Bengali film
-
లేటు వయసులో ప్రియురాలిని పెళ్లాడిన హీరో!
హిందీ, బెంగాలీ చిత్రాలలో ఫేమ్ తెచ్చుకున్న నటుడు పరంబ్రత ఛటర్జీ. తాజాగా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు పియా చక్రవర్తిని వివాహం చేసుకున్నారు. కోల్‌కతాలో జరిగిన వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే పియాకు ఇప్పటికే మ్యూజిషియన్ అనుపమ్ రాయ్‌తో పెళ్లయింది. ఇప్పుడు పరంబ్రత ఛటర్జీని ఆమె రెండో పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకు నిర్మాత, దర్శకురాలైన అరిత్రా సేన్ కూడా హాజరయ్యారు. బెంగాలీ సంప్రదాయంలో వీరి పెళ్లి జరిగింది. వివాహం తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ నిర్వహించనున్నారు. అయితే ఈ జంట తమ పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచారు. బెంగాలీ చిత్ర పరిశ్రమ నుంచి చాలా మందిని ఆహ్వానించలేదని తెలుస్తోంది. కాగా.. 43 ఏళ్ల పరంబ్రత, పియా కలిసి గత నెలలో తమ స్నేహితులతో కలిసి ఉన్న ఓ ఫోటోను పియా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. కొన్ని నెలల క్రితమే వీరిద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలను అవాస్తవమని ఛటర్జీ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. పియా, అనుపమ్ రాయ్ 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో పరంబ్రతతో ప్రేమలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూమర్స్ వినిపించాయి. పియా సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. ఇటీవలే వీరిద్దరు లండన్‌ను కూడా సందర్శించారు. ఛటర్జీ సినీ కెరీర్ బెంగాలీ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన పరంబ్రత 2012లో విద్యాబాలన్ సరసన కహానీ మూవీలో బాలీవుడ్ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత అరణ్యక్, జెహనాబాద్ - ఆఫ్ లవ్ అండ్ వార్, కౌన్ ప్రవీణ్ తాంబే , రాంప్రసాద్ కి తెహ్ర్వి, బుల్బుల్, ట్రాఫిక్, పరి సినిమాలు, షోలలో కనిపించారు. బెంగాలీ వెబ్ సిరీస్ ఫెలుడాలో ఫిక్షన్ డిటెక్టివ్, ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌గా నటించి ఫేమస్ అయ్యారు. -
నంబర్ 3
మళ్లీ బెంగాలీ డైలాగ్ పేపర్స్ పట్టుకున్నారు కథానాయిక శ్రద్ధాదాస్. ‘ది రాయల్ బెంగాల్ టైగర్ (2014), బాద్షా : ది డాన్ (2016)’ శ్రద్ధాదాస్ ఇంతకుముందు నటించిన బెంగాలీ చిత్రాలు. ‘‘టాలీవుడ్ (బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా టాలీవుడ్ అని పిలుస్తారు) బాద్షా జీత్ హీరోగా నటించనున్న సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నందుకు హ్యాపీగా ఉంది. గౌరవంగా ఫీల్ అవుతున్నాను’’ అని పేర్కొన్నారు శ్రద్ధా. ఇలా బెంగాలీలో మూడో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు శ్రద్ధా. ఈ సినిమాకు అన్షుమాన్ ప్రత్యూష్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ కోల్‌కతాలో ప్రారంభం అయ్యింది. రెండేళ్ల క్రితం ‘బాద్షా: ది డాన్’ చిత్రంలో స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు శ్రద్ధా అండ్ జీత్. మరి బెంగాలీ సినిమా తప్ప శ్రద్ధా చేతిలో సినిమాలు లేవా? అంటే అదేం లేదు. తమిళ, తెలుగు, కన్నడ సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇటీవలే ‘సోల్’ ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్‌తో డిజిటల్ రంగం వైపు కూడా అడుగు వేశారు శ్రద్ధా. ఇక ముంబైలో పుట్టినప్పటికీని శ్రద్ధాదాస్ తల్లిదండ్రులు బెంగాల్‌కి చెందినవారన్న విషయం తెలిసిందే. -
ముద్దుకి, దెబ్బకి తేడా తెలియనివారు..
కోల్‌కతా: సెన్సార్ బోర్డు తీరుపై ప్రముఖ దర్శకుడు అంజన్ దత్తా విరుచుకుపడ్డారు. అర్హతలేని వ్యక్తులను సెన్సార్ బోర్డు పదవుల్లో నియమించారని ధ్వజమెత్తారు. బెంగాలీ సినిమా 'సాహెబ్ బీబీ గులామ్' సహా పలు సినిమాల్లో సెన్సార్ బోర్డు పలు సీన్లు తొలగించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 'సెన్సార్ బోర్డులో అనర్హులకు పదవులిచ్చారు. చుంబనానికి, చెంపదెబ్బకు తేడా తెలియని వ్యక్తులు సెన్సార్ చేస్తున్నారు. సినిమా పరిజ్ఞానం లేనివారు సెన్సార్ బోర్డులో ఉన్నారు. చేతిలో కత్తెర ఉందని రెచ్చిపోతున్నారు. ఇష్టమొచ్చినట్టుగా సీన్లు తొలగిస్తున్నార'ని అంజన్ దత్తా మండిపడ్డారు. 'సాహెబ్ బీబీ గులామ్' సినిమాలో బీసీ పాత్రను ఎడిట్ చేయాలని చిత్ర దర్శకుడు ప్రతిమ్ డీ గుప్తాను రీజినల్ సెన్సార్ బోర్డు ఆదేశించింది. ఈ సినిమాలో రేప్ సీన్ తొలగించాలని సూచించింది. దీంతో దర్శకుడు ఎఫ్ సీఏటీనీ ఆశ్రయించడంతో చిన్నచిన్న కట్స్ తో సర్టిఫికెట్ ఇచ్చింది. ఆగస్టు చివరి వారంలో ఈ సినిమా విడుదలకానుంది. -
సుస్మిత మళ్లీ మెరవనుంది
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మళ్లీ తెరపై కనిపించనుంది. చివరిసారిగా ‘నో ప్రాబ్లం’ (2010)లో తెరపై కనిపించిన సుస్మితా, తాజాగా బెంగాలీ చిత్రం ‘నిర్బాక్’లో ప్రధాన పాత్ర పోషించనుంది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ జూలై 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఎక్కువ భాగం షూటింగ్ ముంబైలో జరుగుతుందని, మిగిలిన భాగం కోల్‌కతాతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.