rock star
-
రాక్స్టారిణి
‘రాక్‌స్టార్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నర్గీస్ ఫక్రీ మద్రాస్‌కేఫ్, డిష్యుం, హౌజ్‌ఫుల్–3...మొదలైన సినిమాలతో అలరించింది. హాలీవుడ్ సినిమా ‘స్పై’లోనూ నటించింది. ‘అమావాస్య’ సినిమాతో ఈమధ్య తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ‘రాక్‌స్టార్ యాక్ట్రెస్’గా పిలుచుకునే నర్గీస్ ఫక్రీ అంతరంగ తరంగాలు ఇవి... అమ్మ స్ఫూర్తితో... చాలా విషయాల్లో అమ్మే నాకు స్ఫూర్తి. ఆమె చెకోస్లోవేకియాలో పుట్టింది. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయినా ప్రపంచాన్ని చూడాలనే కోరిక ఆమెలో బలంగా ఉండేది. దీంతో దేశం విడిచి వెళ్లింది.‘రెఫ్యూజీ క్యాంప్’లో నివసించింది. న్యూయార్క్‌కు వెళ్లిన తరువాత...ఇంగ్లిష్ రాక ఇబ్బందులు పడింది. ఆమెకు తెలిసిన వృత్తి కూడా అక్కడ ఉపయోగపడలేదు. దీంతో ఒక రెస్టారెంట్లో క్లీనర్‌గా పనిచేసింది.రాత్రి రెస్టారెంట్ పని, పగలు ఇంగ్లిష్ క్లాసులకు వెళ్లేది. ‘ఇంత కష్టం అవసరమా!’ అని ఎప్పుడూ అనుకోలేదు. బాబోయ్ ఎలుగు! నా పన్నెండవ ఏట అమ్మ నన్ను సమ్మర్‌క్యాంప్‌కు పంపింది. ఇది లో–ఇన్కమ్ ఫ్యామిలీల కోసం ఏర్పాటైన క్యాంపు. టెంటులలో ఉండేవాళ్లం. ఈ క్యాంపు పుణ్యమా అని పనులు సొంతంగా చేసుకోవడం నేర్చుకున్నాను. నీళ్లు తెచ్చుకోవడం, వంట చేయడం, ఊడ్చడం వరకు...ఎన్నో పనులు చేశాను. ఒకరోజు మా క్యాంప్‌లోకి ఒక ఎలుగు వచ్చి నానాబీభత్సం సృష్టించింది. వెంటనే తట్టాబుట్టా సర్దుకొని వేరే చోట క్యాంప్ చేశాం! సొంతకాళ్లపై... సమ్మర్‌క్యాంప్ అనుభవాలు వృథా పోలేదు. నా కాళ్ల మీద నేను నిలబడడానికి ఉపయోగపడ్డాయి. ఇల్లు శుభ్రపరచడం, బాటిల్స్ కలెక్ట్ చేసి అమ్మడం...ఇలా చిన్నాచితకా పనులు చేసి నా చదువుకు అవసరమైన డబ్బు నేనే సంపాదించుకునేదాన్ని. చదువుకునే రోజుల్లో టీచర్ కావాలనుకున్నాను. ఆర్ట్ థెరపీ నేర్చుకోవాలనుకున్నాను. కానీ అలా జరగలేదు. నటిని అయ్యాను. నటించాలని కానీ, నటిస్తానని కానీ ఎప్పుడూ అనుకోలేదు. అమ్మలాగే ప్రయాణాలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. మోడలింగ్‌లోకి రావడం ద్వారా కొత్తప్రదేశాలు చూడటంతో పాటు డబ్బు సంపాదించే అవకాశం దొరికింది. మేలు చేసింది! కోపెన్‌హాగెన్‌లో నివసించే రోజుల్లో(2010)లో ‘రాక్‌స్టార్’ అడిషన్ కోసం బాలీవుడ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ అసిస్టెంట్ సునయన నుంచి మెయిల్ వచ్చింది. ‘‘నాకు హిందీ రాదు’’ అని చేతులెత్తేశాను. కానీ ఇంతియాజ్ సుమారు ఆరుగంటల పాటు మాట్లాడి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అలా ముంబై దారి పట్టాను. ఇక్కడే హిందీ, నటన నేర్చుకున్నాను. కొత్త జీవితాన్ని ప్రారంభించాను. -
పోర్న్ స్టార్ కు అండగా బాలీవుడ్!
ముంబై: ఓ ప్రముఖ టీవీ చానల్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సెక్సీ తార సన్నీ లియోన్ ఎన్నో చిక్కు ప్రశ్నలను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఆ ప్రశ్నల సమాచారం తెలుసుకున్న బాలీవుడ్ జనాలు చాలా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ ఇండో-కెనడియన్‌కు బాసటగా నిలిచారు. కొందరు ఆమెను 'రాక్ స్టార్' అని పొగుడుతుంటే.. మరికొందరు ఆమె ఓపికగా సమాధానాలు ఇచ్చిన విధానాన్ని మెచ్చుకుంటున్నారు. పోర్న్ స్టార్‌గా ముద్రపడిన సన్నీ నటించిన 'మస్తిజాడే' మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే, యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఈ అమ్మడికి ఎలా స్పందించాలో చాలాసేపు అర్థం కాలేదట. ఆ ప్రశ్నలలో కొన్నింటిని చూద్దాం మరి... యాంకర్ ప్రశ్నలు: ⇒ చాలా మంది భార్యలు వారి భర్తలకు మీ నుంచి ఏమైనా సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. దీనిపై ఎలా స్పందిస్తారు? ⇒ ఆమీర్ తో కలిసి నటించాలని మీరు అనుకుంటున్నారు. కానీ మీతో కలిసి ఆమీర్ నటిస్తాడని అనుకుంటున్నారా? అని ఇటీవలే ఓ నేత అడిగిన ప్రశ్నను మళ్లీ సన్నీని అడిగాడు. ⇒ భారత బ్రాండ్ అంబాసిడర్(ప్రచారకర్త)గా మిమ్మల్ని ఎంపికచేస్తే.. అది ప్రమాదానికి సంకేతం కాదంటారా? ⇒ మీరు ఇండియాకి వచ్చిన తర్వాతే దేశంలో పోర్న్ వీక్షకులు పెరిగారు. ప్రపంచంలోనే మనం మొదటి స్థానానికి చేరాం. ఈ ప్రశ్నలకు సన్నీ ఎంతో ఓపికగా, చాలా నేర్పుగా.. బ్యాలెన్స్డ్గా బదులిచ్చిందట. అయితే, బాలీవుడ్ ఇండస్ట్రీ సన్నీ జవాబులకు ఫిదా అయిపోయింది. చాలా మంది ఆమెకు మద్దతు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. రిషి కపూర్: ఇది చాలా అనాగరికమైన ఇంటర్వ్యూ. ఇది పద్ధతి కాదు. అయినా తన నెక్ట్స్ మూవీ కోసం పంటి బిగువన బాధను భరించింది. ఆలియా భట్: అసలు అది ఇంటర్వ్యూ కానే కాదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. దియా మిర్జా: ఒకే ప్రశ్నను ఇరవై సార్లు అడిగాడు. అంటే... అతడు కోరిన విధంగా సన్నీ జవాబివ్వలేదని ఇలా చేశాడు. సుశాంత్ ఎస్ రాజ్‌పుత్: ఆడవాళ్లని ఎలా గౌరవించాలో అతడికి నేర్పించాలి. మిలప్ జవేరి: సన్నీ నిజంగా ఓ 'రాక్ స్టార్'. శృతి సేత్: చివరికి ఆ వ్యక్తిపై ఆమె గెలిచింది. సన్నీ తన దయ, ఓపికతో విజయం సాధించింది. -
మోదీ రాక్ స్టారే.. కానీ
పనాజీ: ఇంటా-బయటా తనదైన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీని రాక్ స్టార్ గా ఒప్పుకుంటూనే కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. విదేశీ టూర్లతో బిజీగా ఉన్న మోదీ.. దేశ ప్రధాని అనే సంగతిని కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదని గోవా కాంగ్రెస్ అధికార ప్రతినిధి టామ్ వాడాక్కాన్ ఎద్దేవా చేశారు. శనివారం రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో మోదీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. 2014 సాధారణ ఎన్నికల్లో గెలిచిన మోదీ.. విదేశీ పర్యటలనపై అమితాసక్తి కనబరుస్తున్నారని మండిపడ్డారు. 'మోదీ ఒక రాక్ స్టారే. నేను ఒప్పుకుంటాను. దేశానికి మాత్రమే ఆయన ప్రధాని. బీజేపీకి ప్రధాని కాదు అనే విషయం గుర్తించుకోవాలి' వాడాక్కాన్ అన్నారు. ఈ దేశానికి ప్రధాని అనే కనీస బాధ్యతను మరిచిపోతున్న నరేంద్ర మోదీ.. కేవలం విదేశీ మట్టి గురించే మాత్రమే మాట్లాడుతుండటం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు.