neck bone broke
-
నలుగురిని బలిగొన్న టిక్ టాక్ ఛాలెంజ్..
అలబామా: అమెరికాలోని అలబామాలో టిక్ టాక్ వీడియోల పిచ్చి నలుగురు ప్రాణాలను తీసింది. వీరంతా బోట్ జంపింగ్ ఛాలెంజ్ పేరుతో వేగంగా వెళ్తోన్న రన్నింగ్ బోటు లోనుంచి నీటిలోకి దూకే ప్రయత్నంలో మెడలు విరగ్గొట్టుకుని అక్కడికక్కడే చనిపోయారు. టిక్ టాక్ వీడియోలంటే చాలా మందికి ఒక సరదా. వీడియోలో ఐడియా వినూత్నంగా ఉండాలే గానీ చాలా తక్కువ వ్యవధిలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకోవచ్చు. అలా పాపులర్ అయినవారు చాలామందే ఉన్నారు. అయితే టిక్ టాక్ వలన కలిగే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్న నెపంతో చాలా దేశాలు ఈ యాప్ ను నిషేధించాయి. ఇదిలా ఉండగా అమెరికాలోని అలబామాలో టిక్ టాక్ సరికొత్త ఛాలెంజ్ ఇప్పటికే నలుగురిని బలి తీసుకుంది. అదే బోట్ జంపింగ్ ఛాలెంజ్.. సముద్రంలో వేగంగా వెళ్తున్న బోటు నుండి నీటిలోకి దూకడమే ఈ ఛాలెంజ్. ఈ విచిత్రమైన ఛాలెంజ్ ఉన్నట్టుండి వైరల్ గా మారడంతో అనేకమంది ఈ ప్రయత్నం చేస్తూ బోట్ నుండి దూకుతూ వీడియోలు తీశారు. కానీ వారిలో నలుగురు మాత్రం తమ మెడలను విరగ్గొట్టుకుని విగతజీవులుగా మారిపోయారు. ఈ వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. TikTok boat jumping challenge that sees people leap off vessels moving at high speed is blamed for FOUR deaths in Alabama - as cop says victims broke their necks instantly. pic.twitter.com/2aCxvJZsRy — Molly Ploofkins™ (@Mollyploofkins) July 9, 2023 అమెరికాకు చెందిన కెప్టెన్ జిమ్ డేవిస్ మాట్లాడుతూ గత ఆరు నెలల్లో మనం నియంత్రించగలిగి కూడా అలా చేయకపోవడం వలన ఈ దిక్కుమాలిన ఛాలెంజ్ వలన నలుగురు చనిపోయారని అన్నారు. నీటిలోకి దూకగానే క్షణాల వ్యవధిలో వారి మెడలు విరిగిపోయాయని, వీరంతా స్నేహితుల ముందు షో ఆఫ్ చేయాలన్న తపనతో చనిపోయినవారేనని ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: ఖలిస్తానీలకు దీటుగా భారతీయుల ర్యాలీ.. -
సరి‘హద్దు’లు చెరిపిన మానవత్వం.. పాక్ బాలికకు పునర్జన్మ!
న్యూఢిల్లీ: ‘మతములన్నియు మాసిపోవును... జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్నారు మహాకవి గురజాడ. మత, ప్రాంత భేదాలన్నీ మాసిపోయి.. మానవత్వమొక్కటే నిలబడుతుందని రుజువు చేశారో ఢిల్లీ డాక్టర్. ఉచితంగా వైద్యమందించి మెడ వంకరతో ఏళ్లుగా బాధపడుతున్న పాక్ బాలికను మామూలు మనిషిని చేశారు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన అఫ్షీన్ గుల్ వయసిప్పుడు 12 ఏళ్లు. బాలిక పది నెలల చిన్నారిగా ఉన్నసమయంలో తన అక్క చేతుల్లోంచి జారిపడిపోయింది. అంతే మెడ 90 డిగ్రీలు వంగిపోయింది. అక్కడ డాక్టర్లకు చూపిస్తే మందులిచ్చారు. కానీ మెడ సెట్ కాలేదు. మెడ వంకరకు సెరిబ్రల్ పాల్సీ కూడా తోడవడంతో అఫ్షీన్ జీవితం నిత్య నరకమైంది. ఆడుకోలేదు. చదువుకోనూ లేదు. స్నేహితులు లేరు. అవన్నీ కాదు... అసలు తినడం, నడవడం, మాట్లాడటమే కష్టమైంది. బ్రిటిష్ జర్నలిస్టు అలెగ్జాండ్రియా థామస్ అఫ్షీన్ వ్యథను రిపోర్ట్ చేసింది. అది ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ డాక్టర్ రాజగోపాలన్ కృష్ణన్‌కు తెలిసింది. జర్నలిస్టు ద్వారా కుటుంబంతో మాట్లాడిన డాక్టర్... అఫ్షీన్ను మామూలు మనిషిని చేస్తానని మాటిచ్చారు. అలా 2021 నవంబర్‌లో బాలికను ఢిల్లీకి తీసుకొచ్చారు. ఉచిత వైద్యమందించారు. నాలుగు అతిపెద్ద సర్జరీలను పైసా తీసుకోకుండా చేశారు. ఇప్పుడా బాలిక నవ్వుతోంది, మాట్లాడగలుగుతోంది. మామూలు మనిషైపోయింది. డాక్టర్ సర్జరీలు చేసి చేతులు దులుపుకోలేదు. ఇప్పటికీ స్కైప్‌లో బాలిక పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. ఇదీ చదవండి: Viral Video: ఆ పసికందు ప్రేమకు అంతా ఫిదా.. ఇంటర్నెట్ను కదిలిస్తున్న వీడియో చూశారా? -
Radhika Gupta: అవమానాల నుంచి అందనంత ఎత్తుకు!
కష్టసుఖాల కలయికే జీవితం. కానీ కొంతమంది జీవితాల్లో సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఊపిరాడనీయకుండా చేçస్తుంటాయి. ఇలాంటప్పుడు మనసులో ఏదోఒక మూలన ఉన్న.. ఉన్నతంగా ఎదగాలన్న కోరిక కూడా ఆవిరైపోతుంది. అచ్చం ఇలాగే జరిగింది రాధికా గుప్తా జీవితంలో. అర్హతలు ఉన్నప్పటికీ, పుట్టుకతో ఉన్న శారీరక సమస్యను సాకుగా చూపుతూ ఉద్యోగానికి పనికిరావని చీత్కారాలకు గురైంది. దీంతో 22 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ కొన్నాళ్లకు ఎడారిలో వర్షంపడినట్లుగా రాధిక జీవితంలో ఉద్యోగ అవకాశం రావడం.. దానిని అందిపుచ్చుకుని నేడు ఏకంగా ఓ పెద్ద కంపెనీకి సీఈవో అయ్యింది. ఇండియాలో ఉన్న అతిపిన్న వయసు సీఈవోలలో రాధిక కూడా ఒకరిగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. యోగేష్, ఆర్తీ గుప్తా దంపతుల ముద్దుల కూతురు రాధికా గుప్తా. యోగేశ్ వృత్తిరీత్యా దౌత్యవేత్త కావడంతో రాధిక చిన్నతనం మొత్తం పాకిస్థాన్, నైజీరియా, అమెరికా, ఇటలీలలో గడిచింది. విదేశాల్లో ఉన్నప్పటికీ ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబం కావడంతో ..‘‘బాగా చదువుకో జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడతావు’’ అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తుండేవారు. దీంతో రాధిక కూడా చక్కగా చదువుకుంటూ స్కూల్లో టాప్–ఫైవ్ జాబితాలో ఉండేది. అంతా బాగానే ఉన్నప్పటికీ రాధికకు పుట్టుకతో కొన్ని సమస్యల కారణంగా మెడ వంకరగా ఉండేది. వంకర మెడతో స్కూలుకెళితే మిగతా విద్యార్థులంతా.. ఆమెను చూసి గేలి చేసేవారు. నువ్వు మీ అమ్మకంటే అందవిహీనంగా ఉన్నావు’’ అంటూ తరచూ మాటలతో హింసించేవారు. తండ్రి ఉద్యోగరీత్యా బదిలీ అవ్వడం.. వెళ్లిన ప్రతి కొత్త స్కూల్లో అవమానాలు వెన్నంటి వేధిస్తుండేవి. అయినప్పటికీ తనని తాను నిరూపించుకునేందుకు నిరంతరం కష్టపడేది . డ్యూయల్ డిగ్రీ ఉన్నప్పటికీ.. ప్రతిష్టాత్మక వార్టన్ బిజినెస్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్‌లలో డ్యూయల్ డిగ్రీ చేసింది. రెండు డిగ్రీలు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణ ప్రారంభించింది. ఆమె విద్యార్హతలు, ప్రతిభా నైపుణ్యాలను పక్కనపెట్టేసి ‘నీ మెడ వంకరగా ఉంది నీలాంటి వాళ్లకు ఉద్యోగం ఇవ్వలేము’’ అని వెనక్కి తిప్పి పంపేవారు. ఇలా వరుసగా ఏడుసార్లు జరగడంతో రాధిక తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యింది. ఎందుకు ఈ జీవితం ఆత్మహత్య చేసుకుంటే ఏబాధ ఉండదు అనిపించింది ఆమెకు. కౌన్సిలింగ్‌తో... నిరాశనుంచి బయటపడేందుకు కొంతమంది స్నేహితుల సాయంతో సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లి కౌన్సిలింగ్ తీసుకుంది. ఆ తరువాత మెకిన్సేలో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ కొన్నాళ్లు పనిచేశాక, ఏక్యూఆర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా చేరింది. తరువాత తన భర్తతో కలిసి ఇండియా