1, 2, 3.. జంప్.. | crocodile jumped into water | Sakshi
Sakshi News home page

1, 2, 3.. జంప్..

Published Thu, Apr 7 2016 3:36 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

crocodile jumped into water

చూశారుగా.. అచ్చంగా మనుషుల్లాగే ఈ మొసలి కూడా ఫెన్స్ ఎక్కి జంప్ చేసింది. రాజస్థాన్‌లోని బూందీ జిల్లాలో ఇటీవల ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్ రామ్‌కిషన్ ఈ చిత్రాలను క్లిక్‌మనిపించారు. ‘మొసలిని చూడగానే.. ఫొటోలు తీయడం ప్రారంభించా. అయితే.. అకస్మాత్తుగా అది ఫెన్స్ ఎక్కడం ప్రారంభించింది. అది దాదాపు 4 అడుగుల ఎత్తు ఉంటుంది.

మనుషుల్లాగే అలవోకగా ఎక్కేయడం ఆశ్చర్యం కలిగించింది’ అని చెప్పారు. ఆ మొసలి గురించి కిషన్ ఆరా తీయగా.. గత మూడు రోజులుగా అది సరస్సు నుంచి బయటకు వచ్చి తచ్చాడుతోందని.. గుడ్లు పెట్టడానికి బయటకు వచ్చి ఉండొచ్చని స్థానికులు చెప్పారు. గుడ్లు పెట్టాక.. దారి తప్పి.. ఇలా వచ్చి ఉండొచ్చని.. సరస్సు కనిపించగానే.. అందులోకి జంప్ చేసినట్లుందని కిషన్ చెప్పారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement