తనది హైదరాబాద్ అంటాడు.. చిత్తూరుకు నిధులు మళ్లిస్తాడు
వైఎస్ స్టైల్‌లో మాట్లాడాలని సీఎం ఆరాటపడుతున్నాడు
భువనగిరి ఎంపీ రాజగోపాల్‌రెడ్డి
సిద్ధులగుట్టలో ప్రత్యేక పూజలు
బచ్చన్నపేట, న్యూస్‌లైన్ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని సీఎం కిరణ్ సొంతంగా పార్టీ పెడతానని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అన్నం తింటూ గోతులు తవ్వే సీఎం.. రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమైతే నాలుగున్నర కోట్ల ప్రజలను కాదని బయట కాలుపెట్టగలడా అని ధ్వజమెత్తారు. తన సొంతఖర్చులతో మండలంలోని పోచన్నపేట, బచ్చన్నపేటలోని ఆటోనగర్ కాలనీ, కొడువటూరు గ్రామాల్లో వేసిన బోర్లను ఆదివారం ఆయన ప్రారంభించారు.
యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నూకల బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చేర్యాల మార్కెట్ కమిటీ చెర్మైన్ మాసపేట రవీందర్‌రెడ్డి, సర్పంచ్ గంగం సతీష్‌రెడ్డి, దాసరి రవి, లక్ష్మీనారాయణ నాయక్, వేమళ్ల సత్యనారాయణరెడ్డి, మహేందర్‌రెడ్డి, కొమ్ము నర్సింగారావు, ఆటో యూనియన్ అధ్యక్ష, గౌరవాధ్యక్షులు భాస్కర్, అయిలయ్య ఆయనకు ఘనస్వాగతం పలికారు. సిద్ధులగుట్టలో ఆలయ ఈఓ రత్నాకర్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామికి ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహానేత వైఎస్‌ఆర్ అకాల మరణంతో దొడ్డిదారిలో సీల్డ్ కవర్ సీఎంగా కిరణ్ అవతారమెత్తాడని విమర్శలు చేశారు. మహానేత వైఎస్‌ఆర్ ఏనాడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు.
బచ్చన్నపేట చౌరస్తాలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు నిధులు సమకూర్చాలని సహ చట్టం జిల్లా కోకన్వీనర్ గంగరబోయిన మహేందర్ ఎంపీకి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు మహేందర్‌రెడ్డి, ఎండీ గౌస్, ఈదులకంటి వెంకట్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, గుర్రపు బాల్‌రాజు, రామిని మదన్, గట్టు మల్లేశం, దిడిగ రమేష్, శ్రీనివాస్, సర్పంచ్ పిన్నింటి బాపురెడ్డి, గంగంర బోయిన మహేందర్, సుబ్బూరి కిషన్, జిల్లా రాజేశ్వర్, మల్గ సిద్దులు, కర్ణాకర్, రాము, ఆనంద్ పాల్గొన్నారు.
నేనేమైనా జనగామ టికెట్ అడిగానా.. : మంత్రి వర్గీయులను ప్రశ్నించిన ఎంపీ
నేనేమైనా జనగామ అసెంబ్లీ టికెట్ కోసం పోటీ పడుతున్నానా.. నా శత్రువులతో తిరుగుతున్నారు.. అంటూ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి మంత్రి పొన్నాల లక్ష్మయ్య వర్గీయులను గట్టిగా ప్రశ్నించారు. అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఆదివారం మండలానికి వచ్చిన ఆయనను మంత్రి వర్గీయులు తమకు సమాచారమివ్వడంలేదని అడిగారు. తనకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి సమాచారం అందిస్తున్నానన్నారు. నియోజకవర్గ ఎంపీగా ఉన్న తనకు ఏ పనులు ప్రారంభించినా మంత్రి సమాచారం ఎందుకివ్వడం లేదని ఎదురు ప్రశ్నించారు.
ఎమ్మెల్యేగా గెలవలేని సీఎం.. పార్టీ పెడతాడా
Published Mon, Feb 3 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
Advertisement
Advertisement