sumitra
-
ప్రముఖ సింగర్ కన్నుమూత
ప్రముఖ బెంగాలీ గాయని సుమిత్రాసేన్ (89) ఇవాళ కన్నుమూశారు. తీవ్రమైన అనారోగ్యానికి గురైన ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె శ్రబానీ సేన్ తన ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. సుమిత్రా సేన్ చాలా ఏళ్లుగా ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె పరిస్థితి క్షీణించడంతో డిసెంబర్ 29న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఆమె తీవ్రమైన బ్రోంకోప్ న్యుమోనియా వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. 2012లో బెంగాలీ సంగీత పరిశ్రమకు ఆమె చేసిన కృషికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంగీత మహా సమ్మాన్ అవార్డును అందించింది. తర్వాత కూడా రవీంద్ర సంగీత వారసత్వాన్ని ఆమె కొనసాగిస్తూ వచ్చారు. తన పాటల ద్వారా ఆ వారసత్వాన్ని సజీవంగా ఉంచినందుకు సుమిత్రా సేన్‌కు ఈ గౌరవం లభించింది. ఆమె 'మేఘ్ బోలేచే జబో జబో', 'తోమారీ జర్నతలర్ నిర్జోనే', 'సఖి భబోనా కహరే బోలే', 'అచ్ఛే దుఖో అచ్ఛే మృత్యు' వంటి కొన్ని ప్రసిద్ధ రవీంద్ర సంగీతాలను పాడింది. -
సెప్టెంబర్‌లో చెన్నై టూ సింగపూర్
తమిళసినిమా: చెన్నై టూ సింగపూర్ చిత్రం సెప్టెంబర్‌లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇందులో విశేషం ఏమిటంటే సంగీతదర్శకుడు జిబ్రాన్ ఈ చిత్రం కోసం సంగీత బాణీలను ప్రయాణంలో చెన్నై నుంచి సింగపూర్ వరకూ పయనిస్తూ కట్టారు. అదేవిధంగా ఈ చిత్రం నిర్మాణంలో ఒక భాగం అయ్యారు కూడా. కాగా కంబ్యాక్ పతాకంపై కే.అనంతన్ నిర్మించిన ఈ చిత్రానికి షబ్బీర్ సహ నిర్మాతగా వ్యవహరించారు. అబ్బాస్ అక్బర్ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించిన ఇందులో గోకుల్ఆనంద్, అంజుకురియన్, రాజేశ్బాలచంద్రన్, శివకేవ్, కవితైకుందర్ ఎంసీ.జెస్సీ, సుమిత్ర ముఖ్య పాత్రలను పోషించారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చెన్నై టూ సింగపూర్ చిత్ర వివరాలను తెలిపేందుకు చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అబ్బాస్ అక్బర్ తెలుపుతూ చిత్రాన్ని 30 శాతం సింగపూర్‌లో చిత్రీకరించామని, మొత్తం చిత్రాన్ని 65 రోజుల్లో పూర్తి చేశామని తెలిపారు. అయితే ముందుగానే అన్ని శాఖల్లోనూ రిహార్సల్ చేసుకుని షూటింగ్‌కు వెళ్లామని చెప్పారు. చిత్రం చూసిన ప్రేక్షకులు ఆధ్యంతం నవ్వుకుని ఆ తరువాత తమ సమస్యలన్నీ మరచిపోతారని అన్నారు. సంగీతదర్శకుడు జిబ్రాన్ మాట్లాడుతూ చిత్రం సంతృప్తిగా వచ్చినా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న భయం ఉండేదన్నారు. అయితే రెండు రోజుల కిందట కొందరు విద్యార్థులకు సినీ ప్రముఖులకు చూపించామని, వారి స్పందన చూసి చిత్ర విజయంపై నమ్మకం ఏర్పడిందని అన్నారు. చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. -
వికారాబాద్ జిల్లాలో విషాదం
పూడూరు(వికారాబాద్): వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో సతమతమవుతున్న భార్యాభర్తలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని పూడూరు మండలం అంగడిచట్టంపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంగయ్య(45), సుమిత్ర(40) దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యాభర్తలు వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని అంబులెన్స్ సాయంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతిచెందారు. జంగయ్య గతంలో రెండు వివాహాలు కాగా.. ఇద్దరు భార్యలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సుమిత్ర జంగయ్యకు మూడో భార్య. వీరిద్దరి మృతితో జంగయ్య మొదటి భార్య ఇద్దరు పిల్లలు, రెండో భార్య ఇద్దరు పిల్లలు, సుమిత్ర కూతురు అనాథలుగా మారారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'అటు వెళ్తే.. సుమిత్ర ఇంటికి వెళ్లిరండి'
వర్షాకాలం మొదలైన తొలిరోజుల్లో సాయంత్రం వేళ ఇంట్లో టీ తాగుతుండగా.. అకస్మాత్తుగా ఓ స్టార్ హీరోయిన్ మనింట్లోకి వచ్చి మనతో కలిసి టీ తాగితే ఎలా ఉంటుంది? పగటి కలలా ఉంటుంది కదా! సుమిత్రకు కూడా అచ్చంగా అలానే ఉందట. అసలు కలే కనలేదు.. కానీ నిజమయ్యిందంటూ తెగ సంబరపడుతోంది. ఇంతకీ ఏం జరిగింది? అందాల చందమామ కాజల్ అగర్వాల్ తమిళనాడులోని నీలగిరికి ఓ తమిళ సినిమా షూటింగ్ కు వెళ్లింది. షూటింగ్ విరామంలో ఆ పక్కనే ఉన్న కొల్లిమలై గ్రామంలో తిరుగుతూ.. అక్కడ ఓ చిన్న బడ్డీ కొట్టు నడుపుతున్న సుమిత్ర ఇంటికి వెళ్లింది. తెర మీద కనిపించే తార సరాసరి ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చేసరికి సుమిత్ర ఆనందానికి అవధుల్లేవు. తన కళ్లను తనే నమ్మలేకపోయిందట. ఆ తర్వాత కాస్త తేరుకుని.. వెంటనే వేడి వేడి టీ పెట్టి కాజల్‌కు అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చేసింది. వారు చూపించిన అభిమానానికి ముగ్ధురాలైన కాజల్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేసుకుంది. అపురూపమైన క్షణాలు అనుకోకుండానే జరుగుతాయని, ఇలాంటిదేదైనా జరుగుతుంది అని అస్సలు ఊహించనివారికి ఏదైనా చేయడంలో బోలెడంత సంతోషం ఉంటుందని చెప్తూ అక్కడ దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది కాజల్. అటు వెళ్లినప్పుడు మీరు కూడా సుమిత్ర ఇంటికి వెళ్లిరండంటూ ట్వీట్ చేసింది. వెళ్తారా మరి. The best moments always happen unexpectedly, Happiness is doing something for someone who… https://t.co/LEqGefXAOJ — Kajal Aggarwal (@MsKajalAggarwal) 24 June 2016 That is Sumitras house in Kollimalai village, nilgiris. Do visit her when you'll are around.… https://t.co/uj42CAdVLy — Kajal Aggarwal (@MsKajalAggarwal) 24 June 2016 -
సుమిత్ర ప్రాణం తీసిన చైన్ స్నాచింగ్
సాక్షి, హైదరాబాద్: భర్త శ్రీహరి పెరాలసిస్ వ్యాధితో మంచం పట్టాడు. పెద్ద కుమారుడు వంశీ డిగ్రీ పూర్తి చేసినా జాబ్ రాలేదు. చిన్న కుమారుడు నల్లకుంటలోని సెయింట్ పాట్రిక్స్ కాలేజీలో ఎంబీఏ తొలి సంవత్సరం చదువుతున్నాడు. కూతురు కోమల్ కాచిగూడలోని నృపతుంగ డిగ్రీ కాలేజీ బీకామ్ ఫస్టియర్ చదువుతోంది. వీరందరికీ ఆర్ధికంగా అండదండలు ఇస్తున్న అమ్మ సుమిత్ర ఓ దొంగ చేతిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూసింది. సేవలు చేసే భార్య ఇక లేదన్న బాధతో శ్రీహరి... అలానాపాలనా చూసుకుంటున్న అమ్మ లేదన్న ఆవేదనతో పిల్లల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. ఇప్పటివరకు చైన్ స్నాచింగ్‌ల్లో బాధితులు గాయపడ్డ ఘటనలు ఉన్నా.. ఓ మహిళ మృతి చెందడం ఇదే తొలిసారి అని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. పట్టపగలే సుమిత్ర మెడలో నుంచి బంగారు గొలుసు లాగడమే కాకుండా నెట్టేసి ఆమె మృతికి కారకుడైన దొంగపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బర్కత్‌పురలో విషాదం.. హైదరాబాద్ బర్కత్‌పుర డివిజన్ సత్యానగర్ ప్రాంతానికి చెందిన పి.శ్రీహరి, సుమిత్ర భార్యాభర్తలు. శ్రీహరి తార్నాకలోని ఎన్ఐఎన్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్)లో అటెండర్‌గా పనిచేస్తుండేవాడు. ఆయనకి పెరాలసిస్ రావడంతో అతని స్థానంలో సుమిత్ర వెళ్లి పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఈ నెల 17న తార్నాకలోని ఎస్బీహెచ్ బ్యాంకులో తమ ఖాతాకు చెందిన వివరాలు తెలుసుకొని రావడానికి సుమిత్ర(45) చిన్నకుమారుడు సంజయ్‌తో కలసి బైక్‌పై వెళ్లింది. తార్నాక నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి పల్సర్‌బైక్‌పై వచ్చి సుమిత్ర మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును తెంచుకుని.. బైక్‌పైనుంచి పక్కకు నెట్టేసి పారిపోయాడు. బైక్‌పై నుంచి సుమిత్ర కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం కాచిగూడలోని సాయికృష్ణ న్యూరో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సుమిత్ర కుటుంబ సభ్యులకు అప్పగించారు. అసెంబ్లీలో మహిళల భద్రత అంశాన్ని లెవనెత్తుతాం... నగరంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, మహిళల భద్రతపై అసెంబ్లీలో కేసీఆర్ సర్కార్‌ను నిలదీస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేపీ శాసనసభపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్‌లు అన్నారు. సుమిత్ర కుటుంబ సభ్యులను శనివారం వారు పరామర్శించారు. చైన్స్నాచర్లను పట్టుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సుమిత్ర చైన్‌స్నాచింగ్‌కు గురై వారం రోజులు గడుస్తున్నా దొంగను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
ఆప్తురాలిగా వచ్చి.. శిశువు కిడ్నాప్
గాంధీ ఆస్పత్రి/తెనాలి రూరల్, న్యూస్‌లైన్: గాంధీ ఆస్పత్రిలో ఒక రోజు వయస్సు న్న శిశువు అపహరణకు గురయ్యాడు. రంగంలోకి దిగిన నార్త్‌జోన్ పోలీసులు సమయస్ఫూర్తి తో వ్యవహరించి ఏడు గంటల్లోనే కేసును ఛేదిం చారు. తెనాలి పోలీసుల సహకారంతో శిశువును రక్షించడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిలకలగూడ ఇన్స్పెక్టర్ బి.అంజయ్య కథనం ప్రకారం.. కడప జిల్లాకు చెందిన మనోహర్(37), చిత్తూరు జిల్లా పీలేరుకు చెంది న సుమిత్ర (28) ఐదేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకొని, బోరబండ శ్రీరాంనగర్‌లో ఉంటున్నా రు. గర్భవతి అయిన సుమిత్రను ప్రసవం కోసం శనివారం ఆస్పత్రిలో చేర్చగా, ఉదయం 11.36 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చిం ది. కొద్దిసేపటికి వైద్యు లు తల్లీబిడ్డల్ని పోస్ట్ ఆపరేటివ్ వార్డు యూనిట్-5కు తరలించారు. ఆప్తురాలిగా వచ్చి.. అదును చూసి కిడ్నాప్ బాలింతైన సుమిత్రకు సపర్యలు చేసేందుకు మహిళలు లేకపోవడం, మనోహర్‌ను వార్డులోకి రానీయక పోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ స్థితిలో భార్యను చూసిన మనోహర్ లేబర్‌వార్డు వద్ద రోదిస్తూ కూర్చున్నారు. అటుగా వచ్చిన ఓ మహిళ ‘అన్నా ఎందుకు ఏడుస్తున్నావు’ అంటూ ప్రశ్నించింది. విషయం చెప్పడంతో ‘నేనున్నాను’ అంటూ ఓదార్చి అతని చేతిలోని మందులు తీసుకుని సుమిత్ర వద్దకు వెళ్లిన ఆ మహిళ.. తనపేరు మరియమ్మ అలియాస్ కీర్తి (30) అని, మనోహర్ పంపించాడని పరిచయం చేసుకుంది. పూర్తి నమ్మకం కలిగేందుకు కొన్ని సపర్యలు కూడా చేసింది. వార్డులో కలియతిరుగుతూ హడావుడి చేసింది. శనివారం రాత్రంతా సుమిత్ర, శిశువులతో కలిసి ఉన్న ఆమె.. ఆదివారం తెల్లవారుజామున శిశువును తీసుకుని వైద్యుడికి చూపించి తీసుకువస్తానంటూ వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో సుమిత్ర విషయం భర్తకు చెప్పింది. ఆస్పత్రి మొత్తం గాలించినా ఫలితం లేకపోవడంతో మనోహర్ అక్కడి పోలీసు ఔట్‌పోస్టు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. వారి సాయంతో 8.30 గంటలకు చిలకలగూడ ఠాణాకు చేరుకుని ఇన్స్పెక్టర్ అంజయ్యను కలిశారు. సమయస్ఫూర్తితో.. మనోహర్ నుంచి నిందితురాలి వివరాలను సేకరించిన పోలీసులు.. ఇది కచ్చితంగా బయటి వారి పనేనని నిర్ధారణకు వచ్చారు. కిడ్నాప్ తర్వాత నగరం నుంచి పారిపోతారని అంచనాకు వచ్చిన పోలీసులు నార్త్‌జోన్ డీసీపీ జయలక్ష్మికి విషయం తెలిపారు. ఆమె ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు పంపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సై వీరబాబు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌ను పరిశీలించగా, కీలక ఆధారాలు లభించాయి. ఉదయం 6.19 గంటలకు ఓ మహిళ శిశువును ఎత్తుకొని స్టేషన్లోకి ప్రవేశించగా, వెనుక మరో వ్యక్తి టికెట్లతో వచ్చాడు. శిశువుతో ఉన్న మహిళను మనోహర్ గుర్తించాడు. వారిద్దరు 6.27కు రెండో నెంబర్ ప్లాట్‌ఫాం పైకి వచ్చినట్లు రికార్డు అయింది. అ ప్లాట్‌ఫామ్ నుంచి 7.10 గంటలకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ వెళ్లడంతో నిందితులు అదే ఎక్కి ఉంటారని అనుమానించారు. తక్షణమే స్పందించిన తెనాలి డీఎస్పీ.. రైలు తెనాలి మీదుగా వెళ్తోందని గుర్తించిన చిల కలగూడ పోలీసులు తెనాలి డీఎస్పీ వై.తులసీరామ్ప్రసాద్ను సంప్రదించి, విషయం వివరిం చారు. గతంలో నగరంలో సుదీర్ఘ కాలం పని చేసిన ప్రసాద్ తక్షణమే స్పందించి, తెనాలి త్రీ టౌన్‌తో పాటు ఆర్పీఎఫ్, జీఆర్పీలను అప్రమత్తం చేసి మొత్తం 30 మందిని ప్లాట్‌ఫాంకు ఇరువైపులా మోహరించారు. మధ్యాహ్నం 1.30కు రైలు తెనాలికి చేరుకోగానే అనువణువూ తనిఖీ చేశారు. డీ-1 బోగీలో ఉన్న నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని శిశువును రెస్క్యూ చేశారు. నిందితులైన కత్తిమండ్ల మేరీ (23), పంబా నవీన్ (18)లను త్రీ టౌన్ ఠాణాకు, శిశువును ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితులది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుగా తేలింది. నవీన్... మేరీ అక్క కుమారుడు. వీరు గతంలోనూ ఇలాంటి నేరాలు చేసినట్లు సమాచారం. అస్వస్థతకు గురైన శిశువును మెరుగైన వైద్యమందించేందుకు గుంటూ రు జిల్లా ఆస్పత్రికి తరలించాలని వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించా రు. 1.9 కిలోల బరువున్న శిశువును అంబులెన్స్‌లో తేవడం ప్రమాదకరమని, తల్లినే గుంటూ రు తరలించాలని భావించారు. అయితే బాలిం తకు రక్తస్రావం ఎక్కువ కావడంతో సోమవా రం గుంటూరు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందం బయల్దేరి వెళ్లింది. కాగా, మేరీ రెండ్రోజులుగా ఆస్పత్రి పరిసరాల్లో తిరుగుతూ శిశువును విక్రయిస్తారా? అంటూ సెక్యూరిటీ సిబ్బందిని వాకబు చేసినట్లు తెలిసింది. వారు అక్కడి నుంచి వెళ్లగొట్టగా, ఆప్తురాలిగా నటించి బాబుతో ఉడాయించినట్లు సమాచారం.