ప్రముఖ బెంగాలీ గాయని సుమిత్రాసేన్ (89) ఇవాళ కన్నుమూశారు. తీవ్రమైన అనారోగ్యానికి గురైన ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె శ్రబానీ సేన్ తన ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. సుమిత్రా సేన్ చాలా ఏళ్లుగా ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె పరిస్థితి క్షీణించడంతో డిసెంబర్ 29న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు.
ఆమె తీవ్రమైన బ్రోంకోప్ న్యుమోనియా వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. 2012లో బెంగాలీ సంగీత పరిశ్రమకు ఆమె చేసిన కృషికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంగీత మహా సమ్మాన్ అవార్డును అందించింది. తర్వాత కూడా రవీంద్ర సంగీత వారసత్వాన్ని ఆమె కొనసాగిస్తూ వచ్చారు. తన పాటల ద్వారా ఆ వారసత్వాన్ని సజీవంగా ఉంచినందుకు సుమిత్రా సేన్‌కు ఈ గౌరవం లభించింది. ఆమె 'మేఘ్ బోలేచే జబో జబో', 'తోమారీ జర్నతలర్ నిర్జోనే', 'సఖి భబోనా కహరే బోలే', 'అచ్ఛే దుఖో అచ్ఛే మృత్యు' వంటి కొన్ని ప్రసిద్ధ రవీంద్ర సంగీతాలను పాడింది.
Comments
Please login to add a commentAdd a comment