bengali
-
అల్లు అర్జున్ 'పుష్ప-2'.. మొదటిసారి ఆ భాషలోనూ!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పుష్ప ఫీవర్ మొదలైపోయింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ మూవీ కోసం వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పుష్ప-2 మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందు ప్రకటించిన డేట్ కంటే ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 5వ తేదీనే పుష్ప-2 విడుదల కానుందని మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించారు.అయితే పుష్ప-2 మూవీని ఎప్పటిలాగే దక్షిణాది రాష్ట్రాలతో పాటు హిందీలోనూ ఓకేసారి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కేరళ, కర్ణాటక, తమిళనాడుతో పాటు బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ సంస్థలకు అప్పగించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్స్ సైతం హైదరాబాద్ ప్రెస్ మీట్‌కు హాజరయ్యారు.(ఇది చదవండి: జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పుష్ప-2 మేకర్స్!)అయితే పుష్ప-2 చిత్రాన్ని తొలిసారిగా బెంగాలీ భాషలోనూ విడుదల చేస్తున్నారు. బెంగాలీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ ఏఏ ఫిల్స్మ్ అధినేత అనిల్ తడానీ సొంతం చేసుకున్నారు. పుష్ప-2 అన్ని రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నట్లు అనిల్ తడానీ తెలిపారు. ఆయన గతంలో పలు బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అనుభవం ఉంది. దీంతో పుష్పరాజ్ మొదటిసారిగా బెంగాలీ ఫ్యాన్స్‌ను అలరించనున్నారు. హిందీలోనూ అనిల్ తడానీ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ సందర్భంగా అనిల్ తడాని మాట్లాడుతూ.."పుష్ప -2ని విడుదల చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో హిందీలో బాహుబలి, కేజీఎఫ్ కూడా రిలీజ్ చేశాం. పుష్ప పార్ట్- 1 కూడా రిలీజ్ మేమే తీసుకున్నాం. ఇప్పుడు పార్ట్ -2 కూడా అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టి హిస్టరీ క్రియేట్ చేస్తుంది' అని అన్నారు. '#Pushpa2TheRule will shatter all records and create history' - distributor #AnilThadani of @AAFilmsIndia 💥GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER, 2024.Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial @AAFilmsIndia… pic.twitter.com/omHran3GBC— Mythri Movie Makers (@MythriOfficial) October 24, 2024 -
బెంగాలీ కూలీలకు అస్వస్థత
కరప: బతుకుదెరువు కోసం కాకినాడ జిల్లాకు వచ్చిన 12మంది పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. వీరు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లా కరప ఎస్ఐ టి.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... కరప మండలం యండమూరు శివారు వడ్డిపాలెంలో జంపన కిరణ్‌రాజు, మరో ఇద్దరు యజమానులకు చెందిన రొయ్యల చెరువుల వద్ద పని చేసేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి 12మంది కూలీలు షేక్ సలీం, అజీద్, నియోరుద్దీన్, అమనుల్లా, ఫారూక్, కలిపటి ముండ్, ఫ్రాడాస్, సాంతూల్, ఫైజప్, అన్వర్, సలుద్దీన్, మీనుదీన్ వచ్చారు. వారంతా రెండు వారాలుగా చెరువుల వద్దే ఉంటూ పని చేస్తున్నారు. పెద్ద డ్రమ్ముల్లో మంచి నీరు నిల్వ చేసుకుని, వాటినే తాగడానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. కూలీలు శనివారం ఉదయం డ్రమ్ములో ఉంచిన నీటిని తాగడంతో వాంతులయ్యాయి. దీనిపై చెరువుల వద్ద పని చేస్తున్న గుమస్తా వెంటనే యజమాని కిరణ్రాజుకు సమాచారం అందించడంతో ఆయన వచ్చి ఆరా తీయగా, గడ్డి మందు కలిపిన డ్రమ్ములోని నీటిని తాగినట్టు కూలీలు తెలిపారు. గడ్డి మందు కలిపిన డ్రమ్ము నీరు లేకుండా ఖాళీగా ఉంది. దీనిపై ప్రశ్నించగా, ఆ నీటిని పారబోసి కడిగేశామని కూలీలు తెలిపారు. వాంతులు చేసుకుని, అస్వస్థతకు గురైన కూలీలందరినీ వెంటనే చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం వీరిలో ఇద్దరికి ఎక్కువగా వాంతులు అవుతున్నాయని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు కిరణ్‌రాజు కరప పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ రామకృష్ణ వడ్డిపాలెంలోని చెరువుల వద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. బెంగాలీ కూలీలు నెల రోజులు పని చేయడానికి వచ్చారని, మధ్యలో పని మానేసి వెళ్లిపోవడానికి ఇటువంటి ఎత్తుగడలు వేస్తుంటారని, గతంలో కాండ్రేగుల చెరువుల వద్ద కూడా ఇలాగే జరిగిందని కిరణ్‌రాజు వివరించారు. నిజంగా గడ్డిమందు కలిపిన నీరు తాగారా, విష ప్రభావం ఏమైనా ఉందా.. అని తేల్చేందుకు కూలీలకు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నారు. -
త్రీ సాంగ్మం
ఒక భాషలో మొదలైన పాట ఆ భాషలోనే ఆగిపోతుంది. అయితే ఈ పాట విషయంలో అలా జరగలేదు. మలయాళంలో మొదలైన పాట హిందీలోకి వచ్చింది. ఆ తరువాత బెంగాలీలోకి వచ్చి ఎండ్ అయింది.ఎక్కడా కృత్రిమత్వం అనిపించదు. హాయిగా వినాలనిపిస్తుంది. మ్యాటర్‌లోకి వస్తే... స్మితాదేవ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ‘ఎడక్కడ్ బెటాలియన్’ అనే మలయాళ సినిమాలోని ‘ఎన్ జీవనే’ పాటను మూడు భాషల్లో చక్కగా పాడింది. స్మిత గొంతుకకు, ఆమె మల్టీ లింగ్వల్ టాలెంట్‌కు నెటిజనులు జేజేలు పలికారు.హిందీ సంగతి సరే, మలయాళీ పాటను సహజంగా పాడడం అనేది గొప్ప విషయం. అచ్చం మలయాళీ సింగర్ పాడినట్లుగా ఉంది’ అని ఒక నెటిజన్ స్పందించాడు. ‘ఈ పాట పుణ్యమా అని మళయాళం, బెంగాలీ భాషల ధ్వనిలోని కొన్ని అద్భుతమైన సారూప్యతలను గమనించే వీలు కలిగింది’ అంటూ స్పందించాడు ఒక విశ్లేషకుడు. ‘మీ పాట మ్యూజిక్ స్ట్రీమింగ్ ΄్లాట్ఫామ్లలో ఉండేలా చూడండి’ అని ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ అడిగాడు. -
దృశ్యం నటి సీమంతం.. సందడి చేసిన టాలీవుడ్ హీరోయిన్!
బాలీవుడ్ భామ ఇషితా దత్తా తెలుగు సినిమా చాణక్యుడుతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత బుల్లితెరపై ఎక్కువగా కనిపించిన భామ హిందీలో తెరకెక్కిన దృశ్యం-2 చిత్రంలోనూ నటించింది. జార్ఖండ్‌కు చెందిన ముద్దుగుమ్మ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఇటీవలే ప్రెగ్నెన్సీ ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ నటి బేబీ షవర్ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంది. తాను బెంగాలీ కావడంతో వారి సంప్రదాయంలో సీమంతం జరుపుకున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇషితా తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'గుంటూరు కారం'లో హాట్ బ్యూటీ.. బిగ్ అప్డేట్ రివీల్ చేసేసింది) ఇషితా తన ఇన్‌స్టాలో రాస్తూ..'షాద్ వేడుక' మా అమ్మ నా కోసం నిర్వహించిన బెంగాలీ బేబీ షవర్…నాకు ఇది ఎంతో స్పెషల్. అంతే కాదు నా జీవితంలో ఉత్తమమైనది. ఇది మా అమ్మ ఆశీర్వాదంగా భావిస్తున్నా.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ వేడుకలో సన్నిహితులు, ఫ్రెండ్స్ పాల్గొన్నారు. ఇషితాకు బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా బేబీ షవర్లో సందడి చేసింది. సీమంతంలో పాల్గొన్న పలువురు తారలు ఇషితా దత్తాను ఆశీర్వదించారు. కాగా.. ప్రస్తుతం ఇషితా దత్తా ఏక్ ఘర్ బనావూంగా అనే షోలో నటిస్తోంది. (ఇది చదవండి: లాల్ దర్వాజ అమ్మవారికి బంగారు బోనమెత్తిన బేబీ హీరోయిన్) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
ఘుమఘుమలాడే బెంగాలీ రొయ్యల ఇగురు, క్యాబేజీ చికెన్.. ఎలా వండాలంటే..
మన దగ్గర చాలా మంది క్యాబేజీ తినడానికి పెద్దగా ఆసక్తి కనబరచరు. కానీ ఇతర దేశాల్లో ప్రతి సలాడ్లోనూ క్యాబేజీ ఉండాల్సిందే. దీనిలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. నారింజ పండులోకంటే క్యాబేజీలోనే విటమిన్ సీ అధికంగా ఉంటుంది. పీచుకూడా ఎక్కువే. ఇవేగాక సల్ఫర్, మెగ్నీషియం, బీటా కెరోటిన్, విటమిన్ కే, అయోడిన్, పొటాషియం, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి సైతం ఇది మంచి ఆహారం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న క్యాబేజీని రుచికరంగా ఎలా వండుకోవచ్చో చూద్దాం... కావల్సిన పదార్థాలు: రొయ్యలు – పావు కేజీ, ఆవ నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు, బంగాళ దుంప – ఒకటి (ముక్కలుగా తరగాలి), బిర్యానీ ఆకు – ఒకటి, జీలకర్ర – టీస్పూను, ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను, పసుపు – టీస్పూను, కారం – రుచికి సరిపడా, టొమాటో – ఒకటి( సన్నగా తరగాలి), ఉప్పు – రుచికి సరిపడా, పంచదార – అర టీస్పూను, క్యాబేజీ తరుగు – నాలుగు కప్పులు ( ఉప్పునీళ్లల్లో అరగంటపాటు నానబెట్టుకోవాలి), గరం మసాలా పొడి – అరటీస్పూను. తయారీ విధారం: ►ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి పసుపు, కొద్దిగా ఉప్ప వేసి కలిపి పదినిమిషాలపాటు నానబెట్టాలి. ►స్టవ్ మీద బాణలి పెట్టి అవనూనె వేసి వేడెక్కిన తరువాత నానబెట్టిన రొయ్యలు వేసి ఒక నిమిషంపాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. ►బంగాళ దుంప ముక్కలు వేసి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ►ఇదే పాన్‌లో జీలకర్ర, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►ఉల్లిపాయ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నీళ్లు పోసి పచి్చవాసన పోయేంత వరకు వేయించాలి. ►ఇప్పుడు పసుపు, జీలకర్ర పొడి, కారం, టొమాటో తరుగు, కొద్దిగా నీళ్లు పోసి ఐదు నిమిషాల సేపు మగ్గనివ్వాలి. ►ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళ దుంప ముక్కలు, రొయ్యలు, నానబెట్టిన క్యాబేజీ, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూతపెట్టి సన్నని మంటమీద ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించి, తరువాత గరం మసాలా పొడి చల్లితే బెంగాలీ రొయ్యల ఇగురు రెడీ. క్యాబేజీ చికెన్ ఎలా వండాలో తెలుసా! కావల్సిన పదార్థాలు: చికెన్ బ్రెస్ట్ ముక్కలు – అరకేజీ, ఉల్లిపాయ – ఒకటి (ముక్కలుగా తరగాలి), వెల్లుల్లి రెబ్బలు – మూడు (సన్నగా తురుముకోవాలి), ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు, క్యాబేజీ తరుగు – ఐదు కప్పులు, ఎర్ర రంగు క్యాప్సికమ్ – ఒకటి( ముక్కలు చేయాలి), కొబ్బరి సాస్ – పావు కప్పు, తరిగిన అల్లం – అర టేబుల్ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, మిరియాల పొడి – రెండు టీస్పూన్లు, స్రింగ్ ఆనియన్ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ►ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడిక్కిన తరువాత వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►తరువాత చికెన్ ముక్కలు వేసి గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించాలి. ►చికెన్ వేగాక క్యాబేజీ తరుగు, క్యాప్సికమ్ ముక్కలు, కొబ్బరి సాస్, అల్లం, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు మగ్గనిస్తే క్యాబేజీ చికెన్ రెడీ. -
బెంగాలీ కళా వైభవం
-
క్రికెట్ యాడ్‌పై దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : ‘మూర్ఖుడా, దద్దమ్మా, హాస్యము తెలియని వెర్రి వెంగలప్ప, అభిరుచి లేనివాడా! భిన్న సంస్కృతులు, భాషలు కలిగిన గొప్ప దేశం పట్ల గౌరవ లేకుండా క్రికెట్ పేరు మీద తప్పుడు జాతీయవాదాన్ని రుద్దుతున్నావు’ అంటూ ప్రముఖ బెంగాలీ చలనచిత్ర నిర్మాత సృజిత్ ముఖర్జీ తీవ్రంగా మండిపడ్డారు. ‘బెంగాలీ సంస్కృతిని, రవీంద్రుడి కవిత్వాన్ని అవమానించడం అంటే అది కచ్చితంగా ఓ జాతి పట్ల విద్వేషం వెదజల్లడమే అవుతుంది’ అంటూ జర్నలిస్ట్ సౌమ్యజిత్ మజుందార్ విమర్శించారు. ‘నేనొక బెంగాలీని, బెంగాలీ సంస్కృతిని గౌరవిస్తాను. మా ఆత్మ అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వాన్ని అవమానించావు, మేము దేవుడికి నైవేద్యంగా పెట్టే తిలర్ నాడును అవమానించావు. ఇందుకు క్షమాపణలు చెప్పాలి’ అని మరొకరు, ‘బెంగాలీలు భారతీయులు కాదా, వేరుగా చూసినందుకు క్షమాణలు చెప్పాలి లేదా కోర్టుకు వెళతాం’ అని ఇంకొకరు, అసలు డాబర్ కంపెనీ ఉత్పత్తులను బహిష్కరించాలన్న హాష్‌ట్యాగ్‌తో మరికొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు కురిపిస్తున్నారు. మంగళవారం జరిగిన భారత్–బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా టీవీల్లో ప్రసారమైన డాబర్ కంపెనీ ఇచ్చిన రెడ్పేస్ట్ యాడ్‌పై కొనసాగుతున్న రాద్ధాంతం ఇది. క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకొని డాబర్ కంపెనీ ఈ యాడ్‌ను రూపొందించింది. భారత్ ఏ దేశంతో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆ దేశానికి చిహ్నమైన వంటకాన్ని టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఓ అభిమాని కసాపసా నమిలి మింగేస్తుంటే ‘సబ్కోఛాబాజాయెంగే (అందరిని నమిలేస్తాం)’ అన్న హాష్‌ట్యాగ్‌తో యాడ్ ప్రసారం అవుతోంది. అభిమాని పాత్రలో ప్రముఖ హాస్య నటుడు మనోజ్ పావువా నటించారు. మొన్న పాకిస్తాన్‌తో మ్యాచ్ జరిగినప్పుడు ప్రసారం చేసిన యాడ్‌లో ‘వాల్నట్స్ (అక్రోట్ కాయలు)’ను మనోజ్ పరా పరా నమలడం కనిపించింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ జరిగినప్పుడు ‘స్టిక్జా టొఫీ (చాక్లెట్ లాంటి స్వీటు),’ వెస్ట్ ఇండీస్‌తో మ్యాచ్ జరిగినప్పుడు ‘కొబ్బరి గరిజలు’ తినడం కనిపించింది. నిన్న బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్ జరిగినప్పుడు ‘తిలర్ నాడు (బెల్లంతో చేసిన నువ్వుల ఉండలు)’ తినడం కనిపించింది. రవీంద్ర నాథ్ ఠాగూర్ రాసిన ‘బ్రిస్తీ పోర్ తపుర్, తుపర్ (చిటపట చినుకులు)’ కవితా పంక్తిని కూడా మనోజ్ వినిపించారు. బెంగాళీ హిందువులు దేవుళ్ల వద్ద ప్రసాదంగా ఎక్కువగా ఈ నువ్వుల ఉండలు పెడతారు. బంగ్లాదేశ్‌కు ప్రతీకగా తమ నువ్వుల ఉండలు చూపడమేమిటీ, ఠాగూర్ కవిత్వాన్ని ప్రస్తావించడం ఏమిటన్నది వారి ప్రశ్న. వాస్తవానికి బెంగాల్ సరిహద్దుకు ఆవల ఉన్న బంగ్లాదేశీయులు కూడా నువ్వుల ఉండలను ప్రీతిగా తింటారు. ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నువ్వుల ఉండలను ప్రజలు ఎక్కువగానే తింటారు. ప్రసాదంగా కూడా పెడతారు. ఠాగూర్‌ను బంగ్లా సరిహద్దు గ్రామాల ప్రజలు గౌరవిస్తారు. ఏదేతేనేమీ విమర్శలు వెల్లువెత్తడంతో డాబర్ కంపెనీ బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఈ యాడ్‌ను రూపొందించడంలో ఎలాంటి దురుద్దేశం లేదని, యాడ్‌లో అభ్యంతకరమైన భాగాన్ని తొలగిస్తున్నామని, ఎవరి మనుసులనైనా నొప్పించి ఉన్నట్లయితే అందుకు క్షంతవ్యులమంటూ వివరణ ఇచ్చింది. -
పాటవింటే చాలు వండేయొచ్చు!
ఆర్ యూ హంగ్రీ? ఆర్ యూ హంగ్రీ?...అయితే పాటేస్కోండి చాలు... క్షణాల్లో మీ చేతులు మీకు తెలయకుండానే లయబద్ధంగా గరిటెతిప్పుతాయి. ఇదే చిట్కాతో వంటలపాటలను పాడేస్తూ కేరళ ఉర్ల్ కళంగ్ కర్రీ, తెలుగువారి దద్ధోజనం, ఆలూ పాస్తా, మటన్ బిర్యానీ, చిన్నారులు మెచ్చే బట్టర్ చికెన్ ఏదైనా సరే క్షణాల్లో వండేస్తూ నెటిజన్లను కట్టిపడేస్తున్నారు బెంగాలీ ఆంటీ సావన్‌దత్తా. ఇష్టంగా చేస్తే వంట కూడా ఒక కళ. ఆ కళ వంట బట్టాలంటే బోర్‌కొట్టే రొటీన్ వంటల కార్యక్రమంలా కాకుండా సరికొత్తగా వంటబట్టించాలనుకున్న సావన్ దత్ అనే బెంగాలీ ఆంటీ ఏపీ, తెలంగాణలతో సహా దక్షిణాది స్పెషల్ వంటకాలతో భోజనప్రియులను వంటింట్లోకి నడిపించేస్తున్నారు. ఇప్పటికే కుప్పలుతెప్పలుగా యూట్యూబ్‌లో వంటలకార్యక్రమాలుంటే ఇందులో కొత్తేముందీ అనుకోకండి. ఇక్కడ వంటలన్నీ పాటల రూపంలో ఉంటాయి. వంటకు కావాల్సిన పదార్థాల నుంచి, వండే విధానం వరకూ అందమైన బ్యాక్‌గ్రౌండ్‌లో చక్కటి హావభావాలతో వండిచూపించడమే సావన్ దత్తా స్పెషాలిటీ. బెంగాలీ ఫ్యావరెట్ వంటకాలైన ఝల్మురీ, కలకత్తా మటన్ బిర్యానీ, కోశా మాంగ్సో, సహా దత్తా వీడియో వంటకాలు పాటల రూపంలో హోరెత్తిస్తున్నాయి. ఆమె రిలీజ్ చేస్తోన్న ఒక్కో పాటా ఒక్కో కొత్త ప్రదేశంలో, కొత్త మ్యూజిక్‌తో సరికొత్తగా ప్రారంభం అవుతుంది. దత్తా ‘‘సాంగ్ బ్లాగ్’’పేరు మెట్రోనోమ్. ఇంకేం, ఆర్ యూ హంగ్రీ... ఆర్ యూ హంగ్రీ అంటూ ఓ పాటేసుకోండి మరి. -
ఆవ పువ్వుల తివాసీ
తెలుగు నవలే అనుకునేంతగా తెలుగు పాఠకులు సొంతం చేసుకున్న బెంగాలీ నవల ‘వనవాసి’. ఈ బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ రచనను సూరంపూడి సీతారాం అనువదించారు. అందులోంచి కొంత భాగం ఇక్కడ. సౌజన్యం: హైదరాబాద్ బుక్ ట్రస్ట్. ఫూల్కియా అరణ్యం దాటగానే, ఎదురుగా పువ్వుతొడిగిన ఆవచేలు కనబడ్డాయి. దృష్టి ఎంతదూరం సారిస్తే అంత దూరమూ కుడివైపునా, ఎడమవైపునా, ఎదుటా, అంతా ఒకే పసుపు పచ్చని పువ్వుల తివాసీ. చక్రవాల రేఖవరకూ పరచిన బ్రహ్మాండమైన తివాసీ, ఎక్కడా అడ్డులేదు, విరామం లేదు. అడవి ఈ చివర నుంచి, అటు బహుదూరంలో ఉన్న శైలశ్రేణి ఒడిలో లీనమైపోయింది. పైన శీతాకాలపు నిర్మేఘపు నీలాకాశం, కింద ఈ పసుపు పచ్చని తివాసీ. అపూర్వమైన ఈ సస్యక్షేత్రంలో మధ్య మధ్య రెల్లు కప్పిన కుటీరాలు మాత్రం కొద్దిగా కనబడతాయి. దుస్సహమైన ఈ చలిలో భార్యాపిల్లలను పెట్టుకుని, చుట్టూ రెల్లు తడికలు మాత్రం కట్టిన ఈ గుడిసెలలో ఈ ఆరుబయలు ప్రాంతంలో, వాళ్లు ఎలా ఉంటున్నారో తెలియలేదు. కోతల రోజులలో పొలాలలోనే మకాంవేసి శిస్తులు వసూలు చెయ్యడం ఈ దేశంలో పరిపాటి. పంట కళ్లంలో ఉండగానే శిస్తు వసూలు చెయ్యకపోతే ఇంత నిరుపేదలు మళ్లీ ఎన్నడూ చెల్లించలేరు.‘‘అయితే ఇక్కడొక డేరా వేయించమంటారా?’’ అని తహసీల్దారు అడిగాడు. ‘‘ఒక్కపూటలో ఒక చిన్న రెల్లు గుడిసె వేయించకూడదూ?’’ అన్నాను. అదే జరిగింది. దగ్గర దగ్గరలో మూడు నాలుగు చిన్న గుడిసెలు కట్టారు. ఒకటి నేను పడుకునేటందుకు. ఒకటి వంటయిల్లు, ఒకదానిలో ఇద్దరు సిపాయిలు, పట్వారీ ఉండడానికి ఏర్పాటయినాయి. వీటికి గుమ్మాలకీ కిటికీలకీ రెల్లు తడికలే కడతారు. అవి సరిగా ముయ్యడానికి వీలుండదు. రాత్రివేళ గాలి లోపలికి రయ్యిన వీస్తుంది. చలి గజగజ వణికిస్తుంది. దాదాపు మోకాళ్లపై వంగి మరీ లోపలికి ప్రవేశించాలి; అవి అంత పొట్టివి. గది మధ్యలో ఒత్తుగా కొమ్మలూ రెమ్మలూ ఆకులూ వేసి వాటిపైన ఒక జంపకానా పరిచి, ఆ పైన పరుపూ దుప్పటీ వేసి పడక తయారు చేశారు. ఈ పడక గది ఏడడుగులు పొడుగు, మూడడుగులు వెడల్పు. అందులో లేచి నిలబడడం అసంభవం. దాని ఎత్తు మూడడుగులు మాత్రం. అయినా చక్కగా ఉంది పూరి గుడిసె. ఇంత విశ్రాంతి, ఇటువంటి ఆనందం, కలకత్తా నగరంలో నాలుగంతస్థుల మేడలో ఉన్నప్పటికీ లభ్యం కాదు. అయితే, నేను చాలారోజులబట్టి ఇక్కడే ఉంటున్నందువల్ల, అరణ్యవాసినై పోయినట్టున్నాను. నా ఆసక్తీ, అభిరుచీ, దృష్టీ ఈ అరణ్య జీవితానుభవం ప్రభావం వల్ల మారిపోయి ఉండాలి. కుటీరంలో ప్రవేశించగానే పచ్చికొమ్మల కొత్తవాసన ఆహ్లాదకరంగా వచ్చింది. ఇందులో ఇంకొకటి నాకు ఎంతో నచ్చింది. పడకపైన అర్ధశయనంగా పడుకుంటే, తల దిక్కున అడుగు వెడల్పూ అంతే పొడగూ ఉన్న కిటికీవంటి కంతలో నుంచి చూస్తూ, సరిగ్గా కంటికి సమరేఖలో పసుపు పచ్చని ఆవ పువ్వుల తివాసీ కనబడుతుంది. ఇటువంటి దృశ్యం అపూర్వం. ఇదొక నూతన అనుభవం. పృథ్వి అంతా పచ్చని తివాసీగా మారిపోయినట్లు, ఈ జగత్తులో నేను ఒంటరిగా ఆ తివాసీపైన పడుకున్నట్లు అనిపించింది. -
పెళ్లికూతురు కనిపించడం లేదు!
బెంగాలీ చిత్రం ‘అగ్నిపరీక్ష’ ఆధారంగా వచ్చి, అచ్చ తెలుగు చిత్రంలా ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ఆ దేవాలయ పరిసరాల్లో ఎవరిగోల వారిది అన్నట్లుగా ఉంది. ఆ గోల మధ్యలో నుంచే...‘పెళ్లికూతురు కనిపించడం లేదు’ అని పెద్దకేక ఒకటి వినిపించింది.తన కారు దగ్గర నిల్చున్న కైలాసం దగ్గరికి ఇద్దరు వ్యక్తులు పరుగెత్తుకు వచ్చారు. ఆ ఇద్దరిలో అరవై సంవత్సరాల వ్యక్తి ఆందోళనగా...‘‘అబ్బాయ్ అబ్బాయ్...ఇటు పిల్ల పారిపోయి వచ్చింది. నీకేమైనా కనిపించిందా?’’ అని అడిగాడు.‘‘మీ అమ్మాయా?’’అడిగాడు కైలాసం.‘కాదు’’ అన్నాడు పెద్దాయన.‘‘మీ మనవరాలా?’’‘‘కాదు... నా పెళ్లాం’’ తాపీగా సమాధానం ఇచ్చాడు పెద్దాయన.అదిరిపడ్డాడు కైలాసం.‘‘నీకు పెళ్లాం కూడానా!’’ వెటకారం చేశాడు కైలాసం.‘‘ఆ... ఇంకా పెళ్లి కాలేదు. వీరికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకొని అన్ని ఏర్పాట్లు చేసుకునేలోపే ఆ పిల్ల పారిపోయింది’’ అసలు విషయం చెప్పాడు ఆ పెద్దాయనపక్కాయన.‘‘మంచిపని చేసింది’’ మనసులోని మాటను గట్టిగా అన్నాడు కైలాసం.‘‘మంచిపని చేసిందా మంచిపని...’’ అంటూ కైలాసం పైకి ఒంటి కాలి మీద లేచాడు పెద్దాయన.‘‘లేకపోతే ఈ వయసులో పెళ్లేంటి... పండ్లవి ఊడిపోయి’’ వెటకారానికి పదును పెట్టాడు కైలాసం.‘అన్నావు... నువ్వు ఇదే అన్నావు. ఈరోజుల్లో ఈ కుర్రాళ్లందరికీ ఇదే రోగం. ఏది నాతో పాటు కలిసి శేరు బియ్యం తిను నీ సంగతి ఏందో తెలుస్తుంది’’ సవాలు విసిరాడు పెద్దాయన.‘‘మేము తినేది అన్నం. బియ్యం కాదు తాతయ్య’’ వ్యంగ్యంగా అ సవాలుకు చురక పెట్టాడు కైలాసం.తాత అనగానే ఆ తాతగారికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఇలా విరుచుకుపడ్డాడు...‘‘తాతయ్యట తాతయ్య! నువ్వు నా కూతురి కొడుకువా? కొడుకు కొడుకువా!’’పరిస్థితి చేయిదాటుతుందని పసిగట్టిన పెద్దాయన పక్కాయన...‘‘వీడితో మనకెందుకండీ... పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దాం పదండి’’ అంటూ తొందరచేశాడు.‘‘పడుచోడు బయలుదేరారండి... బయలుదేరాడు’’ అంటూ కారు స్టార్టు చేశాడు కైలాసం.కొద్దిదూరం ప్రయాణం చేసిన తరువాత నీటి కోసం ఒక జలపాతం సమీపంలో ఆగాడు. జలపాతం దగ్గరికి వెళుతున్నప్పుడు ఒకచోట అమ్మాయి కనిపించింది.‘ఎవరది? వరూధినా? లేక కామిని పిశాచమా? ఆడమనిషే... ఆ సింగారమంతా చూస్తే ఎవరో ప్రియుడి కోసం వచ్చినట్లుంది’ అనుకున్నాడు చేతిలో డబ్బా పట్టుకున్న కైలాసం. అక్కడ ఆమె ఇలా అనుకుంది...‘వీడెవడు? చేతిలో డబ్బా వీడూనూ! ఆ డొక్కు కారు డ్రైవరు కాబోలు. నేను డిక్కీలో నుండి దిగడం చూశాడేమో’’‘ఇదే ప్రేమతతంగమైతే గంట ముందు వచ్చి మగాడు పడుండాలి. చుట్టుపక్కల ఎక్కడా మగపురుగు కనబడడం లేదు. బహుశా ఆ మగధీరుడు ఏదో మోసం చేసి ఉండాలి’ అనుకున్నాడు కైలాసం. ‘ఎందుకైనా మంచిది కాస్త దగ్గరికి వెళ్లి చూద్దాం’ అంటూఅడుగులు వేశాడు.‘వీడికి ఏదో దురుద్దేశం ఉండాలి. లేకపోతే ఎందుకలా నా వైపు చూస్తున్నాడు’ ఆమె అనుమానపడింది.కైలాసం తన వైపు రావడం గమనించి.‘హమ్మయ్యో ఇటే వస్తున్నాడు. ఈ మగాళ్లకి ఇదే తెగులు. ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు అదే పనిగా వెంటపడతారు’ అని విసుక్కుంది.‘ఈ పిల్ల ఆ పిల్లే... పెళ్లిపీటల మీది నుంచి తప్పించుకొని వచ్చిందన్నమాట. ఇక్కడికి ఎందుకొచ్చిందబ్బా? ముసలాడికి ఇచ్చి కట్టబెడితే ఏంచేస్తుంది? చావాలనే వచ్చి ఉంటుంది’ తనే ప్రశ్న వేసుకొని సమాధానం తనే చెప్పుకున్నాడు కైలాసం.ఛీ వెధవ బతుకు. చావడానికి కూడా అడ్డేనా నాకు’ తనను తాను విసుక్కుంది ఆ అమ్మాయి.‘నేను అడ్డనుకుంటుందేమో! నా దారిన నేను పోయినట్లు నాటకం ఆడతాను’ అని వెనక్కి వెళుతున్నట్లు నటించాడు కైలాసం.హమ్మయ్య వెళ్లిపోయాడు’ అని ఆమె ఆత్మహత్యకు సిద్ధపడుతున్న సమయంలో...‘‘ఏవండీ... ఆగండి... మిమ్మల్నే... మిమ్మల్నే’’ అని గట్టిగా అరుచుకుంటూ వచ్చాడు కైలాసం.‘‘ఏమిలేదండీ... ఏమీ లేదు’’ అని బుకాయించబోయింది ఆమె.‘‘లేదంటే ఎలా? మీరు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి’’ ‘‘లేదండి’’ ‘‘చూడండి మీకు చావు అంటే అనుభవం లేనట్లుంది. అందులో నీటిలో పడి చావడం. నీటిలో మొసళ్లు ఉంటాయి. అవి కరకర మింగి నములుతాయి’’ ‘‘అయ్యబాబోయ్.... ఈ నీటిలో మొసళ్లు ఉంటాయా?’’‘‘ఉండవనే అనుకుందాం. మీరు చచ్చేలోగా ఎవడైనా చూసి బయటికి లాగితే మీరు బతికిపోతారు. చావాలని చావకుండా బతికున్నందుకు పోలీసులు కేసులు పెడతారు’’‘‘కేసా? అమ్మయ్యో’’‘‘బతికి ఉంటే ఊరుకుంటుందా ప్రభుత్వం. శిక్ష వేస్తుంది. జైల్లోకి పంపించేస్తుంది. పోనీ మీ మటుకు మీరు అనుభవిస్తారనుకుంటే మధ్య నా పీక మీదికి వస్తుంది’’‘‘మీకా?’’‘‘అవును. ఆత్మహత్య ప్రయత్నానికి సాయపడ్డానని మధ్యలో నన్ను జైల్లో కుక్కుతారు. చూశారా... చావంటే ఎంత చావో’’‘‘ఇవేమీ నాకు తెలియవండీ’’‘‘తెలియకపోతే నాలాంటి వాళ్లను అడిగి తెలుసుకోవాలి. అది సరే మీరు ఎందుకు చావాలనుకుంటున్నారో కాస్త టూకీగా చెబుతారా?’’‘‘బతకడం అనవసరం అనిపించింది’’ చెక్‌పోస్ట్ దగ్గర... ‘‘ఆ పారిపోయిన అమ్మాయి కారులో వస్తే చచ్చినట్లు ఈ దారినే వచ్చి తీరాలి. కాలినడకనైతే అక్కడ మన 456 ఉండనే ఉన్నాడు. ఇక ఎలా పోతుందంటావు?’’ అన్నాడు సీనియర్ కానిస్టేబుల్ జూనియర్‌తో.‘‘అంతే బాబాయ్’’ అన్నాడు జూనియర్ తల ఊపుతూ.‘‘ఛా... బాబాయ్ అనొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బంధుత్వానికి ఉద్యోగానికి సంబంధం లేదని చెప్పలా! డ్యూటీలో ఉండగా సార్ అనాలి. జాగ్రత్త. ఇప్పుడు సార్ అని చెప్పి శాల్యూట్ కొట్టి ఏంచెప్పాలో చెప్పు!’’‘‘సరే సార్! ఆ రిపోర్ట్ అడిగిన వాళ్లను ఒక వివరం అడగడం మరిచిపోయాం సార్’’ అన్నాడు జూనియర్.‘‘ఏమిటది?’’ అడిగాడు సీనియర్.‘‘ఆ అమ్మాయికి జుట్టు ఉందా లేదా?’’ -
తలకిందులు
ఎండాకాలమనే స్పృహ లేకుండా, మబ్బులన్నీ తలోమాటా అనేసుకొని రాత్రి చీకటిని మోసుకొచ్చాయి మధ్యాహ్నం పూటే. పది సంవత్సరాలైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగులోనే కూరుకుపోయిన మా శర్మ గాడికి, వాడి ఫ్రస్ట్రేషన్ చూపించుకోడానికి ఒక కారణం దొరికింది ఇవాళ. తెల్లని కాగితాల్లో, నల్లగా ఇరుక్కున్న మా జీవితాలను, ఎర్రగా ఖూనీ చేసి, ట్యూబ్ లైట్ వెలుతురులో, మాడిపోయిన మా మొహాలను చూసి కసిగా నవ్వుతూ, ఫస్ట్ ఇంటర్నల్ పేపర్స్ ఇస్తున్నాడు.ఈ ఏడు ఎలాగైనా గట్టెక్కేయాలని, వేణుగాడు మునుపెన్నడూ లేని విధంగా ముందు బెంచి పుస్తకాల కళ్లజోడులను సవరిస్తున్నాడు ఈ సెమిస్టరు మొదటి రోజు నుండే. ‘‘ఎండ్ జస్టిఫైస్ ద మీన్స్’’ అనేది వాడి తీరు. సార్ పేపర్ ఇచ్చిందే తడవుగా, నిక్కర్కి పిర్రకాడ బొక్కపడితే చొక్కాతో కవర్ ఎలా చేసుకుంటామో, అలా ఆ ఆన్సర్ షీట్‌ని వెంటనే వాడు ఒక ముద్దలా చుట్టి బ్యాగ్‌లోకి దొబ్బాడు. క్లాస్ లో నక్కి ఉండే వీడు, బయట మాత్రం ఒక ‘ఫెరోసియస్’ విద్యార్థి నాయకుడు. మెస్‌లో మధ్యాహ్నం తిన్న తియ్యటి సాంబార్ కి నిద్రవస్తునట్టు ఉంటే, జీన్స్ ప్యాంటుకి బొక్క పడేంతగా తొడని మాటిమాటికీ గిచ్చుకుంటున్నా. నా నంబర్ పిలిచాడు అకస్మాత్తుగా. చివరిబెంచిలో కూర్చునే నా నల్లటి చెమట వాసనని ఎన్ని సార్లు పీలవలేదు, తలెత్తకుండానే నన్ను గుర్తు పట్టినట్టున్నట్టు, ముక్కును సవరించుకుంటున్నాడు. ఇందాక స్టూడెంట్ క్యాంటీన్లో సిగరెట్ తాగటం చూసాడనుకుంటా, మా ట్యూబ్ లైట్ నీడలు దగ్గరవుతున్నకొద్దీ చేతులు వింతగా ఆడిస్తున్నాడు, ఇంకా తగలబెట్టని పచ్చి శవం మీద వాలే ఈగలను అదిలిస్తున్నట్టు ‘‘షుడ్ ఇంప్రూవ్ రైటింగ్ స్కిల్స్’’ అని గట్టిగా అరచి, ఎడంచేత్తో పేపర్ పారేసి, ఇంకా మిగిలిన గొర్రె పిల్లల మెడలు కొరకడానికి అందంగా నోరు తెరిచాడు. ‘‘ఖాతా ఐనా తెరిచావా?’’ అన్న వేణుగాడి వెకిలిచూపులకి సమాధానంగా, నా పేపర్ వాడి బల్లమీద వేసి, శర్మగాడు మిగిల్చిన పంటి గుర్తులను లోపలనుండి తడుముకుంటూ వెళ్లి కూర్చున్నా. రెండు గంటల విందు భోజనం తరువాత, తేన్చుకుంటూ, పొట్టమీద కుడిచేత్తో నిమురుకుంటూ వెళ్ళిపోయాడు.మళ్ళా క్యాంటీన్‌కి పోయినం, రెండు జేబుల్లో ఇంకొన్ని కబుర్లు నింపుకోవడానికి. గోధుమరంగు వేడి నీళ్ల పొగని, ఎండిపోయిన నారింజరంగు పెదాలతో తాగడం మొదలెట్టాను. బెంగాలీ ‘బోల్చి’ గాడి బీడీ ముద్దు పెట్టుకున్న ఘాటుకు, దగ్గొచ్చి, పొరలు పొరలుగా మాట్లాడుతుంటే, ఎందుకో నాన్న గుర్తుకు వచ్చాడు.పదో తరగతిలో అనుకుంటా, జెండాపండుగ ముందు రోజు ఇంటిబెల్లు ముందు పీరియడ్‌లో క్విజ్ పోటీ పెట్టారు. దానిలో మొదటి ప్రైజ్ వచ్చిందని నాన్నకి ఆ రాతిరి చెపుతుంటే, ‘‘మన రాష్ట్రానికి ఆర్థికశాఖ మంత్రి కూడా ఎవడో తెలియదరా, నా కొడకా?’’ అంటూ, జుట్టు పట్టుకొని, సారాయి ఘాటుని, నా మొఖంపై పిడికిలి గుర్తుగా విడిచిపెట్టాడు. ఆ రోజు ఈ ప్రశ్న ఒక్కటే మా గ్రూప్ వాళ్ళు ఆన్సర్ చేయనిది. ఫలితంగా, ఆ సంవత్సరం లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల పేర్లు, ఢిల్లీ మంత్రుల పేర్లు నోట్స్ అట్టల మీద, బచ్చల కాయల రసంతో రాసుకున్నా, ఎప్పటికి చెరిగిపోకూడదని.నేను ఫెయిల్ కావడమే ఇష్టం లేనివాడు, రీకోర్సు మీద రీకోర్సు చేస్తున్నాడు అని తెలిసి ఉంటే, ఏమి చేసి ఉండేవాడో ఇప్పుడు. పాపం, చనిపోయి బతికిపోయాడు. వేణుగాడు కూడా మాతో పాటే కూర్చున్నాడు. అసలు వాడి చుట్టూ ఎప్పుడూ, రసి కారే పుండు మీద గియ్యిన వాలే చిన్ని చిన్ని నల్ల దోమల్లాగా ఇద్దరు, ముగ్గురు, క్యాంపస్ సచ్చు రాజకీయ సొదని తగరపు శబ్దాల్లా మోగిస్తుంటారు. వీడేమో, పెంటకుప్పపై అక్కడక్కడా మొలిచే పిచ్చిమొక్కల్లా ఉన్న గడ్డాన్ని ఎడంచేత్తో బరుక్కుంటూ, మనుషుల పునాదుల్లో దాక్కున్న అమానుషత్వపు తెరలకు కారణం ఏమైఉంటుందబ్బా అని ఆలోచిస్తున్నట్టు స్ఫురించేలా ఓ పనికిమాలిన పోజు పెట్టి, చెట్ల గుబుర్లోకి తీక్షణంగా చూస్తూన్నాడు.అటుగా వెళ్తున్న ‘నార్త్’ జూనియర్ వీడిని చూసి, ఒక మొహమాటపు నవ్వు తగిలించుకొని మావైపు వచ్చింది. వీడు కూడా, తెగిపడినట్టుండే కింద పెదవితో ఓ ‘నవ్వు’లాంటి శబ్దాన్ని చాలా కష్టంతో ‘సహజంగా’ వదిలాడు. అప్పుడు వాడి మొహం, మట్టి రోడ్డు మూల మలుపులో మెల్లగా నోరు తెరుచుకుని కాచుకునుండే రాళ్ళ బావిలాగా ఉంది.‘‘రేపు అడ్మినిస్ట్రేషన్‌లో నీ సర్టిఫికెట్స్ ప్రాబ్లమ్స్ నేనొచ్చి మాట్లాడతా’’ అని చెప్పి, ఇంకా తన మోచేతి నీళ్లు తాగి ఎంత మంది ఈ యూనివర్సిటీలో బతుకు లాగిస్తున్నారో అని ఓ లెక్కల చిట్టా విప్పాడు. ‘‘యూ ఆర్ ఏ కైండ్ పర్సన్’’ అన్న తన మాటలకి అడ్డుపడి, ‘‘యూ డోంట్ హ్యావ్ టు బీ థ్యాంక్ ఫుల్ టు మీ. ఐయామ్ డూయింగ్ వాట్ ఐయామ్ సపోజ్డ్ టూ డు’’ అని అన్నాడు. వాడి తీయని ఆ ఇంగ్లీష్ మాటలు, ఆ చేతి విరుపులు అచ్చం నీరుకట్ల పాము బుసలు కొడుతున్నట్టే. ఆ అమ్మాయి చేయి చాచి కృతజ్ఞత చెపుదామనుకుంటే, వీడేమో ఒక నమస్కారం పెట్టి తన ‘‘సంస్కారాన్ని’’ ప్రసవించాడు. ఈ శుక్రవారం ఏదో పండగ వచ్చి సెలవులు ఎక్కువగా వచ్చేసరికి, ఇంటికి పోవాలనుకున్నా, లోపల పేరుకున్న చెత్తైనా వదులుతుందేమో అని. రెండువందల కిలోమీటర్లని, ఐదు గంటల్లో తినేసిన ట్రైన్ ఇంజిన్ నన్ను మా మండలంలో విసర్జించింది. ఇంకొక ఆరు కిలోమీటర్లలో ఉన్న మా ఊరు పోవాలంటే, ఖాండ్రుఖాండ్రుమంటున్న ఆటోలే దిక్కు. రెండు గంటల కాలయాపన ఉక్కపోతల తరువాత, ఎనిమిది మంది అప్పీ ఆటోలో ఎక్కితే గాని, పోయినసారి ఎలెక్షన్ల హామీలకు గుర్తుగా మిగిలిన చిరుగులు రోడ్డు మీదకు టైర్లు కదలలేదు. కంకర కంటే గుంతలు ఎక్కువున్న రోడ్డు ఎగుడు దిగుడులకు, నెత్తి బొప్పికట్టకుండా, చెమట పట్టిన చేత్తో సైడ్ కడ్డీ పట్టుకొని,పైకి కిందకి జారుతున్నా.అరగంట తరువాత ఏదో జ్ఞాపకం వచ్చినట్టు బ్రేకు వేయగానే, యూనివర్సిటీ తాలూకా నిరాశను బ్యాగ్ లో పడేసి, చెప్పుల తపతపల్లో రేగిన జుట్టు గాయాలను సవరదిద్దుకుంటూ ఇంటికి నడిచినా.నాటుకు పొయ్యొచ్చి, పళ్ళు గట్టిగా బిగించి అరిగిపోయిన మోచిప్పలను చేత్తో కుదుపుతూ, ఇంకొక చేత్తో కొంగుకంటిన బురదని దులుపుకుంటుంది అమ్మ. శబ్దం చేయకుండా బ్యాగ్ ని మొత్తల్లో పడేసి, గాబుకాడికి పొయ్యా, మొఖానికి రాత్రి అంటిన రమ్ మరకలు ఎక్కడ అమ్మ చూసేస్తుందన్న భయంతో.కండవతో పైచెక్కులన్నీ వొలుచుకొని, ముసుగులన్నీ తుడుచుకున్న తరువాత, ప్లాస్టరింగ్ ఇంకా చేయని గోడకతికించిన అద్దంలో, అయిదేళ్ల క్రితం హైద్రాబాద్ పోయిన అప్పటి ‘నేను’ కనిపించాను. ఆ చీకట్లోనే నాకిష్టమైన చింత చిగురు దూసుకొచ్చి, ఉల్లిగడ్డలతో కలిపి వండి, కూర సట్టి ముందు పెట్టి, అంతవరకూ నా మీద పెట్టుకున్న ఆశలన్నీ పళ్లెంలో అన్నంలా తోడింది. హాస్టల్ కూరలు బాగోక, పచ్చడి కలుపుకున్న రాత్రులు తెచ్చిన అల్సర్ మంటలు అమ్మకి తెలియనీయకుండా, సగం వదిలేసిన ఆ అన్నం పెడ్డకి, ప్రయాణిక బడలిక కారణం అని అబద్ధం చెప్పా.ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ, మంచంలో పడుకున్న నా పక్కనొచ్చి కూర్చుంది. చిన్నప్పుడు ఆటల్లో తల్లో చిక్కుకున్న ఇసుకను తీస్తునట్టుగా, నా జుట్టులో వేళ్ళు కదుపుతూ– ఇటు చూడరా నీకొక మాట చెప్పాలనంది.‘‘చిన్నీ, నీ సావాసగాడికి కూడా మొన్న ఉద్యోగమొచ్చే. ఇప్పుడు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. మరి నువ్వు కూడా ఇంగ ఎదో ఒకటి చూస్కో నీ పొట్టకి’’ అని, ఆ చీకట్లో వేడిగానున్న నా మూసివున్న కళ్ళను పదే పదే తడుముతుంది.పుల్లిగాడు, నేను పదోతరగతి వరకు క్లాస్‌మేట్లం. మా స్కూల్ సెకండ్ ర్యాంక్ వాడిని, టీటీసి దారుల్లోకి లాక్కొనిపోతే, నాకొచ్చిన మండల సెకండ్ ర్యాంక్, మా ఊర్లో డబ్బులున్న ఆసామి ‘దాతృత్వానికి’’ ఆకర్షించబడింది. ఆయన ‘చలువ చేత’, ఒక ప్రయివేటు ఇంటర్ కాలేజ్ ఇంగ్లిష్ మీడియం కోరలకు చిక్కుకొని, అత్యాచారానికి లోనయ్యా.రెండు సంవత్సరాల ర్యాంకుల కొలిమిలో కాల్చబడి తెచ్చుకున్న ఏఐయియియి, ఎంసెట్ సీట్లకు ఫీజుకట్టే స్తోమత లేక, బడి పండుగల్లో ‘‘ఆ పిల్లగాడి చదువు ఖర్చు మొత్తం మేమే భరిస్తున్నాం’’ అని బాకా ఊదిన కమ్మోరి సెల్ ఫోన్ కూడా బదులివ్వక, ఇదిగో ఈ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కోర్స్‌లో జాయిన్ అయ్యా. వాస్తవిక రొదలకి, ఆదర్శాల రొచ్చులకు మధ్యనున్న భూమికి, మూడు అడుగుల ఎత్తులో తొణుక్కుంటూ నడిచేదే యూనివర్సిటీ జీవితం. నిరసనలు, ఆత్మహత్యలు, హత్యలు, మానసిక అలజడులు, పుస్తకాల బూజులు, శారీరక దాడులు, సెక్సువల్ అసల్ట్లు, పుట్టుక నుండే మెదళ్లలో రుద్దే కొన్ని గజ్జి చీదర్లు, ఇవన్నీ వాటాలు వాటాలుగా స్టూడెంట్స్‌ని పంచుకుంటాయి కసికసిగా.జాయినైన మొదటి సంవత్సరంలో, నాది కాని ఈ రంగుల కల్చర్‌కి ఇమడలేక, లైబ్రరీ చెక్క కుర్చీల మధ్య రోజులంతా గడిపా. రెండో ఏడాది ఒకానొక రాత్రుల్లో, నిషా ఎక్కిన కళ్ళతో ‘విప్లవాల’ జోలపాటలకు బందీనై, తరువాత యేడు బాధిత పక్షాల నిరసనలకు, నేనెవరో తెలిసొచ్చి, కొత్త జెండా ఎత్తుకొని అరిచా, గొంతు బొంగురుపోయేదాకా. చివరకు, పోయినేడాది, సొంత జీవితపు ఎదుగుదలకు ఉద్యమాల రెక్కలనే విరిచేసిన ఈ క్యాంపస్ నాయకుల కపటత్వాన్ని చీదరించుకునేలోపే, యూనివర్సిటీ జీవితం ఒక అడుక్కి వచ్చిందనే సత్యం తెలిసొచ్చింది.పొద్దున్నే డొంకలోకి లోటాపట్టుకొని పోతుంటే, దారిలో ఎదురై, రెండు సంవత్సరాలు రికార్డులు రాయడానికి, ఇంకొక రెండేళ్లు కోచింగ్ సెంటర్లో ప్రాక్టీస్ బిట్ల బరువులకి బలైపోయి, పీలగా వేలాడుతున్న చేతివేళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు పుల్లిగాడు. పెళ్లి చేసుకొని ఇక ‘పెద్దోళ్ల’ గుంపులో కలిసిపోతున్నాడని చెప్పి, ‘‘హైదరాబాద్‌లో చదువుతున్నావ్, మాలాగా కాకుండా పెద్ద జాబ్ నువ్వు కొట్టాలిరా’’ అని, ఉరుకులాంటి నడకతో సంసార జీవితంవైపు నడిచాడు.ఎంత దూరం చదువుకుంటుంటే, అంత పెద్ద ‘ఉజ్జోగం’ వస్తుందని మా వాళ్ళ లెక్క.ఇంకొక సెమిస్టరులో కోర్స్ అయిపోతుందనే ఊహకి, బయట నిరుద్యోగ పోటీలో నెగ్గుకురాగలమా అనే భయానికి మధ్య, ఎన్నో రోజులు డిప్రెస్సివ్ రాత్రులతో ఘర్షణ పడలేక ఇంటికి వస్తే, ఊరు పెట్టుకున్న ఆశలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దొడ్డికి పొయ్యెచ్చి బురదకాళ్లని కడుక్కుంటుంటే, ‘‘తుంటోడా.. తుంటోడా’’ అని అరుసుకుంటూ, ‘దానేల’ మాయ్య వచ్చిండు. మొఖం పుల్ల వేసుకొని వెళ్లి పక్కన సతికిలబడితే చెప్పుకుంటూ పోతున్నాడు– ‘‘ఏమి లేదురా, మన రవి గాడిని, నువ్వు చదివేకాడికి పరిచ్చ రాపిద్దామనుకుంటున్నా. అదేదో పెద్ద ఇనివెర్సిటీ అంట కద రా! పైగా నువున్నకాడ ఉంటే, నీకు మల్లె పయోజకుడు అవుతాడు. ఆ నెట్టిలో నువ్వే అప్పలయి చెయ్ మరి’’ అని గడ్డం పట్టుకున్నాడు. మాయ్యకి కొంచెం నత్తి. చెప్పలేనంత ప్రేమో, కోపమో వస్తే ఇలా చేతులకి, కాళ్ళకి పనిచెప్తూ ఉంటాడు. మాయ్య చిన్నకొడుకు రవిగాడు. మాయ్యకి అసలు ఇద్దరు కొడుకులున్నారని మొన్న రేషను కార్డు ఫోటోలు దిగిందాకా ఊళ్ళో వాళ్లకి తెలియదు. చిన్నప్పటి నుండి చదువు పిచ్చితో హాస్టల్లోనే పెరిగాడు వీడు. నేను ఏ సంగతయిందని మల్ల ఫోను చేసి చెప్తలే మాయ్య అని లోపలికెళ్ళి బ్యాగ్‌లో బట్టలు సర్దుకుంటున్నా.అప్పుడే బర్రెపాలు తెచ్చి టీ పెడ్తున్న అమ్మొచ్చి ‘‘ఏంది బిడ్డా, ఇంతలోకే పోతున్నావ్? ఇంటికాడ మనసు నిలవట్లేదా?’’ అని, నా పెద్ద గ్లాస్లో వేడి టీ పోసి ఇచ్చింది.అమ్మ కళ్ళలోకి చూసి అబద్ధం చెప్పే ధైర్యం లేక, ఏదో అర్జెంటు క్లాస్ ఉందని మెస్సేజి వచ్చిందిలే అని బాగ్ లోపల తలదూర్చా, కన్నీళ్ళని ఆపుకోవడానికి. ఉతకని బట్టలమీద రెండు, మూడు కన్నీళ్ల చుక్కలు పడి, కంపు వాసన బయటకి రాబోతుంటే, గబ గబా జిప్ వేసేసాను.ఈసారెందుకో ఊరికి, యూనివర్సిటీకి మధ్య ఉన్న దూరం చాలా తక్కువనిపించింది. నిన్నటి నుండి ఒకటే నోరు పీకుతుంటే, ఒక సిగరెట్ ముట్టించా మెయిన్ గేట్ దగ్గర. పక్కనున్న యూకలిఫ్టస్ చెట్టుకి వేలాడుతున్న గబ్బిలానికి నేను ‘తలకిందులుగా’ కనిపిస్తున్నానేమో ఇప్పుడు.ఇంకొక సిగరెట్‌తో ఓ ఐదారు రోజుల ఆయుష్షు తగ్గించుకొని, హాస్టల్ వైపు బయల్దేరా. సెల్లార్లో మొన్న జాయినయిన జూనియర్ గాడు అటు ఇటు తిరుగుతున్నాడు. నన్ను చూసి దగ్గరకొచ్చి, ‘‘వేణన్నా, మా ఫ్రెండ్ నన్ను ఇక్కడ ఉండమని లోపలికెళ్లారు. రేపు ప్రొటెస్ట్ మీటింగ్ స్పీచ్ రాయాలి లైబ్రరీ కి పొయ్యి మేము ఇప్పుడు’’ అని, కలుషితం కానీ తన భావజాలాన్ని నాముందు పరచాడు.యూనివర్సిటీకి వచ్చిన రెండేళ్లలో వేణు గాడు నేర్చిన మాటలు గుర్తొచ్చాయి–ఏముందిరా, ఒంట్లో వేడి ఉన్నంతకాలం పోరాటం, ఆకలి, సమాజం అని మాటలు చెప్పి, వీలైనంత మందితో పక్కబట్టలమడతల్లో చలి కాచుకోవడమే. నాటకం అయిపోయిన తరువాత రంగు కడిగేసుకొని ఇక్కడ నుండి వీరుడిగా బయటకు పోవడమే మన పని.ఈ జూనియర్గాడి గురించి నాకెందుకులే అని లోపలికి పొయ్యి ఒక గంట తరువాత పని చేసుకొని బయటకు వచ్చినా, ఇంకా అక్కడే ఉండి బిక్కుబిక్కు మంటూ పెచ్చులూడిన గోడలను చూస్తున్నాడు. వీడిని చూస్తుంటే నాకు మా దానేల మాయ్య కొడుకు రవి గాడే గుర్తొచ్చాడు.సరిగ్గా అప్పుడే మాయ్య ఫోన్ చేస్తున్నాడు. కాల్ కట్ చేశా, ఒక నిశ్చయానికి వచ్చినట్టు. మేడి చైతన్య -
బెంగాలీ జంట నయవంచన
బనశంకరి : డేటింగ్ వెబ్సైట్ ద్వారా యువకులను వంచనకు పాల్పడుతున్న బెంగాలీ దంపతులను మంగళవారం సీఐడీ సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.44 వేల నగదు, బ్యాంకుల చెక్కుబుక్స్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సచిన్ పీ.ఘోర్పడే తెలిపారు. వివరాలు... కోల్‌కత్తాకు చెందిన బెంగాలీ చెందిన కుశన్ మంజుదార్, అతని భార్య రుపాళీ మంజుందార్, కుశన్ బెంగాలీ బుల్లితెర నటుడు. ఇదిలా ఉంటే బెంగళూరు నగరానికి చెందిన 34 ఏళ్ల టెక్కీ డేటింగ్ వెబ్సైట్ మింగల్ 2లో వివరాలను అప్లోడ్ చేశాడు. దీనిని గమనించిన రూపాళీ, కోల్కత్తా అర్పితా పేరుతో టెక్కీని పరిచయం చేసుకుంది. మొబైల్, వాట్సాప్‌లో గుడ్‌మార్నింగ్, గుడ్‌నైట్ మెసేజ్‌తో పాటు వ్యక్తిగత పోటోలు పంపుతూ స్నేహం పెంచుకుంది. 2017 జూలై నెలలో తన తండ్రి ఆరోగ్యం సరిగా లేదని అత్యవసర కిత్సకోసం రూ.30 వేల నగదు కావాలని టెక్కీని కోరింది. దీంతో టెక్కీ అర్పిత ఖాతాకు రూ. 30 వేలు నగదు జమ చేశాడు. త్వరలోనే బెంగళూరు వస్తానని, వచ్చినప్పుడు నగదు చెల్లిస్తానని సమాచారం ఇచ్చింది. మరికొద్దిరోజుల్లో అర్పిత తన తండ్రికి గుండెపోటు వచ్చిందని, కోల్కత్తా బీఎం బిర్లా హార్ట్రీసెర్చ్ సెంటర్లో చేర్చామని ఆర్థిక సహాయం చేయాలని టెక్కీని మరోసారి కోరింది. ఇదేవిధంగా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి గత జనవరి వరకు టెక్కీ నుంచి రూ.59.72 లక్షల నగదు అర్పిత అకౌంట్‌కు జమ చేయించుకుంది. అనంతరం ఆమె నడవడిక పట్ల అనుమానించిన టెక్కీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొబైల్ నెంబర్, బ్యాంక్‌ఖాతా, నగదు డ్రాచేసుకున్న బ్యాంక్ వివరాలు, సీసీ కెమెరా వీడియోను పరిశీలించగా వంచకుల ఆచూకీ తెలిసింది. అనంతరం సీఐడీ ప్రత్యేక బృందంం కోల్కత్తా వెళ్లి బెంగాలీ దంపతులు కుశన్ముజుందార్, రూపాలిముజుందార్ను మంగళవారం అరెస్ట్ చేసి బుధవారం నగరానికి తీసుకువచ్చారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి రూపాళీ భర్త కుశన్ ముజుందార్ బుల్లి తెరనటుడు. ఈయన పలు బెంగాలీ సీరియల్స్‌లో నటించాడు. భార్య రూపాళీ మాయలో పడుతున్న వ్యక్తులతో వాట్సాప్, ఇమెయిల్ చాటింగ్ చేస్తూ వంచనకు మద్దతు పలుకుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. వంచనకు పాల్పడిన నగదులో రూపాళీ విలాసవంతమైన జీవనం సాగించేది. డేటింగ్వెబ్సైట్లో మింగల్ 2లో రూపాళీ ముజుందార్ పేరు నమోదు చేసుకుని తన మోడల్ఫొటోలు ఆప్‌లోడ్ చేసేది. లైక్‌చేసిన వ్యక్తులతో తాను డాక్టర్, ఉపాధ్యాయురాలిగా పరిచయం చేసుకుని స్వీట్‌గా మాట్లాడి మాయలోకి దింపి వివిధ మార్గాల్లో వంచనకు పాల్పడి రూ. లక్షలు వసూలు చేసేది. గత 9 ఏళ్లు నుంచి ఎలాంటి ఉద్యోగం చేయకుండా అమాయకులను వంచనకు పాల్పడి వారి వద్ద నుంచి ఆన్లైన్లో తన బ్యాంక్ అకౌంట్ ఖాతా నగదు జమచేసుకునేది. అనంతరం దంపతులు ఇద్దరూ విలాసవంతమైన జీవనం సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
కారేపల్లిలో పట్టుబడిన బెంగాలీ దొంగ
కారేపల్లి: ఓ వైపు బిహార్ దొంగలు ఇంట్లోకి చొర బడి పిల్లలను ఎత్తుకెళ్లిపోతున్నారు, అడ్డు వచ్చిన వారిని హతమార్చుతున్నారు..అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అపోహలు పెరిగిపోయి.. రాత్రి వేళల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పుకార్లుతో ప్రజలు బెంబేలెత్తి పోతుంటే...! తాజాగా కారేపల్లిలో ఓ బెంగాలీ యువకుడు ఆది వారం తెల్లవారు జామున ఆటోను దొంగిలిస్తూ పట్టు పడిన ఘటనతో కారేపల్లిలో మరొక్కసారి అలజడి ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో కారేపల్లిలో నాటు వైద్యం పేరుతో ఇద్దరు మహిళలు పట్టపగలే ఇంటి తలుపులు కొడుతూ.. మీకు ఆ రోగం తగ్గిస్తాం, ఈ రోగం తగ్గిస్తాం అంటూ అనుమానాస్పదంగా తిరిగి, చివరికి గ్రామస్తుల చేతికి చిక్కి పోలీసులకు అప్పగించిన ఘటన మరువక ముందే..ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఈ బెంగాల్ దొంగ ఘటన ప్రజల్లో మరోక్క సారి భయాందోళనను రేకెత్తించింది. పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లా చెందిన మోహన్ బిస్వాల్ అనే యువకుడు గత నెల 30వ తేదీన పశ్చిమ బెంగాల్ నుంచి తమ బ్యాచ్ (ముఠా)తో కలిసి హైదరాబాద్‌లోని షేరులింగం పల్లి వద్ద కాంట్రాక్టర్ ఇమ్రాన్ అహ్మద్ వద్ద కన్స్ట్రక్షన్ పనుల్లో భాగంగా హెల్పర్‌గా పని చేసేందుకు వచ్చాడు. దీనికి సంబంధించి డిసెంబర్ 31వ తేదీ వరకు వ్యాలిడిటీతో అతని వద్ద సరోవర్ జెనిత్ కంపెనీలో పని చేసేందుకు కార్డు సైతం ఉంది. ఇదిలా ఉండగా..తన ముఠాతో పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్ వచ్చిన మోహన్ బిస్వాల్..తప్పిపోయి హైదరాబాద్‌లోని కాకతీయ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కాడు. తన ముఠా కన్పింక క పోవటంతో..తనకు వచ్చిన బెంగాళీ బాషలో అడ్రస్ చెప్పాలంటూ ట్రైన్లో సైతం ప్యాసింజర్లను విసిగించటం, శనివారం అర్థ రాత్రి వరకు ఆ బోగీలో ఉన్న వారిని సైతం లేపి ఇబ్బందులకు గురి చేయటంతో అతన్ని..కారేపల్లి రైల్వే స్టేషన్ వద్దకు రాగానే ఆదివారం తెల్లవారుజాము 3 గం టల సమయంలో బలవంతంగా దింపివేశారు. దీంతో అయోమయానికి గురైన మోహన్ బిస్వాల్ ఏమి చేయాలో తోచక..కారేపల్లిలో ఒంటరిగా కలియతిరుగుతూ..భారత్‌నగర్‌కు చేరు కున్నాడు. ఈ క్రమంలో ఏమిచేయాలో తోచని మోహన్ బిస్వాల్ రోడ్డు ప్రక్కనే ఉన్న ఆటోను నెట్టుకుంటూ..రోడ్డు పైకి తెచ్చాడు. ఆటోలో ఎటేపైన వెళ్దామనుకున్నాడో..ఏమో తెలియని బిస్వాల్ ఆటో ఎంతకు కదలక పోవటంతో..అదే ఇంటిలోని కుంటుంబ సభ్యులను నిద్ర లేపి..తనకు వచ్చిన బెంగాలి బాషతో వారిని బెంబేలెత్తించాడు. దీంతో దొంగ దొంగ అని అరవటంతో..చుట్టు ప్రక్కల వాళ్లు అక్కడికి చేరుకొని..ఇతడు దొంగేనని తలంచి దేహశుద్ది చేశారు. అనంతరం తాళ్లతో కట్టివేసి కారేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. -
‘దేవ్‌దాస్’ నుంచి ‘దాస్ దేవ్’ వరకు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ బెంగాలీ రచయిత శరత్చంద్ర ఛటోపాధ్యాయ్ వందేళ్ల క్రితం రాసిన ‘దేవదాస్’ నవల ఎన్నో భాషల్లో సినిమా తీయడానికి ఎంతోమంది సినీ నిర్మాతలకు స్ఫూర్తినిచ్చింది. భగ్న ప్రేమికుడిగా మద్యానికి బానిసై చివరకు చావును ఆశ్రయించిన ఓ దేవదాసు విషాధభరిత ప్రేమ కథను వేదాంతం రాఘవయ్య, విజయ నిర్మల తెలుగులో, బిమల్ రాయ్, సంజయ్ లీలా బన్సాలీ, అనురాగ్ కాష్యప్లు హిందీలో, దిలీప్ రాయ్ , చాశి నజ్రుల్ ఇస్లాం, శక్తి సమంత బెంగాలీలో తెరకెక్కించగా పీసీ బార్గువా బెంగాలీలో (1935), హిందీలో (1935), అస్సామీస్లో (1937) తీశారు. అనురాగ్ కాష్యప్ 2009లో ‘దేవ్ డీ’ పేరుతో తీసిన సినిమాలో మినహా అన్ని దేవదాస్ చిత్రాల్లో విషాధాంతమే ఉంటుంది. పిరికితనంతో ప్రేయసిని దూరం చేసుకొని మద్యానికి బానిసై అంతా విధి రాతంటూ తనలో తాను కుమిలిపోతూ స్వీయసానుభూతిని కోరుకుంటూ మత్యువును కౌగిలించుకొని దేవదాసునే వీరంతా ఆవిష్కరించారు. చావు పరిష్కారం కాదంటూ ‘చంద్రముఖి’తో దేవదాస్‌కు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారు అనురాగ్ కాష్యప్ తన దేవ్ డీలో. ఇప్పుడు దేవదాస్‌ను మరో రకంగా చూపించేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ హిందీ దర్శకుడు సుధీర్ మిశ్రా. ఆయన దేవదాస్ పాత్రను తనదైన శైలిలో వెనక నుంచి ముందుకు నడిపించారు. అంటే భగ్న ప్రేమికుడై మద్యం మత్తులో మునిగితేలుతున్న దేవదాస్ ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు విచలితుడై రాజకీయ నాయకుడిగా ఎదగడాన్ని ఈ సినిమాలో చూపిస్తారు. అందుకనే దర్శకుడు ఈ సినిమాకు ‘దాస్ దేవ్’గా టైటిల్ పెట్టారు. రాహుల్ భట్, అదిత్ రావ్ హైదరి హీరోహోరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ నెల 23వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. దేవదాస్ నవలకు సుధీర్ మిశ్రా చెప్పిన సరికొత్త భాష్యానికి, చిత్రంలోని పాటలకు ఏకంగా ఐదుగురు సంగీత దర్శకులు సంగీతాన్ని సమకూర్చారు. పీసీ బారువా నుంచి నేటి సుధీర్ మిశ్రా వరకు తీసిన అన్ని దేవదాస్ చిత్రాల్లో సినిమా దర్శకుడి తాత్వికతను ప్రతిబింబించే పాటలు ఒకటి, రెండైనా ఉన్నాయి. దాస్ దేవ్ సినిమాలో డాక్టర్ సాగర్ రాసిన అలాంటి పాట ‘సెహ్మీ హై దడ్కన్’ విపిన్ పట్వా సంగీతం సమకూర్చగా, ఆతిమ్ అస్లాం పాడారు. పీసీ బారువా 1935లో హిందీలో తీసిన దేవదాస్ చిత్రంలో ‘చూటీ ఆసీర్ తో’ కూడా అలాంటి పాటే. కేదార్నాథ్ శర్మ రాసిన ఈ పాటకు తిమిర్ బారన్ సంగీతం సమకూర్చగా పహాడి సన్యాల్ పాడారు. ఈ చిత్రంలో దేవదాస్‌గా కేఎల్ సైగల్, పార్వతిగా జమున నటించారు. వేదాంతం రాఘవయ్య 1953లో తెలుగులో తీసిన ‘దేవదాసు’లో కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అనే పాటను సీఆర్ సుబ్బరామన్ రాయగా, ఘంటసాల వేంకటేశ్వరరావు పాడారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన విషయం తెల్సిందే. 1955లో బిమల్ రాయ్ తీసిన హిందీ దేవదాస్‌లో ‘జైసే తూ ఖుబూల్ కర్లే’ పాటను సాహిర్ లుథియాన్వీ రాయగా, ఎస్డీ బర్మన్ సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్ పాడారు. ఈ చిత్రంలో దేవదాస్‌గా దిలీప్ కుమార్, పార్వతిగా సుచిత్రసేన్ నటించారు. సంజయ్ లీలా బన్సాలీ 2002లో తీసిన దేవ్‌దాస్‌లో దేవదాస్ ఉడుకుతనం, కోపం వ్యక్తం వెనక దాగున్న ఆప్యాయత పట్ల పార్వతి కరుణ రసం చూపే ‘బయిరీ పియా’ పాటను నస్రత్ బదర్ రాయగా శ్రేయా గోషాల్, ఉదిత్ నారాయణ్ పాడారు. ఇస్మాయిల్ దర్బార్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో షారూక్ ఖాన్, ఐశ్యర్యరాయ్లు నటించారు. ఇక అనురాగ్ కాష్యప్ తీసిన దేవ్ డీ చిత్రంలో దేవదాస్ ఎంతదూరం పరుగెత్తినా ఏదో ఒక రాజు వెనక్కి రావాల్సిందే సమస్యలను ఎదుర్కోవాల్సిందే అన్న భావంతో సాగే ‘దునియా’ పాటను షెల్లీ రాయగా, స్వీయ సంగీత దర్శకత్వంలో అమిత్ త్రివేది పాడారు. చిత్రంలో హీరోహీరోయిన్లుగా అభయ్ డియోల్, మహీ గిల్ నటించారు. ఇప్పుడు దాస్ దేవ్‌కు దర్శకత్వం వహించిన సుధీర్ మిశ్రా ఉత్తమ చిత్ర దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఆయన హిందీలో తీసిన ‘హజారో క్వాయిష్ ఐసీ, ధారవి, చమేలి’ చిత్రాలు ప్రేక్షకులు, విశ్లేషకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన గతంలో కుందన్ షా దర్శకత్వంలో వచ్చిన ‘జానే భీ దో యారో’, విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘కామోష్’ చిత్రాలకు సహాయక దర్శకులుగా పనిచేశారు. -
ప్రముఖ నటుడు కన్నుమూత
కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటుడు పార్థ ముఖోపాధ్యాయ సోమవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 70 ఏళ్లు . గతకొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. చూడగానే పక్కింటి అబ్బాయిగా కనిపించే పార్థ 60వ దశకంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించారు. 1958లో 'మా' సినిమాతో బాలనటుడిగా అరంగేట్రం చేసిన ఆయన.. తపన్ సిన్హా తెరకెక్కించిన 'అతిథియా' సినిమాతో హీరోగా మారారు. రవీంద్రనాథ్ టాగోర్ కల్ట్ షార్ట్‌స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా తపన్ సిన్హా తెరకెక్కించిన 'అపోంజాన్' సినిమాలో కూడా హీరోగా కనిపించారు. బెంగాల్ లెజెండ్ హీరో ఉత్తమ్‌కుమార్ తమ్ముడు, కొడుకు పాత్రలకు ఆటోమేటిక్ చాయిస్‌గా పార్థ గుర్తింపు పొందారు. బాలిక బధూ (1967), ధోన్యి మెయే (1971), అగ్నిష్వర్ (1975), అమర్ పృథ్వీ (1985), బాగ్ బందీ ఖేలా (1975) పాపులర్ సినిమాల్లో ఆయన నటించాడు. ఎన్నో సినిమాల్లో గొప్ప అభినయాన్ని కనబర్చిన పార్థ ముఖోపాధ్యాయ బెంగాలీ సినీప్రేమికుల మదిలో ఎల్లప్పటికీ నిలిచి ఉంటారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్లో నివాళులర్పించారు. -
బెంగాలీలకు తీపి వార్తే ఇది..
కోల్‌కతా: బెంగాలీలకు తీపి వార్తే ఇది..రసగుల్లా..ఈ పేరు చెబితే నోరూరుతుంది. ఈ రసగుల్లా స్వీట్ మా ప్రాంతానిదేనంటూ భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు పోటీపడ్డాయి. అయితే, ఈ రసగుల్లా పశ్చిమ బెంగాల్‌కే చెందుతుందని ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన అనుబంధ సంస్థ జీఐ గుర్తింపునిచ్చింది. దీంతో పశ్చిమ బెంగాల్ తమతో పోటీ పడ్డ ఒడిశా మీద విజయం సాధించినట్లయింది. రసగుల్లా స్వీట్ పశ్చిమ బెంగాల్‌దేనని దీనికి భౌగోళిక గుర్తింపు లభించడం బెంగాలీ ప్రజలందరికీ తీయని వార్త అని ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. -
నటుడు కారుకు ప్రమాదం, మోడల్ మృతి
కోల్‌కతా: టాప్ మోడల్, యాంకర్, నటి సోనికా చౌహాన్ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె స్నేహితుడు, బెంగాలీ యువ నటుడు బిక్రమ్ ఛటోపాధ్యాయతో కలిసి కారులో వెళుతుండగా శనివారం ఉదయం లాకేమాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అనంతరం పేవ్మెంట్ ఎక్కేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కారులో చిక్కుకున్న బిక్రమ్, సోనికాను హుటాహుటీన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సోనికా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్రంగా గాయమైన బిక్రమ్‌కు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాదానికి గురైన టయోటా కారు పూర్తిగా ధ్వంసం అయింది. అయితే ప్రమాదం జరిగినప్పుడు బిక్రమ్ కారును అత్యంత వేగంగా నడుపుతున్నట్లు సమాచారం. అలాగే కారులో ఎయిర్ బ్యాగ్స్ కూడా పని చేయలేదని తెలుస్తోంది. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆధారాల కోసం ప్రమాదం జరిగిన ప్రదేశంలోని సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సోనికా చౌహాన్ మృతి పట్ల పలువురు బెంగాలీ నటులు సంతాపం తెలిపారు. కాగా బిక్రమ్ బెడ్రూమ్, మిస్టేక్, అమీ ఔర్ అమర్ గాళ్‌ఫ్రెండ్స్‌తో పాటు పలు బెంగాలీ చిత్రాల్లో హీరోగా నటించాడు. -
గంభీర్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు: తివారి
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బెంగాలీల గురించి ఢిల్లీ సారథి గౌతమ్ గంభీర్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని బెంగాల్ ఆటగాడు మనోజ్ తివారి ఆరోపించాడు. అలా చేయడం వల్లే తాను స్పందించాల్సి వచ్చిందన్నాడు. ‘గంగూలీ, బెంగాలీల గురించి గౌతీ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై దాదాతో మాట్లాడా. అనవసరంగా అతని పేరును లాగుతున్నారని సౌరవ్ బాధపడ్డారు. అయితే గంగూలీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మేం సహించం. గంభీర్ ఎలాగూ నిజం చెప్పడు. అతను చెబుతున్నట్లు నేనే గనుక తప్పు చేస్తే నాకెందుకు 40 శాతమే జరిమానా పడుతుంది. గంభీర్ తప్పు చేశాడో లేదో అతనికి విధించిన 70 శాతం జరిమానాను చూస్తే తెలిసిపోతుంది’ అని తివారి వెల్లడించాడు. స్లెడ్జింగ్ గురించి తాను పెద్దగా పట్టించుకోనని చెప్పిన తివారి, వేరొకరి తల్లిని దూషించడం సరైంది కాదన్నాడు. మరోవైపు మనోజ్ తివారి ఆరోపణలను గంభీర్ ఖండించాడు. తివారి దిగజారి మాట్లాడుతున్నాడని, తానెప్పుడూ గంగూలీని విమర్శించలేదని గంభీర్ వివరించాడు. వివాదాస్పద వ్యాఖ్యలు మాని... తివారి ఆటపై దృష్టి పెట్టాలని గంభీర్ హితవు పలికాడు. -
బెంగాలీలో భారీ క్రేజ్!
బాలీవుడ్లో ఇటీవల ఘనవిజయం సాధించిన చిత్రం ‘పీకు’. ఇందులో దీపికా పదుకొనే బెంగాలీ అమ్మాయిగా నటించారు. ఈ పాత్రలో దీపిక అందర్నీ ఆకట్టుకోగలిగారు. ముఖ్యంగా బెంగాలీ ప్రేక్షకులైతే దీపికకు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో బెంగాలీ దర్శక నిర్మాతలు ఆమెతో బెంగాలీ సినిమా చేయించే ప్రయత్నంలో ఉన్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే బెంగాలీ తెరపై దీపికను చూడొచ్చన్నమాట. -
మొదట్లో ఇబ్బంది అనిపించింది!
‘‘కలలో కూడా ఊహించనవి జరిగినప్పుడు.. అది కూడా మంచి విషయాలైనప్పుడు స్వీట్ షాక్‌లా ఉంటుంది. ‘సూర్య వెర్సస్ సూర్య’కు అవకాశం వచ్చినప్పుడు నాకలాంటి అనుభూతే కలిగింది. నా మాతృభాష బెంగాలీలో పలు చిత్రాల్లో నటించినా, ఓ కొత్త భాషలో అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అని త్రిధా చౌదరి అన్నారు. నిఖిల్ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘సూర్య వెర్సస్ సూర్య’ ఈ గురువారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా త్రిధా కథానాయికగా పరిచయమయ్యారు. ఈ చిత్రం తనకు మంచి గుర్తింపు తెచ్చిందని త్రిధా చెబుతూ -‘‘వాస్తవానికి నేను పగటిపూటను ఇష్టపడినంతగా రాత్రిని ఇష్టపడను. కానీ, ఈ చిత్రం షూటింగ్ ఎక్కువగా రాత్రిపూట జరిగింది. దాంతో మొదటి రెండు, మూడు రోజులు ఇబ్బంది అనిపించింది. ఆ తర్వాత అడ్జస్ట్ అయ్యా’’ అన్నారు. ప్రస్తుతం బెంగాలీలో ప్రముఖ దర్శకుడు కమలేశ్వర్ ముఖర్జీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాననీ, తెలుగు చిత్రాలకు సంబంధించి కథలు వింటున్నాననీ త్రిధా తెలిపారు. -
మహారుచులకు ఫిదా
పుట్టింది కోల్‌కతాలోనే అయినా, పెరిగింది మాత్రం భాగ్యనగరంలోనే. తెలుగు సంస్కృతితో మమేకమైన బెంగాలీ భామ శిల్పా చక్రవర్తి, తెలుగు అబ్బాయినే పెళ్లాడి, ఇక్కడే స్థిరపడింది. చిన్ననాటి నుంచి ఈ నగరంతో ముడివేసుకున్న అనుబంధాన్ని ఆమె ‘సిటీప్లస్’తో పంచుకుంది. బాల్యంలోని మధుర స్మృతులను నెమరువేసుకుంది. అవి ఆమె మాటల్లోనే.. మా అమ్మ, నాన్న ఇద్దరూ రైల్వే ఉద్యోగులు. మా నాన్నకు హైదరాబాద్ బదిలీ కావడంతో నేను నాలుగో క్లాస్ చదువుతున్నప్పుడు ఇక్కడకు వచ్చేశాం. మేం తార్నాకలో ఉండేవాళ్లం. నాకు అన్న ఉన్నాడు. నాకంటే ఐదేళ్లు పెద్ద. మా చదువులన్నీ రైల్వేకు సంబంధించిన విద్యాసంస్థల్లోనే సాగాయి. అమ్మ, నాన్న ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోవడంతో తినిపించడం, స్కూలుకు, కాలేజీకి తీసుకువెళ్లడం సహా నా పనులన్నీ అన్నయ్యే చూసుకునే వాడు. స్కూలుకి కాలినడకనే వెళ్లేదాన్ని. తోవలో బళ్ల మీద అమ్మే జాంకాయులు, రేగుపళ్లు కొనుక్కుని తినేదాన్ని. కాలేజీకి బస్సులో వెళ్లే దాన్ని. అలాంటి రోజులు మళ్లీ రావు. పెద్ద ఫుడీని.. మా స్వస్థలం కోల్‌కతా. మేం బెంగాలీలం. ఇక్కడకు వచ్చిన కొత్తలో ఆహారం విషయుంలో కాస్త ఇబ్బందులు పడ్డాం. బెంగాలీ వంటకాలైన కచోడీ, పూరీ, స్వీట్లకు అలవాటు పడిన మేం ఇక్కడి రుచులకు అలవాటు పడటానికి కొంత టైమ్ పట్టింది. నిజానికి నేను పెద్ద ఫుడీని. అప్పట్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర స్వాతి హోటల్లో వడలు చాలా టేస్టీగా ఉండేవి. చట్నీస్ రెస్టారెంట్లో ఆచారి ఇడ్లీ, స్టీమ్డ్ దోశ కూడా ఇష్టంగా తింటాను. ఇంటర్నెట్లో వెదికి మరీ కొత్త కొత్త రుచులతో ప్రయోగాలు చేస్తుంటా. చిన్నప్పటి నుంచి సిటీతో మమేకం కావడంతో ఇక్కడి బిర్యానీకి, రంజాన్ సీజన్లో హలీంకు బాగా అలవాటు పడిపోయూ. ఈ ప్రాంతంతో మమేకమైన నేను పక్కా తెలుగు అబ్బాయిని పెళ్లాడాను. స్కూల్లో చదువుకునే రోజుల్లో నేనే లీడర్‌గా ఉండేదాన్ని. కల్చరల్ షోస్, స్టేజ్ షోస్‌లో పాల్గొనేదాన్ని. చదువులో మంచి మార్కులే వచ్చేవి. ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్‌లోని ఓయుూ అఫిలియేటెడ్ సాయి సుధీర్ కాలేజీ నుంచి ఎంబీఏ (హెచ్ఆర్) పూర్తిచేశాను. చదువుకునే రోజుల నుంచి నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లందరితో ఇప్పటికీ టచ్‌లో ఉంటుంటాను. శిల్పారామం చాలా ఇష్టం.. సిటీలో నాకు శిల్పారామం అంటే చాలా ఇష్టం. అక్కడి కళాకృతులు, ఆభరణాలు నన్నెంతో ఆకట్టుకుంటాయి. నేను తరచూ అక్కడకు వెళుతుంటాను. చిన్నప్పుడు ఒకసారి ఫ్యామిలీ అంతా యాదగిరిగుట్టకు వెళ్లాం. చాలా అద్భుతమైన ప్రదేశం. మా నాన్న ఎక్కువగా పూజలు చేస్తుంటారు. సికింద్రాబాద్‌లోని కీస్ హైస్కూల్లో మా బెంగాలీ అసోసియేషన్ వాళ్లు ఏటా దసరా వేడుకలను ఘనంగా జరుపుతారు. ఆ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటుంటాను. ఇక డ్యాన్స్ నా ఫేవరేట్ హాబీ. కథక్ డ్యాన్స్‌లో డిప్లొమా కూడా చేశా. లలితకళాతోరణంలో తొలి ప్రదర్శన ఇచ్చా. హైదరాబాదీలు మంచి కళాభిమానులు. ఇక్కడి ప్రజలు నాకు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. నెల్లాళ్ల కిందటే అమెరికా వెళ్లి, ‘ఆటా’ వేడుకల్లో కథక్ ప్రదర్శన ఇచ్చా. హైదరాబాద్ సిటీ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడి చారిత్రక ప్రదేశాలైన చార్మినార్, గోల్కొండ వంటి వాటి పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అవకాశం ఉంటే ఈ దిశగా చేపట్టే ప్రచారంలో పాల్గొనేందుకూ నేను సిద్ధం. -
సర్కారీ పథకాలే బెస్ట్: గంగూలీ
సెలబ్రిటీలంటే ఎడాపెడా సంపాదిస్తారు కనుక వారి ఇన్వెస్ట్మెంట్లు కూడా అలాగే ఉంటాయనుకుంటాం. కానీ కష్టపడి సంపాదించిన సొమ్ము కాబట్టి ప్రతి పైసాను చాలా జాగ్రత్తగా చూసుకుంటామంటున్న సెలబ్రిటీల కథలివి... బెంగాలీ బాబు.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీపై క్రికెట్ అభిమానులకున్న ఇష్టం అంతా ఇంతా కాదు. అందుకే ఆటగాడిగానే కాక కెప్టెన్‌గా కూడా సుదీర్ఘ ఇన్సింగ్స్ ఆడాడు గంగూలీ. మరి పెట్టుబడుల గురించి గంగూలీ ఏమంటారు? తనైతే ఏం చేస్తారు? ఆయన అభిప్రాయమేంటి? ఆయన మాటల్లోనే చూద్దాం.. నా ఉద్దేశంలో ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. మనకు ఏ రంగమైతే బాగా తెలుసో, ఎక్కడైతే మనకు అనుభవం ఉందో అక్కడే పెట్టుబడి పెట్టాలి. అంతేతప్ప మనకు తెలియని, అనుభవం లేని రంగం ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నా దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే మనం పెట్టే పెట్టుబడి మనకు నష్టాలు మిగల్చదన్న నమ్మకం మొదట మనకు కలగాలి. నా వరకూ మాత్రం నేను సురక్షితమైన పెట్టుబడులనే ఆశ్రయిస్తాను. ఏ మాత్రం రిస్కున్నా దూరంగా ఉంటాను. నాకు అనుభవం లేని, నాకు తెలియని రంగాల వైపు చూడనే చూడను. ఎక్కువగా ప్రభుత్వ మద్దతున్న రంగాలు, ఇన్వెస్ట్మెంట్లనే ఆశ్రయిస్తాను. పైవేటు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయను. ఇంకా చెప్పాలంటే ప్రైవేటు బ్యాంకులను కూడా పెద్దగా నమ్మను. ప్రభుత్వ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేస్తా. దానివల్ల నేను, నా ఇన్వెస్ట్మమెంట్లు సేఫ్‌గా ఉంటాయి. ఎందుకంటే ప్రతి పైసా మనం కష్టపడి సంపాదించిందే. పోగొట్టుకుంటే మళ్లీ సంపాదించటం కష్టం. అయితే వ్యాపారాలు చేసేవారు కూడా ఇలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్లు చేద్దామనుకుంటే కుదరదు. వ్యాపారంలో రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్నచోటే లాభం కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి వారు ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందో, ఎక్కడ వృద్ధికి అవకాశం ఉందో అక్కడ పెట్టుబడులు పెట్టాలి. ఇక్కడ మనం గమనించాల్సిందొకటి ఉంది. జీవితానికి గ్యారంటీ లేదు. రేపు ఏం జరుగుతుందో తెలీదు. అందుకే మనకు అనుభవం, నైపుణ్యం ఉండి... మన అదుపులో ఉండేచోటే ఇన్వెస్ట్ చేయాలన్నది ఎవరికైనా నేను చెప్పే సలహా. -
మంత్రి అనుచరుల్లో ఆధిపత్యపోరు
గోదావరిఖని, న్యూస్‌లైన్ : మంత్రి శ్రీధర్‌బాబు అనుచరుల ఆధిపత్యపోరు స్థానిక స్వర్ణకారులు, బెంగాలీ స్వర్ణకారుల మధ్య చిచ్చు పెట్టింది. బెంగాలీ నుంచి వచ్చిన స్వర్ణకారుల వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని, వారు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని స్థానిక స్వర్ణకారులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి అనుచరుల్లో ఒకరు బెంగాలీలకు, మరొకరు స్థానిక స్వర్ణకారులకు నాయకత్వం వహిస్తున్నారు. బెంగాలీలకు మద్దతుగా నిలిచిన నేతలకు పెద్దమొత్తంలో డబ్బులు అందినట్లు ఖనిలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక స్వర్ణకారులు బుధవారం గోదావరిఖనిలో దుకాణాలు బంద్ చేసి సమావేశమవుతున్నారు. బెంగాలీ స్వర్ణకారులు ఇప్పటికే రెండు రోజులుగా తమ దుకాణాలు మూసి ఉంచుతున్నారు. గోదావరిఖని పట్టణంలో 45 బంగారం, వెండి వర్తక దుకాణాలుండగా... నగలను హైదరాబాద్, బెంగళూర్, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల నుంచి తెప్పించేవారు. సమయం, దూరాభారం, భద్రతా భయాలను ఆలోచించిన ఓ వ్యాపారి 22 ఏళ్ల కిత్రం పశ్చిమబెంగాల్ నుంచి ఇద్దరు పనివారిని తీసుకువచ్చి స్థానికంగా నగలు తయారు చేయిం చడం మొదలుపెట్టాడు. కాలక్రమంలో వీరి ద్వారా పశ్చిమబెంగాల్లోని హుబ్లీ, మెంతినిపూర్ తదితర జిల్లాలకు చెంది న చాలా మంది నగల తయారీకి గోదావరిఖని వచ్చారు. ప్రస్తుతం వారు 200 మంది వరకు ఉన్నారు. పనితనం బాగుండడంతోపాటు సమయానికి నగలు చేసి ఇస్తుండడంతో స్థానిక వర్తకులే కాకుండా కరీంనగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, మంథని తదితర ప్రాంతాల వ్యాపారులు కూడా వీరికి ఆర్డర్లు ఇస్తున్నారు. స్థానిక స్వర్ణకారుల పిల్లలు చదువుపై దృష్టి పెట్టడంతో వృత్తిని భర్తీ చేసేవారు కరువయ్యారు. కొందరు ఉన్నా... పాత పద్ధతుల్లోనే నగలు తయారు చేస్తుండడంతో బెంగాలీవారికే ఆర్డర్లు ఎక్కువయ్యాయి. ఈ తరుణంలో స్థానిక స్వర్ణకారులకు, బెంగాలీ పనివారికి మధ్య అంతర్యుద్దం మొదలై ఎనిమిదేళ్ల క్రితం బెంగాలీలను కిడ్నాప్ చేసే వరకు వెళ్లింది. ఇప్పుడేం జరుగుతోంది? స్థానిక స్వర్ణకారుల సంఘానికి మంత్రి అనుచరుడైన ఓ నాయకుడు నాయకత్వం వహిస్తే... బెంగాలీ పనివారికి మరో అనుచరుడు అండగా నిలిచాడు. ఈ తరుణంలో బెంగాలీలు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కొద్ది రోజుల క్రితం స్థానిక స్వర్ణకారులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి వివిధ పార్టీల మద్దతు కూడగట్టారు. కొంత మంది బెంగాలీలను పంపించేందుకు జాబితా తయారు చేశారు. బెంగాలీలకు అండగా నిలిచిన నాయకుడు మరో నేతతో కలిసి దేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉంటుందని చెప్పడంతో బెంగాలీలను పంపించే కార్యక్రమం నిలిచిపోయింది. ఇందుకుగాను బెంగాలీలు సదరు నాయకులకు పెద్ద మొత్తంలో ‘నజరానా’ ముట్టజెప్పినట్టు ప్రచారం జోరందుకుంది. ఆధిపత్యం చెలాయించేందుకు ఈ ఇద్దరు నాయకులు తమ ప్రతాపాన్ని స్థానిక స్వర్ణకారులు, బెంగాలీ పనివారిపై చూపిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. స్వర్ణకారుల్లో చిచ్చుపెట్టి నేతలు లబ్ధిపొందుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
సిసలైన బెంగాలీ అనిపించుకుంటా: షారూఖ్
కోల్‌కతా: తాను సిసలైన బెంగాలీ అనిపించుకుంటానని బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ అన్నారు. జయా బచ్చన్ నుంచి బెంగాలీ నేర్చుకుంటానని తెలిపారు. 19వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(కేఐఎఫ్ఎఫ్) ప్రారంభోత్సవానికి షారూఖ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను ఆదరించినందుకు బెంగాలీ వాసులకు ధన్యావాదాలు తెలిపారు. 'నన్ను మీ వాడిగా అక్కున చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు. గత మూడేళ్లుగా కేఐఎఫ్ఎఫ్కు హాజరవుతున్నాను. మరోసారి మీ ముందు వచ్చేటప్పకి తప్పకుండా బెంగాలీలో మాట్లాడతాను. జయా బచ్చన్ దగ్గర బెంగాలీ నేర్చుకుని సిసలైన బెంగాలీ పౌరుడిగా మీ ముందు ఉంటా' అని షారూఖ్ అన్నారు. పశ్చిమ బెంగాల్‌కు షారూఖ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. జయా బచ్చన్ అంతకుముందు ప్రారంభోపన్యాసం చేస్తూ తన భర్త అమితాబ్, షారూఖ్, కమల్ హాసన్‌లను సిసలైన బెంగాలీలు కాదని పేర్కొన్నారు. -
దుర్గా పందిళ్లకు ద్రవ్యోల్బణం పోటు
సాక్షి, న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం ప్రభావం నగరంలోని దుర్గా పూజా పందిళ్లపై కూడా కనిపిస్తోంది. నగరంలో ఎప్పటి మాదిరిగానే దసరా సందర్భంగా దుర్గా పూజ వేడుకలు నిర్వహించడానికి విభిన్న దుర్గా పూజా సమితులు గత రెండు నెలలుగా సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నెల తొమ్మిది నుంచి ప్రారంభమయ్యే ఐదు రోజుల ఉత్సవాల కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయని పూజా సమితులు చెబుతున్నాయి. రాజధాని నగరంలో బెంగాలీలు అధికంగా ఉండటంతో ఇక్కడ కూడా దుర్గా పూజోత్సవాలను ఆడంబరంగా నిర్వహిస్తారు. విభిన్న ఇతివృత్తాలతో విగ్రహాల తయారీ, పందిళ్ల రూపకల్పనతో పాటు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలతో పాటు భక్తులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. కాగా గ్లామర్‌తో పాటు వైభవాన్ని, భక్తిని మేళవించి వైభవంగా జరుపుకునే దుర్గా పూజా వేడుకలపై ఈసారి ద్రవ్యోల్బణం ప్రభావం పడింది. ఆర్థిక మాంద్యం కారణంగా సమితులకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చే కార్పొరోట్ సంస్థలు చిన్న మొత్తాలతోనే ఈసారి సరిపెట్టాయి. మరోవైపు దుర్గా పూజ నిర్వహణ ఖర్చు మూడింతలు పెరిగింది. దీంతో దుర్గాపూజ సమితులు తమ బడ్జెట్లను కుదించి ఖర్చులకు కోత విధించకతప్పడం లేదు. ఖర్చులు పెరిగిన కారణంగా ఇదివరలో మాదిరిగా ఈ ఉత్సవాల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌ల నుంచి సుప్రసిద్ధ కళాకారులను రప్పించడం లేదని పూజా సమితి సభ్యులు చెబుతున్నారు. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం ముఖ్యంగా ఇంధనం చార్జీలు, కరెంటు చార్జీలు, కూలీ రేట్లు, పళ్లు, కూరగాయల ధరలు పెరగడంతో ఐదు రోజుల ఉత్సవాని కయ్యే ఖర్చుకు పరిమితులు విధించకతప్పడం లేదని వారు అంటున్నారు. సందర్శకుల వినోదం కోసం ప్రతి సంవత్సరం పశ్చిమ బెంగాల్ నుంచి కళాకారులను విమానంలో రప్పించేవారమని కానీ ఈ యేడాది స్థానిక కళాకారులతోనే కార్యక్రమాలను రూపొందించామని గ్రేటర్ కైలాష్ పార్ట్-2లో దుర్గోత్సవ్ వేడుక నిర్వహించే పూజా సమితి సభ్యుడు చెప్పారు. ఈ పూజా సమితి గడిచిన 22 సంవత్సరాలుగా గ్రేటర్ కైలాష్‌లో దుర్గాపూజా వేడుకలను నిర్వహిస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో ఈ సంవత్సరం బడ్జెట్‌ను అదుపులో పెడుతున్నామని, డోలు వాయించే ఢాఖీల సంఖ్యను కూడా తగ్గించామని ఆయన చెప్పారు. ప్రతిసంవత్సరం ఏదో ఒక ఇతివృత్తంతో పూజా పందిరి వేసేవారమని, కానీ ఈ సంవత్సరం ఇదివృత్తం లేకుండా నిరాడంబరంగా పండల్ రూపొందిస్తున్నామని పుష్పవిహార్ ఎంబీ రోడ్ పూజాసమితి అధ్యక్షుడు చెప్పారు. కశ్మీరీగేట్ ప్రాంతంలో గత 104 సంవత్స రాలుగా ఇక్కడ పండల్ ఏర్పాటు చేస్తున్నారు. పండల్ వద్ద భోజనశాలలు కూడా నిర్వహిస్తారు. ఇంకా సీఆర్ పార్క్, మయూర్ విహార్‌లో మిలన్ పూజా కమిటీ, సఫ్దర్‌జంగ్ ఎన్క్లేవ్ ప్రాంతాల్లో ఉత్సవాలు భారీగా నిర్వహిస్తారు.