దక్షిణాఫ్రికా: స్కై డ్రైవింగ్‌లు గురించి వినే ఉంటాం. ఇలాంటి స్కై డ్రైవింగ్‌లు భయం కలిగించే అత్యద్భుతమైన ధైర్య సాహసాలతో చేసే ఒక అరుదైన విన్యాసం. కానీ ఒక్కోసారి ఈ విన్యాసాలు బెడిసికొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడొక దక్షిణాప్రికా బృందం చేసిన స్కైడ్రైవింగ్ చూస్తే చాలా భయం వేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది
(చదవండి: అరుదైన వింత సంఘటన... తోకతో పుట్టిన బాలుడు)
ఈ వీడియోలో ..మొదట ఆ బృందం అంతా విమానంలో ఆకాశంలో ఒక చోట ఈ విన్యాసం చేయడానికి చూస్తున్నట్లుగా కనిపిస్తారు. ఈ మేరకు అక్కడే ఆకాశంలో ఒక చోట గాలిలో విమానాన్ని నిలిపి నెమ్మదిగా విమానం డోర్ తీసి ఒకేసారి జంప్ చేయాలని నిర్ణయించుకుంటారు. వారు అనుకున్న విధంగా అందరూ ఒకేసారి 16 వేల అడుగుల ఎత్తులోంచి జంప్ చేస్తారు. అయితే వారు జంప్ చేసి విధానం అత్యంత భయానకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బృందం అంతా ఒకేసారి దూకడంతో విమానం ఒక్కసారి స్పిన్ అయిపోయి అదుపుతప్పినట్టుగా వెళ్లుతుంది.
పైగా ఒక దశలో విమానిం కిందకి వెళ్లే క్రమంలో వాళ్లపైకి దూసుకొస్తున్నట్లుగా ఉంటుంది. అదృష్టమేమిటంలే ఎవర్ని ఢీ కొట్టకుండా ఆ విమానం కాసేపటికి నిధానంగా కిందకి ల్యాండ్ అవ్వడానికి వెళ్లిపోతుంది. అయితే జంప్ చేసిన 9 మంది బృంద సభ్యులు ఒక్కసారిగా చెల్లచెదురైనా మళీ అంతా భలే చక్కగా ఒకరిని ఒకరు పట్టుకుంటూ రకరకాలుగా విన్యాసాలు చేస్తారు. ఈ మేరకు ఈ 9 మంది బృంద సభ్యులు ఏవియేషన్ విద్యలో భాగంగానే ఈ విన్యాసాలు ప్రదర్శిస్తారు. అయితే కొంతసేపటికి ఆ బృందం సురక్షితంగా కిందకి ల్యాండ్ అవుతారు.
(చదవండి: వింతైన ఇల్లు దీని ధర ఎంత తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment