ఇన్నాళ్లకు బాబును చూపించించిన బ్యూటీ.. 12 ఏళ్ల క్రితం తెలుగులో.. | Actress Ishita Dutta Reveals His Son Vaayu's Face On His Birthday | Sakshi
Sakshi News home page

Ishita Dutta: పుట్టిన ఏడాదికి బాబు ముఖం చూపించిన టాలీవుడ్‌ బ్యూటీ

Jul 21 2024 2:08 PM | Updated on Jul 21 2024 3:26 PM

Actress Ishita Dutta Reveals His Son Vaayu's Face On His Birthday

బాలీవుడ్‌ జంట ఇషితా దత్తా- వత్సల్‌ సేత్‌ వారం రోజులుగా ఆనందంలో మునిగి తేలుతున్నారు. కారణం.. వారి ముద్దుల బాబు ఏడాది బర్త్‌డే సెలబ్రేషన్స్‌. ఇన్నాళ్లుగా తన బాబు వాయు ముఖాన్ని ఎవరికీ చూపించకుండా దాస్తూ వస్తున్న ఇషితా ఎట్టకేలకు బుడ్డోడిని చూపించేసింది.

అప్పుడే నీకు ఏడాది వయసా?
హ్యాపీ బర్త్‌డే మై బేబీ.. అప్పుడే నీకు ఏడాది వయసు అంటే నమ్మలేకపోతున్నాను. అమ్మానాన్నగా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం.. నిజానికి జూలై 19న వాయు బర్త్‌డే.. కానీ సెలబ్రేషన్స్‌లో బిజీగా ఉండటంతో చాలా ఆలస్యంగా పోస్ట్‌ పెట్టాల్సి వచ్చింది అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. బాబును ఊయలలో ఆడిస్తున్న ఫోటోను సదరు పోస్టుకు జత చేసింది. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు వాయుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తెలుగులో ఒకే ఒక్క సినిమాలో
కాగా ఝార్ఖండ్‌లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. హిందీలో దృశ్యం 1, దృశ్యం 2 , ఫిరంగి, బ్లాంక్‌ వంటి చిత్రాల్లో నటించింది. రిష్తాన్‌ కా సౌధాగర్‌- బాజీఘర్‌ అనే సీరియల్‌లో తనతో పాటు నటించిన వత్సల్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. 2023 జూలై 19న వాయు అనే కుమారుడికి జన్మనిచ్చారు.

చదవండి: అంతులేని వినోదానికి రెడీనా? బిగ్‌బాస్‌ 8 వీడియో షేర్‌ చేసిన నాగార్జున

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement