డిఅప్పారావు టీడీపీలో చేరుతున్న విషయంపై అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. రూరల్ నియోజకవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు నగరంలోకి వస్తుండగా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలో ఆదిరెడ్డిఅప్పారావు ఫొటోలు ఉండడం చూశానన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాలకు అరాచకాలకు ఇదొక ఉదాహరణన్నారు. ఒక పార్టీ నుంచి శాసనసభకు, శాసనమండలికి ఎన్నికైన వారు వేరే పార్టీలోకి ఫిరాయించడం తప్పుకాదు అని పెద్ద సంకేతాన్ని ఇస్తూ, రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నార ని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి పార్టీ ఫిరాయిస్తున్నట్టు, మారుతున్నట్టు కనీసం పార్టీకి సమాచారం లేదని, పార్టీ నాయకులెవరికీ తెలియజేయలేదని చెప్పారు. చాలా సందర్బాల్లో ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరన్నారు. తీరా చూస్తే టీడీపీ ఫ్లెక్సీల మీద ఆయన ఫొటో ఉండడం దురదృష్టకరమన్నారు. ఒకవేళ నిజంగా పార్టీ వి«ధానాలు నచ్చకో, పార్టీ పట్ల నమ్మకం లేకో పార్టీ మారాలనుకుంటే ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనే దానిపై రాజ్యాంగపరంగా స్పష్టమైన నియమనిబంధనలు ఉన్నాయన్నారు. ఆ ప్రకారం పార్టీ పదవుల్ని వదులుకుని వెళితే ఎవరికీ ఎటువంటి అభ్యంతం లేదన్నారు. పార్టీకి గౌరవప్రదంగా రాజీనామాను పంపించాలన్నారు. రాజమహేంద్రవరం నగరమంతా ఫ్లెక్సీలు కట్టారని, వాటిని చూస్తేగాని తెలియని పరిస్థితి అన్నారు. నేడు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని, క్షేత్రస్థాయిలో ప్రజలు జగన్ నాయకత్వాని బలంగా కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు వైఎస్సార్ సీపీకి అండగా ఉన్నందున పార్టీకి ఎటువంటి ఢోకా లేదన్నారు. జిల్లాలో గడపగడపకూ వెఎస్సార్ కార్యక్రమంలో పర్యటిస్తున్న పార్టీ శ్రేణులకు ఆదరణ లభిస్తోందన్నారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. -
ప్రయాణీకులకు రక్షణగా కూల్ షేడ్స్ !
నాగ్ పూర్ః భారతదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే నగరాల్లో ఒకటైన నాగపూర్ లో ప్రయాణీకుల కష్టాలపై అధికారులు దృష్టి సారించారు. నగరంలోని ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎండ వేడి నుంచీ ప్రయాణీకులకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నారు. తీవ్రమైన వేడిని తట్టుకోలేక, సిగ్నల్ పడిన ఒకటి రెండు నిమిషాలు కూడ వేచి చూడలేని ప్రజలు... సిగ్నల్ జంప్ కు ప్రయత్నించడాన్ని నాగపూర్ అధికారులు గమనించారు. అందుకే ప్రయాణీకులకు కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నగరంలోని ప్రతి కూడలివద్దా ముఖ్యంగా టూవీలర్ పై ప్రయాణించే వారికి ఎండనుంచి రక్షణ కోసం పచ్చని క్లాత్ తో నీడనిచ్చే ఏర్పాట్లు చేశారు. నాగపూర్ లో ఈసారి నమోదవుతున్న44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేని ప్రజలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేందుకు కూడ వెనుకాడటం లేదు. దీంతో అధికారులు ఈ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చల్లని రాష్ట్రంగా చెప్పే మహరాష్ట్రతోపాటు ఈసారి దేశంలోనే అనేక రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవ్వడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇంటినుంచీ బయటకు వెళ్ళే పరిస్థితి లేకపోయినా తప్పని పరిస్థితుల్లో ప్రయాణించాల్సి రావడం వారి ఓర్పును, సహనాన్ని పరీక్షిస్తోంది. దీంతో తీక్షణమైన సూర్యకిరణాల వేడినుంచీ ప్రయాణీకులను కాపాడేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూల్ గ్రీన్ షేడ్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సిగ్నల్ పడినప్పుడు మోటారిస్టులు అక్కడి నీడలో ఆగేందుకు ప్రయత్నిస్తుంటారు. లేదంటే ఎండను తట్టుకోలేక అడ్డదిడ్డంగా రోడ్లు దాటడం, సిగ్నల్ జంప్ చేయడం చేస్తుంటారు. దీన్ని నిశితంగా గమనించిన నాగపూర్ అధికారులు కూల్ షేడ్స్ ప్రక్రియ చేపట్టారు. స్థానికుల కష్టాలపై దృష్టి సారించిన అధికారుల ప్రయత్నాన్ని నాగపూర్ ప్రజలు అభినందిస్తున్నారు. -
1, 2, 3.. జంప్..
చూశారుగా.. అచ్చంగా మనుషుల్లాగే ఈ మొసలి కూడా ఫెన్స్ ఎక్కి జంప్ చేసింది. రాజస్థాన్‌లోని బూందీ జిల్లాలో ఇటీవల ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్ రామ్‌కిషన్ ఈ చిత్రాలను క్లిక్‌మనిపించారు. ‘మొసలిని చూడగానే.. ఫొటోలు తీయడం ప్రారంభించా. అయితే.. అకస్మాత్తుగా అది ఫెన్స్ ఎక్కడం ప్రారంభించింది. అది దాదాపు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. మనుషుల్లాగే అలవోకగా ఎక్కేయడం ఆశ్చర్యం కలిగించింది’ అని చెప్పారు. ఆ మొసలి గురించి కిషన్ ఆరా తీయగా.. గత మూడు రోజులుగా అది సరస్సు నుంచి బయటకు వచ్చి తచ్చాడుతోందని.. గుడ్లు పెట్టడానికి బయటకు వచ్చి ఉండొచ్చని స్థానికులు చెప్పారు. గుడ్లు పెట్టాక.. దారి తప్పి.. ఇలా వచ్చి ఉండొచ్చని.. సరస్సు కనిపించగానే.. అందులోకి జంప్ చేసినట్లుందని కిషన్ చెప్పారు. -
పులులు ఏం చేస్తాయో చూద్దామని...
అలవికాని చోట అధికులమనరాదు అన్న సామెత.. ఆవ్యక్తికి తెలుసో లేదో కాని... ఏకంగా పులులతోనే పెట్టుకునేందుకు చూశాడు. తన జిమ్నాస్టిక్ విన్యాసాలను అక్కడ ప్రదర్శించేందుకు ప్రయత్నించాడు. జూ సందర్శించేందుకు వెళ్ళిన పర్యాటకుల్లోని ఓ కుర్రాడు... అప్పటిదాకా కేబుల్ కార్ లో కూచుని శ్రద్ధగానే తిలకించాడు. తీరా పులులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్ క్లోజర్ పైకి వచ్చేప్పటికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చినట్టుంది. తన ప్రతిభను ప్రదర్శిద్దామని ప్రయత్నించాడు. ఉన్నట్టుండి పులులు ఉండే ఎన్ క్లోజర్ నెట్ పైకి దూకేశాడు. ఇంతకూ బతికాడా లేదా అన్నదేగా మీ సందేహం...? చైనా జంతు ప్రదర్శన శాలలో పులలకు ప్రత్యేక ఎన్ క్లోజర్ ఉంది. సాధారణంగా ఏ జూలో అయినా అలాగే ఉంటుంది. వన్యప్రాణులను తిలకించాలనుకున్నవారిని ప్రత్యేకంగా పకడ్బందీగా ఉన్న వాహనాల్లో లోపలికి పంపుతుంటారు. అయితే చైనాలో తుంటరిగాళ్ళను నమ్మకూడదనుకున్నారో ఏమో జూ సిబ్బంది... సందర్శకులకు కనిపించే విధంగా.. ఎన్ క్లోజర్ పైభాగాన్ని కూడ వలతో పూర్తిగా కప్పేశారు. పులులను చూడాలనుకునేవారు కేబుల్ కార్ ద్వారా (రోప్ వే) వెళ్ళాల్సిందే. ఈ నేపథ్యంలో రోప్ వే ఛైర్ లో నుంచి చూస్తున్నట్టుగా చూస్తూ ఆ కుర్రాడు... ఉన్నట్లుండి వలపైకి దూకేశాడు. జరిగిన సంఘటనకు తోటి పర్యాటకులు షాకైపోయారు. వెంటనే తేరుకుని పెద్దగా కేకలు వేయడం ప్రారంభించారు. ఈ గందరగోళం గమనించిన పులులు...ఆకతాయిని నోటికి కరచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఆ కుర్రాడి అదృష్టం కలసి రావడంతో జూ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వలపై పడిన వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురు చూసిన పర్యాటకులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వ్యక్తిని పబ్లిక్ న్యూసెన్స్ గా పోలీసులు అరెస్టు చేశారు. ఇంతా చేస్తే. ఇదంతా థ్రిల్ కోసం చేశానని అతడు చెప్పడం విశేషం. పులుల ఎన్ క్లోజర్ లో వ్యక్తులు పడటం ఇది మొదటిసారి కాదు. ఇండియాలోని గ్వాలియర్ జూ లో 2014 లో ఓ విద్యార్థి 20 అడుగుల గోడ ఎక్కి మరీ పులులను చూసేందుకు ప్రయత్నించి ఎన్ క్లోజర్ లో పడ్డాడు. షర్టు విప్పేసి డ్యాన్స్ చేస్తూ పెన్ లో నానా హంగామా చేశాడు. పులుల మూడ్ ఎలా ఉందో ఏమో జూ సిబ్బంది వచ్చే వరకూ అవి పట్టించుకోపోవడంతో బతికిపోయాడు. అదే సంవత్సరంలో ఢిల్లీ జూలో రెండు తెల్ల పులులున్న ఎన్ క్లోజర్ లో పడ్డ విద్యార్థి... వాటి నోటికి చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. అవును... ఓ సినిమాలో హీరోగారన్నట్లు.. సింహం పడుకుంటే జూలుతో జడేయాలనుకోవడం, పులితో ఫొటో తీయించుకోవాలనుకోవడం మంచిది కాదు మరి...