
బెంగాలీ 'సరిగమప' షో రన్నర్ సింగర్ ఆల్బర్ట్ కబో లెప్చ ఇంట విషాదం చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన కూతురు ఎవెలిన్ అర్ధాంతరంగా తనువు చాలించింది. అస్వస్థతకు లోనవడంతో చిన్నారిని కోల్‌కతాలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స తీసుకుంటూ ప్రాణాలు విడిచింది. దీంతో అతడి కుటుంబం శోకసంద్రంలో ముగినిపోయింది. ఏడాది కూడా నిండని కూతురు ఇక లేదనే బాధను జీర్ణించుకోలేకపోతున్న ఆల్బర్ట్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు.
తన కూతురు చనిపోయిందన్న వార్తను ఆల్బర్ట్ సోషల్ మీడియాలో ధృవీకరించాడు. పసిపాప మరణవార్త విని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆల్బర్ట్ కబో లెప్చ విషయానికి వస్తే.. అతడి గొంతు నుంచి వెలువడే సుమధుర గీతాలకు ఎంతోమంది అభిమానులు ఉన్నాయి. అతడు సరిగమప షూటింగ్‌కు కూడా పలుసార్లు తన భార్య పూజా ఛెత్రితో పాటు కూతురిని వెంటేసుకుని వచ్చేవాడు. ఈ షోలో అతడు రెండో స్థానంలో నిలిచాడు.
చదవండి: మెహబూబ్ ఇంట షాదీ వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment