Ishita Dutta
-
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. రివీల్ చేసిన భర్త!
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఇషితా దత్తా- వత్సల్ సేత్ ఒకరు. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్‌లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్‌ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ వాయు అనే కుమారుడు కూడా జన్మించాడు. గతంలో తన కుమారుడిని ఫేస్ రివీల్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది.అయితే ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె భర్త వత్సల్ సేత్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో బిడ్డను తమ ఇంటికి ఆహ్వానించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. '9 ఏళ్ల పరిచయం.. ఎనిమిదేళ్ల ప్రేమ.. గుర్తుగా ఓ చిన్న ప్రేమ.. త్వరలోనే మా హృదయాలు మళ్లీ కలవబోతున్నాయి' అంటూ వాలైంటైన్ డే రోజున పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం వత్సల్ సేత్ ఈ వార్తలను ధృవీకరించారు. ఇషితా రెండోసారి గర్భం ధరించడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందని.. అంతేకాకుండా చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇషిత నాకు ప్రెగ్నెన్సీ గురించి చెప్పినప్పుడు.. ఒక తండ్రిగా నేను సంతోషించానని తెలిపారు. కాగా.. ఇషితా దత్తా, వత్సల్ సేత్ 2017లో పెళ్లి చేసుకున్నారు. 'రిష్టన్ కా సౌదాగర్ - బాజీగర్' అనే టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. జూలై 19 2023న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.సినిమాల విషయానికొస్తే ఇషిత దత్తా చివరిసారిగా థ్రిల్లర్ చిత్రం 'దృశ్యం 2'లో కనిపించింది ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ చివరిగా 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్‌లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. హిందీలో దృశ్యం 1, దృశ్యం 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
ఇన్నాళ్లకు బాబును చూపించించిన బ్యూటీ.. 12 ఏళ్ల క్రితం తెలుగులో..
బాలీవుడ్ జంట ఇషితా దత్తా- వత్సల్ సేత్ వారం రోజులుగా ఆనందంలో మునిగి తేలుతున్నారు. కారణం.. వారి ముద్దుల బాబు ఏడాది బర్త్‌డే సెలబ్రేషన్స్. ఇన్నాళ్లుగా తన బాబు వాయు ముఖాన్ని ఎవరికీ చూపించకుండా దాస్తూ వస్తున్న ఇషితా ఎట్టకేలకు బుడ్డోడిని చూపించేసింది.అప్పుడే నీకు ఏడాది వయసా?హ్యాపీ బర్త్‌డే మై బేబీ.. అప్పుడే నీకు ఏడాది వయసు అంటే నమ్మలేకపోతున్నాను. అమ్మానాన్నగా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం.. నిజానికి జూలై 19న వాయు బర్త్‌డే.. కానీ సెలబ్రేషన్స్‌లో బిజీగా ఉండటంతో చాలా ఆలస్యంగా పోస్ట్ పెట్టాల్సి వచ్చింది అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. బాబును ఊయలలో ఆడిస్తున్న ఫోటోను సదరు పోస్టుకు జత చేసింది. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు వాయుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.తెలుగులో ఒకే ఒక్క సినిమాలోకాగా ఝార్ఖండ్‌లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. హిందీలో దృశ్యం 1, దృశ్యం 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది. రిష్తాన్ కా సౌధాగర్- బాజీఘర్ అనే సీరియల్లో తనతో పాటు నటించిన వత్సల్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. 2023 జూలై 19న వాయు అనే కుమారుడికి జన్మనిచ్చారు.చదవండి: అంతులేని వినోదానికి రెడీనా? బిగ్‌బాస్ 8 వీడియో షేర్ చేసిన నాగార్జున -
Ishita Dutta Latest Photos: దృశ్యం నటి ఇషితా దత్తా సీమంతం.. సందడి చేసిన హెబ్బా పటేల్! (ఫొటోలు)
-
దృశ్యం నటి సీమంతం.. సందడి చేసిన టాలీవుడ్ హీరోయిన్!
బాలీవుడ్ భామ ఇషితా దత్తా తెలుగు సినిమా చాణక్యుడుతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత బుల్లితెరపై ఎక్కువగా కనిపించిన భామ హిందీలో తెరకెక్కిన దృశ్యం-2 చిత్రంలోనూ నటించింది. జార్ఖండ్‌కు చెందిన ముద్దుగుమ్మ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఇటీవలే ప్రెగ్నెన్సీ ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ నటి బేబీ షవర్ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంది. తాను బెంగాలీ కావడంతో వారి సంప్రదాయంలో సీమంతం జరుపుకున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇషితా తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'గుంటూరు కారం'లో హాట్ బ్యూటీ.. బిగ్ అప్డేట్ రివీల్ చేసేసింది) ఇషితా తన ఇన్‌స్టాలో రాస్తూ..'షాద్ వేడుక' మా అమ్మ నా కోసం నిర్వహించిన బెంగాలీ బేబీ షవర్…నాకు ఇది ఎంతో స్పెషల్. అంతే కాదు నా జీవితంలో ఉత్తమమైనది. ఇది మా అమ్మ ఆశీర్వాదంగా భావిస్తున్నా.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ వేడుకలో సన్నిహితులు, ఫ్రెండ్స్ పాల్గొన్నారు. ఇషితాకు బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా బేబీ షవర్లో సందడి చేసింది. సీమంతంలో పాల్గొన్న పలువురు తారలు ఇషితా దత్తాను ఆశీర్వదించారు. కాగా.. ప్రస్తుతం ఇషితా దత్తా ఏక్ ఘర్ బనావూంగా అనే షోలో నటిస్తోంది. (ఇది చదవండి: లాల్ దర్వాజ అమ్మవారికి బంగారు బోనమెత్తిన బేబీ హీరోయిన్) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
Ishita Dutta: మదర్స్ డే నాకు ఎంతో ప్రత్యేకం..
-
దృశ్యం నటి సీమంతం వేడుక.. మదర్స్ డే సందర్బంగా ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ నటి ఇషితా దత్తా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో చాణక్యుడు సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో దృశ్యం సినిమాతో అరంగేట్రం చేసింది. అయితే 2017లో వాత్సల్ షేత్ను వివాహం చేసుకున్న ముద్దుగుమ్మ గర్భం ధరించినట్లు ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చింది. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు చెల్లెలుగా ఇండస్ట్రీకి పరిచయమైంది. (ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్) ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఇషితా దత్తా ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ మదర్స్ డే తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపింది. ఎందుకంటే ఈరోజే తన సీమంతం వేడుకలు జరుపుకోవడం తన జీవితంలో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేసింది. ఇషితా మాట్లాడుతూ..'ఈ ఏడాది మదర్స్ డే నాకు చాలా ప్రత్యేకం. నా బేబీ షవర్ ఈ రోజున జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా అమ్మ, అత్తతో కలిసి మదర్స్ డేని జరుపుకుంటున్నా. నా చిన్నప్పుడు మా అమ్మను కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేసేదాన్ని. ఏది ఏమైనా ఆమె నా కోసం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని' వివరించింది. కాగా.. మార్చి 2023లో గర్భం దాల్చినట్లు ప్రకటించింది ఇషితా. (ఇది చదవండి: పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్ వీళ్లే)