Own party
-
సొంత పార్టీ కుట్రకే బైడెన్ బలి
వాషింగ్టన్: సొంత డెమొక్రాటిక్ పార్టీ నేతల కుట్రలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బలయ్యారని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆయన్ను తొలుత బ్రతిమాలి, చివరకు భయపెట్టి అధ్యక్ష బరి నుంచి తప్పించారన్నారు. శనివారం మిన్నెసోటాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. ‘‘బైడెన్‌కు 1.4 కోట్ల మంది ఓటర్ల అండ ఉంది. పోటీలో కొనసాగాలని కృతనిశ్చయంతో కన్పించారు. అలాంటి బలమైన నేతను బెదిరించి తప్పించారు. ‘మర్యాదగా తప్పుకుంటే మంచిది. లేదంటే అవమానభారంతో పంపిస్తాం. అధ్యక్షుడు మరణించినా, బాధ్యతలు నిర్వర్తించలేని స్థితిలో ఉన్నా 25వ రాజ్యాంగ సవరణ ద్వారా తప్పించగలమని బెదిరించారు. అలా ఇంటిదారి పట్టించారు. చేసేదేమీ లేక బైడెన్ తప్పుకున్నారన్నది వాస్తవం. కానీ మీడియాలో మాత్రం తప్పుడు కథనాలొచ్చాయి. ఆయన ధైర్యంగా ని్రష్కమించారంటూ అంతా ఆయనను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేశారు. వాస్తవానికి ఆయనను బలవంతంగా పక్కకు నెట్టేశారు’’ అన్నారు. కమలపై తిట్ల దండకం డెమొక్రటిక్ పార్టీ నుంచి తన ప్రత్యరి్థగా దాదాపుగా ఖాయమైన కమలా హారిస్‌పై ట్రంప్ తిట్ల దండకానికి దిగారు. ‘‘ఆమె మితిమీరిన ఉదారవాది. స్థిరచిత్తం లేని నాయకురాలు. మతిలేని వామపక్షవాది. అమెరికా చరిత్రలోనే అత్యంత అసమర్థ ఉపాధ్యక్షురాలు. గతంలో మార్కిస్ట్ జిల్లా అటార్నీగా శాన్ఫ్రాన్సిస్కోను నాశనం చేశారు. ఇలాంటి నేత అమెరికా చరిత్రలో ఎన్నడూ అధ్యక్ష పోటీలో నిలబడలేదు. హారిస్ పొరపాటున దేశాధ్యక్షురాలైతే దేశంలో హింస, కల్లోలం నిత్యకృత్యాలవుతాయి. ఆమె పరిపాలనలో అమెరికా అంతటా అతివాదం, వైఫల్యాలు, ఉద్రిక్త పరిస్థితులు.. చివరకు మూడో ప్రపంచ యుద్ధమే రావొచ్చు. అందుకే ఈ ఎన్నికల్లో ఆమెను మనం గెలవకుండా అడ్డుకుందాం. ఆమె అమెరికాకు కాకుండా నేరగాళ్లకు అధ్యక్షురాలిగా మసులుకుంటారు. ఆమె గెలిస్తే గాజా నుంచి కూడా శరణార్థులు అమెరికాకు వచ్చి తిష్టవేస్తారు’ అని ట్రంప్ ఆరోపించారు. ‘నేను గెలిచి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే తొలి రోజే బైడెన్–హారిస్ హయాంలో తీసుకున్న సరిహద్దు విధానాలన్నింటినీ చెత్తబుట్టలో పడేస్తా. సరిహద్దును మూసేసి అక్రమ వలసలను అడ్డుకుంటా’ అని అన్నారు. అధికారంలోకి వస్తే క్రిప్టోకరెన్సీని సూపర్‌పవర్‌గా మలుస్తానని చెప్పారు. -
USA Presidential Elections 2024: తప్పుకోవాలంటూ బైడెన్‌పై ఒత్తిళ్లు
వాషింగ్టన్: అట్లాంటాలో టీవీలో ముఖాముఖి చర్చలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ధాటికి చేతులెత్తేసిన డెమొక్రటిక్ అభ్యర్థి, అధ్యక్షుడు జో బైడెన్‌పై సొంత పారీ్టలోనే వ్యతిరేకత ఎక్కువవుతోంది. 81 ఏళ్ల వయసున్న ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన మాత్రం తాను తప్పుకునే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు! ట్రంప్‌తో చర్చలో బైడెన్ పేలవ ప్రదర్శనను పలు మీడియా సంస్థలు సంపాదకీయాల్లో ఏకిపారేశాయి. సోషల్ మీడియాలో మీమ్స్‌కు కొదువే లేదు. ఈ విమర్శలపై బైడెన్ స్పందించారు. ‘‘బరాక్ ఒబామా మాదిరి ప్రత్యర్థిని నేను వాగ్ధాటితో ఇరుకున పెట్టలేకపోయిన మాట వాస్తవమే. దీనిపై నా మద్దతుదారులు, పారీ్టలోనూ కొంత అసంతృప్తి నెలకొందని తెలుసు. కానీ ట్రంప్‌పై మరింతగా పోరాడతా’ అని అన్నారు. డెమొక్రటిక్ ముఖ్యుల్లో పెరిగిన అసంతృప్తి ట్రంప్‌తో డిబేట్ తర్వాత బైడెన్ అభ్యరి్థత్వంపై చాలా మంది డెమొక్రటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ) సభ్యుల్లో అసమ్మతి పెరిగింది. యువనేతకు అవకాశమిశ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. షికాగోలో ఆగస్ట్ 19న జరిగే డెలిగేట్ల భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల కథనం. -
Lok Sabha Election 2024: నోరుజారె... పరువు పోయె..!
అసలే ఇది ఎన్నికల సీజన్. ప్రచారం దుమ్మురేగుతోంది. మైకు దొరికితే చాలు.. నేతల హామీలకు, విమర్శల ధాటికి అడ్డూఅదుపూ ఉండటం లేదు. ఆ క్రమంలో కొన్నిసార్లు తాము ఏ పారీ్టలో ఉన్నాం, ఎవరి తరఫున ప్రచారం చేస్తున్నామన్న స్పృహ లేకుండా నేతలు నోరు జారుతున్నారు. సొంత పార్టీ అభ్యరి్థనే చిత్తుచిత్తుగా ఓడించండనీ, ప్రత్యర్థి పారీ్టకి ఓటేయాలనీ పిలుపిస్తున్నారు! జరగాల్సిన నష్టం జరిగాక తీరిగ్గా నాలుక్కరుచుకుంటున్నారు. ఇలా టంగ్ స్లిప్పవుతున్న వారిలో కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినవారే గాక కాకలుతీరిన నేతలు కూడా ఉండటం విశేషం. కుడిఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నారు గానీ, రాజకీయాల్లో మాత్రం నోరుజారితే నవ్వులపాలే...!! అధిర్.. అయ్యో రామా! బీజేపీకి ఓటేయడం మేలన్న కాంగ్రెస్ దిగ్గజం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే పశి్చమ బెంగాల్ కాంగ్రెస్ దిగ్గజం అధిర్ రంజన్ చౌదరి ఇటీవల ఎన్నికల ర్యాలీలో మళ్లీ నోరుజారారు. ‘బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు ఓటేసే కంటే బీజేపీకి వేయడం నయం’ అన్నారు! జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన పారీ్టకి ఓటేయాలని పిలుపివ్వడం పట్ల సొంత నేతలే తీవ్రంగా మండిపడ్డారు. దాంతో తానలా అన్లేదంటూ అ«ధిర్ మాట మార్చారు. కానీ అధికార తృణమూల్ దీన్ని మంచి అస్త్రంగా అందిపుచ్చుకుంది. బెంగాల్లో అ«ధిర్ బీజేపీకి తొత్తుగా పనిచేస్తున్నారంటూ చెలరేగిపోయింది.లాలు కూతుర్ని ఓడించండి! సొంత పార్టీ ఎమ్మెల్సీ పిలుపు బిహార్ రాజకీయ దిగ్గజం లాలు ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సరన్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెను గెలిపించుకునేందుకు అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా లాలు స్వయంగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా కూతురితో పాటు పాల్గొన్న తొలి సభలోనే హంసపాదు ఎదురైంది! సొంత పార్టీ ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ మాట్లాడుతూ ‘‘ఓటర్లు, పార్టీ కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా. రోహిణీ ఆచార్యను భారీ మెజారిటీతో ఓడించండి’ అంటూ పిలుపునిచ్చారు. దాంతో లాలుతో పాటు వేదికపై ఉన్న ఆర్జేడీ నేతలంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న సునీల్ క్షమించాలంటూ వేడుకున్నారు.కంగనా... కన్ఫ్యూజన్! గురి తప్పిన ‘నాన్ వెజ్’ విసుర్లు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బీజేపీలో చేరి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తుండటం తెలిసిందే. స్టార్ క్యాంపెయినర్ అయిన ఆమె బిహార్ ఎన్నికల ర్యాలీలో ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్‌కు బదులు పొరపాటున బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను విమర్శించి నవ్వులపాలయ్యారు. ‘‘దారి తప్పిన యువరాజులున్న పారీ్టలకు మన దేశంలో కొదవ లేదు. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలకునే రాహుల్ గాంధీ కావచ్చు. నవరాత్రుల సందర్భంగా కూడా చేపలు తినే తేజస్వి సూర్య కావచ్చు. అంతా అదే బాపతు’ అంటూ కంగన విరుచుకుపడ్డారు. దాంతో భారీగా ట్రోలింగ్‌కు గురయ్యారు. తేజస్వీ యాదవ్ కూడా, ‘ఇంతకీ ఎవరీ అమ్మగారు?!’ అంటూ ఎద్దేవా చేశారు. దేశ తొలి ప్రధాని సుభాష్ చంద్ర బోస్ అన్న కంగనా వ్యాఖ్యల పైనా విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. శివపాల్.. శివ శివా! బీజేపీని గెలిపించాలన్న సమాజ్‌వాదీ నేత అది ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి ఒకప్పుడు గట్టి పట్టున్న ఇటావా లోక్‌సభ స్థానం. జస్వంత్ నగర్లో ఎన్నికల ప్రచార సభ. జనం భారీగా హాజరయ్యారు. పార్టీ చీఫ్ అఖిలేశ్ బాబాయి, సమాజ్‌వాదీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్ యాదవ్ మాట్లాడుతున్నారు. వేదికపై ఉన్న అఖిలేశ్, ఇటావా ఎస్పీ అభ్యర్థి జితేంద్ర దోహారే తదితరులు ఆసక్తిగా వింటున్నారు. ఇంతలో శివపాల్ ఉన్నట్టుండి, ‘అందుకే నేను కోరేదొక్కటే! బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించండి!!’ అంటూ పిలుపునిచ్చారు. అంతటితో ఆగలేదు. ‘ప్రజలంతా అఖిలేశ్ చెప్పినట్లు విని, భారతీయ జనతాపారీ్టకి భారీ మెజారిటీతో విజయాన్ని అందించండి’ అన్నారు. దాంతో అఖిలేశ్ బిత్తరపోగా ఇతర ఎస్పీ నేతలంతా గతుక్కుమన్నారు. నోరు జారానని గమనించిన శివపాల్ కాసేపు బీజేపీపై విరుచుకుపడ్డా జనమంతా గోలగోలగా నవ్వుకున్నారు! అందిపుచ్చుకున్న మోదీ...ఈ ఉదంతాన్ని తర్వాత ఇటావాలోనే జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రచారాస్త్రంగా మలచుకున్నారు. ‘చూశారా! స్వయంగా ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ బాబాయ్ కూడా బీజేపీని గెలిపించాలని కోరుతున్నారు’ అంటూ చెలరేగిపోయారు. 2019లో ములాయం కూడా బీజేపీని ఆశీర్వదించారని గుర్తు చేశారు. ‘‘2019 ఎన్నికలకు ముందు పార్లమెంట్ చివరి సెషన్లో ములాయం మాట్లాడుతూ, మీరు మళ్లీ విజయం సాధించబోతున్నారని నన్నుద్దేశించి నిండు సభలో అన్నారు. ఆ ఆశీర్వాదం ఫలించింది. ఇప్పుడు ములాయం మన మధ్య లేకున్నా ఆయన సోదరుడు బీజేపిని గెలిపించాలని కోరుతున్నారు. ఇది యాదృచి్ఛకమని నేననుకోవడం లేదు. శివపాల్ మనసులో ఉన్నదే బయటికొచి్చంది’’ అంటూ చెణుకులు విసిరారు!లోగుట్టు ‘బోరా’కే ఎరుక... స్వపక్ష ఎంపీనే ఓడించాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే!అసోంలోని నగావ్ లోక్‌సభ స్థానంలో ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శిబమణి బోరా కూడా ఇలాగే నోరు జారారు. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారామె. జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నట్టుండి, ‘ప్రద్యుత్‌ను భారీ మెజారిటీతో ఓడించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. ఓడిస్తారో లేదో చెప్పండి. ఈవీఎం బటన్‌ను నొక్కి నొక్కి ప్రద్యుత్ కచ్చితంగా ఓడేలా చూడండి’’ అంటూ పిలుపునివ్వడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. పొరపాటున అన్నారా, కావాలనే అన్నారా అంటూ దీనిపై తీవ్ర చర్చ కూడా జరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ క్యాంపులో చీలికలు?
వాషింగ్టన్: అధికారం చేపట్టినప్పటి నుంచి తరచూ వివాదాల్లో చిక్కుకుపోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ప్రక్రియపై విచ్చలవిడి విమర్శలకు దిగడం, కౌంటింగ్ ప్రక్రియ నిలిపివేతకు న్యాయస్థానాల్లో కేసులు, కౌంటింగ్ సాగుతూండగానే తాను గెలిచినట్లుగా ప్రకటించుకోవడం వంటి వాటిపై రిపబ్లికన్ పార్టీ నేతలు పలువురు గుర్రుగా ఉన్నారు. దీంతో ట్రంప్ చర్యలకు పార్టీ తరఫు నుంచి తగిన మద్దతు లేదు సరికదా.. రిపబ్లికన్ల నేతగా మరోసారి ఎన్నుకునే అవకాశాలూ మృగ్యమవుతున్నాయి. సెనేట్‌లో ట్రంప్ మద్దతుదారుగా ఇప్పటివరకూ వ్యవహరించిన మిచ్ మెక్కానెల్ ఇప్పటికే ఓట్ల లెక్కింపు జరుగుతూండగానే గెలిచినట్లు ట్రంప్ ప్రకటించడాన్ని పరోక్షంగా ఆక్షేపించారు. ‘‘గెలిచానని చెప్పుకోవడం వేరు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడం వేరు’’అని కెంటకీ నుంచి గెలుపొందిన మిచ్ స్పష్టం చేశారు. ట్రంప్‌పై తమ వ్యతిరేకతను స్పష్టం చేసిన వారిలో మిచ్ ఒక్కరే లేరు. ఫ్లారిడా సెనేటర్, ఇటీవలే ట్రంప్ ర్యాలీలో ప్రసంగాలు చేసిన మార్కో రూబియో ట్విట్టర్ వేదికగా ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం చెప్పుకోవాల్సిన అంశం. ‘‘చట్టబద్ధంగా పోలైన ఓట్ల లెక్కింపులో జాప్యం జరగడం మోసం కాదు’’అని ట్వీట్ చేశారు. చట్టబద్ధ ఓట్లు లెక్కిస్తే నాదే గెలుపు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. చట్టబద్ధమైన ఓట్లనే లెక్కిస్తే తనదే గెలుపన్నారు. వైట్‌హౌస్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల్లో నిజాయతీగా గెలవలేరని డెమొక్రాట్లకు తెలుసు. అందుకే భారీగా అవకతవకలకు, అక్రమాలకు పాల్పడ్డారు. లక్షలాదిగా గుర్తు తెలియని మెయిల్ ఇన్ ఓట్లు వేయించారు. దీనికి సంబంధించి నా దగ్గర చాలా ఆధారాలున్నాయి’ అని తెలిపారు. నిజాయతీతో కూడిన ఎన్నికలు, నిజాయతీతో కూడిన లెక్కింపు కోరుకుంటున్నామన్నారు. ‘చట్టబద్ధ ఓట్లు లెక్కిస్తే తేలిగ్గా గెలుపు సాధిస్తా. అక్రమ ఓట్లను లెక్కిస్తే ఫలితాలను తారుమారు చేస్తున్నట్లే. ఆలస్యంగా వచ్చిన ఓట్లను లెక్కించాలనుకుంటే మేం ప్రతిఘటిస్తాం. కానీ, చాలా ఓట్లు ఆలస్యంగా వచ్చాయి’ అని ట్రంప్ అన్నారు. ఎన్నికల ఫలితాల విశ్లేషకులు, ప్రముఖ టెక్ సంస్థలు, మీడియా.. డెమొక్రాట్ల పక్షాన నిలబడి ఓటర్లను మభ్యపెట్టాయని ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. ప్రసారం చేయని ఏబీసీ, సీబీఎస్, ఎన్బీసీ శ్వేతసౌధంలో ట్రంప్ మీడియా సమావేశాన్ని ఏబీసీ, సీబీఎస్, ఎన్బీసీ వంటి వార్తా చానళ్లు పట్టించుకోలేదు. ట్రంప్వ్యాఖ్యలపై సీఎన్ఎన్కు చెందిన ఆండర్సన్ కూపర్.. తన సమయం ముగిసిందని తెలిసి వెనక్కి తిరిగి వెళ్తున్న ఊబకాయం తాబేలు వంటి వాడంటూ ట్రంప్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అక్రమాలు జరగలేదని అందరూ భావిస్తుండగా ట్రంప్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తుండటం వల్లే ఆ సమావేశాన్ని తాము ఆపేశామని ఎన్బీసీకి చెందిన లెస్టర్ హోల్ట్ చెప్పారు. భారీగా దొంగ ఓట్లు పడ్డాయనేందుకు ఎలాంటి సూచనలు కనిపించడం లేదని, ఇది ట్రంప్ చేస్తున్న ఆరోపణ అని సీబీఎస్ కరస్పాండెంట్ నాన్సీ కోర్డెస్ చెప్పారు. అధ్యక్షుడు చేస్తున్న తప్పును సరి చేసేందుకే తాము ట్రంప్ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదని ఎంఎస్ఎన్బీసీ వ్యాఖ్యాత బ్రియాన్ విలియమ్స్ అన్నారు. ‘మాకు తెలిసినంత వరకు చట్ట విరుద్ధమైన ఓట్లు ఏమీ లేవు. మాకు తెలిసిన ప్రకారం ట్రంప్‌కు గెలుపు కూడా లేదు అని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు జాప్యం అవుతుండటంతో ట్రంప్ అసహనంతో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. -
టీడీపీలో మంత్రి సుజయ్ రంగరావుకు వ్యతిరేకత
-
చింతమనేనిపై సొంత పార్టీ నేతల అరోపణలు
-
ఎమ్మెల్యేగా గెలవలేని సీఎం.. పార్టీ పెడతాడా
తనది హైదరాబాద్ అంటాడు.. చిత్తూరుకు నిధులు మళ్లిస్తాడు వైఎస్ స్టైల్లో మాట్లాడాలని సీఎం ఆరాటపడుతున్నాడు భువనగిరి ఎంపీ రాజగోపాల్‌రెడ్డి సిద్ధులగుట్టలో ప్రత్యేక పూజలు బచ్చన్నపేట, న్యూస్‌లైన్ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని సీఎం కిరణ్ సొంతంగా పార్టీ పెడతానని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అన్నం తింటూ గోతులు తవ్వే సీఎం.. రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమైతే నాలుగున్నర కోట్ల ప్రజలను కాదని బయట కాలుపెట్టగలడా అని ధ్వజమెత్తారు. తన సొంతఖర్చులతో మండలంలోని పోచన్నపేట, బచ్చన్నపేటలోని ఆటోనగర్ కాలనీ, కొడువటూరు గ్రామాల్లో వేసిన బోర్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నూకల బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చేర్యాల మార్కెట్ కమిటీ చెర్మైన్ మాసపేట రవీందర్‌రెడ్డి, సర్పంచ్ గంగం సతీష్‌రెడ్డి, దాసరి రవి, లక్ష్మీనారాయణ నాయక్, వేమళ్ల సత్యనారాయణరెడ్డి, మహేందర్‌రెడ్డి, కొమ్ము నర్సింగారావు, ఆటో యూనియన్ అధ్యక్ష, గౌరవాధ్యక్షులు భాస్కర్, అయిలయ్య ఆయనకు ఘనస్వాగతం పలికారు. సిద్ధులగుట్టలో ఆలయ ఈఓ రత్నాకర్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామికి ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ అకాల మరణంతో దొడ్డిదారిలో సీల్డ్ కవర్ సీఎంగా కిరణ్ అవతారమెత్తాడని విమర్శలు చేశారు. మహానేత వైఎస్ఆర్ ఏనాడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. బచ్చన్నపేట చౌరస్తాలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు నిధులు సమకూర్చాలని సహ చట్టం జిల్లా కోకన్వీనర్ గంగరబోయిన మహేందర్ ఎంపీకి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు మహేందర్‌రెడ్డి, ఎండీ గౌస్, ఈదులకంటి వెంకట్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, గుర్రపు బాల్‌రాజు, రామిని మదన్, గట్టు మల్లేశం, దిడిగ రమేష్, శ్రీనివాస్, సర్పంచ్ పిన్నింటి బాపురెడ్డి, గంగంర బోయిన మహేందర్, సుబ్బూరి కిషన్, జిల్లా రాజేశ్వర్, మల్గ సిద్దులు, కర్ణాకర్, రాము, ఆనంద్ పాల్గొన్నారు. నేనేమైనా జనగామ టికెట్ అడిగానా.. : మంత్రి వర్గీయులను ప్రశ్నించిన ఎంపీ నేనేమైనా జనగామ అసెంబ్లీ టికెట్ కోసం పోటీ పడుతున్నానా.. నా శత్రువులతో తిరుగుతున్నారు.. అంటూ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి మంత్రి పొన్నాల లక్ష్మయ్య వర్గీయులను గట్టిగా ప్రశ్నించారు. అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఆదివారం మండలానికి వచ్చిన ఆయనను మంత్రి వర్గీయులు తమకు సమాచారమివ్వడంలేదని అడిగారు. తనకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి సమాచారం అందిస్తున్నానన్నారు. నియోజకవర్గ ఎంపీగా ఉన్న తనకు ఏ పనులు ప్రారంభించినా మంత్రి సమాచారం ఎందుకివ్వడం లేదని ఎదురు ప్రశ్నించారు.