Ishita Dutta enjoys scrumptious food at her Baby Shower in Bengali culture - Sakshi
Sakshi News home page

Ishita Dutta: ఇషితా దత్తా బేబీ షవర్.. సోషల్ మీడియాలో వైరల్!

Published Mon, Jul 17 2023 12:28 PM | Last Updated on Mon, Jul 17 2023 12:38 PM

Ishita Dutta Celebrates Baby Shower In Bengali Culture - Sakshi

బాలీవుడ్ భామ ఇషితా దత్తా తెలుగు సినిమా చాణక్యుడుతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత బుల్లితెరపై ఎక్కువగా కనిపించిన భామ హిందీలో తెరకెక్కిన దృశ్యం-2 చిత్రంలోనూ నటించింది. జార్ఖండ్‌కు చెందిన ముద్దుగుమ్మ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఇటీవలే ప్రెగ్నెన్సీ ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

అయితే తాజాగా ఈ బాలీవుడ్ నటి బేబీ షవర్ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంది. తాను బెంగాలీ కావడంతో వారి సంప్రదాయంలో సీమంతం జరుపుకున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇషితా తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

(ఇది చదవండి: 'గుంటూరు కారం'లో హాట్‌ బ్యూటీ.. బిగ్‌ అప్‌డేట్‌ రివీల్‌ చేసేసింది)

ఇషితా తన ఇన్‌స్టాలో రాస్తూ..'షాద్ వేడుక' మా అమ్మ నా కోసం నిర్వహించిన బెంగాలీ బేబీ షవర్…నాకు ఇది ఎంతో స్పెషల్. అంతే కాదు నా జీవితంలో ఉత్తమమైనది. ఇది మా అమ్మ ఆశీర్వాదంగా భావిస్తున్నా.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ వేడుకలో సన్నిహితులు, ఫ్రెండ్స్ పాల్గొన్నారు. ఇషితాకు బెస్ట్ ఫ్రెండ్‌ అయిన హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా బేబీ షవర్‌లో సందడి చేసింది. సీమంతంలో పాల్గొన్న పలువురు తారలు ఇషితా దత్తాను ఆశీర్వదించారు. కాగా.. ప్రస్తుతం ఇషితా దత్తా ఏక్ ఘర్ బనావూంగా అనే షోలో నటిస్తోంది. 

(ఇది చదవండి: లాల్‌ దర్వాజ అమ్మవారికి బంగారు బోనమెత్తిన బేబీ హీరోయిన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement