Aviation Course
-
Zoya Agarwal: అబ్బురపరిచే సాహసికి... అరుదైన గౌరవం
మ్యూజియం అంటే వస్తు,చిత్ర సమ్మేళనం కాదు. అదొక ఉజ్వల వెలుగు. అనేక రకాలుగా స్ఫూర్తిని ఇచ్చే శక్తి. అలాంటి ఒక మ్యూజియంలో కెప్టెన్ జోయా అగర్వాల్ సాహసాలకు చోటు దక్కింది... శాన్ఫ్రాన్సిస్కో(యూఎస్)లోని ఏవియేషయన్ మ్యూజియం వైమానికరంగ అద్భుతాలకు వేదిక. అక్కడ ప్రతి వస్తువు, ప్రతి చిత్రం, పుస్తకం...ప్రపంచ వైమానికరంగ వైభవానికి సంబంధించి ఎన్నో విషయాలను చెబుతుంది. అలాంటి మ్యూజియంలో ఇప్పుడు మన దేశానికి చెందిన జోయా అగర్వాల్ సాహస చరిత్రకు చోటుదక్కింది. ఈ ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలో చోటు సంపాదించిన తొలి భారతీయ మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించింది జోయా. ఇప్పుడు ఆమె అద్భుత సాహసాన్ని చిత్రాల నుంచి వస్తువుల వరకు రకరకాల మాధ్యమాల ద్వారా తెలుసుకోవచ్చు. స్ఫూర్తి పొందవచ్చు. దిల్లీలో జన్మించిన జోయాకు చిన్నప్పటి నుంచి సాహసాలు అంటే ఇష్టం. పైలట్ కావాలనేది ఆమె కల. అయితే తల్లిదండ్రులు భయపడ్డారు. ‘పైలట్ కావడానికి చాలా డబ్బులు కావాలి. అంత స్తోమత మనకు ఎక్కడ ఉంది తల్లీ’ అని కూడా అన్నారు. అయితే అవేమీ తన మనసును మార్చలేకపోయాయి.ఏవియేషన్ కోర్స్ పూర్తయినరోజు తన ఆనందం ఎంతని చెప్పాలి! మొదటి అడుగు పడింది. ఒక అడుగు అంటూ పడాలేగానీ దారి కనిపించడం ఎంతసేపని! తొలిసారిగా దుబాయ్‌కి విమానాన్ని నడిపినప్పుడు జోయా సంతోషం ఆకాశాన్ని అంటింది. పైలట్ కావాలనుకొని అయింది. ఆ తరువాత కెప్టెన్ కూడా అయింది....ఇక చాలు అని జోయా అక్కడితో ఆగిపోయి ఉంటే ప్రపంచ వైమానికరంగ చరిత్రలో ఆమెకు అంటూ ఒక పుట ఉండేది కాదు. కోవిడ్ కోరలు చాచిన కల్లోల సమయంలో ‘వందే భారత్ మిషన్’లో భాగంగా విమానం ద్వారా విదేశాల్లో ఉన్న ఎంతోమంది భారతీయులను స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చి ‘శభాష్’ అనిపించుకుంది. ఇక అతిపెద్ద సాహసం గత సంవత్సరం చేసింది. నలుగురు మహిళా పైలట్లను కూర్చోబెట్టుకొని ఉత్తరధ్రువం మీదుగా 17 గంటల పాటు విమానం నడిపి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జోయాను ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధిగా నియమించడం అరుదైన గౌరవం. ‘అంకితభావం మూర్తీభవించిన సాహసి కెప్టెన్ జోయా అగర్వాల్. ఆమె విజయాలు, సాహసాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తాయి. వారి కలను నెరవేర్చుకునేలా చేస్తాయి. మ్యూజియంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చరిత్ర, విజయాలు ఈ తరానికే కాదు, భవిష్యత్తరాలకు కూడా ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి’ అంటున్నారు శాన్ఫ్రాన్సిస్కో ఎవియేషన్ మ్యూజియం అధికార ప్రతినిధి. ‘ఇది కలా నిజమా! అనిపిస్తుంది. ఈ గుర్తింపు నా దేశానికి, నాకు గర్వకారణం’ అంటుంది జోయా. జోయా అగర్వాల్ ప్రతిభ, సాహసం కలగలిసిన పైలట్ మాత్రమే కాదు యువతరాన్ని కదిలించే మంచి వక్త కూడా. ‘రాత్రివేళ ఆరుబయట కూర్చొని ఆకాశాన్ని చూస్తున్న ఎనిమిది సంవత్సరాల బాలికను అడిగేతే, తాను కచ్చితంగా పైలట్ కావాలనుకుంటుంది’ అంటుంది జోయా అగర్వాల్. అయితే అలాంటి బాలికలు తమ కలను నెరవేర్చుకోవడానికి జోయాలాంటి పైలట్ల సాహసాలు ఉపకరిస్తాయి. తిరుగులేని శక్తి ఇస్తాయి. -
షాకింగ్ వీడియో: 16వేల అడుగుల ఎత్తులోంచి..
దక్షిణాఫ్రికా: స్కై డ్రైవింగ్‌లు గురించి వినే ఉంటాం. ఇలాంటి స్కై డ్రైవింగ్‌లు భయం కలిగించే అత్యద్భుతమైన ధైర్య సాహసాలతో చేసే ఒక అరుదైన విన్యాసం. కానీ ఒక్కోసారి ఈ విన్యాసాలు బెడిసికొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడొక దక్షిణాప్రికా బృందం చేసిన స్కైడ్రైవింగ్ చూస్తే చాలా భయం వేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది (చదవండి: అరుదైన వింత సంఘటన... తోకతో పుట్టిన బాలుడు) ఈ వీడియోలో ..మొదట ఆ బృందం అంతా విమానంలో ఆకాశంలో ఒక చోట ఈ విన్యాసం చేయడానికి చూస్తున్నట్లుగా కనిపిస్తారు. ఈ మేరకు అక్కడే ఆకాశంలో ఒక చోట గాలిలో విమానాన్ని నిలిపి నెమ్మదిగా విమానం డోర్ తీసి ఒకేసారి జంప్ చేయాలని నిర్ణయించుకుంటారు. వారు అనుకున్న విధంగా అందరూ ఒకేసారి 16 వేల అడుగుల ఎత్తులోంచి జంప్ చేస్తారు. అయితే వారు జంప్ చేసి విధానం అత్యంత భయానకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బృందం అంతా ఒకేసారి దూకడంతో విమానం ఒక్కసారి స్పిన్ అయిపోయి అదుపుతప్పినట్టుగా వెళ్లుతుంది. పైగా ఒక దశలో విమానిం కిందకి వెళ్లే క్రమంలో వాళ్లపైకి దూసుకొస్తున్నట్లుగా ఉంటుంది. అదృష్టమేమిటంలే ఎవర్ని ఢీ కొట్టకుండా ఆ విమానం కాసేపటికి నిధానంగా కిందకి ల్యాండ్ అవ్వడానికి వెళ్లిపోతుంది. అయితే జంప్ చేసిన 9 మంది బృంద సభ్యులు ఒక్కసారిగా చెల్లచెదురైనా మళీ అంతా భలే చక్కగా ఒకరిని ఒకరు పట్టుకుంటూ రకరకాలుగా విన్యాసాలు చేస్తారు. ఈ మేరకు ఈ 9 మంది బృంద సభ్యులు ఏవియేషన్ విద్యలో భాగంగానే ఈ విన్యాసాలు ప్రదర్శిస్తారు. అయితే కొంతసేపటికి ఆ బృందం సురక్షితంగా కిందకి ల్యాండ్ అవుతారు. (చదవండి: వింతైన ఇల్లు దీని ధర ఎంత తెలుసా?) -
బతుకుదెరువు కోసం వెళ్లి.. మృత్యువాత
చిట్యాల, న్యూస్‌లైన్ : ఉన్నత ఉద్యోగం చేసి.. కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకుకోవాలని అతడు కన్న కలలు కల్లలయ్యూయి. 23 ఏళ్ల ప్రాయూనికే నూరేళ్లు నిండాయి. ఉద్యోగ వేటలో విదేశాలకు వెళ్లిన అతడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. చిట్యాల మండ లం ఒడితల గ్రామానికి చెందిన ఓ యువకుడు దక్షిణాఫ్రికాలో మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి బంధువుల కథనం ప్రకారం... మాచర్ల రాధ, రాయమల్లు దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో పెద్దకుమారుడు రాకేష్(23) ఎనిమిదో తరగతి వరకు గొర్లవీడు హైస్కూల్లో, పదోతరగతి రేగొండ మండలం లింగాల భారతి హైస్కూల్లో చదివాడు. ఇంటర్ ఎంపీసీ హన్మకొండలోని బాలాజీ జూనియర్ కాలేజీలో, డిగ్రీ కేడీసీలో చదివాడు. 2012లో ఏవియేషన్ కోర్సును బెంగళూరులో పూర్తి చేసి, అక్కడే ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తుండగా దక్షిణాఫ్రికాలో ఉంటున్న నాగార్జునతో పరిచయం ఏర్పడింది. అతడు దక్షిణాఫ్రికాలో మంచి కంపెనీలో సేల్స్ మేనేజర్ ఇప్పిస్తానని మూడు నెలల క్రితం తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ఓ కంపెనీలో సేల్స్‌ప్రమోటర్‌గా పెట్టుకున్నారని పేర్కొన్నారు. దసరా పండగ వరకు ఇంటికి వస్తానని చెప్పాడని రాకేష్ మేనమామ కన్నం రమేష్ చెప్పారు. కారులో డ్యూటీకి వెళుతుండగా ఐదు రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో రాకేష్ మృతిచెందినట్లు మూడు రోజుల తర్వాత తెలిసిందని ఆయన వెల్లడించారు. శనివారం సమాచారం ఇవ్వడంతో హైదరాబాద్‌కు ఆదివారం వె ళ్లి మృతదేహాన్ని తీసుకొచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. రాకేష్ మృతితో ఒడితల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాకేష్ అంత్యక్రియల్లో వివిధ పార్టీల నాయకులు, స్నేహితులు,గ్రామప్రజలు పాల్గొని కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. దసరకు వత్తనంటివికాదు బిడ్డో : తల్లి రాధ దసర పండుగకు వత్తనంటివి బిడ్డో.. అందరికి బట్టలు తెత్తనని చెప్తివి కొడుకో. అందరికంటె జర మంచిగ బతకాలని పోయిండు. కానరాని రాజ్యం వద్దని మెత్తుకున్న ఇనలేదు. మంచిగా చదువుకోని పెద్దగా ఎదుగుతనని చెప్పిండు. కడుపుకోత పెట్టిండు. అక్కడ ఏం జరిగిందో తెల్వదు. స్నేహితుడే మోసం చేశాడు : మృతుడి మేనమామ కన్నం రమేష్ బెంగళూరులో ఎయిర్‌పోర్టులో జాబ్ చేస్తున్నపుడు ఆనందపడ్డాం. అక్కడ నాగార్జున అనే దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి పరిచయం కావడం వల్లనే రాకేష్ దక్కకుండా పోయాడు. మంచి జాబ్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిండు. రాకేష్ నా చేతిలో పెరిగిండు.