వచ్చింది. సొంతంగా ‘ఫోర్‌ఫ్రంట్ క్యాపిటల్ మేనేజ్మెంట్’ కంపెనీని ప్రారంభించింది. కంపెనీ క్యాపిటల్, పనితీరు బావుండడంతో ఎడిల్వీజ్ ఫోర్ఫ్రంట్ను కొనేసింది. ఇదే సమయంలో రాధిక పనితీరుని మెచ్చి ఎడిల్వీజ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌కు సీఈవోని చేసింది. అనేక అవమానాలు, కష్టాల తరువాత సీఈవోగా రాణిస్తోన్న రాధిక ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ‘దట్ గర్ల్ విత్ ఏ బ్రోకెన్ నెక్’ వీడియోలో తన కథను వివరిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. అనేక అవమానాలనుంచి అందనంత ఎత్తుకు ఎదిగి నేను ఇది అని నిరూపించి చూపిస్తోంది రాధిక. నాన్నే ప్రేరణ.. నాన్న ..ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టారు. కష్టపడి చదివి సివిల్ సర్వీసెస్‌లో ఏడో ర్యాంక్ సాధించారు. నిరుపేదరికం నుంచి వచ్చిన ఆయన అన్నిసాధించ గలిగినప్పుడు, నాకున్న ఒక సమస్యతో ఎందుకు వెనుకబడిపోవాలి అనుకుని, బాగా కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నాను. అందం, అనుమానాలను పక్కనపెట్టి, నేను ఎదుర్కొన్న ప్రతిసమస్యను అనుభవాలుగా మార్చుకుని ముందుకు సాగాను. దాంతోనే ఈ స్థాయిలో నిలబడిగలిగాను. – రాధికా గుప్తా -
మసాజ్.. అతడి ప్రాణాలు తీసింది
ఒళ్లు నొప్పులుగా ఉన్నాయని మసాజ్ చేయించుకోడానికి వెళ్తే.. మెడ ఎముక విరిగి ప్రాణాలు కోల్పోయాడు! ఈ ఘటనపై దాదాపు ఏడాది పాటు దర్యాప్తు జరిగిన తర్వాత.. అతడి ప్రాణాలు పోవడానికి మసాజే కారణమని తేలింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ ఘటన జరిగింది. దానిపై ఇన్నాళ్ల పాటు పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత. మసాజ్ సెంటర్ మేనేజర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. భోపాల్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి. 2015 డిసెంబర్ 12వ తేదీన నజీరాబాద్ ప్రాంతానికి చెందిన హర్నభ్ సింగ్ అనే వ్యక్తి తమ బంధువుల ఇంట్లో పార్టీలో ఉండగా తనకు మెడ బాగా నొప్పిగా ఉందని చెబుతూనే కుప్పకూలిపోయాడు. అతడికి నొప్పి చాలా ఎక్కువగా ఉండటంతో.. స్థానికంగా ఉండే మధు ఠాకూర్ అనే వ్యక్తికి సింగ్ తల్లి ఆ విషయాన్ని చెప్పారు. అది ఎలా తగ్గుతుందో తనకు తెలుసని అతడు చెప్పి, దగ్గర్లో ఉన్న మసాజ్ పార్లర్‌కు వెళ్లమని సూచించాడు. అయితే.. హర్నభ్కు అక్కడ చేసిన మసాజ్ కారణంగా మెడ ఎముకల్లో ఒకటి విరిగిపోయి, అతడు స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆస్తప్రికి తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. పోస్టుమార్టం నివేదికలో డాక్టర్లు అతడి మృతికి కచ్చితమైన కారణం ఏంటో చెప్పకపోవపడంతో కేసు నమోదు చేయడంలో ఆలస్యమైందని పోలీసులు తెలిపారు. చివరకు వైద్య, న్యాయ నిపుణులతో కూడిన బృందం క్షుణ్ణంగా విచారణ జరిపి, అతడి మెడ ఎముక విరిగిన తర్వాతే మరణించాడని, అందుకు కారణం మసాజ్ అని తేల్చడంతో ఇన్నాళ్లకు కేసు నమోదు చేశారు.