TV interview
-
USA Presidential Elections 2024: తప్పుకోవాలంటూ బైడెన్‌పై ఒత్తిళ్లు
వాషింగ్టన్: అట్లాంటాలో టీవీలో ముఖాముఖి చర్చలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ధాటికి చేతులెత్తేసిన డెమొక్రటిక్ అభ్యర్థి, అధ్యక్షుడు జో బైడెన్‌పై సొంత పారీ్టలోనే వ్యతిరేకత ఎక్కువవుతోంది. 81 ఏళ్ల వయసున్న ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన మాత్రం తాను తప్పుకునే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు! ట్రంప్‌తో చర్చలో బైడెన్ పేలవ ప్రదర్శనను పలు మీడియా సంస్థలు సంపాదకీయాల్లో ఏకిపారేశాయి. సోషల్ మీడియాలో మీమ్స్‌కు కొదువే లేదు. ఈ విమర్శలపై బైడెన్ స్పందించారు. ‘‘బరాక్ ఒబామా మాదిరి ప్రత్యర్థిని నేను వాగ్ధాటితో ఇరుకున పెట్టలేకపోయిన మాట వాస్తవమే. దీనిపై నా మద్దతుదారులు, పారీ్టలోనూ కొంత అసంతృప్తి నెలకొందని తెలుసు. కానీ ట్రంప్‌పై మరింతగా పోరాడతా’ అని అన్నారు. డెమొక్రటిక్ ముఖ్యుల్లో పెరిగిన అసంతృప్తి ట్రంప్‌తో డిబేట్ తర్వాత బైడెన్ అభ్యరి్థత్వంపై చాలా మంది డెమొక్రటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ) సభ్యుల్లో అసమ్మతి పెరిగింది. యువనేతకు అవకాశమిశ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. షికాగోలో ఆగస్ట్ 19న జరిగే డెలిగేట్ల భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల కథనం. -
ప్రధాని ఇంటర్వ్యూలు ఇలా ఉన్నాయా?
ఒక ప్రధానమంత్రితో ముఖాముఖి అన్నది ఆయన విమర్శకులపై దాడి చేయటానికి వేదికగా ఉండకూడదు. అంతేకాదు, సరైన విమర్శలకు ఆయన్ని స్పందింపజేసేలా ఉండాలి. స్పందింప ‘చేయటం’ అనే క్రియ ముఖ్యం. ప్రశ్నడిగి వదిలేస్తే ఏ ప్రధాని అయినా ఆ ప్రశ్నను తప్పించటానికి, సమాధానాన్ని దాటవేయటానికి చూడొచ్చు. అలా చేయకుండా, సమాధానం కోసం పదే పదే ఒత్తిడి తేవడం ఇంటర్వ్యూ చేసేవారి బాధ్యత. అంతేకాదు, వీక్షకుల తరఫున ప్రశ్నలు అడుగుతున్నామన్న స్పృహను వారు కలిగి ఉండాలి. అలాగే ఇంటర్వ్యూ చేసేవారు బెరుకుగా, ప్రధానికీ తనకూ వ్యత్యాసం ఉందన్న గ్రహింపుతో ఉన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ప్రధానిని తను కఠినమైన ప్రశ్నలు కూడా అడగగలడు అనే భావన వీక్షకులలో కలిగించాలి.ఇప్పటి బి.బి.సి. చైర్మన్ సమీర్ షా ఒకప్పుడు ‘లండన్ వీకెండ్ టెలివిజన్’ లో నా మొదటి బాస్. టెలివిజన్ ఇంటర్వ్యూలలో ప్రశ్నలు అడగటం గురించి నాకు తెలిసిన చాలా విషయాలు ఆయన నేర్పించినవే. వాటిలో ముఖ్యమైన పాఠం... వీక్షకుల తరఫున ప్రశ్నలు అడుగుతున్నామన్న స్పృహను మనం కలిగి ఉండటం. అందుకే మీ ప్రశ్నలు సందర్భోచితంగా ఉండాలి. సమాధానం వచ్చేవరకు మీరు పట్టుపట్టి ఉండాలి. లేదంటే మీరు సమాధానం రాబట్టలేక పోతున్నారని వీక్షకులకు స్పష్టమైపోతుంది.కనుక టీవీలో ప్రధానమంత్రి ఇంటర్వ్యూలను చూస్తున్న ప్పుడు నేను ఏం వినాలని కోరుకుంటాను? ఏముందీ, వీక్షకుడిగా నా తరఫున ఆ ప్రశ్నలు అడుగుతున్నట్లుంటే కనుక, నా ప్రశ్నలు ఎలా ఉండి ఉండాలి అని ఆలోచిస్తుంటాను. ముందుగా, ప్రధాని వేటిని తన విజయాలుగా భావిస్తున్నారో వాటి గురించి తెలుసుకోవాలనుకుంటాను. ఆయనకు ఎదురైన సవాళ్లకు, బహిర్గతమైన వాస్తవాలకు, చేసిన తప్పులకు, కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలకు ఆయన ఏ విధంగా స్పందిస్తారో కూడా తెలుసుకోవాలని అనుకుంటాను. సంభాషణ ఏకపక్షంగా కాకుండా రెండు వైపుల నుండీ ఉండాలని కోరుకుంటాను. కాబట్టి సంభాషణలో ప్రధానిని అంతరాయపరచటం ఉంటుంది. కొన్నిసార్లు అంతరాయాలు అవసరం కూడా! రెండోది – ఒక ప్రధానమంత్రితో ముఖాముఖి అన్నది ఆయన విమర్శకులపై దాడి చేయటానికి వేదికగా ఉండకూడదు. అంతేకాదు, సరైన విమర్శలకు ఆయన్ని స్పందింపజేసేలా ఉండాలి. స్పందింపచేయటం అనే క్రియ ముఖ్యం. ప్రశ్నడిగి వదిలేస్తే ఏ ప్రధాని అయినా ఆ ప్రశ్నను తప్పించటానికి, సమాధానాన్ని దాటవేయటానికి చూస్తారు. అలా చేయకుండా, సమాధానం కోసం ఒత్తిడి తేవడం ఇంటర్వ్యూ చేసేవారి బాధ్యత. మూడవది – ఇంటర్వ్యూ ఆసాంతం.. ఇంటర్వ్యూ చేసేవారు, ప్రధానీ ఇద్దరూ కూడా సమానమే. అలాంటప్పుడు మాత్రమే ఇంటర్వ్యూ ప్రధానిని బాధ్యుడిని చేస్తుంది. కనుక ఇంటర్వ్యూ చేసేవాళ్లు ఆయన్ని ‘సర్’ అని పిలవకూడదు. అలా అనడం అంటే ఆయన్ని ఉన్నత పీఠం మీద ఉంచినట్లు! అలాగే ఇంటర్వ్యూ చేసేవారు బెరుకుగా, ఆయనకూ తనకూ వ్యత్యాసం ఉందన్న గ్రహింపుతో ఉన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ప్రధానిని తను కఠినమైన ప్రశ్నలు కూడా అడగగలడు అనే భావన వీక్షకులలో కలిగించాలి. నాల్గవది – అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తప్పనిసరిగా ఇంటర్వ్యూ చేసేవారు లేవనెత్తిన అంశాలకు సంబంధించినవై ఉండాలి. కొద్దిపాటి ఊకదంపుడును అర్థం చేసుకోవచ్చు కానీ, అడగని వాటికి జవాబు చెబుతూ, అడిగిన వాటికి విరుద్ధమైన సమాధానం ఇస్తూ పీఎం పూర్తిగా దారి మళ్లేందుకు అనుమతించకూడదు. అలా జరిగితే మర్యాదపూర్వకమైన బలవంతపు అంతరాయం అవసరం. పీఏం అదే పనిగా దారి మళ్లుతూ ఉంటే ఒకటి కంటే ఎక్కువసార్లు అంతరాయాలు ఉండొచ్చు. ఐదవది – ఇంటర్వ్యూయర్‌కు వ్యూహం అవసరం. ఏదో అడగటానికి అన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఎప్పుడూ కూడా అడగకూడని ఒక ప్రశ్నకు ఉదాహరణ: ‘ఈసారి మీరు కచ్చితంగా గెలుస్తారు, అయితే 2029లో కూడా గెలుస్తారా?’ఇప్పుడు, సంబంధిత పీఎం స్వభావం, వ్యక్తిత్వాలకు అనుగుణంగా స్పందించేందుకు తగిన సామర్థ్యాన్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కలిగి ఉండాలి. ఉదాహరణకు, ఒక ప్రధాని తను చేసిన ప్రతి పనీ దేశం కోసమే చేశానని దేశభక్తి ఢంకాను బజాయిస్తుంటే... ప్రధాన మంత్రులందరి విషయంలోనూ అది సహజమే కదా అని అనండి. అలా అనడం ఆయన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిపి ఉంచదు. లేదా, అందరికీ తెలిసి ప్రధాని చెప్పిన ఒక విషయం గురించి, లేదా ఆయన చేసిన ఒక పని గురించి నిర్ద్వంద్వంగా ప్రధాని తాను అనలేదని, చేయలేదని వాదిస్తుంటే... అప్పుడు దానిని సమయ సందర్భ, స్థల కాలాలతో సహా గుర్తు చేసే స్థితిలో ఇంటర్వ్యూయర్ ఉండాలి. ఆ విషయంలో స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే అది ప్రధానమంత్రిని సవాలు చేయటం వంటిది. ఇంటర్వ్యూయర్ సిద్ధపడి ఉండాల్సిన వాటిలో ఇదొక సహేతుకత కలిగి ఉండాల్సిన భాగం. కొన్నిసార్లు స్పష్టమైన ప్రశ్నలు లేవనెత్తాలి. ఎందుకంటే అవి ఆ ఇంటర్వ్యూ ఇస్తున్న ప్రధానికి సంబంధించినవై ఉంటాయి. వాటిని విస్మరించలేము. ఉదాహరణకు, ఆ ప్రధాని తను భగవంతుని వాహకమని విశ్వసిస్తుంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కొంతవరకైనా ఆయన్ని శంకిస్తున్నట్లుగా.. అది మీకెలా తెలుసు? మీరలా అనడం హేతుబద్ధమేనా? అని అడిగి తీరాలి. లేదా, ప్రధానిని అనుకరిస్తూ జీవనం సాగించే హాస్యగాడికి ఆయనపై పోటీ చేసేందుకు అనుమతి లభించకపోతే మీరు అందుకు అనుమతిస్తారా అని ఆ ఇంటర్వ్యూయర్ అడగాలి. ఆయన చికాకు పడుతూ కోపగించుకుంటున్నా కూడా పట్టు వదలక అడిగి తీరాలి. అంతేకాదు, ప్రధాని ఎల్లప్పుడూ తనను తాను తృతీయ పురుషలోనే ఎందుకు చెప్పుకుంటారు? గొప్ప కోసమా? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించాలి. చివరిగా – నేనిక్కడ రాసిన వాటిని ఒక స్వచ్ఛమైన మనసు గల, గౌరవనీయులైన ప్రధాని అంగీకరిస్తారన్న నమ్మకం నాకుంది. గుర్తుంచుకోండి! ప్రజలను ఆకట్టుకోవటానికి తన ఇంటర్వ్యూను ఉపయోగించుకోవాలని ఆయన అనుకుంటారు. వాళ్ళకు చీకాకు తెప్పించాలనుకోరు. ఆ సంగతి మర్చిపొవద్దు. సమీర్ నాతో చెప్పిన మరొక మాట ఇది.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
'గడిచిన 18 నెలలు కష్టకాలంగా అనిపించింది'
టాలెంట్‌కు కొదువ లేకున్నా గాయాలు, అధిక బరువు, డోపింగ్‌లో పట్టుబడడం ఇలాంటివన్నీ పృథ్వీ షాను చాలా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు టీమిండియాలో ఉన్న ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ల కంటే ముందే జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు పృథ్వీ షా. తాజాగా రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీతో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న పృథ్వీ షాను టీమిండియా తలుపు మరోసారి తట్టింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు అతను ఎంపికయ్యాడు. అయితే జట్టు కూర్పు దృశ్యా పృథ్వీ షాకు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. ఒకవేళ పృథ్వీని ఆడించాలనుకుంటే రాహుల్ త్రిపాఠిని తప్పించాల్సి ఉంటుంది. మరి పృథ్వీ షా తొలి టి20 ఆడతాడా లేదా అనేది మరికొద్ది సేపట్లో తెలియనుంది. టీమిండియాలోకి తిరిగి రావడంపై పృథ్వీ షా స్పందించాడు. మ్యాచ్‌కు ముందు బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్య్వులో పృథ్వీ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గడిచిన 18 నెలలు తనకు కష్టకాలంగా అనిపించిందని.. మళ్లీ టీమిండియాలోకి రావడం సంతోషం కలిగిస్తుందని పేర్కొన్నాడు. పృథ్వీ షా మాట్లాడుతూ..''చాలా రోజులుగా నేను భారత జట్టుకు దూరంగా ఉన్నాను. మళ్లీ పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది. రాత్రి 10.30 సమయంలో జట్టును ప్రకటించారు. ఆ క్షణంలో నాకు చాలా ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయి. వాటి దెబ్బకు నా ఫోన్ హ్యాంగ్ అయ్యింది. దాంతో ఏం జరుగుతుందని కాస్త షాక్‌కు గురయ్యాను. గత 18 నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న నాకు ఈ సమయం చాలా కఠినంగా గడిచింది. కానీ నాకు మద్దుతు ఇచ్చే వారు మాత్రం అండగా నిలిచారు. భారత్ జట్టుకు రాక ముందు నుంచి అండగా నిలిచినవారు ఆ మద్దతును అలానే కొనసాగించారు. నేను ఆడకపోయినా.. వారు నాకు మద్దుతుగా ఉండటం సంతోషాన్నిచ్చింది. నా స్నేహితులు, కుటుంబం, తండ్రి, కోచ్‌లు చాలా సపోర్ట్‌గా నిలిచారు. అలాంటి వారు నా జీవితంలో ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక టీమ్ సెలెక్ట్ అయినందుకు నేను ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. ఆ సమయంలో నేను అస్సాంలో ఉన్నాను. మా నాన్న మాత్రం చాలా సంతోషించాడు. జట్టులోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చావ్.. ఫోకస్ ఆట మీద పెట్టాలని హెచ్చరించాడు. అవకాశం వస్తే పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని సూచించాడు.'' అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. రంజీట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ సాధించడంపై స్పందిస్తూ.. పృథ్వీ షా సంతోషం వ్యక్తం చేశాడు. 'ట్రిపుల్ సెంచరీతో రంజీల్లో రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉంది. నేను ఆటను మాత్రమే ఆడాను. ప్రత్యేకంగా ఏం చేయలేదు. నాపై పూర్తి నమ్మకంతో ఆడాను. సెంచరీ, డబుల్ సెంచరీ చేసినా కూడా పట్టుదలతో నా ఇన్నింగ్స్ కొనసాగించాను. అయితే 400 చేయకపోవడంపై ఇప్పటి కీ బాధపడుతున్నాను. మరో 21 పరుగులు చేస్తే ఆ ఘనత నాకు దక్కేది.'' అని పేర్కొన్నాడు. కాగా పృథ్వీ షా 2021లో లంక టూర్లో ధావన్ కెప్టెన్సీలో చివరిసారి టీమిండియాకు ఆడాడు. టీమిండియా తరపున పృథ్వీ షా ఇప్పటివరకు 5 టెస్టుల్లో 339 పరుగులు, ఆరు వన్డేల్లో 189 పరుగులు చేశాడు. From emotions on #TeamIndia comeback & the support system to reuniting with former U-19 teammates and Head Coach Rahul Dravid 👍 👍 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦 as @PrithviShaw discusses all this & more 👌 👌 - By @ameyatilak Full interview 🎥 🔽 #INDvNZhttps://t.co/ZPZWMbxlAC pic.twitter.com/IzVUd9tT6X — BCCI (@BCCI) January 27, 2023 చదవండి: కీలక పదవిలో బ్రియాన్ లారా.. గాడిన పెట్టేందుకేనా! -
తనుశ్రీకి పిచ్చి పట్టింది
ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై బాలీవుడ్లో ఇప్పటికీ వాడి వేడి చర్చ జరుగుతూనే ఉంది. కొందరు తనుశ్రీకి మద్దతుగా నిలిస్తే.. మరికొందరు నానాకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. నటి రాఖీ సావంత్ కూడా ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో నానాకి మద్దతుగా మాట్లాడారు. ‘‘నానా పటేకర్, గణేశ్ ఆచార్యపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలు. నాకు మహిళలపై గౌరవం ఉంది. వారి గురించి తప్పుగా మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. తనుశ్రీకి పిచ్చి పట్టింది. పదేళ్లుగా కోమాలో ఉండి ఈ మధ్యే బయటికి వచ్చింది. పదేళ్ల తర్వాత అమెరికా నుంచి వచ్చిన తనుశ్రీ అవకాశాలు లేక.. డబ్బుల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. నానాని తప్పుపడుతోంది’’ అన్నారు. రాఖీ సావంత్ వ్యాఖ్యలపై తనుశ్రీ ఫైర్ అయ్యారు. ఆమెపై రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందో చూడాలి. -
వైగోకి కోపం.. ఇంటర్వ్యూ నుంచి అవుట్
చెన్నై: ప్రజా సంక్షేమ కూటమి(పీడబ్ల్యూఎఫ్) సమన్వయకర్త, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోకు కోపం వచ్చింది. న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు కోపం రావడంతో మైక్ తీసేసి బయటకు వెళ్లిపోయారు. పాలిమర్ టీవీ ఛానల్ ప్రతినిధి వైగోతో ఇంటర్వ్యూ చేస్తూ... ప్రజా సంక్షేమ కూటమిని అన్నాడీఎంకే బీ టీమ్ గా పిలవొచ్చా? అధికార పార్టీ నుంచి ఈ కూటమికి రూ.1500 కోట్లు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది కదా? అని ప్రశ్నించారు. దీంతో కోపం తెచ్చుకున్న ఆయన 'నేను ఈ ఇంటర్వ్యూ రద్దు చేసుకుంటున్నాన'ని కాలర్ మైకును తీసేసి వెళ్లిపోయారు. మైకు తొలగించేముందు తన ప్రశ్న పూర్తిగా వినాలని పాలిమర్ టీవీ ఛానల్ ప్రతినిధి కోరినా ఆయన వినిపించుకోలేదు. కాగా, తమ పార్టీపై నిరాధార ఆరోపణలు చేశారంటూ వైగోకు డీఎంకే అధినేత కరుణానిధి శనివారం నోటీసులు పంపారు. తమ కూటమిలో చేరితే రూ.500 కోట్లు, 80 సీట్లు ఇస్తామని విజయకాంత్‌తో డీఎంకే బేరసారాలు ఆడిందని వైగో ఆరోపించిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చారు. డీఎంకే లాగానే బీజేపీ సైతం డీఎండీకేతో బేరసారాలు ఆడిందని వైగో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. వైగో ఆరోపణలు సత్యదూరమని కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్ కొట్టిపారేశారు. -
పోర్న్ స్టార్ కు అండగా బాలీవుడ్!
ముంబై: ఓ ప్రముఖ టీవీ చానల్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సెక్సీ తార సన్నీ లియోన్ ఎన్నో చిక్కు ప్రశ్నలను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఆ ప్రశ్నల సమాచారం తెలుసుకున్న బాలీవుడ్ జనాలు చాలా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ ఇండో-కెనడియన్‌కు బాసటగా నిలిచారు. కొందరు ఆమెను 'రాక్ స్టార్' అని పొగుడుతుంటే.. మరికొందరు ఆమె ఓపికగా సమాధానాలు ఇచ్చిన విధానాన్ని మెచ్చుకుంటున్నారు. పోర్న్ స్టార్‌గా ముద్రపడిన సన్నీ నటించిన 'మస్తిజాడే' మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే, యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఈ అమ్మడికి ఎలా స్పందించాలో చాలాసేపు అర్థం కాలేదట. ఆ ప్రశ్నలలో కొన్నింటిని చూద్దాం మరి... యాంకర్ ప్రశ్నలు: ⇒ చాలా మంది భార్యలు వారి భర్తలకు మీ నుంచి ఏమైనా సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. దీనిపై ఎలా స్పందిస్తారు? ⇒ ఆమీర్ తో కలిసి నటించాలని మీరు అనుకుంటున్నారు. కానీ మీతో కలిసి ఆమీర్ నటిస్తాడని అనుకుంటున్నారా? అని ఇటీవలే ఓ నేత అడిగిన ప్రశ్నను మళ్లీ సన్నీని అడిగాడు. ⇒ భారత బ్రాండ్ అంబాసిడర్(ప్రచారకర్త)గా మిమ్మల్ని ఎంపికచేస్తే.. అది ప్రమాదానికి సంకేతం కాదంటారా? ⇒ మీరు ఇండియాకి వచ్చిన తర్వాతే దేశంలో పోర్న్ వీక్షకులు పెరిగారు. ప్రపంచంలోనే మనం మొదటి స్థానానికి చేరాం. ఈ ప్రశ్నలకు సన్నీ ఎంతో ఓపికగా, చాలా నేర్పుగా.. బ్యాలెన్స్డ్గా బదులిచ్చిందట. అయితే, బాలీవుడ్ ఇండస్ట్రీ సన్నీ జవాబులకు ఫిదా అయిపోయింది. చాలా మంది ఆమెకు మద్దతు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. రిషి కపూర్: ఇది చాలా అనాగరికమైన ఇంటర్వ్యూ. ఇది పద్ధతి కాదు. అయినా తన నెక్ట్స్ మూవీ కోసం పంటి బిగువన బాధను భరించింది. ఆలియా భట్: అసలు అది ఇంటర్వ్యూ కానే కాదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. దియా మిర్జా: ఒకే ప్రశ్నను ఇరవై సార్లు అడిగాడు. అంటే... అతడు కోరిన విధంగా సన్నీ జవాబివ్వలేదని ఇలా చేశాడు. సుశాంత్ ఎస్ రాజ్‌పుత్: ఆడవాళ్లని ఎలా గౌరవించాలో అతడికి నేర్పించాలి. మిలప్ జవేరి: సన్నీ నిజంగా ఓ 'రాక్ స్టార్'. శృతి సేత్: చివరికి ఆ వ్యక్తిపై ఆమె గెలిచింది. సన్నీ తన దయ, ఓపికతో విజయం సాధించింది. -
ఇంటర్వ్యూలకు రాహూల్ ప్రిపేర్