పోర్న్ స్టార్ కు అండగా బాలీవుడ్! | You're a rockstar, says B-Town on Sunny Leone | Sakshi
Sakshi News home page

పోర్న్ స్టార్ కు అండగా బాలీవుడ్!

Published Tue, Jan 19 2016 7:08 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

పోర్న్ స్టార్ కు అండగా బాలీవుడ్! - Sakshi

పోర్న్ స్టార్ కు అండగా బాలీవుడ్!

ముంబై: ఓ ప్రముఖ టీవీ చానల్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సెక్సీ తార సన్నీ లియోన్ ఎన్నో చిక్కు ప్రశ్నలను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఆ ప్రశ్నల సమాచారం తెలుసుకున్న బాలీవుడ్ జనాలు చాలా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ ఇండో-కెనడియన్కు బాసటగా నిలిచారు. కొందరు ఆమెను 'రాక్ స్టార్' అని పొగుడుతుంటే.. మరికొందరు ఆమె ఓపికగా సమాధానాలు ఇచ్చిన విధానాన్ని మెచ్చుకుంటున్నారు.  పోర్న్ స్టార్గా ముద్రపడిన సన్నీ నటించిన 'మస్తిజాడే' మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే, యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఈ అమ్మడికి ఎలా స్పందించాలో చాలాసేపు అర్థం కాలేదట. ఆ ప్రశ్నలలో కొన్నింటిని చూద్దాం మరి...

యాంకర్ ప్రశ్నలు: ⇒ చాలా మంది భార్యలు వారి భర్తలకు మీ నుంచి ఏమైనా సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. దీనిపై ఎలా స్పందిస్తారు?
⇒ ఆమీర్ తో కలిసి నటించాలని మీరు అనుకుంటున్నారు. కానీ మీతో కలిసి ఆమీర్ నటిస్తాడని అనుకుంటున్నారా? అని ఇటీవలే ఓ నేత అడిగిన ప్రశ్నను మళ్లీ సన్నీని అడిగాడు.
⇒ భారత బ్రాండ్ అంబాసిడర్(ప్రచారకర్త)గా మిమ్మల్ని ఎంపికచేస్తే.. అది ప్రమాదానికి సంకేతం కాదంటారా?
⇒ మీరు ఇండియాకి వచ్చిన తర్వాతే దేశంలో పోర్న్ వీక్షకులు పెరిగారు. ప్రపంచంలోనే మనం మొదటి స్థానానికి చేరాం.

ఈ ప్రశ్నలకు సన్నీ ఎంతో ఓపికగా, చాలా నేర్పుగా.. బ్యాలెన్స్డ్గా బదులిచ్చిందట. అయితే, బాలీవుడ్ ఇండస్ట్రీ సన్నీ జవాబులకు ఫిదా అయిపోయింది. చాలా మంది ఆమెకు మద్దతు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

రిషి కపూర్: ఇది చాలా అనాగరికమైన ఇంటర్వ్యూ. ఇది పద్ధతి కాదు. అయినా తన నెక్ట్స్ మూవీ కోసం పంటి బిగువన బాధను భరించింది.
ఆలియా భట్: అసలు అది ఇంటర్వ్యూ కానే కాదు. చాలా ఆశ్చర్యంగా ఉంది.
దియా మిర్జా: ఒకే ప్రశ్నను ఇరవై సార్లు అడిగాడు. అంటే... అతడు కోరిన విధంగా సన్నీ జవాబివ్వలేదని ఇలా చేశాడు.
సుశాంత్ ఎస్ రాజ్పుత్: ఆడవాళ్లని ఎలా గౌరవించాలో అతడికి నేర్పించాలి.
మిలప్ జవేరి: సన్నీ నిజంగా ఓ 'రాక్ స్టార్'.
శృతి సేత్: చివరికి ఆ వ్యక్తిపై ఆమె గెలిచింది. సన్నీ తన దయ, ఓపికతో విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement