USA Presidential Elections 2024: తప్పుకోవాలంటూ బైడెన్‌పై ఒత్తిళ్లు USA Presidential Elections 2024: Democrats reject calls for Biden to drop out of 2024 race | Sakshi
Sakshi News home page

USA Presidential Elections 2024: తప్పుకోవాలంటూ బైడెన్‌పై ఒత్తిళ్లు

Published Mon, Jul 1 2024 5:30 AM | Last Updated on Mon, Jul 1 2024 5:30 AM

USA Presidential Elections 2024: Democrats reject calls for Biden to drop out of 2024 race

ససేమిరా అంటున్న అమెరికా అధ్యక్షుడు­

వాషింగ్టన్‌: అట్లాంటాలో టీవీలో ముఖాముఖి చర్చలో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ధాటికి చేతులెత్తేసిన డెమొక్రటిక్‌ అభ్యర్థి, అధ్యక్షుడు జో బైడెన్‌పై సొంత పారీ్టలోనే వ్యతిరేకత ఎక్కువవుతోంది. 81 ఏళ్ల వయసున్న ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన మాత్రం తాను తప్పుకునే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు! 

ట్రంప్‌తో చర్చలో బైడెన్‌ పేలవ ప్రదర్శనను పలు మీడియా సంస్థలు సంపాదకీయాల్లో ఏకిపారేశాయి. సోషల్‌ మీడియాలో మీమ్స్‌కు కొదువే లేదు. ఈ విమర్శలపై బైడెన్‌ స్పందించారు. ‘‘బరాక్‌ ఒబామా మాదిరి ప్రత్యర్థిని నేను వాగ్ధాటితో ఇరుకున పెట్టలేకపోయిన మాట వాస్తవమే. దీనిపై నా మద్దతుదారులు, పారీ్టలోనూ కొంత అసంతృప్తి నెలకొందని తెలుసు. కానీ ట్రంప్‌పై మరింతగా పోరాడతా’ అని అన్నారు. 

డెమొక్రటిక్‌ ముఖ్యుల్లో పెరిగిన అసంతృప్తి 
ట్రంప్‌తో డిబేట్‌ తర్వాత బైడెన్‌ అభ్యరి్థత్వంపై చాలా మంది డెమొక్రటిక్‌ నేషనల్‌ కమిటీ(డీఎన్‌సీ) సభ్యుల్లో అసమ్మతి పెరిగింది. యువనేతకు అవకాశమిశ్వాలన్న డిమాండ్‌ తెరపైకి వస్తోంది. షికాగోలో ఆగస్ట్‌ 19న జరిగే డెలిగేట్ల భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల కథనం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement