అలబామా: అమెరికాలోని అలబామాలో టిక్ టాక్ వీడియోల పిచ్చి నలుగురు ప్రాణాలను తీసింది. వీరంతా బోట్ జంపింగ్ ఛాలెంజ్ పేరుతో వేగంగా వెళ్తోన్న రన్నింగ్ బోటు లోనుంచి నీటిలోకి దూకే ప్రయత్నంలో మెడలు విరగ్గొట్టుకుని అక్కడికక్కడే చనిపోయారు.
టిక్ టాక్ వీడియోలంటే చాలా మందికి ఒక సరదా. వీడియోలో ఐడియా వినూత్నంగా ఉండాలే గానీ చాలా తక్కువ వ్యవధిలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకోవచ్చు. అలా పాపులర్ అయినవారు చాలామందే ఉన్నారు. అయితే టిక్ టాక్ వలన కలిగే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్న నెపంతో చాలా దేశాలు ఈ యాప్ ను నిషేధించాయి.
ఇదిలా ఉండగా అమెరికాలోని అలబామాలో టిక్ టాక్ సరికొత్త ఛాలెంజ్ ఇప్పటికే నలుగురిని బలి తీసుకుంది. అదే బోట్ జంపింగ్ ఛాలెంజ్.. సముద్రంలో వేగంగా వెళ్తున్న బోటు నుండి నీటిలోకి దూకడమే ఈ ఛాలెంజ్. ఈ విచిత్రమైన ఛాలెంజ్ ఉన్నట్టుండి వైరల్ గా మారడంతో అనేకమంది ఈ ప్రయత్నం చేస్తూ బోట్ నుండి దూకుతూ వీడియోలు తీశారు. కానీ వారిలో నలుగురు మాత్రం తమ మెడలను విరగ్గొట్టుకుని విగతజీవులుగా మారిపోయారు. ఈ వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
TikTok boat jumping challenge that sees people leap off vessels moving at high speed is blamed for FOUR deaths in Alabama - as cop says victims broke their necks instantly. pic.twitter.com/2aCxvJZsRy
— Molly Ploofkins™ (@Mollyploofkins) July 9, 2023
అమెరికాకు చెందిన కెప్టెన్ జిమ్ డేవిస్ మాట్లాడుతూ గత ఆరు నెలల్లో మనం నియంత్రించగలిగి కూడా అలా చేయకపోవడం వలన ఈ దిక్కుమాలిన ఛాలెంజ్ వలన నలుగురు చనిపోయారని అన్నారు. నీటిలోకి దూకగానే క్షణాల వ్యవధిలో వారి మెడలు విరిగిపోయాయని, వీరంతా స్నేహితుల ముందు షో ఆఫ్ చేయాలన్న తపనతో చనిపోయినవారేనని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: ఖలిస్తానీలకు దీటుగా భారతీయుల ర్యాలీ..
Comments
Please login to add a commentAdd a comment