సాక్షి, హైదరాబాద్: సో హ్యాపీ ఇట్ హర్ట్స్ అంటూ నగరవాసుల హృదయాలను టచ్ చేయనున్నారు కెనడియన్ రాక్ స్టార్ బ్రియాన్ ఆడమ్స్. ప్రపంచవ్యాప్త టూర్‌లో భాగంగా మన దేశానికి వచ్చి గత 10న షిల్లాంగ్‌లో ప్రదర్శనతో ఇండియా టూర్ ప్రారంభించారు. బ్రియాన్ ఆడమ్స్ (Bryan Adams) గుర్‌గ్రామ్, ముంబయి, బెంగళూర్‌ల తర్వాత మన నగరంలో ఈ నెల 16న జరిగే ప్రదర్శనతో యాత్ర ముగించనున్నారు. ఇది కేవలం ఒక గాన ప్రదర్శనకు మాత్రమే పరిమితం కాదని, అహూతులతో సంపూర్ణ సంగీత యాత్ర చేయిస్తుందని నిర్వాహకులు అంటున్నారు.
‘సమ్మర్ ఆఫ్ 69, ఎవ్రీ థింగ్ ఐ డూ ఐ డూ ఇట్ ఫర్ యూ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, రన్ టూ యూ, 18 టిల్ ఐ డై...తదితర తన సూపర్ హిట్ ఆల్బమ్స్‌తో పాటు తాజాగా వస్తున్న సో హ్యాపీ ఇట్ హర్ట్స్’ లతో శ్రోతలను అలరించనున్నాడు ఈ సింగర్ అండ్ రైటర్. నగరంలో ఎయిర్‌పోర్ట్‌లోని జీఎంఆర్ ఎరీనాలో ఈ సంగీత ప్రదర్శన రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. రాక్ సంగీత ప్రియులు బుక్ మై షో ద్వారా ఎంట్రీ పాస్‌లను కొనుగోలు చేయవచ్చు.
చదవండి: 15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలి
ఇకపై డిజిటలైజ్డ్.. కాన్ఫరెన్స్‌లు
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో సమావేశాల తీరుతెన్నులు సమూలంగా మారిపోనున్నాయని డిజిటల్ మీటింగ్స్ ఊపందుకోనున్నాయని ఆడియో, వీడియో నిపుణులు స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక ఆడియో ఉత్పత్తులకు పేరొందిన సెన్‌హీజర్, క్రెస్ట్రాన్ బ్రాండ్స్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌లో కాన్ఫరెన్స్‌లు– ఆడియో, వీడియో టెక్నాలజీ అంశంపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రకరకాల అత్యాధునిక పరికరాల పనితీరును వీడియో సహితంగా వివరించారు. నగరానికి చెందిన వందలాది మంది ఆడియో వీడియో పరికరాల నిపుణులు, వినియోగదారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment