ఒకరిద్దరి నిష్క్రమణతో నష్టం లేదు
రు నాయకులు పార్టీని వీడిపోయినా ఎలాంటి నష్టం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులు.. ఎమ్మెల్సీ ఆదిరెడ్డిఅప్పారావు టీడీపీలో చేరుతున్న విషయంపై అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. రూరల్ నియోజకవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు నగరంలోకి
ఆదిరెడ్డి పార్టీని వీడుతున్నట్టు మాటైనా చెప్పలేదు
పార్టీ ఇచ్చిన పదవిని వదులుకుని వెళ్లడమే సరైన పద్ధతి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం):
ఒకరిద్దరు నాయకులు పార్టీని వీడిపోయినా ఎలాంటి నష్టం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులు.. ఎమ్మెల్సీ ఆదిరెడ్డిఅప్పారావు టీడీపీలో చేరుతున్న విషయంపై అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. రూరల్ నియోజకవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు నగరంలోకి వస్తుండగా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలో ఆదిరెడ్డిఅప్పారావు ఫొటోలు ఉండడం చూశానన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాలకు అరాచకాలకు ఇదొక ఉదాహరణన్నారు. ఒక పార్టీ నుంచి శాసనసభకు, శాసనమండలికి ఎన్నికైన వారు వేరే పార్టీలోకి ఫిరాయించడం తప్పుకాదు అని పెద్ద సంకేతాన్ని ఇస్తూ, రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నార ని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి పార్టీ ఫిరాయిస్తున్నట్టు, మారుతున్నట్టు కనీసం పార్టీకి సమాచారం లేదని, పార్టీ నాయకులెవరికీ తెలియజేయలేదని చెప్పారు. చాలా సందర్బాల్లో ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరన్నారు. తీరా చూస్తే టీడీపీ ఫ్లెక్సీల మీద ఆయన ఫొటో ఉండడం దురదృష్టకరమన్నారు. ఒకవేళ నిజంగా పార్టీ వి«ధానాలు నచ్చకో, పార్టీ పట్ల నమ్మకం లేకో పార్టీ మారాలనుకుంటే ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనే దానిపై రాజ్యాంగపరంగా స్పష్టమైన నియమనిబంధనలు ఉన్నాయన్నారు. ఆ ప్రకారం పార్టీ పదవుల్ని వదులుకుని వెళితే ఎవరికీ ఎటువంటి అభ్యంతం లేదన్నారు. పార్టీకి గౌరవప్రదంగా రాజీనామాను పంపించాలన్నారు. రాజమహేంద్రవరం నగరమంతా ఫ్లెక్సీలు కట్టారని, వాటిని చూస్తేగాని తెలియని పరిస్థితి అన్నారు. నేడు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని, క్షేత్రస్థాయిలో ప్రజలు జగన్ నాయకత్వాని బలంగా కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు వైఎస్సార్ సీపీకి అండగా ఉన్నందున పార్టీకి ఎటువంటి ఢోకా లేదన్నారు. జిల్లాలో గడపగడపకూ వెఎస్సార్ కార్యక్రమంలో పర్యటిస్తున్న పార్టీ శ్రేణులకు ఆదరణ లభిస్తోందన్నారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు.