న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు నేరచరిత్ర గల అభ్యర్థులను చాలామందిని బరిలో దింపాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ అన్నింటిదీ ఇదే బాట.
క్రిమినల్ కేసులున్న నేతలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన బీజేపీ, స్వచ్ఛపాలన అందించడమే లక్ష్యంగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ కళంకితులపైనే ఆధారపడుతున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకారం.. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న 23 మందికి ఆప్ టిక్కెట్లు కేటాయించింది. బీజేపీ 29 మంది, కాంగ్రెస్ 21 మందిని నేరచరిత్రగల వారిని ఎంపిక చేసింది. గత ఎన్నికలను పరిశీలిస్తే నేరచరిత్ర గల అభ్యర్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోందని ఏడీఆర్ వెల్లడించింది
ఢిల్లీ ఎన్నికల బరిలో క్రిమినల్స్
Published Sat, Jan 31 2015 11:59 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement