లేటు వయసులో ప్రియురాలిని పెళ్లాడిన హీరో! | Actor Parambrata Chatterjee Marries Girlfriend Piya Chakraborty In Kolkata | Sakshi
Sakshi News home page

Marriage: విడాకులు తీసుకున్న ప్రియురాలిని పెళ్లాడిన హీరో!

Published Mon, Nov 27 2023 6:59 PM | Last Updated on Mon, Nov 27 2023 7:12 PM

Actor Parambrata Chatterjee Marries Girlfriend Piya Chakraborty In Kolkata - Sakshi

హిందీ, బెంగాలీ చిత్రాలలో ఫేమ్ తెచ్చుకున్న నటుడు పరంబ్రత ఛటర్జీ. తాజాగా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు పియా చక్రవర్తిని వివాహం చేసుకున్నారు. కోల్‌కతాలో జరిగిన వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే పియాకు ఇప్పటికే మ్యూజిషియన్ అనుపమ్ రాయ్‌తో పెళ్లయింది. ఇప్పుడు పరంబ్రత ఛటర్జీని ఆమె రెండో పెళ్లి చేసుకుంది. 

ఈ వేడుకకు నిర్మాత, దర్శకురాలైన అరిత్రా సేన్ కూడా హాజరయ్యారు. బెంగాలీ సంప్రదాయంలో వీరి పెళ్లి జరిగింది. వివాహం తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ నిర్వహించనున్నారు. అయితే ఈ జంట తమ పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచారు. బెంగాలీ చిత్ర పరిశ్రమ నుంచి చాలా మందిని ఆహ్వానించలేదని తెలుస్తోంది.

కాగా.. 43 ఏళ్ల పరంబ్రత, పియా కలిసి గత నెలలో తమ స్నేహితులతో కలిసి ఉన్న ఓ ఫోటోను పియా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. కొన్ని నెలల క్రితమే వీరిద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలను అవాస్తవమని ఛటర్జీ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. పియా, అనుపమ్ రాయ్ 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో పరంబ్రతతో ప్రేమలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూమర్స్ వినిపించాయి. పియా సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. ఇటీవలే వీరిద్దరు లండన్‌ను కూడా సందర్శించారు.

ఛటర్జీ సినీ కెరీర్

బెంగాలీ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన పరంబ్రత 2012లో విద్యాబాలన్ సరసన కహానీ మూవీలో బాలీవుడ్ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత అరణ్యక్, జెహనాబాద్ - ఆఫ్ లవ్ అండ్ వార్, కౌన్ ప్రవీణ్ తాంబే , రాంప్రసాద్ కి తెహ్ర్వి, బుల్బుల్, ట్రాఫిక్, పరి సినిమాలు, షోలలో కనిపించారు. బెంగాలీ వెబ్ సిరీస్ ఫెలుడాలో ఫిక్షన్ డిటెక్టివ్, ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌గా నటించి ఫేమస్ అ‍య్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement