బాలీవుడ్ సినిమా ‘స్త్రీ–2’లోని ‘ఆజ్ కీ రాత్; పాట ఇప్పటికీ హల్‌చల్ చేస్తూనే ఉంది. ‘బిల్‌బోర్డ్’ చాట్‌లో టాప్‌లో ఉంది. మధుబంటి బాగ్చీ ఆలపించిన ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ బెంగాలీ సింగర్, కంపోజర్ గురించి తెలుసుకుందాం. హిందుస్థానీ క్లాసికల్ వోకల్ మ్యూజిక్ ఆగ్రా ఘరానాలతో పరిచయం ఆమె ఆస్తి. మన శాస్త్రీయ సంగీతం నుంచి పాశ్చాత్య పాప్ వరకు ఆమె గొంతులో అలవోకగా వినిపిస్తాయి.
పశ్చిమ బెంగాల్‌లోని బలూర్‌ఘూట్ ఆమె స్వస్థలం. తండ్రి ప్రొఫెసర్. తల్లి వ్యాపారవేత్త. కోల్కత్తాలోని ‘హెరిటేజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో డిగ్రీ, కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ నుంచి లేజర్ అండ్ ఆప్టికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసింది. బెంగాలీ మ్యూజిక్ బ్యాండ్ ‘మృతిక’తో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించింది. బెంగాలీ చిత్రం ‘అమీ ఆర్ అమర్ గర్ల్‌ఫ్రెండ్స్’తో చిత్రరంగంలోకి అడుగుపెట్టింది.
(చదవండి: ఇన్ఫోసిస్, విప్రోలాంటి సంస్థల్లో ఉద్యోగం కాదనుకుని కానిస్టేబుల్‌గా..!)
Comments
Please login to add a commentAdd a comment