Bengali Artist
-
లేటు వయసులో ప్రియురాలిని పెళ్లాడిన హీరో!
హిందీ, బెంగాలీ చిత్రాలలో ఫేమ్ తెచ్చుకున్న నటుడు పరంబ్రత ఛటర్జీ. తాజాగా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు పియా చక్రవర్తిని వివాహం చేసుకున్నారు. కోల్‌కతాలో జరిగిన వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే పియాకు ఇప్పటికే మ్యూజిషియన్ అనుపమ్ రాయ్‌తో పెళ్లయింది. ఇప్పుడు పరంబ్రత ఛటర్జీని ఆమె రెండో పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకు నిర్మాత, దర్శకురాలైన అరిత్రా సేన్ కూడా హాజరయ్యారు. బెంగాలీ సంప్రదాయంలో వీరి పెళ్లి జరిగింది. వివాహం తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ నిర్వహించనున్నారు. అయితే ఈ జంట తమ పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచారు. బెంగాలీ చిత్ర పరిశ్రమ నుంచి చాలా మందిని ఆహ్వానించలేదని తెలుస్తోంది. కాగా.. 43 ఏళ్ల పరంబ్రత, పియా కలిసి గత నెలలో తమ స్నేహితులతో కలిసి ఉన్న ఓ ఫోటోను పియా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. కొన్ని నెలల క్రితమే వీరిద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలను అవాస్తవమని ఛటర్జీ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. పియా, అనుపమ్ రాయ్ 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో పరంబ్రతతో ప్రేమలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూమర్స్ వినిపించాయి. పియా సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. ఇటీవలే వీరిద్దరు లండన్‌ను కూడా సందర్శించారు. ఛటర్జీ సినీ కెరీర్ బెంగాలీ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన పరంబ్రత 2012లో విద్యాబాలన్ సరసన కహానీ మూవీలో బాలీవుడ్ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత అరణ్యక్, జెహనాబాద్ - ఆఫ్ లవ్ అండ్ వార్, కౌన్ ప్రవీణ్ తాంబే , రాంప్రసాద్ కి తెహ్ర్వి, బుల్బుల్, ట్రాఫిక్, పరి సినిమాలు, షోలలో కనిపించారు. బెంగాలీ వెబ్ సిరీస్ ఫెలుడాలో ఫిక్షన్ డిటెక్టివ్, ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌గా నటించి ఫేమస్ అయ్యారు. -
దృశ్యం నటి సీమంతం.. సందడి చేసిన టాలీవుడ్ హీరోయిన్!
బాలీవుడ్ భామ ఇషితా దత్తా తెలుగు సినిమా చాణక్యుడుతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత బుల్లితెరపై ఎక్కువగా కనిపించిన భామ హిందీలో తెరకెక్కిన దృశ్యం-2 చిత్రంలోనూ నటించింది. జార్ఖండ్‌కు చెందిన ముద్దుగుమ్మ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఇటీవలే ప్రెగ్నెన్సీ ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ నటి బేబీ షవర్ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంది. తాను బెంగాలీ కావడంతో వారి సంప్రదాయంలో సీమంతం జరుపుకున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇషితా తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'గుంటూరు కారం'లో హాట్ బ్యూటీ.. బిగ్ అప్డేట్ రివీల్ చేసేసింది) ఇషితా తన ఇన్‌స్టాలో రాస్తూ..'షాద్ వేడుక' మా అమ్మ నా కోసం నిర్వహించిన బెంగాలీ బేబీ షవర్…నాకు ఇది ఎంతో స్పెషల్. అంతే కాదు నా జీవితంలో ఉత్తమమైనది. ఇది మా అమ్మ ఆశీర్వాదంగా భావిస్తున్నా.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ వేడుకలో సన్నిహితులు, ఫ్రెండ్స్ పాల్గొన్నారు. ఇషితాకు బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా బేబీ షవర్లో సందడి చేసింది. సీమంతంలో పాల్గొన్న పలువురు తారలు ఇషితా దత్తాను ఆశీర్వదించారు. కాగా.. ప్రస్తుతం ఇషితా దత్తా ఏక్ ఘర్ బనావూంగా అనే షోలో నటిస్తోంది. (ఇది చదవండి: లాల్ దర్వాజ అమ్మవారికి బంగారు బోనమెత్తిన బేబీ హీరోయిన్) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
సింగర్ కుటుంబంలో విషాదం.. నెలలు నిండిన కూతురు కన్నుమూత
బెంగాలీ 'సరిగమప' షో రన్నర్ సింగర్ ఆల్బర్ట్ కబో లెప్చ ఇంట విషాదం చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన కూతురు ఎవెలిన్ అర్ధాంతరంగా తనువు చాలించింది. అస్వస్థతకు లోనవడంతో చిన్నారిని కోల్‌కతాలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స తీసుకుంటూ ప్రాణాలు విడిచింది. దీంతో అతడి కుటుంబం శోకసంద్రంలో ముగినిపోయింది. ఏడాది కూడా నిండని కూతురు ఇక లేదనే బాధను జీర్ణించుకోలేకపోతున్న ఆల్బర్ట్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తన కూతురు చనిపోయిందన్న వార్తను ఆల్బర్ట్ సోషల్ మీడియాలో ధృవీకరించాడు. పసిపాప మరణవార్త విని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆల్బర్ట్ కబో లెప్చ విషయానికి వస్తే.. అతడి గొంతు నుంచి వెలువడే సుమధుర గీతాలకు ఎంతోమంది అభిమానులు ఉన్నాయి. అతడు సరిగమప షూటింగ్‌కు కూడా పలుసార్లు తన భార్య పూజా ఛెత్రితో పాటు కూతురిని వెంటేసుకుని వచ్చేవాడు. ఈ షోలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. చదవండి: మెహబూబ్ ఇంట షాదీ వేడుకలు -
ప్రముఖ సింగర్ కన్నుమూత
ప్రముఖ బెంగాలీ గాయని సుమిత్రాసేన్ (89) ఇవాళ కన్నుమూశారు. తీవ్రమైన అనారోగ్యానికి గురైన ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె శ్రబానీ సేన్ తన ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. సుమిత్రా సేన్ చాలా ఏళ్లుగా ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె పరిస్థితి క్షీణించడంతో డిసెంబర్ 29న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఆమె తీవ్రమైన బ్రోంకోప్ న్యుమోనియా వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. 2012లో బెంగాలీ సంగీత పరిశ్రమకు ఆమె చేసిన కృషికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంగీత మహా సమ్మాన్ అవార్డును అందించింది. తర్వాత కూడా రవీంద్ర సంగీత వారసత్వాన్ని ఆమె కొనసాగిస్తూ వచ్చారు. తన పాటల ద్వారా ఆ వారసత్వాన్ని సజీవంగా ఉంచినందుకు సుమిత్రా సేన్‌కు ఈ గౌరవం లభించింది. ఆమె 'మేఘ్ బోలేచే జబో జబో', 'తోమారీ జర్నతలర్ నిర్జోనే', 'సఖి భబోనా కహరే బోలే', 'అచ్ఛే దుఖో అచ్ఛే మృత్యు' వంటి కొన్ని ప్రసిద్ధ రవీంద్ర సంగీతాలను పాడింది. -
దివంగత సింగర్ కేకేకు క్షమాపణలు.. ఎలాంటి శత్రుత్వం లేదు
Bengali Singer Rupankar Bagchi Issues Apology To KK After Criticised: ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (53) మరణంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర శోకంలో మునిగిపోయింది. వివిధ భాషల్లో కలుపుకుని సుమారు 800కు పైనే పాటలు పాడిన ఆయన మే 31 రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన తర్వాత గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోని ఆయన అనేక భాషల్లో పాడి అందరి మనసులను గెలుచుకున్నారు. ఆయన మృతి పట్ల యావత్ సినీ లోకం సంతాపం తెలియజేసింది. అయితే ప్రముఖ బెంగాలీ గాయకుడు, గేయ రచయిత రూపాంకర్ బగ్చీ మాత్రం 'ఎవరు ఈ కేకే, ప్రాంతీయ సింగర్లను ప్రోత్సహించాలి' అంటూ వీడియో రూపంలో తన అక్కసును వెళ్లగక్కిన విషయం విదితమే. ఆయన మాటలకు అనేక మంది నెటిజన్స్ దుమ్మెత్తిపోశారు. అయితే తాజాగా రూపాంకర్ ఈ విషయంపై కేకేకు అతని కుటుంబానికి క్షమాపణలు తెలిపాడు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ నిర్వహించి బహిరంగంగా క్షమాపణలు కోరాడు. తను పోస్ట్ చేసిన వీడియోను కూడా డిలీట్ చేసినట్లు పేర్కొన్నాడు. 'కేకే కుటుంబానికి, నా వ్యాఖ్యలతో బాధపడిన ప్రతి ఒక్కరికీ చెప్పాలనుకుంటున్నాను. కేకేతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. బెంగాలీ పరిశ్రమకు చెందిన వారి కంటే దక్షిణ, పశ్చిమ భారతదేశానికి చెందిన గాయకులకు ఎక్కువ ప్రేమ, గుర్తింపు లభిస్తుందని మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. చదవండి: కేకే ఎవరు? మాలాంటి గొప్ప సింగర్లు మీ కళ్లకు కనిపించడం లేదా? ఇంత విద్వేశానికి గురవుతారని ఊహించలేదు. నా భార్యకు కూడా బెదిరింపు మెస్సేజ్‌లు వస్తున్నాయి. అందుకే కేకే కుటుంబ సభ్యులకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ వీడియోను కూడా డిలీట్ చేశాను. కేకే ఇప్పుడు ఎక్కడ ఉన్న దేవుడు ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని ప్రెస్మీట్లో రూపాంకర్ బగ్చీ తెలిపాడు. -
కేకే ఎవరు? మాలాంటి గొప్ప సింగర్లు మీ కళ్లకు కనిపించడం లేదా?
సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. కానీ ఆయన గొంతు సవరించుకుని పాడే పాటలకు దేశమే ఫిదా అయింది. సౌత్ నుంచి నార్త్ దాకా ఎన్నో భాషల్లో పాటలు పాడి అందరి మనసులు గెలుచుకున్నారు. ప్రేమగీతాల కంటే విరహ గీతాలతోనే బాగా పాపులర్ అయ్యారు. కానీ అర్ధాంతరంగా ఆయన గొంతు మూగబోయింది. సింగర్ కేకే అలియాస్ కృష్ణకుమార్ కున్నాత్ (53) మంగళవారం రాత్రి కోల్‌కతా ప్రదర్శన తర్వాత గుండెపోటుతో కన్నుమూశారు. కేకే మృతి చెందడానికి కొన్ని గంటల ముందు బెంగాలీకి చెందిన సింగర్ రూపాంకర్ బగ్చీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అసలు కేకే ఎవరు? ఆయన్ను కీర్తిస్తున్నారెందుకు? మాలాంటి గొప్ప సింగర్లు మీ కళ్లకు కనిపించడం లేదా? అంటూ ఫేస్బుక్ లైవ్‌లో మండిపడ్డాడు. దీంతో ఈయన శాపనార్థాలే కేకే మృతికి కారణమయ్యాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఫేస్బుక్ లైవ్‌లో రూపాంకర్ మాట్లాడుతూ.. 'కోల్‌కతాలో కేకే షో ఉందనగానే ఎక్కడలేని ఎగ్జయిట్మెంట్ కనిపిస్తోంది. నేను, అనుపమ్ రామ్, సోమత, ఎమాన్ చక్రవర్తి, ఉజ్జయినీ ముఖర్జీ, కాక్టస్, ఫాజిల్స్, రూపమ్ ఇస్లామ్.. ఇంకా మరెందరో కోల్‌కతాకు చెందిన ఆర్టిస్టులు కేకే కంటే బాగా పాడతారు. మరి మా గురించి మీరెందుకు అంత ఎగ్జయిట్ అవరు? కారణమేంటో చెప్పండి. అసలు కేకే ఎవరు? అలాంటి వాళ్లకంటే మేము చాలా చాలా బాగా పాడతాం. నేను పైన చెప్పిన వారందరూ కేకే కంటే ఉత్తమంగా ఆలపించేవాళ్లే. దయచేసి ప్రాంతీయ గాయకులను ప్రోత్సహించండి. బెంగాలీవాసులుగా మసులుకోండి' అని చెప్తూ లైవ్ ముగించాడు. ఈ లైవ్ జరిగిన కాసేపటికే కేకే మరణించడంతో అతడి ఫ్యాన్స్ రూపాంకర్పై ఫైర్ అవుతున్నారు. 'మరీ అంత అసూయనా, మీ శాపనార్థాల వల్లే ఆయన ఉసురు పోయింది', 'నిన్ను జైల్లో వేయాలి' అంటూ ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై రూపాంకర్ స్పందిస్తూ.. తాను కేవలం బెంగాలీ సంగీత సాహిత్యాన్ని ఆదరించకుండా పోతున్న ధోరణిపైనే ఆవేదన వ్యక్తం చేశానని కానీ అందరూ కేకే గురించి అన్నమాటలనే పట్టించుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. చదవండి: సింగర్ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి.. సింగర్ కేకే మృతిపై అనుమానాలు.. ముఖంపై గాయాలు! -
మనోరంజితం పటచిత్రం
వేలాది శ్లోకాల్లో ఇమిడి ఉన్న రామాయణ, మహాభారతాలను తన ప్రతిభతో చిత్రరూపం ఇచ్చి మన ముందుంచారు బెంగాలీ ఆర్టిస్ట్ రంజిత్ చిత్రకార్. పటచిత్ర ప్రతిభతో రామాయణానికి చిత్ర రూపం ఇస్తూ 45 షీట్లలో బంధించారు. అంతే మనోరంజకంగా మహాభారతాన్ని చిత్రరాజంగా మలచారు. బంజారాహిల్స్‌లోని ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో సోమవారం మొదలైన ‘పటచిత్ర’ ప్రదర్శన అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ నెల 14 వరకు జరుగుతున్న ఎగ్జిబిషన్లో ఎయిడ్స్ నియంత్రణ, అడవుల సంరక్షణ వంటి సామాజిక అంశాలపై కూడా చిత్రాలు కొలువు దీరాయి. ‘పదేళ్ల వయసు నుంచే పటచిత్ర ఆర్ట్ నేర్చుకున్నాను. కఠోర సాధనతోనే ఈ రంగంలో పేరు సాధించగలిగాను. శాంతినికేతన్ విశ్వభారతి యూనివర్సిటీ, లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఢాకా యూనివర్సిటీ, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్‌లలో నా ఆర్ట్ కలెక్షన్స్ ఉన్నాయి. నా ఇద్దరు కుమారులు కూడా పటచిత్ర పెయింటింగ్ చేస్తున్నార’ని కుంచెకారుడు రంజిత్ చిత్రకార్ తెలిపారు. వాంకె శ్రీనివాస్ రంగుల కళ మదిలోని అందమైన ఊహలకు రంగులు అద్దితే.. కలలకు రూపమిచ్చి కళాఖండాలుగా కళ్లముందు పెడితే.. ఎంత అద్భుతం..! ఇలాంటి అందమైన అద్భుతమే మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ఆర్ట్స్ కళాశాలలో పూర్వ విద్యార్థులు ఆవిష్కరించారు. ‘మిలాంజ్’ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనలో మరో లోకాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 7న ప్రారంభమైన ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ పలువురిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇదే కళాశాలలో పెయింటింగ్ ఓనమాలు దిద్ది, పేరొందిన ఫైన్ఆర్ట్స్ కళాశాలల్లో మాస్టర్స డిగ్రీలు పొంది అంతా కలసి ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మండుతున్న అగ్గిపుల్లపై పెద్దపులి, పూలకుండిలోని మొక్క ఆకును అందుకునేందుకు ప్రయత్నిస్తున్న జిరాఫీ.. సీతాకోక చిలుక ఏనుగును పట్టుకుని ఎగిరిపోవడం.. వంటి ఎన్నో చిత్రాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.