ఆటోను దొంగిలిస్తూ దొరికి పోయిన..పశ్చిమ బెంగాల్ దొంగ దృశ్యం
కారేపల్లి: ఓ వైపు బిహార్ దొంగలు ఇంట్లోకి చొర బడి పిల్లలను ఎత్తుకెళ్లిపోతున్నారు, అడ్డు వచ్చిన వారిని హతమార్చుతున్నారు..అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అపోహలు పెరిగిపోయి.. రాత్రి వేళల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పుకార్లుతో ప్రజలు బెంబేలెత్తి పోతుంటే...! తాజాగా కారేపల్లిలో ఓ బెంగాలీ యువకుడు ఆది వారం తెల్లవారు జామున ఆటోను దొంగిలిస్తూ పట్టు పడిన ఘటనతో కారేపల్లిలో మరొక్కసారి అలజడి ప్రారంభమైంది.
ఈ మధ్య కాలంలో కారేపల్లిలో నాటు వైద్యం పేరుతో ఇద్దరు మహిళలు పట్టపగలే ఇంటి తలుపులు కొడుతూ.. మీకు ఆ రోగం తగ్గిస్తాం, ఈ రోగం తగ్గిస్తాం అంటూ అనుమానాస్పదంగా తిరిగి, చివరికి గ్రామస్తుల చేతికి చిక్కి పోలీసులకు అప్పగించిన ఘటన మరువక ముందే..ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఈ బెంగాల్ దొంగ ఘటన ప్రజల్లో మరోక్క సారి భయాందోళనను రేకెత్తించింది.
పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లా చెందిన మోహన్ బిస్వాల్ అనే యువకుడు గత నెల 30వ తేదీన పశ్చిమ బెంగాల్ నుంచి తమ బ్యాచ్ (ముఠా)తో కలిసి హైదరాబాద్‌లోని షేరులింగం పల్లి వద్ద కాంట్రాక్టర్ ఇమ్రాన్ అహ్మద్ వద్ద కన్‌స్ట్రక్షన్ పనుల్లో భాగంగా హెల్పర్‌గా పని చేసేందుకు వచ్చాడు. దీనికి సంబంధించి డిసెంబర్ 31వ తేదీ వరకు వ్యాలిడిటీతో అతని వద్ద సరోవర్ జెనిత్ కంపెనీలో పని చేసేందుకు కార్డు సైతం ఉంది.
ఇదిలా ఉండగా..తన ముఠాతో పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్ వచ్చిన మోహన్ బిస్వాల్..తప్పిపోయి హైదరాబాద్‌లోని కాకతీయ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కాడు. తన ముఠా కన్పింక క పోవటంతో..తనకు వచ్చిన బెంగాళీ బాషలో అడ్రస్ చెప్పాలంటూ ట్రైన్‌లో సైతం ప్యాసింజర్‌లను విసిగించటం, శనివారం అర్థ రాత్రి వరకు ఆ బోగీలో ఉన్న వారిని సైతం లేపి ఇబ్బందులకు గురి చేయటంతో అతన్ని..కారేపల్లి రైల్వే స్టేషన్ వద్దకు రాగానే ఆదివారం తెల్లవారుజాము 3 గం టల సమయంలో బలవంతంగా దింపివేశారు.
దీంతో అయోమయానికి గురైన మోహన్ బిస్వాల్ ఏమి చేయాలో తోచక..కారేపల్లిలో ఒంటరిగా కలియతిరుగుతూ..భారత్‌నగర్‌కు చేరు కున్నాడు. ఈ క్రమంలో ఏమిచేయాలో తోచని మోహన్ బిస్వాల్ రోడ్డు ప్రక్కనే ఉన్న ఆటోను నెట్టుకుంటూ..రోడ్డు పైకి తెచ్చాడు.
ఆటోలో ఎటేపైన వెళ్దామనుకున్నాడో..ఏమో తెలియని బిస్వాల్ ఆటో ఎంతకు కదలక పోవటంతో..అదే ఇంటిలోని కుంటుంబ సభ్యులను నిద్ర లేపి..తనకు వచ్చిన బెంగాలి బాషతో వారిని బెంబేలెత్తించాడు. దీంతో దొంగ దొంగ అని అరవటంతో..చుట్టు ప్రక్కల వాళ్లు అక్కడికి చేరుకొని..ఇతడు దొంగేనని తలంచి దేహశుద్ది చేశారు. అనంతరం తాళ్లతో కట్టివేసి కారేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment