'అటు వెళ్తే.. సుమిత్ర ఇంటికి వెళ్లిరండి' | 'That is Sumitras house in Kollimalai village' tweets Kajal Aggarwal | Sakshi
Sakshi News home page

'అటు వెళ్తే.. సుమిత్ర ఇంటికి వెళ్లిరండి'

Published Fri, Jun 24 2016 4:38 PM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

'అటు వెళ్తే.. సుమిత్ర ఇంటికి వెళ్లిరండి'

'అటు వెళ్తే.. సుమిత్ర ఇంటికి వెళ్లిరండి'

వర్షాకాలం మొదలైన తొలిరోజుల్లో సాయంత్రం వేళ ఇంట్లో టీ తాగుతుండగా.. అకస్మాత్తుగా ఓ స్టార్ హీరోయిన్ మనింట్లోకి వచ్చి మనతో కలిసి టీ తాగితే ఎలా ఉంటుంది? పగటి కలలా ఉంటుంది కదా!  సుమిత్రకు కూడా అచ్చంగా అలానే ఉందట. అసలు కలే కనలేదు.. కానీ నిజమయ్యిందంటూ తెగ సంబరపడుతోంది. ఇంతకీ ఏం జరిగింది?

అందాల చందమామ కాజల్ అగర్వాల్ తమిళనాడులోని నీలగిరికి ఓ తమిళ సినిమా షూటింగ్ కు వెళ్లింది. షూటింగ్ విరామంలో ఆ పక్కనే ఉన్న కొల్లిమలై గ్రామంలో తిరుగుతూ.. అక్కడ ఓ చిన్న బడ్డీ కొట్టు నడుపుతున్న సుమిత్ర ఇంటికి వెళ్లింది. తెర మీద కనిపించే తార సరాసరి ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చేసరికి సుమిత్ర ఆనందానికి అవధుల్లేవు. తన కళ్లను తనే నమ్మలేకపోయిందట. ఆ తర్వాత కాస్త తేరుకుని.. వెంటనే వేడి వేడి టీ పెట్టి కాజల్కు అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చేసింది. వారు చూపించిన అభిమానానికి ముగ్ధురాలైన కాజల్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేసుకుంది.

అపురూపమైన క్షణాలు అనుకోకుండానే జరుగుతాయని, ఇలాంటిదేదైనా జరుగుతుంది అని అస్సలు ఊహించనివారికి ఏదైనా చేయడంలో బోలెడంత సంతోషం ఉంటుందని చెప్తూ అక్కడ దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది కాజల్. అటు వెళ్లినప్పుడు మీరు కూడా సుమిత్ర ఇంటికి వెళ్లిరండంటూ ట్వీట్ చేసింది. వెళ్తారా మరి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement