
సుస్మిత మళ్లీ మెరవనుంది
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మళ్లీ తెరపై కనిపించనుంది. చివరిసారిగా ‘నో ప్రాబ్లం’ (2010)లో తెరపై కనిపించిన సుస్మితా, తాజాగా బెంగాలీ చిత్రం ‘నిర్బాక్’లో ప్రధాన పాత్ర పోషించనుంది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ జూలై 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఎక్కువ భాగం షూటింగ్ ముంబైలో జరుగుతుందని, మిగిలిన భాగం కోల్‌కతాతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.