No Problem
-
మా నుంచి భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదు: తాలిబన్లు
కాబూల్: భారతదేశానికి తాలిబన్ల నుంచి ఎలాంటి ముప్పు ఉండబోదని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సోమవారం స్పష్టం చేశారు. ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జబీహుల్లా పలు అంశాలను ప్రస్తావించారు. ‘ఆసియా ప్రాంతంలో భారత్ కీలకమైన దేశం. గత అఫ్గాన్ ప్రభుత్వం, భారత్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. తాలిబన్ల నేతృత్వంలో ఏర్పడే నూతన అఫ్గాన్ ప్రభుత్వం సైతం అదే స్థాయిలో సహృద్భావ సంబంధాలను కోరుకుంటోంది’ అని జబీహుల్లా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌తో కలసి భారత వ్యతిరేక కార్యకాలాపాలకు తాలిబన్లు పాల్పడబోతున్నారనే వార్తలపై జబీహుల్లా స్పందించారు. అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. తాలిబన్లు భారత్‌కు ఎటువంటి హానీ తలపెట్టబోరన్నారు. తాలిబన్లు పాక్‌నూ తమ సొంత దేశంగా భావిస్తారని జబీహుల్లా ఇటీవల పేర్కొన్నారు. ఆ అంశంపై వివరణ ఇచ్చారు. ‘పాక్‌తో అఫ్గాన్‌కు సరిహద్దు బంధముంది. అఫ్గానీయులు తరచూ సరిహద్దు దాటి బంధువులు, వాణిజ్యం కోసం పాక్ ప్రజలతో మమేకమవుతారు. అలాంటి బంధాన్నే మేం కోరుకుంటున్నాం’ అని ఆయన వివరించారు. ‘అన్ని దేశాలతో మంచి దౌత్య సంబంధాలనే మేం ఆశిస్తున్నాం’ అని అన్నారు. ‘అన్ని దేశాలతో మంచి దౌత్య సంబంధాలనే మేం ఆశిస్తున్నాం. ముఖ్య దేశాలన్నీ ఎంబసీలను కొనసాగించాలి’ అని అన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌పైనా మాట్లాడారు. ‘ఒక ఉమ్మడి నిర్ణయం కోసం రెండు వైపుల నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. యుద్ధమే ఏకైక మార్గమని మేం భావించట్లేదు’ అని చెప్పారు. -
వాన..? వరద..? నో ప్రాబ్లమ్!
ఆ మధ్య ఒకరోజులోనే హైదరాబాద్‌ను ముంచేసిన వాన గుర్తుందా? పోనీ గత ఏడాది ఇదే టైమ్‌లో చెన్నైను చుట్టుముట్టిన వరదలు! గుర్తుండే ఉంటాయి లెండి! ఇలాంటి విపరీతమైన వాతావరణ సంఘటనలు ఇకపై కూడా తరచూ మనల్ని పలకరించునున్నాయి. థ్యాంక్స్ టు భూతాపోన్నతి (గ్లోబల్ వార్మింగ్), వాతావరణ మార్పులు! వీటిని ఎదుర్కొనేందుకు, నష్టాన్ని తగ్గించుకునేందుకు విపరీతమైన ప్లానింగ్ అవసరమవుతోంది. బ్రిటన్‌లో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. అందుకు ప్రత్యక్ష నిదర్శనాలు పక్కనున్న ఫొటోలు. అన్ని కాలాల్లో... ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకోగల ఇళ్లను డిజైన్ చేసేందుకు ‘రెసిలియంట్ హోమ్స్’ పేరుతో ఓ పోటీ నిర్వహించింది. అనేక ఆర్కిటెక్చర్ సంస్థలు, మాస్టర్ ప్లానర్లు ఈ పోటీలో పాల్గోన్నారు. చివరకు జేటీపీ ఆర్కిటెక్చర్, ఎడ్బార్స్లీ అనే పర్యావరణవేత్త కలిసి సిద్ధం చేసిన ఈ ఇళ్ల డిజైన్లకు అవార్డు దక్కింది. ‘ఆ... ఏముంది ఈ డిజైన్‌లో. అంతా మామూలేగా’ అనుకుంటున్నారా? కొంచెం ఆగండి.. వరద వచ్చే ప్రమాదముందీ అనుకోండి... చాలా ముందుగానే ఈ ఇంట్లోని వాళ్ల స్మార్ట్ఫోన్లలో ఎలర్ట్‌లు వచ్చేస్తాయి. ఆ వెంటనే వీరు సెల్లార్ ప్రాంతంలో ఉంచుకున్న కార్లు, ఇతర విలువైన వస్తువులను సురక్షితమైన ప్రాంతానికి తరలించుకోవచ్చు. అంతేకాకుండా... ఈ ఇళ్లల్లో విద్యుత్తుకు సంబంధించిన పరికరాలు (ట్రాన్స్ఫార్మర్లు, బ్యాటరీలు గట్రా) మొదటి అంతస్తులో ఉంటాయి. ఫలితంగా వాన రాగానే ఇక్కడ కరెంటు అస్సలు పోదన్నమాట. పైకప్పును జాగ్రత్తగా చూస్తే అక్కడ సోలార్ ప్యానెల్స్ ఉన్న విషయమూ మనకు స్పష్టమవుతుంది. సో... అత్యవసర పరిస్థితుల్లోనూ రోజువారీ పనులేవీ పక్కనపెట్టాల్సిన పనిలేదు. పొరుగింటిలో ఏదైనా అనుకోని అవాంతరం ఏర్పడినా వారు క్షేమంగా పక్కింటిలోకి చేరేందుకూ ఏర్పాట్లు ఉన్నాయి. భలే డిజైన్ కదూ... అమరావతిలోనూ... హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఇళ్లతో ఓ కాలనీ సిద్ధం చేస్తే బాగుంటుందేమో! -
ఒకరిద్దరి నిష్క్రమణతో నష్టం లేదు
ఆదిరెడ్డి పార్టీని వీడుతున్నట్టు మాటైనా చెప్పలేదు పార్టీ ఇచ్చిన పదవిని వదులుకుని వెళ్లడమే సరైన పద్ధతి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం): ఒకరిద్దరు నాయకులు పార్టీని వీడిపోయినా ఎలాంటి నష్టం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులు.. ఎమ్మెల్సీ ఆదిరెడ్డిఅప్పారావు టీడీపీలో చేరుతున్న విషయంపై అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. రూరల్ నియోజకవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు నగరంలోకి వస్తుండగా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలో ఆదిరెడ్డిఅప్పారావు ఫొటోలు ఉండడం చూశానన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాలకు అరాచకాలకు ఇదొక ఉదాహరణన్నారు. ఒక పార్టీ నుంచి శాసనసభకు, శాసనమండలికి ఎన్నికైన వారు వేరే పార్టీలోకి ఫిరాయించడం తప్పుకాదు అని పెద్ద సంకేతాన్ని ఇస్తూ, రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నార ని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి పార్టీ ఫిరాయిస్తున్నట్టు, మారుతున్నట్టు కనీసం పార్టీకి సమాచారం లేదని, పార్టీ నాయకులెవరికీ తెలియజేయలేదని చెప్పారు. చాలా సందర్బాల్లో ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరన్నారు. తీరా చూస్తే టీడీపీ ఫ్లెక్సీల మీద ఆయన ఫొటో ఉండడం దురదృష్టకరమన్నారు. ఒకవేళ నిజంగా పార్టీ వి«ధానాలు నచ్చకో, పార్టీ పట్ల నమ్మకం లేకో పార్టీ మారాలనుకుంటే ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనే దానిపై రాజ్యాంగపరంగా స్పష్టమైన నియమనిబంధనలు ఉన్నాయన్నారు. ఆ ప్రకారం పార్టీ పదవుల్ని వదులుకుని వెళితే ఎవరికీ ఎటువంటి అభ్యంతం లేదన్నారు. పార్టీకి గౌరవప్రదంగా రాజీనామాను పంపించాలన్నారు. రాజమహేంద్రవరం నగరమంతా ఫ్లెక్సీలు కట్టారని, వాటిని చూస్తేగాని తెలియని పరిస్థితి అన్నారు. నేడు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని, క్షేత్రస్థాయిలో ప్రజలు జగన్ నాయకత్వాని బలంగా కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు వైఎస్సార్ సీపీకి అండగా ఉన్నందున పార్టీకి ఎటువంటి ఢోకా లేదన్నారు. జిల్లాలో గడపగడపకూ వెఎస్సార్ కార్యక్రమంలో పర్యటిస్తున్న పార్టీ శ్రేణులకు ఆదరణ లభిస్తోందన్నారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. -
సుస్మిత మళ్లీ మెరవనుంది
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మళ్లీ తెరపై కనిపించనుంది. చివరిసారిగా ‘నో ప్రాబ్లం’ (2010)లో తెరపై కనిపించిన సుస్మితా, తాజాగా బెంగాలీ చిత్రం ‘నిర్బాక్’లో ప్రధాన పాత్ర పోషించనుంది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ జూలై 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఎక్కువ భాగం షూటింగ్ ముంబైలో జరుగుతుందని, మిగిలిన భాగం కోల్‌కతాతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.