‘రాయ్ బెంగాల్ టైగర్’తో ఇక ఆ బాధ లేదు!
శ్రద్ధాదాస్ కథానాయికై ఐదేళ్లవుతోంది. ఈ ఐదేళ్లల్లో తన మాతృభాష బెంగాలీలో నటించే అవకాశం రాలేదామెకు. దాంతో రచ్చ గెలిచినా ఇంట గెలవలేదనే బాధ ఈ బ్యూటీకి ఉంది.
అయితే ఇప్పుడు శ్రద్ధా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే బెంగాలీ మూవీ ‘రాయ్ బెంగాల్ టైగర్’లో నటించే అవకాశం వరించింది. హిందీలో ఎ వెన్స్‌డే, స్పెషల్ 26 లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన నీరజ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బెంగాలీ సూపర్ స్టార్స్ అభిర్ చటర్జీ, జీత్ కాంబినేషన్‌లో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని శ్రద్ధా తెలిపారు. ఈ చిత్రానికి రాజేష్ గంగూలీ దర్శకుడు.